సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో వరుసగా కుక్కల దాడి ఘటనలు జరిగినా ప్రభుత్వం చలించకపోవడం అమానవీయమని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ మేరకు శనివారం(ఆగస్టు 10) ఎక్స్(ట్విటర్)లో ఆయన ఒక పోస్టు చేశారు.
‘బతికున్న మనుషులను సైతం కుక్కలు చంపి పీక్కుతిన్న ఘటనలు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. మరోవైపు చిన్నారులపై కుక్కల దాడులు నిత్యకృత్యం అవుతున్నాయి. రాష్ట్రంలో కుక్కల దాడుల్లో మనుషులు చనిపోవడం అనేది ఒక సాధారణ అంశంగా ప్రభుత్వం భావిస్తుండటం దుర్మార్గం.
కుక్క కాటు కేసులు నమోదైన వెంటనే తగిన చర్యలు తీసుకొని ఉంటే రాష్ట్రంలో గడిచిన 8 నెలల కాలంలో 343 కుక్కకాటు సంఘటనలు జరిగి ఉండేవి కావు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయేవారు కాదు. ఇప్పటికే ఈ విషయంలో పలుమార్లు హైకోర్టు హెచ్చరికలు జారీ చేసినా ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్ర వదలడం లేదు. ప్రభుత్వం వెంటనే కుక్కల దాడులు అరికట్టే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలి’అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment