Cobra Sticking Out From Door Terrifies Internet - Sakshi
Sakshi News home page

భయానక వీడియో: ఇలాంటి సెక్యూరిటీ గార్డును ఎప్పుడైనా చూశారా?.. కాస్త ఉంటే కాటు పడేదే!

Published Tue, Dec 27 2022 6:36 PM | Last Updated on Tue, Dec 27 2022 7:25 PM

Cobra Sticking Out From Door Terrifies Internet - Sakshi

వైరల్‌: కొన్ని వీడియోలకు ఎన్నేళ్లు అయినా.. క్రేజ్‌ తగ్గదు. రిపీట్‌ మోడ్‌లో వైరల్‌ అవుతూనే ఉంటాయవి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. బహుశా.. ఆ వీడియోను గనుక మీరు ఇంతకు ముందు చూడకపోయి ఉంటే ఇప్పుడు చూసేయండి.. సెఫెస్ట్‌ సెక్యూరిటీ సిస్టమ్‌ అంటూ ఓ వ్యక్తి సరదా క్యాప్షన్‌తో ఆ వీడియోను పోస్ట్‌ చేశాడు. 

ఓ నాగుపాము తలుపు సందులోంచి పడగవిప్పి బుసలు కొడుతూ కనిపించింది. తనను వీడియో తీస్తున్న వ్యక్తిని తదేకంగా చూసి ఆ నాగు.. ఒక్కసారిగా కాటేసే యత్నం చేసింది కూడా. అయితే.. 

ఆ ఇంటి వెనక ఒకావిడ భయంతో చూస్తున్న దృశ్యం కనిపిస్తుంది. ఇది ఎప్పుడు ఎక్కడ జరిగిందనే దానిపై క్లారిటీ లేదు. కాకపోతే మన దేశంలోనే జరిగినట్లు తెలుస్తోంది. బహుశా.. అది అలా తలుపులో దూరి ఉంటుందని భావిస్తున్నారు. ఇక ఈ భయానక వీడియోకు కామెంట్లు రకరకాలుగా వస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement