బెంగళూరు: పని మీద వెళ్తున్నప్పుడు గమనించకుండానే చెప్పులు, షూ ధరిస్తుంటారు చాలా మంది. అయితే, వాటిల్లో విష పురుగులు ఉంటే ప్రాణాలకే ప్రమాదంగా మారుతుంది. ఎంత అర్జెంట్ పని ఉన్నా ఓసారి చూసి ధరించటం మంచింది. ఓ సారి ఈ సంఘటన చూడండి. షూలో భారీ నాగు పాము నక్కింది. దానిని బయటకు తీసేందుకు ప్రయత్నించగా పడగ విప్పి బుసలు కొడుతోంది. కర్ణాటకలోని మైసూర్‌లో జరిగిన ఈ సంఘటన వీడియోను ట్విటర్‌లో షేర్ చేయగా ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఓ వ్యక్తి రోజూ మాదిరిగానే షూ ధరించేందుకు వెళ్లగా అందులో నాగు పాము కనిపించి షాక్‌కు గురయ్యాడు. ఆ తర్వాత పాములు పట్టే వ్యక్తికి ఫోన్ చేశాడు. అక్కడికి చేరుకున్న ఆ వ్యక్తి పామును షూ నుంచి తీసేందుకు ప్రయత్నించాడు. దాంతో కోపంతో ఊగిపోయిన ఆ పాము పడగ విప్పి బుసలు కొట్టింది. ఈ సంఘటన ప్రతి ఒక్కరికి హెచ్చరికగానే చెప్పాలి. షూ ధరిస్తున్నప్పుడు కచ్చితంగా దానిని పరిశీలించిన తర్వాత వేసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.
Shocking video of cobra #snake in Mysore, Karnataka hiding inside the shoe.
— Bharathirajan (@bharathircc) October 10, 2022
#ViralVideo #Cobra #Rescued #Shoes #Karnataka pic.twitter.com/rJmVN5W1ne
ఇదీ చదవండి: 10 ఏళ్ల వయసులో జైలుకు.. 53 ఏళ్లప్పుడు నిర్దోషిగా విడుదల
Comments
Please login to add a commentAdd a comment