
అరెస్టయిన నిందితులు
తుమకూరు: అప్పు చెల్లించడం లేదనే కారణంగా యువకుడిని హత్య చేసిన ఘటనలో మంగళవారం క్యాత్సంద్ర పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. తుమకూరుకు చెందిన భరత్, కాంతరాజు,పాలనేత్రయ్య (27) చాలా కాలంగా పక్కపక్క ఇళ్లల్లోనే ఉంటుండడంతో ముగ్గురు స్నేహితులుగా మారారు. గతనెల 29వ తేదీన పాతనేత్రయ్య ఇంట్లో పెంపుడు కుక్క కాంతరాజును కరిచింది. దీనిపై కాంతరాజు, భరత్‌లు పాలనేత్రయ్య తల్లితో గొడవ పడ్డారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన పాలనేత్రయ్య గొడవలకు దిగొద్దని స్నేహితులను హెచ్చరించాడు.
అప్పు చెల్లించాలని ఒత్తిడి చేసి :దీంతో పాలనేత్రయ్యపై కక్ష పెంచుకున్న నిందితులు అతడిని అంతమొందించడానికి నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో గతంలో తనవద్ద తీసుకున్న రూ.5వేల అప్పు చెల్లించాలని నిందితులు పాలనేత్రయ్యను అడిగారు. తనవద్ద డబ్బులు లేవని తరువాత చెల్లిస్తానని చెప్పడంతో అదేరోజు రాత్రి మాట్లాడాలని బస్టాండ్‌కు తీసుకెళ్లి కత్తులు, రాడ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో పాలనేత్రయ్య అక్కడిక్కడే మృతి చెందగా మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం నిందితులను అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment