ఇటీవల కాలంలో కుక్కలు మనుషులపై దాడి చేసిన ఘటనలు ఎక్కువ అవుతున్నాయి. రోడ్డు మీద వెళ్తున్న వారిపై విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరుస్తున్నాయి. అయితే ఈ జాబితాలోకి పెంపుడు కుక్కలు కూడా చేరాయి. ఈ మధ్య పెంపుడు శనుకాలు కూడా ఉన్నట్టుండి యజమానులు, బయట వారిపై దాడి చేస్తున్నాయి. అయితే కుక్కలు గాయపరిచిన ఘటనలో బాధితులకు పరిహారం అందడం చాలా అరుదు.
కానీ తాజాగా ఓ పెంపుడు కుక్క కరిచిన ఘటనలో గాయపడిన మహిళకు ఉపశమనం లభించింది. పెంపుడు కుక్క దాడిలో గాయపడ్డ బాదితురాలికి 2 లక్షల పరిహారం చెల్లించాలని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార వేదిక.. గురుగ్రామ్ మున్సిపల్ కార్పొరేషన్‌ను(ఎంసీజీ) మంగళవారం ఆదేశించింది. కావాలంటే చెల్లించిన పరిహారం మొత్తాన్నికుక్క యజమాని నుంచి తిరిగి పొందవచ్చని పేర్కొంది.
కాగా ఇళ్లల్లో పనులు చేసుకుంటూ జీవించే మున్ని అనే మహిళ, తన కోడలుతోపాటు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా వినిత్ చికారా పెంచుకుంటున్న కుక్క ఆగష్టు 11 న దాడి చేసింది. ఈ ప్రమాదంలో మహిళ తల, ముఖానికి తీవ్ర గాయాలవ్వడంతో ఆమెను గురుగ్రామ్‌లోని ఆసుపత్రికి తరువాత ఢిల్లీలోని సఫ్దర్‌గంజ్ హాస్పిటల్‌కు తరలించారు. కుక్క దాడిపై సివిల్ లైన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే మహిళను కరిచిన శునకం ‘డోగో అర్జెంటీనో’ జాతికి చెందినదిగా యజమాని తెలిపారు.
చదవండి: అరే! ఏం మనుషుల్రా ఇంత రాక్షసత్వమా! శునకానికి ఉరి వేసి...
కుక్కను స్వాధీనం చేసుకోవాలని, దాని లైసెన్స్ అనుమతిని వెంటనే రద్దు చేయాలని ఫోరమ్ మున్సిపల్ కార్పొరేషన్‌ను ఆదేశించింది. అదే విధంగాపెంపుడు కుక్కల పాలసీని మూడు నెలల్లో రూపొందించాలని ఆదేశించింది. వీధి జంతువులను అదుపులోకి తీసుకున్న తర్వాత వాటిని పౌండ్లలో ఉంచాలని, అలాగే హనికరమైన 11 అన్యదేశ జాతులను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ జాతి కుక్కులను ఎవరైనా పెంచుకుంటే వెంటనే కస్టడీలోకి తీసుకోవాలని తెలిపింది.
డోగో అర్జెంటీనో వంటి క్రూర జాతికి చెందిన శునకం పెంపుడు విషయంలో యజమాని చట్టాన్ని, నిబంధనలు ఉల్లించాడని స్పష్టంగా అర్థం అవుతోందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా అమెరికన్ పిట్-బుల్ టెర్రియర్స్, డోగో అర్జెంటీనో, రోట్‌వీలర్ వంటి క్రూర జాతి కుక్కులపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది.
Comments
Please login to add a commentAdd a comment