Dog Bite
-
భౌబోయ్.. కరిచేస్తున్నాయ్!
సాక్షి, అమరావతి: శునకాలు చెలరేగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా నిత్యం 8,300 మందికి పైగా ప్రజలు కుక్క కాట్ల బారినపడుతున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం 2023లో దేశంలో 30,43,339 కుక్కు కాటు కేసులు నమోదయ్యాయి. ఇందులో 286 మంది మరణించారు. ఈ విషయాన్ని కేంద్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.ఈ నేపథ్యంలో వీధి కుక్కల కాట్లు, రేబిస్ నివారణకు జాతీయ రేబిస్ నియంత్రణ కార్యక్రమం అమలు చేస్తున్నట్టు కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ నివేదిక ప్రకారం.. 2023లో కుక్కు కాటు కేసుల కోసం 46,54,398 యాంటీ రేబిస్ షాట్లను చికిత్సగా అందించినట్టు తెలిపింది. అత్యవసర మందుల జాబితాలో వ్యాక్సిన్, సీరమ్అత్యవసర, ముఖ్యమైన మందుల జాబితాలో యాంటీ రాబిస్ వ్యాక్సిన్, యాంటీ రేబిస్ సీరమ్‌ను చేర్చినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కుక్క కాటు కేసులను నియంత్రించేందుకు కుక్కల జనాభా నిర్వహణ కీలకమైన విధుల్లో ఒకటని పేర్కొంది. దీని కోసం యానిమల్ బర్త్ కంట్రోల్ కార్యక్రమాన్ని, యాంటీ రేబిస్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్టు వెల్లడించింది. ఇందుకోసం నిధుల మంజూరు చేయడంతోపాటు రేబిస్ టీకాల కోసం సాయం అందిస్తున్నట్టు తెలిపింది.2030 నాటికి రేబిస్ నిర్మూలన దిశగా.. కుక్క కాట్ల నివారణ, రేబిస్ నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా జాతీయ కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నట్టు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. 2030 నాటికి రేబిస్ నిర్మూలించే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు తెలిపింది. దశల వారీగా రేబిస్ రహిత నగరాల కార్యక్రమాన్ని చేపట్టినట్టు పేర్కొంది. 15 రాష్ట్రాల్లో రేబిస్ నివారణ కోసం టైర్–1, టైర్–2 నగరాలను లక్ష్యంగా చేసుకుని కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. తొలి దశలో ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, పుదుచ్ఛేరి, అస్సాం రాష్ట్రాల్లో రేబిస్ హెల్ప్‌లైన్ 15400 ప్రారంభించినట్టు, ఇతర రాష్ట్రాల్లో దశల వారీగా ప్రారంభించేందుకు ప్రణాళికలు ఉన్నాయని కేంద్ర మంత్రిత్వ శాఖ వివరించింది. జాతీయ రేబిస్ నియంత్రణ కార్యక్రమం అమల్లో భాగంగా రాష్ట్రాలు, జిల్లా స్థాయిల్లో మానవ శక్తిని పెంచడం, రేబిస్ పోస్ట్ ఎక్స్పోజర్ ప్రాఫిలాక్సిస్ కోసం వ్యయంతో కూడిన ఇంట్రాడెర్మల్ రేబిస్ వ్యాక్సిన్లను ప్రచారం చేయడం, రేబిస్ డయాగ్నస్టిక్స్ బలోపేతం చేయడం, జంతువుల కాటు రాబిస్ కేసులపై నిఘాను బలోపేతం చేయడం, అవగాహన కలి్పంచడం, కార్యాచరణ పరిశోధన వంటి చర్యలను చేపట్టినట్టు కేంద్ర మంత్రిత్వ శాఖ వివరించింది. జాతీయ రేబిస్ నివారణ, నియంత్రణ కోసం జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఆరోగ్య సంరక్షణ సిబ్బంది సామర్థ్యాన్ని పెంచడంతోపాటు రేబిస్ వ్యాక్సిన్లు, రేబిస్ ఇమ్యునోగ్లోబులిన్ సేకరణ, రేబిస్ నివారణకు అవగాహన కల్పన కోసం బడ్జెట్ ద్వారా నేషనల్ రేబిస్ కంట్రోల్ కార్యక్రమం అమలు కోసం రాష్ట్రాలు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నట్టు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. -
కుక్కల బీభత్సం.. రోజుకు వెయ్యిమందిని కరుస్తూ..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కుక్కకాటు ఘటనలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఢిల్లీ-ఎన్సీఆర్లో రోజుకు వెయ్యి మందికి పైగా జనం కుక్క కాటుకు గురవుతున్నారు. ఢిల్లీకి చెందిన వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం సఫ్దర్‌జంగ్, డాక్టర్ రామ్ మనోహర్ లోహియా, హిందూరావు, జీటీబీ, డీడీయూ, లోక్‌నాయక్, ఇతర ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులకు రేబిస్ వ్యాక్సిన్ కోసం ప్రతి రోజు వెయ్యి మందికి పైగా బాధితులు వస్తున్నారు.కుక్కకాటు కేసుల్లో 60 శాతం మంది చిన్నారులేనని వైద్యులు చెబుతున్నారు. సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి చెందిన యాంటీ రేబిస్ క్లినిక్ హెడ్ డాక్టర్ యోగేశ్ గౌతమ్ మాట్లాడుతూ ఆస్పత్రిలో రోజూ దాదాపు 500 రేబిస్ టీకాలు వేస్తున్నారని తెలిపారు. వీరిలో 200 మంది కొత్త రోగులు కాగా, 300 మంది పాత రోగులు. లోక్ నాయక్ ఆస్పత్రి అత్యవసర విభాగం అధిపతి డాక్టర్ రీతూ సక్సేనా మాట్లాడుతూ తమ ఆస్పత్రికి ప్రతిరోజూ దాదాపు 100 మంది వ్యాక్సిన్ తీసుకునేందుకు వస్తున్నారని తెలిపారు. సెలవు దినాల్లో వీరి సంఖ్య మరింతగా పెరుగుతున్నదన్నారు.సాధారణంగా కుక్క, పిల్లి, నక్క, తోడేలు, గబ్బిలం లేదా ఇతర జంతువులు కరిచినప్పుడు బాధితుడు తప్పనిసరిగా రేబిస్ టీకా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఏదైనా జంతువు కరచిన వెంటనే బాధితునికి మొదటి డోస్ ఇస్తారు. రెండవది మూడు రోజులు, మూడవది ఏడు రోజులు, నాల్గవ డోస్ 28 రోజులకు అందిస్తారు. మొదటి డోస్‌తో పాటు యాంటీ రేబిస్ సీరమ్ (ఏఆర్ఎస్)ను కూడా బాధితునికి ఇస్తారు.ఇది కూడా చదవండి: ఒకే ఇంటిలో ఐదు మృతదేహాలు.. ఢిల్లీలో కలకలం -
కిల్లర్ డాగ్స్!
..: ఇది జర్నలిజంలో ఓ పాత పాఠం :..జర్నలిస్టుల సంగతి ఎలా ఉన్నా.. ప్రభుత్వాలు మాత్రం దీన్ని సీరియస్‌గానే తీసుకున్నట్లు ఉన్నాయి. అందుకే మనిషిని కుక్క కరవడం కాదు.. చంపేస్తున్నా.. పెద్దగా పట్టనట్లే ఉంటున్నాయి.ఫలితం..ఓ విహాన్.. ఓ పూలమ్మ,.. ఓ రామలక్ష్మి.. పేరేదైతేనేం.. ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. తరచూ పదుల సంఖ్యలో ప్రజలు కుక్కకాట్ల బారిన పడుతూనే ఉన్నారు. ఏళ్లుగా ఉన్న సమస్య ఇది.. ఎవరూ సీరియస్‌గా తీసుకోని విషయమిది. మరేం చేద్దాం?ఇప్పటికైనా పట్టించుకుందామా? పట్టనట్లే ఉందామా?⇒ హైదరాబాద్‌లోని మియాపూర్ మక్తాకు చెందిన ఆరేళ్ల బాలుడు సాత్విక్‌పై రెండు నెలల క్రితం వీధికుక్కలు దాడి చేసి చంపేశాయి. నెల రోజుల క్రితం ఇబ్రహీంపట్నం రాయపోల్‌లో నాలుగేళ్ల బాలుడిపై వీధికుక్క దాడి చేసింది. నిలోఫర్‌లో చికిత్స పొందుతూ ఇటీవల చనిపోయాడు. గత పదిహేను రోజుల్లో నాలుగు కుక్కకాటు ఘటనల్లో పదుల సంఖ్యలో చిన్నారులు, పెద్దవాళ్లు గాయపడ్డారు. ⇒ రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బట్టోనితాళ్లలో 20 రోజుల కింద పిట్ల రామలక్ష్మి (80) అనే వృద్ధురాలిపై వీధికుక్కలు దాడి చేసి పీక్కుతిన్నాయి.⇒ సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రానికి చెందిన భరత్, వెంకటలక్ష్మి దంపతులు హైదరాబాద్ జవహర్‌నగర్ పరిధిలోని ఆదర్శనగర్‌కు మూడు నెలల క్రితం వలస వచ్చారు. వారి 18 నెలల కుమారుడు విహాన్‌ను ఇటీవల కుక్కలు దాడి చేసి చంపేశాయి.⇒ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎడ్జెర్లకు చెందిన జంగం నర్సయ్య బర్ల కాపరిగా, ఆయన భార్య పూలమ్మ (50) గ్రామ పంచాయతీ నర్సరీలో కూలీ పని చేసేవారు. వారి ఏకైక కుమార్తె వివాహం కావడంతో.. భార్యాభర్త ఇద్దరే ఉండేవారు. జూలై 5న పూలమ్మ నర్సరీలో పని ముగించుకుని తిరిగొస్తుండగా కుక్కలు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. దీనితో తాను ఒంటరిని అయిపోయానంటూ నర్సయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు... ఈ ఘటనలే కాదు.. చెప్పుకుంటూపోతే మరెన్నో.. వీధి వీధినా, గ్రామం, పట్టణం తేడా లేకుండా ఎన్నో వందల కుటుంబాల్లో విషాదం నింపుతున్న కుక్కల దాడి ఘటనలెన్నో. అవి మనుషులకు మంచి స్నేహితులంటూ మనం చెప్పుకొనే శునకాలే.. ఇంటి ముందో, వీధిలోనో కలియదిరుగుతూ కనిపించేవే. కానీ కొన్నేళ్లుగా కుక్కల దాడి ఘటనలు పెరిగిపోతున్నాయి. చిన్నారులను, వయసు మళ్లినవారిపై దాడిచేసి పొట్టనపెట్టుకుంటూ కన్నీళ్లు నింపుతున్నాయి. - సాక్షి, హైదరాబాద్ఆహార కొరత.. విపరీతంగా సంతానోత్పత్తివీధికుక్కలు రెచ్చిపోవడానికి ప్రధాన కారణం ఆహార కొరత అని వెటర్నరీ వైద్యులు చెప్తున్నారు. ఖాళీ ప్రదేశాలు తగ్గిపోవడం, వాతావరణ పరిస్థితులు కూడా ప్రభావం చూపిస్తున్నాయని అంటున్నారు. కుక్కలు పెద్ద శబ్దాలు, ఎక్కువ వెలుగు ఉండే లైట్ల వల్ల ఆవేశపడతాయని.. ఇలాంటి సమయాల్లోనే అవి అతిగా దాడులు చేస్తుంటాయని వివరిస్తున్నారు. సాధారణంగా కుక్కలు మాంసాహారాన్ని ఇష్టపడతాయి. కానీ ఇప్పుడు వాటికి శాఖాహారం కూడా దొరకని పరిస్థితి రావడంతో రెచ్చిపోతున్నాయి.అందువల్ల కుక్కలకు షెల్డర్ హోమ్‌లు, ప్రత్యేకంగా పార్కులు ఏర్పాటు చేసి, వాటికి సంతానోత్పత్తి నియంత్రణ శస్త్రచికిత్సలు చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొంత ప్రయత్నం జరిగినా ఫలితం మాత్రం శూన్యం. జీహెచ్ఎంసీ పరిధిలో నాలుగు లక్షలకుపైగా వీధి కుక్కలు ఉన్నాయని కార్పొరేషన్ వెటర్నరీ విభాగం చెబుతోంది. కానీ వాస్తవంగా 10 లక్షలకుపైగానే వీధి కుక్కలు ఉన్నట్టు అంచనా. వీటిలో మూడో వంతు కుక్కలకు కూడా స్టెరిలైజేషన్, వాక్సినేషన్ జరగలేదని సమాచారం.నామ్ కే వాస్తేగా కార్యాచరణకుక్కకాట్లతో ప్రజలు ప్రాణాలు కోల్పోతుండటంపై ఇటీవల హైకోర్టు తీవ్రస్థాయిలో స్పందించడంతో.. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించింది. కానీ ఆ హడావుడి నాలుగైదు రోజుల్లోనే ముగిసిపోయింది. ప్రస్తుతం రాష్ట్రంలోని 26 జిల్లాల్లో పశు జనన నియంత్రణ కేంద్రాలు ఉండగా.. మిగతా జిల్లాల్లోనూ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కానీ అడుగు ముందుకు పడలేదు.2030 నాటికి రేబిస్ నిర్మూలన సాధ్యమెట్లా?