![Indore Man Shoots Dead Neighbour s Pet Dog For Biting Wife: Police - Sakshi](/styles/webp/s3/article_images/2021/06/3/dog.gif.webp?itok=Fk83F4QC)
భోపాల్: మధ్య ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. తన భార్యను పక్కింట్లోని పెంపుడు కుక్క కరిచిందని రివాల్వర్‌తో కాల్చిచంపాడో వ్యక్తి. వివరాలు.. ఇండోర్‌లోని సుదామ నగర్ అపార్ట్ మెంట్లో నరేంద్ర విశ్వయ్య అనే వ్యక్తి ఉంటున్నాడు. అతని పక్కింట్లో ఒక వ్యక్తి కుక్కను పెంచుకుంటున్నాడు.
అయితే, అది విశ్వయ్య భార్యను కరిచింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన సదరు వ్యక్తి, వెంటనే తన లైసెన్స్డ్ తుపాకితో ఆ కుక్కను కాల్చిచంపాడు. దీనిపై ఆ శునకం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు, నరేంద్రను అదుపులోకి తీసుకొని జంతువులపై క్రూరత్వంగా ప్రవర్తించడం, లైసెన్స్గన్ను దుర్వినియోగం చేయడం వంటి వివిధ సెక్షన్ల కింద కేసులను నమోదు చేశారు. ఈ సంఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని ఇండోర్ పోలీసు అధికారి మనీష్ మహోర్ తెలిపారు.
పోలీసుల విచారణలో ప్రాథమికంగా ఆ కుక్క ఇది వరకే చాలా మందిని కరిచి, గాయ పర్చిందని తెలింది. ఒక వేళ నిందితుడి వాదనే నిజమైతే శునకం యజమానిపై కూడా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment