Door
-
Hyderabad: విమానం గాల్లో ఉండగా డోర్ తెరిచే ప్రయత్నం..
శంషాబాద్: ప్రయాణంలో ఉన్న విమానం డోరు తెరిచే ప్రయత్నం చేసి కలకలం రేపిన ఓ ప్రయాణికుడి ఘటనలో పలు వివరాలు వెల్లడయ్యాయి. స్నేహితులతో ఉజ్జయిని వెళ్లిన ఓ ప్రయాణికుడు ఈ నెల 21 ఇండోర్ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానంలో కొందరు ప్రయాణికులతో గొడవ పడడంతో అతడిని ముందు సీటులో కూర్చోబెట్టారు. ఆ తర్వాత కొద్దిసేపటికి అతడు గాల్లో ప్రయాణిస్తున్న విమానం డోరు తెరిచేందుకు యతి్నంచడంతో అందులోని ఉద్యోగులు నివారించారు.ఈ విషయమై ఆర్జీఐఏ పీఎస్‌లో కేసు నమోదు అయినప్పటికి వివిధ మెడికల్ రిపోర్టుల ఆధారంగా అతడు స్టేషన్ బెయిల్ పొందాడు. అసలు సదరు ప్రయాణికుడు అలా ప్రవర్తించడానికి గల కారణం ఏంటని స్నేహితులను ప్రశి్నంచిన పోలీసులకు అతడు బంగు (మూలికలతో చేసిన మత్తుపదార్థం) సేవించడమే కారణమని తెలిపారు. బంగు మత్తులో ఉన్నందునే సదరు ప్రయాణికుడు అలా ప్రవర్తించినట్లు తెలిపారు. -
‘ఆటోమేటిక్ డోర్‌కు అలవాటు పడలేదు’
‘వందే భారత్’ రైలులో ప్రయాణించాలని ఎవరికి ఉండదు చెప్పండి? ఆధునిక సౌకర్యాలతో తళతళలాడుతున్న ఈ రైలు ఎక్కాలని చాలామంది తహతహలాడిపోతుంటారు. అయితే ఈ రైలులోని కొన్ని సాంకేతిక విషయాలు తెలియక కొందరు చిక్కుల్లో పడుతున్నారు. సాధారణంగా మన ఇంట్లో ఎవరైనా రైలు ప్రయాణానికి బయలుదేరినప్పుడు వారిని దిగబెట్టేందుకు తోడుగా ఎవరో ఒకరు వెళుతుంటారు. ఇదేవిధంగా ఒక భర్త తన భార్యను వందేభారత్ రైలు ఎక్కించేందుకు వెళ్లాడు. ఆమె తన సీటులో కూర్చున్నాక భర్త కూడా ఆమె పక్కనే కూర్చున్నాడు. అయితే ఇంతలో వారుంటున్న కోచ్ డోర్ ఆటోమేటిక్‌గా క్లోజ్ అయిపోయింది. మరి అప్పుడేం జరిగింది? వివరాల్లోకి వెళితే ఒక మహిళ తన కుమార్తె దగ్గర ఉండేందుకు తొలిసారిగా వందే భారత్ రైలులో గుజరాత్‌లోని వడోదర నుంచి ముంబైకి బయలుదేరింది. ఆ మహిళకు తోడుగా స్టేషన్ వరకూ ఆమె భర్త వచ్చాడు. లగేజీని ఆమె కూర్చున్న సీటు దగ్గర ఉంచి, కాసేపు కూర్చున్నాడు. ఇంతలో రైలు తలుపులు మూసుకుపోయిన శబ్ధం వినిపించింది. ఆ వ్యక్తి రైలు దిగకముందే డోర్ మూసుకుపోయింది. దీంతో ఆ వ్యక్తి టీసీతో మాట్లాడి రైలును ఆపాలనుకున్నాడు. అయితే అప్పటికే ఆలస్యం కావడంతో రైలు వేగం అందుకుంది. దీంతో ఆ వ్యక్తి తనకు ఇష్టం లేకపోయినా తదుపరి స్టేషన్ వచ్చే వరకు ప్రయాణించవలసి వచ్చింది. అతని కుమార్తె తన ‘ఎక్స్’ హ్యాండిల్లో ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ పోస్ట్‌ను ఇప్పటివరకూ కొన్ని లక్షలమంది వీక్షించారు. ఈ పోస్ట్ చూసిన ఒక యూజర్.. ‘అతను స్టేషన్‌లోని నో పార్కింగ్ జోన్లో పెట్టిన తన కారు గురించి ఆందోళన చెందుతున్నాడేమోనని’ రాయగా, మరొక యూజర్ ‘ఇది అతనికి అందమైన జ్ఞాపకంగా మిగులుతుందని’ రాశాడు. మరో యూజర్ ‘అతనింకా ఆటోమేటిక్ డోర్‌కు అలవాటుపడలేదని’ పేర్కొన్నాడు. My mother is travelling for the first time in Vande Bharat from Vadodara to Mumbai today to visit me. As it is going to be a longer stay, she had two big bags to travel with. (1/4) — Kosha (@imkosha) April 2, 2024 -
ఓపెన్ ఎక్స్పీరియన్స్ సెంటర్లు ప్రారంభించిన డోర్ తయారీ సంస్థ