దేశంలో 2030 నాటికి రేబిస్‌ను నిర్మూలించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకొంది. ఆ లక్ష్యం నెరవేరాలంటే శునకాల నియంత్రణ చర్యలు వేగవంతం చేయాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో యాంటీ రేబిస్ టీకాలను విరివిగా అందుబాటులో ఉంచాలి. కానీ కేంద్రం సరిగా నిధులు కేటాయించడం లేదు. రాష్ట్రాలూ పట్టించుకోవడం లేదు. కుక్కకాట్లతో రేబిస్ సోకడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 59 వేల మంది చనిపోతుంటే.. అందులో 20 వేలకుపైగా (36 శాతం) మరణాలు మనదేశంలోనే నమోదవుతున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.ఒక్క జంట నుంచి ఏడేళ్లలో 4 వేల కుక్కలు⇒ కుక్కల జీవిత కాలం 8 నుంచి 12 ఏళ్లు⇒ 8 నెలల వయసు నుంచే వాటికి సంతానోత్పత్తి సామర్థ్యం ఉంటుంది⇒ వీటి గర్భధారణ సమయం 60–62 రోజులే ఏటా రెండు సార్లు పిల్లలను కంటాయి. ప్రతిసారి 4 నుంచి 8 పిల్లలను పెడతాయి⇒ ఒక శునకాల జంట, వాటి పిల్లలు, వీటన్నింటికీ పుట్టే పిల్లలు ఇలా.. ఏడాదిలోనే 40 వరకు అవుతాయి. మొత్తంగా ఒక్క జంట నుంచి ఏడేళ్లలో సుమారు 4 వేల వరకు అయ్యే అవకాశం ఉంటుందికాకి లెక్కలేనా..?జీహెచ్ఎంసీలో ఏటా 50, 60 వేల వీధికుక్కలకు సంతాన నిరోధక శస్త్రచికిత్స (స్టెరిలైజేషన్) జరుగుతున్నట్టు లెక్కలు చెప్తున్నాయి. ఈ శస్త్రచికిత్సలు, రేబిస్ వ్యాధి సోకకుండా వ్యాక్సినేషన్, సిబ్బంది జీతభత్యాలు, ఇతర ఖర్చుల కోసం ఏటా రూ.12 కోట్లకుపైగానే వ్యయం చేస్తున్నారు. కానీ వీధికుక్కల సంఖ్య ఏమాత్రం తగ్గకపోగా.. అంతకంతకూ పెరిగిపోతోంది. నిధులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయన్న ప్రశ్న తలెత్తుతోంది. మున్సిపల్ కార్పొరేషన్లు ఒక్కో కుక్క స్టెరిలైజేషన్ కోసం రూ.1,700 చొప్పున ఖర్చు చేస్తున్నా.. చేసే ఆపరేషన్లకు, చూపే లెక్కలకు తేడా ఉంటోందన్న ఆరోపణలు ఉన్నాయి.గోవా ఎలా కంట్రోల్ చేయగలిగింది?కుక్కకాట్ల విషయంలో గోవా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఆ రాష్ట్రంలో గత మూడేళ్లలో ఒక్క కుక్కకాటు మరణం కూడా నమోదు కాలేదు. నిర్ణీత కాలవ్యవధిలో కుక్కలకు శస్త్రచికిత్సలు చేస్తున్నారు. శునకాల దాడినుంచి స్వీయరక్షణ విధివిధానాలను విద్యార్థులకు, మహిళలకు తెలియజెప్పడం వంటి అంశాలు గోవాలో సత్ఫలితాలిస్తున్నాయి. బెంగళూరు, అహ్మదాబాద్ నగరాల్లోనూ కుక్కల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు ప్రశంసలు పొందాయి.ఆ రాష్ట్రాల్లో బాధితులకు పరిహారంకుక్కకాటు ఘటనలకు రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని గత సంవత్సరం హరియాణా– పంజాబ్ హైకోర్టు తీర్పునిచ్చింది. కుక్క కాటు కేసుల్లో ఒక్కో పంటి గాటుకు 10వేల రూపాయల చొప్పున బాధి తులకు నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశించింది. కుక్కకాటు ఘటనలో 0.2 సెంటీమీటర్లు, ఆపైన కోత పడితే బాధితులకు రూ.20 వేలు చెల్లించా లని.. ప్రాణనష్టం జరిగితే రూ.5 లక్షలు పరిహారంగా ఇవ్వాలని స్పష్టం చేసింది. కర్ణాటకలో కుక్కకాటు కేసులను సమీక్షించడానికి, కుక్కకాటుకు గురైన వ్యక్తులకు పరిహారం అందించడానికి అక్కడి పట్టణాభివృద్ధి శాఖ పట్టణ, స్థానిక సంస్థలతో కమిటీలను ఏర్పాటు చేసింది. ఆ కమిటీల ద్వారా 48 గంటల్లో బాధితులకు పరిహారాన్ని అందిస్తున్నారు. రాష్ట్రంలో ఎలాంటి పరిహారం లేదు.పిల్లలు పలవుతున్నా ప్రభుత్వం స్పందించల్లేదుమాది సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం గోవిందాపూర్. ఇటీవల రెండు పిచ్చి కుక్కలు ముగ్గురు చిన్నారులపై దాడి చేశాయి. నా బిడ్డ ప్రావీణ్య కూడా తీవ్రంగా గాయపడింది. కుక్కల దాడిలో పిల్లలు బలవుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలి. – సాగర్‌రెడ్డి, ప్రావీణ్య తండ్రికొత్త ప్రదేశాల్లో వదిలేయడంతో సమస్యలువీధికుక్కల స్టెరిలైజేషన్ విషయంలో మున్సిపల్ అధికారులు పొరపాట్లు చేస్తున్నారు. స్టెరిలైజేషన్ కోసం తీసుకువెళ్లిన కుక్కలను తిరిగి అదే ప్రాంతంలో వదలకుండా కొత్త ప్రదేశాల్లో విడిచిపెడుతున్నారు. అక్కడి కుక్కలు కొత్తవాటిని రానీయకపోవడం, మనుషులూ కొత్తవారు కావడంతో అభద్రతకు లోనవుతాయి. దీనికితోడు కుక్కలు అతి చల్లదనం, వర్షాలు, వేడిని తట్టుకోలేవు. చిత్రంగా ప్రవర్తిస్తూ దారినపోయే వారిపై దాడులకు దిగుతాయి. కుక్కలకు సకాలంలో స్టెరిలైజేషన్ చేయాలి. షెల్టర్లు ఏర్పాటు చేసి తరలించాలి. – అసోసియేట్ ప్రొఫెసర్ రాంసింగ్ లఖావత్, వెటర్నరీ యూనివర్సిటీరేబిస్ సోకే ప్రమాదం.. జాగ్రత్త.కుక్కకాటుతో రేబిస్ సోకే ప్రమాదం ఉంటుంది. కుక్క కరిస్తే వెంటనే గాయాన్ని పది, పదిహేను నిమిషాల పాటు నీటితో శుభ్రం చేయాలి. యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయించుకోవాలి. రేబిస్ సోకితే తొలిదశలో జ్వరం, తలనొప్పి, వాంతులు వస్తాయి. తర్వాత పిచ్చిగా ప్రవర్తించడం, మనుషులను గుర్తించèలేక పోవడం, నోట్లోంచి నురగ, గొంతు పట్టేయడం, ఊపిరి ఆడకపోవడం వంటివి కనిపి స్తాయి. చివరిగా కోమాలోకి వెళ్లి ప్రాణాలు పోయే ప్రమాదమూ ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. – డాక్టర్ వెంకటేశ్వర్రావు, డీఎంహెచ్ఓ, రంగారెడ్డిరెచి్చపోయిన పిచ్చి కుక్కలు29 మందికి గాయాలు బాధితుల్లో చిన్నపిల్లలు, వృద్ధులు నందిపేట్ /మాచారెడ్డి/ మంగపేట: నిజామాబాద్, కామారెడ్డి, ములుగు జిల్లా మంగపేటలో సోమవా రం పిచ్చి కుక్కలు స్వైర విహారం చేసి సుమారు 29 మందిని గాయపర్చాయి. బాధితులు పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నందిపేట మండల కేంద్రంలోని బంగారు సాయిరెడ్డి ఫ్యాక్టరీ దగ్గర గల రామ్‌రెడ్డి వెల్డింగ్ షాప్ నుంచి మెయిన్ రోడ్డు వెంబడి లిటిల్ ఫ్లవర్ స్కూల్, చాకలి ఐలమ్మ, ఆనంది హాస్పిటల్, వ్యాన్ల అడ్డ, నట్రాజ్ టాకీస్ కాంప్లెక్స్ ప్రాంతాల వరకు ఓ పిచి్చకుక్క పదిమందిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. లిటిల్ ఫ్లవర్ స్కూలు విద్యారి్థ, ఆనంద్ హాస్పిటల్ ఆయమ్మ లసుంబాయిపై కూడా కుక్క దాడి చేసి తొడ, చేతి కండరాలను పీకేసింది.మాచారెడ్డి మండలంలోని ఘన్పూర్ (ఎం)లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పిచ్చి కుక్క పది మందిని గాయ పర్చింది. అక్షిత అనే బాలికపై, ఆరుబయట నిద్రిస్తున్న వృద్ధుడు పోచయ్యతో పాటు యాకూబ్, చైతన్య, హార్యన్, రంజిత్ తదితరులపై కుక్క దాడి చేసి గాయపర్చింది. ఆగ్రహించిన గ్రామస్తులు కుక్కను చంపేశారు. అలాగే ములుగు జిల్లా మంగపేటలోనూ ఓ పిచ్చి కుక్క పలువురిపై దాడిచేసింది. గంపోనిగూడెం, పొదుమూరు, మంగపేటలో సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఇంట్లో ఉన్న వృద్ధురాలిని, రోడ్డుపై నున్న ఎర్రావుల సమ్మయ్య, కొప్పుల లాలయ్య, దాదాని, ఎండి సైదా, మైతున్బి, ఎండి గోరెతోపాటు మరో ముగ్గురిపై పిచ్చి కుక్క దాడిచేసింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా మరో ఆరుగురికి స్పల్ప గాయాలయ్యాయి. -
కుక్కలదాడి ఘటనలపై హరీశ్‌రావు కీలక ట్వీట్
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో వరుసగా కుక్కల దాడి ఘటనలు జరిగినా ప్రభుత్వం చలించకపోవడం అమానవీయమని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ మేరకు శనివారం(ఆగస్టు 10) ఎక్స్(ట్విటర్)లో ఆయన ఒక పోస్టు చేశారు.‘బతికున్న మనుషులను సైతం కుక్కలు చంపి పీక్కుతిన్న ఘటనలు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. మరోవైపు చిన్నారులపై కుక్కల దాడులు నిత్యకృత్యం అవుతున్నాయి. రాష్ట్రంలో కుక్కల దాడుల్లో మనుషులు చనిపోవడం అనేది ఒక సాధారణ అంశంగా ప్రభుత్వం భావిస్తుండటం దుర్మార్గం. కుక్క కాటు కేసులు నమోదైన వెంటనే తగిన చర్యలు తీసుకొని ఉంటే రాష్ట్రంలో గడిచిన 8 నెలల కాలంలో 343 కుక్కకాటు సంఘటనలు జరిగి ఉండేవి కావు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయేవారు కాదు. ఇప్పటికే ఈ విషయంలో పలుమార్లు హైకోర్టు హెచ్చరికలు జారీ చేసినా ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్ర వదలడం లేదు. ప్రభుత్వం వెంటనే కుక్కల దాడులు అరికట్టే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలి’అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. -
ఒక్క ఏడాదిలో 30 లక్షల మందికి కుక్కకాటు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 2023 ఒక్క ఏడాదిలోనే 286 మంది కుక్కకాటుకు బలయ్యారని కేంద్రం పార్లమెంటులో వెల్లడించింది. 2023లో మొత్తంగా 30 లక్షలకుపైగా కుక్కకాటు కేసులు నమోదయ్యాయని తెలిపింది. ఈ మేరకు మంగళవారం(జులై 30) కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ లోక్‌సభకు రాతపూర్వకంగా తెలిపారు. 2023లో 46లక్షల 54వేల98మందికి యాంటీ రేబిస్ వ్యాక్సిన్లు ఇచ్చినట్లు వెల్లడించారు. రేబిస్ నియంత్రణకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జాతీయ రేబీస్ నియంత్రణ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.కుక్కల నియంత్రణకు స్థానిక సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రేబిస్ టీకాకు నిధులు కేటాయిస్తున్నాయని తెలిపారు. -
పెంపుడు కుక్క కరిచి తండ్రీకొడుకులు మృతి
-
కుక్క కాటు.. ఒక్కో పంటి గాటుకు రూ.10వేల పరిహారం!
చండీగఢ్: కుక్క కాటు కేసులపై హర్యానా-పంజాబ్ హైకోర్టులు సంచలన తీర్పు వెలువరించింది. కుక్క కాటుపై రాష్ట్ర ప్రభుత్వాలే ప్రధాన బాధ్యత వహించాలని ధర్మాసనం తెలిపింది. కుక్క కాటు కేసుల్లో ఒక్కో పంటి గాటుకు రూ.10,000 నష్టపరిహారం చెల్లించాలని తీర్పు వెలువరించింది. కుక్క కాటు ఘటనల్లో 0.2 సెంటీమీటర్ల కోత పడితే రూ.20,000 బాధితునికి చెల్లించాలని ఆదేశించింది. కుక్క కాటు కేసులో దాఖలైన 193 కేసుల్లో న్యాయస్థానం విచారణ చేపట్టింది. వీధికుక్కల బెడదపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ తీర్పు వెలువడింది. వాఘ్ బక్రీ టీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ 49 ఏళ్ల పరాగ్ దేశాయ్ అక్టోబర్‌లో వీది కుక్కలు వెంబడించిన ఘటనలో మరణించారు. వీధికుక్కలు ఆయన్ని వెంబడించగా పడిపోవడంతో తీవ్ర రక్తస్రావం అయిందని.. ఆ కారణంగా దేశాయ్ మరణించారని సంబంధిత ఆసుపత్రి ఇటీవల ప్రకటనలో పేర్కొంది. ఈ విషాద ఘటన అనంతరం సోషల్ మీడియాలో వీధి కుక్కల సమస్యను పరిష్కరించాలని పెద్ద ఎత్తున చర్చ సాగింది. పంజాబ్, హర్యానా, కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌లలో నమోదైన కుక్క కాటు కేసులపై ఒక కమిటీని ఏర్పాటు చేయాలని హైకోర్టు కోరింది. జంతువుల దాడి కేసుల్లో చెల్లించాల్సిన నష్టపరిహారాన్ని నిర్ణయించాలని తీర్పులో స్పష్టం చేసింది. అయితే.. వీది కుక్కలతో పాటు ఆవులు, ఎద్దులు, గాడిదలు, గేదెలు, అడవి, పెంపుడు జంతువులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఇదీ చదవండి: Liquor Sale In Delhi: ‘దీపావళి మద్యం’తో ఢిల్లీ సర్కారుకు భారీ ఆదాయం! -
కుక్కలు మనుషుల్ని ఎందుకు కరుస్తాయి?వాటికీ ఫ్రస్ట్రేషన్ ఉంటుందా?
జిల్లాలో రోజురోజుకూ కుక్కకాటు ఘటనలు పెరిగిపోతున్నాయి. నిత్యం ఎక్క డో ఒక చోట మనుషులపై దాడి చేసి గాయపరుస్తూ నే ఉన్నాయి. వీధులు, రోడ్లపై గుంపులు గుంపులు గా తిరుగుతూ పాదచారులు, ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారిని వెంబడించి మరీ కరుస్తున్నాయి. అంతేకాకుండా ఇళ్లలోకి దూరి దాడి చేస్తున్నాయి. శునకాల దాడిలో చిన్నారులు ప్రాణాలు వదిలిన సందర్భా లు అనేకం. కుక్క కాటుకు గురైన వారు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. రోజు రోజుకు కుక్కల బాధితులు పెరిగిపోతున్నారు. కుక్కలు కరవడం వల్ల రేబిస్ అనే వ్యాధి వచ్చే అవకాశం ఉంది. రేబిస్ వల్ల ఏటా 55 వేల మందికి పైగా చనిపోతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. మన దేశంలో కుక్క కాటుకు ఏటా 15 వేలకు పైగా మంది చనిపోతున్నారు. ఆకలితో దాడి చేస్తున్నాయా..? ఇంతకీ కుక్కలు మనుషులపై ఎందుకు తెగబడుతున్నాయి. ఆకలితోనా లేక దూపతోనా.. ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకప్పుడు వీధి కుక్కలు మనుషులపై దాడి చేసేవి కావు. గ్రామాల్లోకి కొత్తగా ఎవరైనా వచ్చినా, వాటికి హాని చేసే జంతువులు, ఇతర ప్రాణులు ఏవైనా కనిపిస్తే దాడి చేయడం చూశాం. కానీ ఇప్పుడు మనుషులపై దాడి చేయడం ఎక్కువైంది. ఏ కుక్క మంచిదో ఏది పిచ్చిదో తెలియని పరిస్థితి నెలకొంది. శునకాల దాడికి ప్రధాన కారణం ఆకలి అని పలువురు అంటున్నారు. గ్రామాల్లో, మున్సిపలిటీల్లో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా మెరుగుపడింది. దీంతో వాటికి ఆహారం దొరకడం లేదు. అలాగే ఇంటింటా చెత్త సేకరణ ప్రారంభమయ్యాక రోడ్డు పక్క అన్నం, ఇతర ఆహార పదార్థాలు పడేయడం తగ్గింది. దీంతో వాటికి ఆహారం దొరకడం కష్టంగా మారింది. పైగా కుక్కలు తరుచూ దాడి చేస్తుండడంతో వాటిని ఎవరూ చేరదీసి ఆహారం పెట్టడం లేదు. దీంతో అవి ఆకలికి అలమటిస్తున్నాయి. కనీసం దాహం తీర్చుకునేందుకు వీధి నల్లాల వద్ద నీరు కూడా దొరడం లేదు. కుక్కలు డీ హైడ్రేషన్‌కు గురైనప్పుడు కూడా తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. ఆ సమయంలో అధిక శబ్ధం వినిపించినా, వ్యక్తులు అధికంగా తన పక్క నుంచి తిరిగినా, వాటి పక్క నుంచి హఠాత్తుగా పరుగెత్తుతున్న కుక్కలు కరిచేసే అవకాశం ఉంది. కొన్ని సార్లు ప్రజల్ని భయపెట్టడానికి కుక్కలు అరుస్తుంటాయి. అవి అలా అరుస్తూ వెంటపడినప్పుడు ప్రజలు పరుగెడతారు. దీంతో తమకు భయపడి మనుషులు పరుగెడుతున్నారని కుక్కలు భావిస్తాయి. ఈ క్రమంలోనే వాళ్లను వెండిస్తూ కరచే దాకా వదలవు. ఇలా చేస్తే కుక్క కాటు నుంచి తప్పించుకోవచ్చు .. ►కుక్క దగ్గరికి వస్తే కదలకుండా నిలబడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగెత్తరాదు. కళ్లలోకి తదేకంగా చూడరాదు. కుక్క పిల్లల దగ్గరికి వెళ్లరాదు. ► నిద్రిస్తున్నప్పుడు, తింటున్నప్పుడు, పిల్లలకు పాలిస్తున్నప్పుడు ఏ రకంగానూ ఇబ్బంది పెట్టరాదు. ► కుక్క దాడి చేసేటప్పుడు ముఖాన్ని పంచె లేదా తువ్వాలు తదితర వాటితో కప్పుకోవాలి. ఏమీ లేకపోతే చొక్కాను పైకి జరుపుకోవాలి. లేదా ముఖాన్ని చేతులతో కప్పుకోండి. ముఖంపై కరిస్తే ఇన్ఫెక్షన్ మెదడుకు త్వరగా సోకుతుంది. దీనివల్ల ప్రాణహాని ఉండే ప్రమాదం ఉంది. ►కుక్క కోపంగా దగ్గరికి వస్తే నేల వైపు చూస్తూ దానికి దూరంగా మెల్లగా నడవాలి. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికారాబాద్ మున్సిపల్ పరిధిలో గత ఏడాది ఏర్పాటు చేసిన ఏబీసీలో 1,429 శునకాలకు సంతానం కలగకుండా ఆపరేషన్లు చేశారు. ఆపరేషన్ల అనంతరం కొన్నాళ్ల పాటు సెంటర్లోనే ఉన్న కుక్కలు బయటి వచ్చాక వరుసపెట్టి జనాలపై దాడికి తెగబడుతున్నాయి. వీధి కుక్కలను ఒకేచోట పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు బంధించి ఉంచడంతో అవి ఒత్తిడికి లోనై మనుషులపై దాడి చేస్తున్నట్లు తెలిసింది. తాండూరులోని ఏబీసీ సెంటర్లో కూడా సుమారు 1,247 కుక్కలకు ఆపరేషన్లు చేశారు. కుక్క కరిస్తే ఏం చేయాలి? కుక్క కాటుకు గురైన వ్యక్తి ఐదు సార్లు రేబిస్ వ్యాధికి వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. కుక్క కాటు వల్ల బాగా గాయం అయ్యి రక్తస్రావం అయితే వ్యాక్సిన్ తో పాటు కరిచిన చోట ఇమ్యునొగ్లోబిలిన్స్ ఇంజెక్షన్ తీసుకోవాలి. కుక్క కరిస్తే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే..గతంలో కుక్క కాటుకు గురైన వ్యక్తికి ఒకప్పుడు బొడ్డు చుట్టూ 16 ఇంజెక్షన్లు వేసేవారు. దీంతో ఆ వ్యక్తి ఎంతో బాధను అనుభవించాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం ఈ పద్ధతి మారింది. వ్యాక్సినేషన్ ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా సుమారు 3వేల కుక్కలకు రేబీస్ వ్యాధి సోకకుండా పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో వ్యాక్సిన్ వేశారు. అయినా ఎక్కడో ఒక చోట రేబీస్ వ్యాధితో కుక్కలు జనాలపై దాడి చేస్తున్నాయి. రేబిస్‌తో చాలా ప్రమాదం రేబీస్ వ్యాధికి గురైన పశువులను కుక్కలు కరిసినా, రేబీస్ వ్యాధి ఉన్న కుక్కను మరో కుక్క కరిచినా వ్యాధి ఒకదాని నుంచి మరొక దానికి సోకుతుంది. ఆ కుక్కలు మనుషులను కరిస్తే ప్రమాదం. వెంటనే వైద్యులను సంప్రదించాలి. అయితే రేబీస్ వ్యాధి సోకుండా ప్రతి ఏటా జూన్ మొదటి వారంలోనే పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో టీకాలు వేస్తున్నాం. పెంపుడు కుక్కలకు కూడా వాటి యజమానులు తప్పకుండా వ్యాక్సిన్ వేయించాలి. కుక్కలను భయపెట్టడం, నేరుగా వాటివైపు చూడడం, వాటి దగ్గరగా పెద్ద చప్పుడు చేయడం వంటివి చేయరాదు. అలా చేస్తే అవి దాడిచేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. – అనిల్‌కుమార్, జిల్లా పశు వైద్యాధికారి -
కుక్క కరిచిన విషయాన్ని దాచి, నెలరోజల్లోనే విలవిల్లాడుతూ..
ఉత్తర ప్రదేశ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. కుక్క కరిచిన విషయాన్ని ఓ బాలుడు తన పేరెంట్స్‌కు చెప్పకపోవడంతో.. నెలన్నర తర్వాత ప్రాణాంతక రేబిస్‌తో (కుక్కకాటు వల్ల వచ్చే రేబిస్ వ్యాధి) చనిపోయాడు. తండ్రి భూజాల మీదే చిన్నారి కన్నుమూయడం హృదయ విదారకం. సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మృతుడిని 8వ తరగతి చదువుతున్న షావేజ్‌గా గుర్తించారు. వివరాలు.. విజయ్ నగర్ పీఎస్ పరిధిలోని చరణ్ సింగ్ కాలనీకి చెందిన షావేజ్ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. నెలన్నర కిత్రం అతన్ని పక్కింటి వారికి చెందిన కుక్క కరిచింది. ఈ విషయాన్ని చిన్నారి భయంతో తన తల్లిదండ్రుల దగ్గర చెప్పకుండా దాడిపెట్టాడు. అయితే ఆ కుక్కకు వ్యాక్సిన్ చేయించకపోవడంతో బాలుడికి రేబిస్ వ్యాధి వ్యాపించింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి బాలుడి అనారోగ్యానికి గురయ్యాడు. అన్నం తినడం మానేసి వింతగా ప్రవర్తించడం, కుక్కలా మొరగడం మొదలు పెట్టాడు. గమనించిన తల్లిదండ్రులు గట్టిగా మందలించడంతో కొన్ని రోజుల క్రితం కుక్క కరిచిన విషయాన్ని తెలిపాడు. షావేజ్ కుటుంబీకులు అతన్ని ఢిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకెళ్లారు. కానీ అక్కడ చికిత్స చేసేందుకు చేర్చుకోకపోవడంతో బులంద్‌షహర్‌లోని ఆయుర్వేద వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అయితే బాలుడి పరిస్థితి క్షీణించడంతో బులంద్‌షహర్ నుంచి ఘజియాబాద్‌కు బయల్దేరారు. If you can't vaccinate 🐕, then don't domestic one. Yesterday evening a 14-yr-old Shavez, died in his father's arm, as he did not inform his parents about dog bite, which he suffered more than a month ago due to negligence of his neighbour. #Ghaziabad #UttarPradesh pic.twitter.com/45wVyPw5nC — Arvind Chauhan 💮🛡️ (@Arv_Ind_Chauhan) September 5, 2023 అంబులెన్స్‌లో ఘజియాబాద్‌కు తీసుకువస్తున్న సమయంలో బాలుడు తన తండ్రి చేతుల్లోనే ప్రాణాలు విడిచాడు. అంబులెన్స్‌లో కొడుకు పరిస్థితిని చూసి కుమిలిపోతున్న తండ్రి, తండ్రి చేతిలో మృత్యువుతో పోరాడుతున్న బాలుడు నొప్పితో మెలికలు తిరుగుతున్న హృదయ విదారక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరోవైపు బాలుడి మృతికి కారణమైన కుక్కతో పాటు దాని యజమానిపై చర్యలు తీసుకోవాలని షావాజ్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. STORY | Ghaziabad boy dies of rabies over a month after dog bite, hid incident from parents out of fear READ: https://t.co/Ialssrekma VIDEO: pic.twitter.com/4VGnf1t4Y2 — Press Trust of India (@PTI_News) September 6, 2023 -
జగిత్యాల: కుక్క దాడిలో గాయపడ్డ బాలిక మృతి
సాక్షి, జగిత్యాల: కుక్క కాటు మరో బాలిక జీవితాన్ని బలిగొంది. దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె మృత్యువుతో పోరాడింది. రెండువారాల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ .. చివరకు కన్నుమూసింది. గొల్లపెల్లి మండలం ఆత్మకూరు గ్రామంలో పదిహేను రోజుల కిందట ఓ పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. ఊర్లో దాదాపు పది మందిని గాయపర్చింది. అయితే సంగెపు సాహిత్య అనే 12 ఏళ్ల బాలిక మాత్రం కుక్క దాడిలో తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించిన చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ ఆ చిన్నారి ఇవాళ(శనివారం) ఉదయం కన్నుమూసింది. తమ ముందు ఆడిపాడిన చిన్నారి ఇక లేదనే విషయం తెలిసి.. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదీ చదవండి: గుండెలో రంధ్రం.. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి.. -
అరుస్తూ.. కరుస్తూ.. ఆపై ఆ ఊర్లో ఒక్కసారిగా..!
వికారాబాద్: పిచ్చికుక్క వీరంగం చేసింది.. బిగ్గరగా మొరుగుతూ (అరుస్తూ) కనిపించిన వాళ్లందరినీ కరుస్తూ భయభ్రాంతులు సృష్టించింది. ఈ సంఘటన గురువారం ఉదయం రేగడిమైలారంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఇందిరానగర్ కాలనీలోని పలు ఇళ్లలో దూరిన వీధికుక్క చిన్నారులపై దాడికి పాల్పడింది. ఆరుగురిని కరిచి, తీవ్రంగా గాయ పరిచింది. వీరి అరుపులు, కేకలతో భయపడిన తల్లిదండ్రులు పరుగున వచ్చి పిల్లలను ఆస్పత్రికి తరలించే టెన్షన్లో ఉండగా.. ఒకరి తర్వాత ఒకరిని కరుస్తూ వెళ్లింది. దీని దాడిలో నెల్లి శ్రీనివాస్ కొడుకు ఆదిత్య(ఎల్కేజీ), బంటు అంజిలయ్య కూతురు నందిని(యూకేజీ), నెల్లి వెంకటప్ప కూతురు నవ్యశ్రీ(ఎల్కేజీ), మంగలి శ్రీనివాస్ కూతురు దివ్యశ్రీ(ఎల్కేజీ), మమత, నర్మద గాయపడ్డారు. అలాగే ఇందిరానగర్‌కు చెందిన వృద్ధుడు కుమ్మరి రాములును కరిచిన కుక్క.. అక్కడి నుంచి గ్రామంలోని జాతీయ రహదారిపైకి వచ్చి డీప్లానాయక్ తండాకు చెందిన పూల్‌సింగ్ అనే వ్యక్తిని గాయపర్చింది. దీనిదాడిలో మొత్తం పది మంది గాయపడ్డారు. వీరందరినీ కొడంగల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రథమచికిత్స చేశారు. గాయాలు ఎక్కువగా ఉన్న నలుగురు చిన్నారులను హైదరాబాద్‌లోని నల్లకుంట ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం బాధితులు ఇళ్లకు చేరుకున్నారు. ఈ సంఘటనతో ఊరంతా ఉలిక్కిపడింది. పది మందిపై దాడిచేసిన కుక్క మాత్రం తప్పించుకుపోయింది. దీంతో వీధుల్లో కుక్కలను చూస్తే గ్రామస్తులు హడలిపోతున్నారు. కుక్కలను అరికట్టాలని కోరుతున్నారు. -
ఎముక బయటకు వచ్చేలా పెంపుడు కుక్క దాడి..అదే అతనికి వరమైంది
ఓ పెంపుడు కుక్క యజమాని నిద్రిస్తుండగా దాడి చేసింది. అది అతని కాలి బొటనవేలు ఎముక బయటకు వచ్చేలా కొరికేసింది. విచిత్రంగా అది అతని వరంలా మరి అతన్ని ప్రాణాలను రక్షించుకోగలిగేలా చేసింది. ఈ అనూహ్య ఘటన యూకేలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..యూకేకి చెందిన డేవిడ్ లిండ్సే ఒక రోజు సోఫాలో మత్తుగా నిద్రపోతుండగా. అతడి పెంపు కుక్క ఏడు నెలల బుల్డాగ్ అతడి కాలి బొటన వేలుని కొరికేస్తుటుంది. ఐతే ఇదంత గమనించని యజమాని సడెన్‌గా లేచి చూసేటప్పటికీ..కాలి దగ్గర ఏం చేస్తుందా? అంటూ చూసి షాక్ అవుతాడు. ఆ కుక్క ఎందుకిలా చేసిందో అర్థం గాక లిండ్స్ అతడి భార్య అయోమయానికి గురవుతారు. విచిత్రమేమిటంటే ఎముక బయటకు వచ్చేలా గాయం చేసిన అతడికి నొప్పి తెలియలేదు. దీంతో అతను వెంటనే ఆస్పత్రికి వెళ్లి జాయిన్ అవ్వగా అసలు విషయం తెలిసి కంగుతింటాడు. తనకు డయాబెటీస్ వచ్చిందని, శరీరంలో రెండు దమనులు మూసుకుపోవడం వల్ల కాళ్లకు రక్తం సరిగా సరఫరా కావడం లేదని పేర్కొన్నారు వైద్యులు. అందువల్లే కుక్క గాయం చేస్తున్నా..తనకు స్పర్శ తెలియలేదని, వెల్లడించారు వైద్యులు. ఆ కుక్క అలా దాడి చేయడం వల్లే కదా డాక్టర్లు ఈ విషాయన్ని వెల్లడించగలిగారని లిండ్సే భావించాడు. అది గాయం చేయడం తనకు మంచిదే అయ్యిందని, అందువల్ల ఆ కుక్కను బయటకు పంపిచే ఆలోచన కూడా తనకు లేదని లిండ్సే చెప్పడం గమనార్హం. ఈ మేరకు అతను సుమారు తొమ్మిది రోజులు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న అనతరం డిశ్చార్జ్ అయ్యాడు. కానీ డాక్టర్లు ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యే ప్రమాదం ఉన్నందున్న లిండ్సే బొటనవేలుని తీసేశారు. ఐతే లిండ్సే మాత్రం ఆ బొటనవేలుని తన పెండపు కుక్క కోసం ఇంటికి తీసుకువెళ్లినట్లు చెబుతుండటం విశేషం. (చదవండి: 'దీన్ని అలా చూడకూడదు..': భారత్ పర్యటనపై పాక్ మంత్రి వ్యాఖ్యలు) -
రెండు సెకన్లకో దాడి.. అరగంటకో మరణం
సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రతి రెండు సెకన్లకు ఒక కుక్కకాటు నమోదవుతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఫలితంగా అరగంటకో మరణం సంభివిస్తున్నట్లు తేలింది. భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), ఢిల్లీ ఎయిమ్స్ సంయుక్తంగా పరిశోధన నిర్వహించాయి. ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐజేఎంఆర్) ఈ అధ్యయన ఫలితాలను ప్రచురించింది. 100 కోట్లు: ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుక్కల సంఖ్య. 70 కోట్లు: వివిధ దేశాల్లో వీధికుక్కల సంఖ్య. ప్రపంచంలో వీధికుక్కలు లేని మొదటి దేశం నెదర్లాండ్స్ 2030: రేబిస్ మరణాలను పూర్తిగా నియంత్రించేందుకు భారత్ సహా ప్రపంచ దేశాలు నిర్దేశించుకున్న గడువు. ఏటా సుమారు 20 వేల మంది మృతి ♦ ఐసీఎంఆర్–ఎయిమ్స్ అధ్యయనం ప్రకారం దేశంలో కుక్కకాట్లు, ఇతరత్రా జంతువుల కాటు కారణంగా సంభవించే రేబిస్‌తో ఏటా 18 వేల నుంచి 20 వేల మంది వరకు మృత్యువాతపడుతున్నారు. దేశంలో నమో దవుతున్న రేబిస్ మరణాల్లో 93% కుక్కకాటు ద్వారానే సంభవిస్తున్నా యి. అందులో 63% వీధికుక్కల ద్వారానే చోటుచేసుకుంటున్నాయి. పట్టణాల్లో 60%, గ్రామాల్లో 64% వీధికుక్కల ద్వారా రేబిస్ వ్యాప్తి చెందుతోంది. దేశంలో కోటిన్నర వీధికుక్కలు... ♦ భారత్‌లో 2 కోట్ల కుక్కలు ఉండగా అందులో వీధికుక్కల సంఖ్య 1.53 కోట్లుగా ఉంది. వీధికుక్కలు పెరగడానికి ప్రధాన కారణం... వ్యర్థాలను తీసుకెళ్లే పద్ధతి సక్రమంగా లేకపోవడమేనని ఐసీఎంఆర్ అధ్యయనం పేర్కొంది. అందువల్లే వ్యర్థాలు ఉన్న దగ్గర వీధికుక్కల సంతతి పెరుగుతోందని విశ్లేషించింది. ఆస్పత్రుల ప్రాంగణాల్లో తిష్ట... దేశంలో ఎన్నో ఆసుపత్రులు కుక్కలకు ఆవాస కేంద్రాలుగా ఉంటున్నాయి. రోగులు పడేసే ఆహార వ్యర్థాలను తింటూ అక్కడే తిష్ట వేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాయి. తిండి దొరకనప్పుడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిర్వహణ సరిగ్గాలేని శవాగారాల్లోకి చొరబడి శవాలను సైతం పీక్కుతింటున్నాయి. 3 రకాల శునకాలు.. ♦ మనుషుల మీద ఆధారపడే దాన్ని బట్టి కుక్కలను ఇంట్లో పెంచుకొనేవి, సామాజిక అవసరాలకు ఉపయోగించేవి, వీధికుక్కలుగా విభజించారు. అయితే ప్రధానంగా వీధికుక్కలతోనే సమస్యలు వస్తున్నాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కుక్కల సంతతి నియంత్రణకు సరైన ప్రణాళికలు రచించకపోవడం, జంతు హక్కుల కార్యకర్తల కార్యకలాపాల వల్ల కుక్కకాట్లు అధికమవుతున్నాయి. కుక్కల నియంత్రణ ఇలా... ♦ దేశవ్యాప్తంగా ఏకకాలంలో కుక్కలకు కుటుంబ నియంత్రణ కష్టసాధ్యమైనందున నోటి ద్వారా వేసే టీకాలను అభివృద్ధి చేసి కుక్కలకు ఆహారంలో కలిపి అందించాలి. దీనివల్ల వాటి జాతిని వీలైనంత మేర కట్టడి చేయవచ్చు. ♦ వీధికుక్కల కట్టడికి మున్సిపాలిటీ, వెటర్నరీ, ఎన్జీవోలు, కుక్కల సంరక్షణ కేంద్రాలు, ప్రజలు సమన్వయంతో పనిచేయాలి. ♦ వీధికుక్కల వల్ల కలిగే ప్రమాదాలపై ప్రజలను చైతన్యపరచాలి. -
ప్రసూతి వార్డులోకి ప్రవేశించిన కుక్క.. శిశువును నోటకరుచుకుని..
బెంగళూరు: కొద్ది నెలల క్రితం తెలంగాణలో కుక్కల దాడిలో ఓ బాలుడు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. అయితే, ఇలాంటి దారుణ ఘటనే తాజాగా కర్నాటకలో చోటుచేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రి ప్రసూతి వార్డులోకి వచ్చిన ఓ వీధి కుక్క నవజాత శిశువును నోటితో పట్టుకుని ఈడ్చుకెళ్లింది. అనంతరం ఈ ఘటనలో నవజాత శిశువు మృతి చెందింది. వివరాల ప్రకారం.. శివమొగ్గ జిల్లాలోలని ప్రభుత్వ ఆసుపత్రి ప్రసూతి వార్డులో శనివారం ఉదయం ఓ మహిళ.. శిశువు జన్మించింది. అయితే, శనివారం ఉదయం 7 గంటల సమయంలో ఓ విధి కుక్క.. ప్రసూతి వార్డులోకి ప్రవేశించింది. అక్కడే ఉన్న శిశువును నోటకరుచుకుని బయటకు ఈడ్చుకెళ్లింది. దీన్ని చూసిన ఆసుపత్రి సిబ్బంది.. వెంటనే కుక్కను తరిమికొట్టారు. దీంతో, శిశువును అక్కడే వదిలేసి.. కుక్కు బయటకు పరుగులు పెట్టింది. అనంతరం, సిబ్బంది శిశువును ఆసుపత్రిలోకి తీసుకెళ్లారు. ఈ క్రమంలో శిశువును పరిశీలించిన వైద్యులు.. బిడ్డ చనిపోయినట్టుగా గుర్తించారు. అయితే, కుక్క కాటుకు ముందే నవజాత శిశువు చనిపోయాడా లేదా అంతకుముందే చనిపోయాడా? అనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక, శిశువు మృతిలో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి. మరోవైపు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
కుక్క కాటుకు 1,000 కుట్లు
వాషింగ్టన్: స్నేహితురాలితో ఆడుకోవడానికి పొరుగింటికి వెళ్లిన ఆరేళ్ల బాలికపై శునకం దాడిచేసింది. ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను బతికించడానికి వెయ్యికిపైగా కుట్లు వేయాల్సి వచ్చింది. చికిత్స కోసం నిధులు సేకరించారు. హృదయవిదారకమైన ఈ ఉదంతం అమెరికాలోని చెస్టర్‌విల్లేలో చోటుచేసుకుంది. ఆరేళ్ల చిన్నారి లిలీ ఫిబ్రవరి 18న ఆడుకోవడానికి పొరుగింటికి వెళ్లింది. అక్కడ టేబుల్‌పై కూర్చొని ఉండగా ఆ కుటుంబం పెంచుకుంటున్న పిట్‌బుల్ అనే జాతి శునకం హఠాత్తుగా దాడి చేసింది. ముఖంపై కరిచేసింది. కంటి కింది నుంచి చుబుకం దాకా పంటి గాట్లు దిగాయి. లిలీ మిత్రురాలు వెంటనే గట్టిగా అరవడంతో వంటగదిలో ఉన్న ఆమె తల్లి బయటకు వచ్చింది. కుక్కను ఆమె దూరంగా తరిమేసింది. లిలీ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు చేతులెత్తేయడంతో బోస్టన్లోని మరో హాస్పిటల్లో చేర్చారు. చికిత్సకు చాలా డబ్బు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పడంతో లిలీ కుటుంబ మిత్రుడొకరు సోషల్ మీడియాలో ‘గోఫండ్‌మీ’ పేరిట పేజీని ఏర్పాటు చేసి, నిధులు సేకరించాడు. వైద్యులు లిలీకి చికిత్స పూర్తిచేశారు. ముఖంపై వెయ్యికిపైగా కుట్లు వేశారు. తన బిడ్డ దుస్థితిని చూసి శోకాన్ని ఆపుకోవడానికి తాను చాలా కష్టపడాల్సి వచ్చిందని లిలీ తల్లి డోరోతీ నార్టన్ చెప్పారు. లిలీ ముఖంలో కండరాలన్నీ దెబ్బతిన్నాయని, ఇప్పట్లో మాట్లాడలేదని, కనీసం నవ్వలేదని డాక్టర్లు వెల్లడించారు. పూర్తిగా కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని అన్నారు. -
ఇది మీ అంతరాత్మను కదిలించలేదా?
సాక్షి, హైదరాబాద్: ‘‘నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి చంపాయి. అధికారులు ఏం చేస్తున్నారు? ఇది మీ అంతరాత్మలను కదిలించలేదా? ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా వీధి కుక్కల నియంత్రణకు మీ వద్ద ఏదైనా ప్రణాళిక ఉందా?’’అని జీహెచ్ఎంసీ అధికారులను హైకోర్టు నిలదీసింది. ఈ ఘటనకు సంబంధించి బాలుడి తల్లిదండ్రులు పరిహారం పొందేందుకు అర్హులేనని స్పష్టం చేసింది. అధికారులు తీసుకున్న చర్యలేమిటో కోర్టుకు తెలియజేయాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 16కు వాయిదా వేసింది. సుమోటోగా విచారణ నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలానికి చెందిన గంగాధర్ హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో ఓ కారు సర్వీసింగ్ సెంటర్లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం గంగాధర్‌తోపాటు సర్వీసింగ్ సెంటర్‌కు వెళ్లిన నాలుగేళ్ల కుమారుడు ప్రదీప్‌పై వీధికుక్కలు దాడి చేయడంతో మృతి చెందాడు. ఈ ఘటనపై ఓ పత్రికలో ప్రచురితమైన వార్తను హైకోర్టు సుమోటో పిల్‌గా విచారణకు స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీలతో కూడిన ధర్మాసనం గురువారం దీనిపై విచారణ నిర్వహించింది. బాలుడి మరణం దురదృష్టకరమని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ కోర్టుకు చెప్పారు. ఈ సందర్భంగా వీధికుక్కల నియంత్రణకు తీసుకున్న చర్యలేమిటో తెలియజేయాలని ధర్మాసనం ఆదేశించింది. ఇలాంటివి మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను మార్చి 16వ తేదీకి వాయిదా వేసింది. -
కుక్కల దాడిపై స్పందించిన వర్మ.. జీహెచ్ఎంసీ మేయర్‌పై సెటైర్లు!
