
కర్ణాటక, బొమ్మనహళ్లి: చిక్కమగళూరు సమీపంలోని అటవీ ప్రాంతంలో ఒక నాగుపాము, కుక్క మధ్య జరిగిన పోరాటం చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కోప్ప తాలుకాలోని హోళెమక్కి గ్రామానికి సమీపంలో ఉన్న ఒక తోటలో కుక్కకు, నాగుపాముకు గొడవ జరిగింది. అవినాశ్ అనే వ్యక్తికి చెందిన తోటలో సుమారు అరగంట పాటు కీచులాటలో నాగుపాము రోషంతో పడగవిప్పి బుసకొడుతూ కుక్కను ఎదుర్కొంది. ఈ పోరాటాన్ని చూసిన తోట యజమాని దానిని సెల్‌ఫోన్లో ఫోటోలు, వీడియోలు తీయడం జరిగింది. తన జోలికి రావద్దని నాగుపాము కుక్కను బెదిరిస్తూ పొదల్లోకి జారుకుంది. పాము పడగవిప్పినప్పుడు సూర్య కిరణాలు పడగపైన పడి ప్రకాశిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ఆకర్షిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment