
సేలం ప్రభుత్వ ఆస్పత్రి వద్ద కుక్క కాటు బాధితులు
సేలం: ఒకే కుక్క 66 మందిని కరిచిన సంఘటన శుక్రవారం ఉదయం సేలంలో చోటు చేసుకుంది. సేలం కిచ్చిపాళయం వద్ద శుక్రవారం పిచ్చికుక్క సంచరిస్తూ ఆ మార్గంలో వెళుతున్న అందరినీ వెంటపడి కరవసాగింది. స్థానికులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని కుక్కను కొట్టి తరిమారు. ఆ కుక్క సమీపంలోని పచ్చపట్టి, నారాయణనగర్, కురింజి నగర్ ప్రాంతాల్లో తిరుగుతూ 66 మందిని కరిచింది. కుక్క దాడిలో గాయపడిన వారిలో కొందరు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లగా, అనేక మంది సేలం ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. వైద్య సిబ్బంది వారికి చికిత్సలు చేసి రేబిస్ టీకాలు వేశారు. ఎట్టకేలకు పట్ట కోయిల్ ప్రాంతంలో సంచరిస్తున్న కుక్కను స్థానికులు కొట్టి చంపారు.
Comments
Please login to add a commentAdd a comment