వివాదాస్పద సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వర్మ ఏ కామెంట్ చేసిన సోషల్ మీడియాలో పెను సంచలనంగా మారిపోతుంది. అయితే, తాజాగా తెలంగాణలో కుక్కల దాడిలో బాలుడు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తనదైన స్టైల్లో వర్మ ఎంటర్ అయ్యాడు. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మిపై సెటైరికల్ కామెంట్స్ చేశారు. కాగా, ఇటీవలి కాలంలో జీహెచ్ఎంసీ పరిధిలో కుక్కల దాడులు పెరుగుతున్న కారణంగా మేయర్ విజయలక్ష్మి అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్‌లో భాగంగా మేయర్.. కుక్కల దాడులు జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీనిపై వర్మ స్పందించారు. ఈ సందర్బంగా వర్మ.. కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. ట్విట్టర్ వేదికగా కేటీఆర్ సార్.. ఒక్క దగ్గరకు చేర్చిన కుక్కల మధ్యలోకి మేయర్‌ను పంపండి అంటూ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే మేయర్ తన పదవికి ఎందుకు రాజీనామా చేయకూడదని ప్రశ్నించారు. Hey @GadwalvijayaTRS why don’t u resign your post as a mayor and take all the Dog goons into your home and feed them yourself , so that they won’t eat our children ? pic.twitter.com/2dfa426hRv — Ram Gopal Varma (@RGVzoomin) February 23, 2023 అయితే, అంతకుముందు మేయర్.. ఆకలితో ఉన్నందునే కుక్కలు దాడి చేశాయని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై కూడా వర్మ స్పందించి ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లల ప్రాణం కంటే కుక్కల ఆకలి గురించి ఆలోచించడమేంటని మండిపడ్డారు. అంతగా ఉంటే.. మేయర్ గారు కుక్కలన్నింటినీ ఇంటికి తీసుకువెళ్లి ఆహారం పెట్టొచ్చు కదా అని కామెంట్ చేశారు. కుక్కలన్నీ మేయర్ ఇంట్లో ఉంటేనే పిల్లలకు రక్షణ ఉంటుందని సెటైర్ వేశారు. అలాగే, కుక్కల విషయంలో సమీక్షలో భాగంగా ఏం నిర్ణయం తీసుకున్నారో చెప్పాలన్నారు. Hey @GadwalvijayaTRS I WANT TO BITE @KTRBRS @hydcitypolice pic.twitter.com/bXTFqsxzzH — Ram Gopal Varma (@RGVzoomin) February 23, 2023 -
కుక్క దాడుల ఎఫెక్ట్.. వారికి మంత్రి తలసాని వార్నింగ్!
సాక్షి, హైదరాబాద్: వీధి కుక్కల దాడిలో అంబర్‌పేటకు చెందిన నాలుగేళ్ల వయసున్న చిన్నారి మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఘటనపై తెలంగాణ హైకోర్టు కూడా స్పందించింది. వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి కేసును బుధవారం సుమోటోగా స్వీకరించింది. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా విచారణకు స్వీకరిస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీలో కుక్కల దాడి ఘటనలపై ప్రభుత్వం అప్రమత్తమైంది. కుక్క కాటు నియంత్రణపై 13 అంశాలతో మున్సిపల్ శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ క్రమంలో స్టెరిలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించింది. వీధి కుక్కలను దత్తత తీసుకునేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఇదే సమయంలో హెల్ప్‌లైన్ నంబర్ 040-2111 1111 తీసుకువచ్చింది. ఇదిలా ఉండగా.. జీహెచ్ఎంసీలో వీధి కుక్కల దాడుల ఘటనలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షా సమావేశానికి మున్సిపల్, వెటర్నరీ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. నగరంలో జరిగిన ఘటన బాధాకరం. నగరంలో కుక్కల బెడద ఎక్కువగా ఉంది. మేయర్ వ్యాఖ్యలను విపక్షాలు వక్రీకరించాయి. ప్రస్తుతం కుక్కల విషయంలో 8 ప్రత్యేక టీమ్స్‌తో స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నాం. టోల్ ఫ్రీ నంబర్, ప్రత్యేక యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. చనిపోయిన జంతువుల దహనానికి జీహెచ్ఎంసీ సూచించిన ప్రాంతాల్లోనే దహనం చేయాలి. ప్రజలు ఎవరూ కూడా ఆందోళన చెందవద్దు. విమర్శలు చేసే వారికి మేము సమాధానం చెప్పాము. ట్రైనింగ్ క్యాంపు పెట్టి వీటి కోసం ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటాము. మటన్, చికెన్ షాపుల వద్ద రేపటి(శుక్రవారం) నుండి స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నాము. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాము. రాత్రి సమయంలో స్పెషల్ టీమ్స్ తనిఖీల్లో ఉంటాయి. అక్కడే కేసులు నమోదు చేస్తారని హెచ్చరించారు. -
విశ్వనగరానికి వీధికుక్కల బెడద.. మూడు రెట్లు పెరిగిన ఘటనలు
రాష్ట్రంలో వీధి కుక్కలు పేట్రేగిపోతున్నాయి. కాలనీలు, బస్తీల్లో స్వైర విహారం చేస్తున్నాయి. గుంపులు గుంపులుగా తిరుగుతూ చిన్నారులపై దాడులు చేస్తున్నాయి. కొన్నిచోట్ల క్రూర మృగాల్లా రెచి్చపోతూ పసిపిల్లల ప్రాణాలు తీస్తున్నాయి. విశ్వనగరంగా చెప్పుకుంటున్న హైదరాబాద్‌లోనూ వీటి బెడద తప్పడం లేదు. సోమవారం బాగ్ అంబర్‌పేటలో కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన ఓ నాలుగేళ్ల బాలుడు మరణించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు వేర్వేరు ఘటనల్లో కూడా ఇద్దరు చిన్నారులపై కూడా కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. 2022లో నవంబర్ నాటికే 80,281 కుక్కకాట్లు రాష్ట్రంలో కుక్కకాటు కేసులు ఏడాది కాలంలోనే గణనీయంగా పెరిగాయి. నాలుగేళ్ల క్రితం భారీగా ఉన్న కేసులు.. మరుసటి రెండేళ్లు తగ్గగా.. తర్వాత నాలుగో ఏడాది మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. 2021లో 24,124 కుక్క కాట్లు సంభవించగా, 2022లో నవంబర్ నాటికే ఏకంగా 80,281 మందిని కుక్కలు కరిచినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ నివేదిక వెల్లడించింది. అంటే అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఏకంగా మూడురెట్లకు పైగా కుక్కకాట్లు జరిగాయి. దేశంలో కుక్కకాట్లలో తెలంగాణ 8వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో 2019లో 1.67 లక్షల కాట్లు, 2020లో 66,782 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో సమస్య తీవ్రం హైదరాబాద్‌లోని ఐపీఎంకు కుక్క కాట్లకు గురై చికిత్స కోసం వస్తున్నవారు నెలకు 2,000– 2,500కు పైగా ఉంటుండగా, నిజామాబాద్, కరీంనగర్ వంటి నగరాల్లో నెలకు 400 వరకు కుక్కకాటు కేసులు నమోదు కావడం.. వాటి బెడద ఎంత తీవ్రంగా ఉందో స్పష్టం చేస్తోంది. ఇక హైదరాబాద్‌తో పాటు జీహెచ్ఎంసీని ఆనుకొని ఉన్న జవహర్‌నగర్, బడంగ్‌పేట, బండ్లగూడ, మీర్‌పేట, జిల్లెలగూడ, బోడుప్పల్, పీర్జాదిగూడ, నిజాంపేటల్లో వీటి సమస్య అత్యంత తీవ్రంగా ఉంది. జవహర్‌నగర్‌లో డంపింగ్ స్టేషన్ కుక్కలకు ప్రత్యేక ఆవాస కేంద్రంగా తయారైంది. రాష్ట్రవ్యాప్తంగా మునిసిపల్ కార్పొరేషన్లలో వెటర్నరీ విభాగాలున్నా, అవి నామమాత్రంగా కొనసాగుతున్నాయి. వీధి కుక్కలు పెరిగిపోవడానికి, నగరాల్లో ఏటా వేల సంఖ్యలో కుక్కకాటు కేసులు నమోదవడానికి ఆయా కార్పొరేషన్లు, మునిసిపాలిటీలలో అధికార యంత్రాంగాల నిర్లక్ష్యమే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజామాబాద్, కరీంనగర్, గ్రేటర్ వరంగల్, రామగుండం, ఖమ్మం కార్పొరేషన్లలో వీధికుక్కల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు తక్కువేనన్న విమర్శలూ ఉన్నాయి. కరీంనగర్ కార్పొరేషన్లో ఈ ఏడాది కుక్కల సంతాన నియంత్రణ శస్త్ర చికిత్సలను కూడా నిలిపివేసినట్లు సమాచారం. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 20 జిల్లా కేంద్రాలలో జంతు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసిన మునిసిపల్ శాఖ స్టెరిలైజేషన్ (సంతాన నియంత్రణ) చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒక కుక్క, దాని పిల్లలు..పిల్లల పిల్లలు! ఒక కుక్క దాని పిల్లలు కలిపి ఏడాది కాలంలో దాదాపు 42 కుక్క పిల్లలను పెడతాయి. వాటి పిల్లలు.. పిల్లల పిల్లలు ఇలా మొత్తం ఏడేళ్ల కాలంలో దాదాపు 4 వేల కుక్కలు పుడతాయని అంచనా. ఇలా కుక్కల సంతతి అభివృద్ధి చెందుతున్నా వాటిని తగ్గించే కార్యక్రమాలు అంత చురుగ్గా సాగడం లేదు. దీంతో వీధికుక్కల సంఖ్య తగ్గడం లేదు. స్టెరిలైజేషన్తోనే నియంత్రణ.. వీధి కుక్కల నియంత్రణకు స్టెరిలైజేషన్ ఒక్కటే మార్గం. అంటే కుక్కల పునరుత్పత్తి ప్రక్రియను నియంత్రించేలా శస్త్రచికిత్సలు చేయడం. మొత్తం కుక్కల్లో ఆడకుక్కలన్నింటికీ ఒకేసారి సంతాన నిరోధక శస్త్రచికిత్సలు జరిగితేనే కుక్కల సంతతి తగ్గుతుంది. ఏటా వేలాది కుక్కలకు శస్త్ర చికిత్సలు చేస్తున్నట్లు ఆయా కార్పొరేషన్ల వెటర్నరీ విభాగాల అధికారులు చెపుతున్న మాటలన్నీ డొల్ల మాటలేనని కుక్కల సంఖ్య పెరిగిపోతున్న తీరు స్పష్టం చేస్తోంది. ఒక్క వరంగల్ కార్పొరేషన్లోనే సుమారు 60 వేలకు పైగా వీధికుక్కలు ఉన్నట్లు అధికారులు లెక్కలేశారు. ఇక్కడ కుక్కల సంతాన నియంత్రణ కోసం ఓ ప్రైవేటు ఎన్జీవోకు శస్త్ర చికిత్సల బాధ్యత అప్పగించారు. ఒక కుక్కకు స్టెరిలైజేషన్ చేస్తే కార్పొరేషన్ రూ.750 చెల్లిస్తోంది. ప్రతిరోజు 20 కుక్కల వరకు పట్టుకొని ఆపరేషన్లు చేస్తున్నట్లు ఎన్జీవో సంస్థ చెపుతున్నప్పటికీ, వేలల్లో ఉన్న కుక్కల సంతతి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలోనే ప్రతిరోజు 20 నుంచి 30 కుక్క కాటు కేసులు ఎంజీఎం ఆసుపత్రికి వస్తున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్, రామగుండంలలో కార్పొరేషన్ అధికారులే కుక్కల నియంత్రణకు స్టెరిలైజేషన్ చేపట్టినా, అవి ఎంతోకాలం సాగలేదు. కరీంనగర్లో స్టెరిలైజేషన్ పేరుతో కుక్కలను చంపుతున్నట్లు ఓ స్వచ్చంద సంస్థ పేర్కొనడంతో ఆ కార్యక్రమాన్ని నిలిపివేశారు. రామగుండం పూర్తిగా కోల్‌బెల్ట్ ఏరియా కావడం, ఓపెన్ నాలాలు ఎక్కువగా ఉండడంతో కుక్కల బెడద తీవ్రంగా ఉంది. కొత్తవారు ఎవరు కనిపించినా పిక్కలు పీకేసే పరిస్థితి ఈ కాలరీస్‌లో ఉంది. కరీంనగర్, నిజామాబాద్ నగరాల్లో ప్రతి నెల 400 వరకు కుక్కకాటు కేసులు నమోదవుతున్నాయి. ఖమ్మంలో 2021లో కుక్కల స్టెరిలైజేషన్ కార్యక్రమం ప్రారంభించిన కార్పొరేషన్ అధికారులు సుమారు 2,500 కుక్కలకు సంతాన నియంత్రణ ఆపరేషన్లు చేసినట్లు చెప్పారు. కానీ తర్వాత ఆ కార్యక్రమాన్ని నిలిపివేశారు. ఇప్పుడు నగరంలో ఎక్కడ చూసినా వీధికుక్కల గుంపులే కనిపిస్తున్నాయి. 29,789 కుక్కలకు స్టెరిలైజేషన్ రాష్ట్ర వ్యాప్తంగా వీధికుక్కల సంతతిని తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పురపాలక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. జీహెచ్ఎంసీ మినహా అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రత్యేకంగా జంతు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. ఇందులో భాగంగా ఇప్పటివరకు 20 జిల్లా కేంద్రాలలో ఏర్పాటు చేసిన జంతు సంరక్షణ కేంద్రాల్లో 29,789 కుక్కలకు సంతతి నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించినట్లు తెలిపింది. నగరాలు, మునిసిపాలిటీలలో ప్రజలకు ఇబ్బందిగా మారిన కుక్కలతో పాటు కోతులను కూడా ఈ సంరక్షణ కేంద్రాలకు తరలించి స్టెరిలైజేషన్ చేస్తున్నట్లు తెలిపింది. కుక్కలకు ఆహారం దొరక్కే..: మేయర్ విజయలక్ష్మి గ్రేటర్ నగరంలో 2022 జనవరి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 20 మధ్యకాలంలో 5,70,729 కుక్కలుండగా 4,01,089 కుక్కలకు సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేసినట్లు హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి చెప్పారు. అంబర్‌పేట ఘటనలో కుక్కలకు ప్రతిరోజూ ఆహారం వేసే వారు రెండురోజులుగా వేయనందునే ఆకలికి తట్టుకోలేక బాలునిపై దాడి చేసి ఉంటాయని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రతిరోజూ కుక్కలకు మాంసం వేసే దుకాణాలు వారు దుకాణాలు మూసేసినా అలాగే వ్యవహరిస్తాయని చెప్పారు. ఇదొక ప్రమాదం మాత్రమేనంటూ.. బాలుడు మరణంపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. నగరంలో మరోమారు ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆహారం కోసం నగరాలకు.. గతంలో వీధి కుక్కలు గ్రామాల్లో ఎక్కువగా ఉండేవి. అయితే నగరాల్లో వాటికి ఆహారం ఎక్కువ మొత్తంలో లభ్యమవుతుండడంతో వాటి సంఖ్య భారీగా పెరిగింది. ఏదైనా సంఘటన జరిగినప్పుడు హడావుడి చేసి వదిలేయకుండా.. వీధికుక్కల సమస్యపై కార్పొరేషన్లకు ప్రజలు ఫోన్లు చేసినప్పుడు స్పందించి ఆయా బస్తీలు, కాలనీల్లోని కుక్కలను తీసుకెళ్లి స్టెరిలైజేషన్ చేసి దూరంగా వదిలేస్తే ఈ సమస్యను కొంతవరకు తగ్గించవచ్చని ప్రజలు అంటున్నారు. ఆడకుక్కలన్నిటికీ ఆపరేషన్లు చేయాలి హైదరాబాద్‌లో కుక్కల సంఖ్య తగ్గించేందుకు ఏబీసీ (యానిమల్ బర్త్ కంట్రోల్) కార్యక్రమాలు నిబంధనల కనుగుణంగా జరగడం లేవని, అవినీతి జరుగుతోందని జంతు ప్రేమికురాలు, సంబంధిత అంశాలపై అవగాహన ఉన్న డాక్టర్ శశికళ తెలిపారు. జైపూర్, గోవాల్లో ఈ కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయని చెప్పారు. ఆడ కుక్కలన్నింటికీ ఆపరేషన్లు చేయడంతో పాటు మగవాటికి సంతానోత్పత్తి వయసు వచ్చే సమయంలోనే (8–12 నెలల మధ్య) సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేస్తున్నారన్నారు. వీటితో పాటు ‘మిషన్ ర్యాబిస్’పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తారని, కుక్కల బారిన పడకుండా ఎలా వ్యవహరించాలి, తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారని చెప్పారు. అసోంలోనూ కొన్ని సంస్థలు ఇలా పనిచేస్తున్నాయని వివరించారు. మాయమైన ‘మాఇంటి నేస్తం’.. పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ లోపం వల్ల, బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం వల్ల కుక్కల సంచారం పెరుగుతోంది. వీటి సంఖ్యను తగ్గించే చర్యల్లో భాగంగా దాదాపు ఐదేళ్ల క్రితం వీధికుక్కలను పెంచుకునే పథకం ‘మా ఇంటి నేస్తం’ప్రారంభించారు. అప్పట్లో 3 వేల వీధికుక్కల్ని ఆసక్తి ఉన్నవారికి దత్తత ఇచ్చారు. కానీ ఆ తర్వాత ఆ పథకం కనుమరుగైంది. అది కొనసాగినా వీధికుక్కల సంఖ్య తగ్గి ఉండేదనే అభిప్రాయాలున్నాయి. హైదరాబాద్ నగరంలో కుక్కలను కట్టడి చేయాలని దాదాపు 8 నెలల క్రితం హైకోర్టు ఆదేశించినప్పటికీ చర్యల్లేక పోవడం విచారకరం. హైదరాబాద్ ఐపీఎంలో 2022 జనవరి నుంచి 2023 జనవరి వరకు నమోదైన కుక్కకాటు కేసులు నెల కేసులు 2022 జనవరి 2,286 ఫిబ్రవరి 2,260 మార్చి 2,652 ఏప్రిల్ 2,540 మే 2,569 జూన్ 2,335 జూలై 2,201 ఆగస్టు 2,272 సెపె్టంబర్ 2,177 అక్టోబర్ 2,474 నవంబర్ 2,539 డిసెంబర్ 2,554 2023 జనవరి 2,580 ––––––––––––––––––––– హైదరాబాద్‌లో గతంలో... – 2016 ఫిబ్రవరి 12న కుషాయిగూడలో కుక్కలు దాడి చేయడంతో 8 ఏళ్ల బాలిక మృతి. – 2020లో అమీర్‌పేటలో ఒకేరోజు 50 మంది కుక్కకాట్ల బారిన పడ్డారు. – 2020 ఆగస్టులో లంగర్‌హౌస్‌లో నలుగురు చిన్నారులకు గాయాలు – 2022 డిసెంబర్ 12న పీర్జాదిగూడలో చిన్నారికి తీవ్రగాయాలు. – 2021 జనవరి 30న బహదూర్‌పురాలో 8 ఏళ్ల బాలుడు మృతి. – 2017లో 14 మంది, 2018లో 9 మంది కుక్కకాట్ల వల్ల మరణించారు. ఇలా ఏటా కుక్కకాట్ల వల్ల మరణాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. –––––––––––––––– ప్రతిసారీ 4–8 పిల్లలు – కుక్కల జీవిత కాలం 8–12 సంవత్సరాలు. – 8 నెలల వయసు నిండేటప్పటికి సంతానోత్పత్తి సామర్ధ్యం వస్తుంది. – కుక్కల గర్భధారణ సమయం 60–62 రోజులు – ఒక్కో కుక్క సంవత్సరానికి రెండు పర్యాయాలు సంతానోత్పత్తి చేస్తుంది. – సంతానోత్పత్తి జరిపిన ప్రతిసారీ 4–8 పిల్లలు పెడుతుంది. ––––––––––––––––––––– పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం: కేటీఆర్ అంబర్‌పేటలో కుక్కల దాడిలో బాలుడు మరణించడం బాధాకరమని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపడతామని పేర్కొన్నారు. వీధికుక్కల దాడిలో గాయపడి మరణించిన బాలుడి కుటుంబానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం తెలిపారు. నగరంలోని పలు ప్రాంతాల్లో వీధికుక్కలు, కోతుల సమస్య తీవ్రంగా ఉందన్నారు. దీనిపై జీహెచ్ఎంసీ, వెటర్నరీ అధికారులతో ఈ నెల 23 న ఉదయం 11.00 గంటలకు మాసాబ్‌ట్యాంక్‌లోని తమ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. కుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులకు గాయాలు సుజాతనగర్: కుక్కల దాడిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్, బేతంపూడి గ్రామాల్లో ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. సుజాతనగర్‌లోని సుందరయ్యనగర్‌కు చెందిన నాలుగేళ్ల చిన్నారి ఫజీమా మంగళవారం స్థానిక అంగన్వాడీ సెంటర్ నుంచి ఇంటికి వస్తుండగా.. ఒక్కసారిగా వచి్చన కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో ఫజీమా చేతికి గాయాలు కాగా.. స్థానికులు కుక్కలను తరిమేశారు. బేతంపూడిలో ఇంటి వద్ద ఆడుకుంటున్న యశ్వంత్ అనే బాలుడిపై అకస్మాత్తుగా వచి్చన వీధి కుక్కలు దాడి చేసి గొంతుపై కరిచాయి. కుక్కల నుంచి బాలుడిని విడిపించేందుకు వెళ్లిన గ్రామస్తుడు బానోత్ లాలుపై కూడా దాడి చేయగా స్థానికులు వాటిని తరిమేశారు. అసలేం జరిగింది.. హైదరాబాద్‌లో తండ్రితో కలిసి అతను పనిచేసే చోటుకు వెళ్లిన బాలుడు కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి మరణించడం కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం.. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయికి చెందిన గంగాధర్ జీవనోపాధి కోసం నగరానికి వచ్చి భార్యాపిల్లలతో కలిసి బాగ్‌అంబర్‌పేటలో నివాసముంటున్నాడు. ఛే నంబర్లోని కార్ల సరీ్వసింగ్ సెంటర్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఈ నెల 19న తన కుమారుడు ప్రదీప్ (4), కుమార్తెతో కలిసి కారు సరీ్వసింగ్ సెంటర్‌కు వెళ్లాడు. పిల్లల్ని ఆడుకొమ్మనిచెప్పి విధుల్లో నిమగ్నమయ్యాడు. ప్రదీప్ అక్కడ ఆటవిడుపుగా ఒంటరిగా తిరుగుతున్న సమయంలో కుక్కల గుంపు ఒకటి అకస్మాత్తుగా దాడి చేసింది. బాలుని అక్క గమనించి కేకలు వేయడంతో గంగాధర్‌తో పాటు ఇతర సెక్యూరిటీ గార్డులు వచ్చి కుక్కలను తరిమికొట్టారు. అప్పటికే తీవ్రంగా గాయపడ్డ ప్రదీప్‌ను సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు బాలుడు మృతి చెందినట్లు చెప్పారు. -
