
గాయపడ్డ చిన్నారి హరిణి
కుత్బుల్లాపూర్: నగరంలో వీధికుక్కలు చెలరేగిపోతున్నాయి. రాత్రి పగలు తేడా లేకుండా దాడులకు తెగబడుతున్నాయి. రెండేళ్ల క్రితం వరకు 3.5 లక్షలున్న వీటి సంఖ్య ఇప్పుడు అనూహ్యంగా 8 లక్షలకు పెరిగిపోయింది. నిధులు లేవన్న కారణంతో ప్రభుత్వం వీధి శునకాల సంతాన నిరోధక శస్త్ర చికిత్సలను తగ్గించడంతో వాటి సంతానం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది. మంగళవారం కుత్బుల్లాపూర్ పరిధి ప్రసూననగర్‌లోపాఠశాల నుంచి ఇంటికి వెళుతున్న ఏడుగురు చిన్నారులపై వీధికుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ప్రసూననగర్ రామాలయం వీధికి చెందిన చిన్నారులు జ్ఞానేశ్వర్, హరిణి, లీనా, శ్రవణ్ తదితరులు పాఠశాల నుంచి ఇంటికి వెళుతుండగావీధి కుక్క ఒక్కసారిగా దాడి చేసింది. దీంతో సురేష్‌కుమార్ అనే వ్యక్తి దానిని తరిమికొట్టి చిన్నారులను కాపాడారు. సంక్షేమ సంఘం ప్రతినిధులు నాగశేఖర్‌గౌడ్, నాగేశ్వరరావు, నారాయణలకు సమాచారం అందించడంతో వారు చిన్నారులను స్థానిక ఓ ప్రైవేట్ ఆస్పత్రికితరలించారు.