
సాక్షి, జగిత్యాల: కుక్క కాటు మరో బాలిక జీవితాన్ని బలిగొంది. దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె మృత్యువుతో పోరాడింది. రెండువారాల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ .. చివరకు కన్నుమూసింది.
గొల్లపెల్లి మండలం ఆత్మకూరు గ్రామంలో పదిహేను రోజుల కిందట ఓ పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. ఊర్లో దాదాపు పది మందిని గాయపర్చింది. అయితే సంగెపు సాహిత్య అనే 12 ఏళ్ల బాలిక మాత్రం కుక్క దాడిలో తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించిన చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ ఆ చిన్నారి ఇవాళ(శనివారం) ఉదయం కన్నుమూసింది. తమ ముందు ఆడిపాడిన చిన్నారి ఇక లేదనే విషయం తెలిసి.. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చదవండి: గుండెలో రంధ్రం.. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి..
Comments
Please login to add a commentAdd a comment