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కచ్చితంగా చర్యలు తీసుకుంటాం: మేయర్
-
కుక్కల దాడిలో బాలుడి మృతి బాధాకరం: మేయర్
-
కుక్కల దాడిలో చిన్నారి మృతి బాధాకరం: మేయర్
సాక్షి, హైదరాబాద్: నగరంలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన బాధాకరమన్నారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి. ఈ పరిణామంపై సాక్షి వరుస కథనాల నేపథ్యంలో స్పందించిన ఆమె అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వీధి కుక్కలను కంట్రోల్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి పేర్కొన్నారు. నగరంలో కుక్కలను స్టెరిలైజ్ చేసేందుకు.. ప్రతీరోజూ 30 వాహనాలు తిరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఇప్పటిదాకా 4 లక్షల కుక్కలకు స్టెరిలైజ్ చేసినట్లు గణాంకాలు వివరించారామె. నగరంలో ఐదున్నర లక్షలకుపైనే వీధి కుక్కలు ఉన్నట్లు అంచనా వేస్తున్నట్లు ఆమె తెలిపారు. అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందడం బాధాకరమన్న ఆమె.. ఘటనపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అలాగే ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారామె. కుక్కలు ఏయే ప్రాంతాల్లో ఎక్కువగా తిరుగుతున్నాయో.. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారామె. అంతకు ముందు మేయర్ విజయలక్ష్మి అధికారులతో అత్యవసర భేటీ నిర్వహించారు. ఈ భేటీకి జోనల్ కమిషనర్లు, వెటర్నరీ అధికారులు హాజరయ్యారు. వీధి కుక్కల కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ఆమె అధికారుల నుంచి వివరాలను సేకరించారు. -
షాకింగ్.. 2 గంటల్లో 40 మందిని కరిచిన వీధి కుక్క.. కిక్కిరిసిన ఆసుపత్రి వార్డ్
జైపూర్: కుక్కలు మనుషులపై దాడి చేస్తున్న ఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతున్నాయి. రోడ్డు మీద వెళ్తున్న వారిపై విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరుస్తున్నాయి. పెంపుడు శునకాలు, వీధి కుక్కలనే తేడా లేకుండా ఉన్నట్టుండి యజమానులు, బయట వారిపై దాడి చేస్తున్నాయి. తాజాగా రాజస్థాన్‌లో ఓ వీధి కుక్క బీభత్సం సృష్టించింది. కేవలం 2 గంటల్లోనే ఏకంగా 40 మందిని కరిచింది. ఈ ఘటన బార్మర్ జిల్లాలోని కళ్యాణ్పూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. వీధి కుక్క దాడితో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కుక్క దాడిలో గాయాలపాలైన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బాధితులతో ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డు నిండిపోయింది. దీంతో స్థానికంగా పరిస్థితి ఏ స్థాయికి చేరిందనేది వెల్లడవుతోంది. అకస్మాత్తుగా వీధికుక్క దాడి చేయడంతో చాలా మంది గాయపడ్డారని, వారందరికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని సదరు హాస్పిటల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బిఎల్ మన్సూరియా తెలిపారు. ఈ ఘటనపై వెంటనే నగర పాలక సంస్థకు సమాచారం అందించడంతో అధికారులు రంగంలోకి దిగారు. కుక్కను పట్టుకునేందుకు రెండు బృందాలను ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు ఆసుపత్రి సిబ్బంది సహాయంతో వీధికుక్కను పట్టుకున్నారు. తాజా ఘటనతో నగరంలోని కుక్కల బెడద ఎక్కువగా ఉన్న వివిధ ప్రాంతాల్లో వాటిని పట్టుకునేందుకు నగర పాలక సంస్థ చర్యలు చేపట్టింది. చదవండి: దారుణం.. ఇంటి యజమానిని చితకబాది.. నోట్లో పినాయిల్ పోసి.. -
కుక్క కాటుకు వ్యాక్సిన్ కొరత..
సాక్షి, హైదరాబాద్: కుక్కకాటు వల్ల వచ్చే రేబిస్ వ్యాధితో సంభవిస్తున్న మరణాలు తెలంగాణలో గణనీయంగా ఉన్నాయి. ఇటువంటి మరణాల్లో దేశంలోనే తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ మధ్య 21 మంది రేబిస్ వ్యాధితో మరణించినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా వెల్లడించింది. అత్యధికంగా కర్ణాటకలో 32 మంది ఈ కాలంలో మరణించగా, తర్వాత పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రల్లో 24 చొప్పున, తమిళనాడులో 22, కేరళ, తెలంగాణల్లో 21 చొప్పున రేబిస్ మరణాల కేసులు నమోదయ్యాయి. జాతీయ రేబిస్ నియంత్రణ కార్యక్రమం దేశం మొత్తం అమలవుతున్నా రేబిస్ మరణాలు సంభవించడంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. వ్యాక్సిన్ అందుబాటులో ఉంచాలని కేంద్రం ఆదేశించింది. వ్యాక్సిన్ కొరత... : రాష్ట్రంలో అనేక ఆస్పత్రుల్లో కుక్క కరిచిన తర్వాత జరగాల్సిన చికిత్సకు అవసరమైన మందులు లేవనే చెప్పాలి. అధికార లెక్కల ప్రకారమే కుక్కకాటు వల్ల దాదాపు 40 వేల మందికిపైగా ఆస్పత్రులపాలవుతున్నట్లు వెల్లడైంది. ఇక విచక్షణారహితంగా కరిచే పిచ్చికుక్కలను పట్టి దూరంగా వదిలివచ్చే శిక్షణ కలిగిన సిబ్బంది కొరత కూడా తీవ్రంగానే ఉంది. మున్సిపల్ అధికారులు ఏదో నామమాత్రంగా పిచ్చికుక్కలు, వీధికుక్కలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రికార్డుల్లో రాసుకుంటున్నా ఆచరణకు వచ్చే సరికి కాగితాలకే మిగిలిపోతున్నాయి. రేబిస్ నిరోధక టీకాలు కొనుగోలు, సరఫరా అంతా ఒక మిథ్యగా మారిపోతోంది. కోట్లాది రూపాయలు వ్యయం చేసి కొంటున్నట్లు చెప్తున్నా మందులు మాత్రం అందుబాటులో ఉండటం లేదు. అలాగే కుక్కల సంఖ్య పెరగకుండా నియంత్రణ చేసే కార్యక్రమం కూడా నామమాత్రంగా మారింది. శునకాలకు శస్త్రచికిత్స చేస్తున్నట్లు రికార్డుల్లో రాసుకుంటున్నా అవి ఎంతవరకు వాస్తవం అనేది అగమ్యగోచరంగానే ఉంది. వీధి కుక్కలకు వచ్చిన జబ్బులకు చికిత్సచేసే విధానం అయితే లేదనే చెప్పొచ్చు. -
మహిళపై పెంపుడు కుక్క దాడి.. యజమానికి షాకిచ్చిన కోర్టు
ఇటీవల కాలంలో కుక్కలు మనుషులపై దాడి చేసిన ఘటనలు ఎక్కువ అవుతున్నాయి. రోడ్డు మీద వెళ్తున్న వారిపై విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరుస్తున్నాయి. అయితే ఈ జాబితాలోకి పెంపుడు కుక్కలు కూడా చేరాయి. ఈ మధ్య పెంపుడు శనుకాలు కూడా ఉన్నట్టుండి యజమానులు, బయట వారిపై దాడి చేస్తున్నాయి. అయితే కుక్కలు గాయపరిచిన ఘటనలో బాధితులకు పరిహారం అందడం చాలా అరుదు. కానీ తాజాగా ఓ పెంపుడు కుక్క కరిచిన ఘటనలో గాయపడిన మహిళకు ఉపశమనం లభించింది. పెంపుడు కుక్క దాడిలో గాయపడ్డ బాదితురాలికి 2 లక్షల పరిహారం చెల్లించాలని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార వేదిక.. గురుగ్రామ్ మున్సిపల్ కార్పొరేషన్‌ను(ఎంసీజీ) మంగళవారం ఆదేశించింది. కావాలంటే చెల్లించిన పరిహారం మొత్తాన్నికుక్క యజమాని నుంచి తిరిగి పొందవచ్చని పేర్కొంది. కాగా ఇళ్లల్లో పనులు చేసుకుంటూ జీవించే మున్ని అనే మహిళ, తన కోడలుతోపాటు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా వినిత్ చికారా పెంచుకుంటున్న కుక్క ఆగష్టు 11 న దాడి చేసింది. ఈ ప్రమాదంలో మహిళ తల, ముఖానికి తీవ్ర గాయాలవ్వడంతో ఆమెను గురుగ్రామ్‌లోని ఆసుపత్రికి తరువాత ఢిల్లీలోని సఫ్దర్‌గంజ్ హాస్పిటల్‌కు తరలించారు. కుక్క దాడిపై సివిల్ లైన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే మహిళను కరిచిన శునకం ‘డోగో అర్జెంటీనో’ జాతికి చెందినదిగా యజమాని తెలిపారు. చదవండి: అరే! ఏం మనుషుల్రా ఇంత రాక్షసత్వమా! శునకానికి ఉరి వేసి... కుక్కను స్వాధీనం చేసుకోవాలని, దాని లైసెన్స్ అనుమతిని వెంటనే రద్దు చేయాలని ఫోరమ్ మున్సిపల్ కార్పొరేషన్‌ను ఆదేశించింది. అదే విధంగాపెంపుడు కుక్కల పాలసీని మూడు నెలల్లో రూపొందించాలని ఆదేశించింది. వీధి జంతువులను అదుపులోకి తీసుకున్న తర్వాత వాటిని పౌండ్లలో ఉంచాలని, అలాగే హనికరమైన 11 అన్యదేశ జాతులను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ జాతి కుక్కులను ఎవరైనా పెంచుకుంటే వెంటనే కస్టడీలోకి తీసుకోవాలని తెలిపింది. డోగో అర్జెంటీనో వంటి క్రూర జాతికి చెందిన శునకం పెంపుడు విషయంలో యజమాని చట్టాన్ని, నిబంధనలు ఉల్లించాడని స్పష్టంగా అర్థం అవుతోందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా అమెరికన్ పిట్-బుల్ టెర్రియర్స్, డోగో అర్జెంటీనో, రోట్వీలర్ వంటి క్రూర జాతి కుక్కులపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది.