
చిలకలగూడ: పెంపుడు కుక్క కరిచిందని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరి ధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీతాఫల్‌మండికి చెందిన శిరీష తన కుమార్తెతో కలిసి ఈ నెల 7న సాయంత్రం 4 గంటలకు ఇంటికి నడుచుకుంటూ వెళుతోంది. ఇదే ప్రాంతానికి చెందిన అనిత పెంపుడు కుక్క చిన్నారి వెంటబడి కుడి చెవి వెనుక కరిచింది. దీంతో చిన్నారికి తీవ్ర రక్తగాయమైంది. గాంధీ ఆస్పత్రిలో చికిత్స చేయించిన అనంతరం బాధితురాలి తల్లి శిరీష పోలీసులను ఆశ్రయించింది. రెండు రోజుల క్రితం అదే పెంపుడు కుక్క తన కుమారుడిని కూడా కరిచిందని తన ఫిర్యాదులో పేర్కొంది. ఇండియన్ పీనల్ కోడ్ 336 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment