shoot dog
-
తన భార్యను కరిచిందని కుక్కపై ప్రతీకారం..
భోపాల్: మధ్య ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. తన భార్యను పక్కింట్లోని పెంపుడు కుక్క కరిచిందని రివాల్వర్‌తో కాల్చిచంపాడో వ్యక్తి. వివరాలు.. ఇండోర్‌లోని సుదామ నగర్ అపార్ట్ మెంట్లో నరేంద్ర విశ్వయ్య అనే వ్యక్తి ఉంటున్నాడు. అతని పక్కింట్లో ఒక వ్యక్తి కుక్కను పెంచుకుంటున్నాడు. అయితే, అది విశ్వయ్య భార్యను కరిచింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన సదరు వ్యక్తి, వెంటనే తన లైసెన్స్డ్ తుపాకితో ఆ కుక్కను కాల్చిచంపాడు. దీనిపై ఆ శునకం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు, నరేంద్రను అదుపులోకి తీసుకొని జంతువులపై క్రూరత్వంగా ప్రవర్తించడం, లైసెన్స్గన్ను దుర్వినియోగం చేయడం వంటి వివిధ సెక్షన్ల కింద కేసులను నమోదు చేశారు. ఈ సంఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని ఇండోర్ పోలీసు అధికారి మనీష్ మహోర్ తెలిపారు. పోలీసుల విచారణలో ప్రాథమికంగా ఆ కుక్క ఇది వరకే చాలా మందిని కరిచి, గాయ పర్చిందని తెలింది. ఒక వేళ నిందితుడి వాదనే నిజమైతే శునకం యజమానిపై కూడా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. చదవండి: పెళ్లిలో వధువు చేసిన పనికి బిత్తరపోయిన వరుడు! -
'కాల్చి చంపండి.. తుపాకీ నేను ఇస్తా'
న్యూయార్క్: బొద్దుగా, ముద్దుగా ఉండే కుక్కను తుపాకీతో కాల్చి చంపమంటే ఎవరైనా చంపుతారా? ఎంతటి కఠినాత్ములైనా ఇలాంటి పని చేయలేరు. కానీ దిక్కుతోచని స్థితిలో తన కుక్కను చంపాలని అమెరికా మహిళ ఒకరు ఫేస్ బుక్ ఫ్రెండ్స్ ను అభ్యర్థించింది. తన పెంపుడు శునకాన్ని సంరక్షణించే స్తోమత తనకు లేనందున దాన్ని చంపాలని ఆమె విజ్ఞప్తి చేసింది. 'నా కుక్కను కాల్చి చంపడానికి ఒకరు కావాలి. తుపాకీ నేనే ఇస్తా' అని టెక్సాస్ మహిళ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. వెంటనే స్పందించిన జంతు సంరక్షణ అధికారులు ఈ కుక్కను కాపాడారు. దీనికి వ్యాక్సిన్లు వేయించి మరొక మహిళకు సంరక్షణార్థం అప్పగించారు. ఎవరైనా దీన్ని పెంచుకునేందుకు ముందుకు వస్తే వారికి ఈ కుక్కను అప్పగిస్తామని అధికారులు తెలిపారు. గోధుమ, తెలుపు రంగులో ఉన్న మూడున్నరేళ్ల ఈ శునకాన్ని పోషించలేక దాన్ని చంపాలని యజమానురాలు తన ఫేస్ బుక్ లో మిత్రులను కోరిందని చెప్పారు. భారమైన హృదయంతోనే ఆమె ఈ పనికి పూనుకుందన్నారు. ఆమెతో నేరుగా మాట్లాడేందుకు మీడియా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.