జర్మన్ ఆధారిత హర్మన్ సంస్థ అనుబంధ కంపెనీ అయిన శక్తి హర్మన్ తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్, దిల్లీలో రెండు ‘ఓపెన్ ఎక్స్పీరియన్స్ సెంటర్’ను ప్రారంభించింది. బుధవారం బేగంపేటలో జరిగిన కార్యక్రమంలో హర్మన్ గ్రూప్ యాజమాన్య భాగస్వామి మార్టిన్ జే.హర్మన్ పాల్గొని మాట్లాడారు. స్టీల్ డోర్, వుడెన్ డోర్లకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగిందన్నారు. సంస్థ ప్రస్తుతం హైదరాబాద్ ప్లాంట్‌లో వీటిని ఉత్పత్తి చేస్తున్నట్లు చెప్పారు. ఇండియావ్యాప్తంగా మార్కెట్‌ను పెంచనున్నట్లు తెలిపారు. సంస్థ ప్రారంభించిన ప్రొడక్ట్ ఎక్స్పీరియన్స్ కేంద్రాల ద్వారా వినియోగదారులు నేరుగా ఉత్పత్తులను చూసి వాటి ఉపయోగాలపై అవగాహన పొందే వీలుంటుందన్నారు. ప్రస్తుతం అన్ని విభాగాల్లో కలిపి ఏటా 1.1లక్షల డోర్లు అమ్ముడవుతున్నాయన్నారు. శక్తి హర్మన్ సంస్థ ఎండీ శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ కంపెనీ విస్తరణలో భాగంగా వచ్చే ఏడాది రెండో త్రైమాసికంలోపు జైపుర్‌లోని మహేంద్రాసిటీలో రెండో ప్లాంట్ అందుబాటులోకి వస్తుందన్నారు. హైదరాబాద్‌లోని ప్లాంట్ ద్వారా ఏటా 2లక్షల డోర్లు, 10వేల ఇండస్ట్రీయల్ డోర్లు ఉత్పత్తి అవుతున్నాయని చెప్పారు. జైపుర్ ప్లాంట్ అందుబాటులోకి వస్తే ఏటా మరో 1.3లక్షల డోర్లు ఉత్పత్తి పెరుగుతుందన్నారు. ఈ ప్లాంట్ అందుబాటులోకి వస్తే దాదాపు 450 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇందుకోసం రూ.175కోట్లు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. కమర్షియల్, ఇండస్ట్రీయల్, రెసిడెన్షియల్ విభాగాల్లో అధునాతన టెక్నాలజీతో డోర్లు తయారుచేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్, దిల్లీలో ప్రారంభించిన ఓపెన్ ఎక్స్పీరియన్స్ సెంటర్ల ద్వారా కస్టమర్లు నేరుగా సంబంధిత ప్రోడక్ట్‌ను చూసి దాని ఉపయోగాలు తెలుసుకుని నిర్ణయం తీసుకునే వీలుంటుందన్నారు. కేటలాగ్ చూసి డోర్లను కొనుగోలు చేయడం కంటే అనుభవపూర్వంగా వాటి గురించి తెలుసుకుని, చూసి కొనాలో వద్దో నిర్ణయం తీసుకోవడం ఉత్తమమని వివరించారు. దేశవ్యాప్తంగా రియాల్టీ రంగం విస్తరిస్తుంది. దానికి అనువుగా డోర్ల అవసరం ఉంటుందన్నారు. హైదరాబాద్ మెట్రోతోపాటు చాలా ప్రభుత్వ, ప్రైవేట్‌రంగాల్లో తమ సంస్థకు చెందిన డోర్లను వాడుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చేపడుతున్న ప్రభుత్వ, ప్రైవేట్ రంగం, రెసిడెన్షియల్ విభాగాల్లో 2.5కోట్ల డోర్లు అవసరం ఉందన్నారు. అయినప్పటికీ డోర్ల తయారీలో అసంఘటిత రంగానికి ఇప్పటికీ 50 శాతం కంటే ఎక్కువ వాటా ఉందన్నారు. గతేడాది కంపెనీ రూ.270కోట్ల రెవెన్యూ సంపాదించినట్లు చెప్పారు. ఇండస్ట్రీయల్, కమర్షియల్ డోర్లు తయరుచేసే శక్తి హర్మన్ సంస్థ ప్రతిష్టాత్మక జర్మన్ ఆధారిత హర్మన్ బ్రాండ్ అనుబంధ కంపెనీ. హర్మన్ సంస్థ డోర్ సెగ్మెంట్లో 1935 నుంచి ప్రపంచవ్యాప్తంగా తన కార్యకలాపాలను నిర్వర్తిస్తుంది. ఇప్పటికే గ్లోబల్‌గా తమ సంస్థకు చెందిన దాదాపు 2కోట్ల డోర్లు వినియోగిస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. దాదాపు 6000 మంది సంస్థలో పనిచేస్తున్నట్లు చెప్పారు. ఆసియా, ఉత్తర అమెరికా, యూరప్‌తో కలిపి మొత్తం 40 ఫ్యాక్టరీల్లో తమ ఉత్పత్తులను తయారుచేస్తున్నారు. అయితే 1994 నుంచి శక్తి హర్మన్‌గా కార్యకలాపాలు కొనసాగిస్తున్న సంస్థ..2012 నుంచి ఇండియావ్యాప్తంగా తమ ఉత్పత్తులకు మార్కెటింగ్ చేసేలా చర్యలు తీసుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.8వేల కోట్ల టర్నోవర్ ఉన్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. -
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: మంత్రి తలసాని
సనత్‌నగర్: ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడంతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉండే జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంతి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ రూపొందించిన కరపత్రాలు, డోర్ స్టిక్కర్లను ఆదివారం ఆయన తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ, వర్షాకాలంలో పలు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, వాటి బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇంటి పరిసరాల్లో మురుగునీరు, పిచి్చమొక్కలు, వ్యర్థాలు ఉంటే దోమలు వృద్ధి చెంది డెంగీ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుందన్నారు. దోమల నివారణకు జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో ప్రతి రోజూ ఫాగింగ్ చేస్తారన్నారు. కార్యక్రమంలో డీసీ శంకర్, ఎంటమాలజీ ఎస్ఈ దుర్గాప్రసాద్, ఏఈ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. యాదవుల అభివృద్ధికి ప్రభుత్వం అండ: మంత్రి యాదవుల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నల్లగొండ జిల్లా యాదవ సంఘం నూతన కమిటీ సభ్యులు.. అధ్యక్షుడు మేకల యాదయ్య యాదవ్ ఆధ్వర్యంలో మంత్రిని ఆయన నివాసంలో ఆదివారం కలిసి శాలువాతో సత్కరించారు. మంత్రిని కలిసిన వారిలో గౌరవ అధ్యక్షుడు అల్లి వేణుయాదవ్, ప్రధాన కార్యదర్శి కొమ్మనబోయిన సైదులు యాదవ్, ఉపాధ్యక్షుడు కదారి గోపి, సాంస్కృతిక విభాగం మహిళా అధ్యక్షురాలు మంజులత యాదవ్, యూత్ అధ్యక్షుడు దొంగరి శివకుమార్, సల్లా సైదులు, ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోసాల గోపాల కృష్ణ ఉన్నారు. కాగా, మంజుల యాదవ్ ఆధ్వర్యంలో రూపొందించిన గురుకులం, ఇతర పాటల పోస్టర్లను మంతి ఈ సందర్భంగా ఆవిష్కరించారు. -
ఆకాశంలో వింత.. చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే! స్వర్గానికి దారి ఇదేనా?
ఈ విశ్వంలో మనకు తెలియని వింతలు విడ్డూరాలు చాలానే ఉన్నాయి. మన శాస్త్రవేత్తలు ఎన్నో సంవత్సరాల నుంచి బోలెడు అంతుచిక్కని విషయాలను బయటపెట్టిన అవి ఈ విశ్వంలో ఉన్నవాటితో పోలిస్తే చాలా తక్కువనే చెప్పాలి. అప్పుడప్పుడు ఆకాశంలో ఏవో మెరుపులు, వింతలు కనపడడం వాటిని చూసి ఔరా అనుకుంటుంటాం. అలానే దాని గురించి పూర్తిగా తెలియకపోయినా మనకు నచ్చిన, తెలిసిన వాటితో పోలుస్తుంటాం. తాజాగా మేఘావృతమైన ఆకాశంలో ఓ వింత ఆకారం కనిపించింది. దీని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అదేమై ఉంటుందని నెట్టింట ప్రస్తుతం చర్చణీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని హెబ్బాల్ ఫ్లైఓవర్ సమీపంలో శనివారం రాత్రి ఓ వింత ప్రత్యక్ష్యమైంది. అది చూసేందుకు ఎలా ఉందంటే.. ఆకాశంలో ఉన్న భవనానికి సంబంధించిన తలుపులులా కనిపిస్తూ.. దాని వెనుక ప్రకాశవంతమైన వెలుగు కనిపిస్తోంది. ఇక దీన్ని కొందరు వీడియో తీసి నెట్టింట షేర్ చేయగా అది కాస్త వైరల్‌గా మారి రచ్చ చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇది ఏమై ఉండవచ్చు? అని ఎవరికి నచ్చిన కామెంట్లు వాళ్లు పెడుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కొందరు ఇది స్వర్గానికి దారి అయ్యిండచ్చని కామెంట్ పెట్టగా.. మరికొందరేమో ఇదేంటో అని భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇంకొందరేమో మరో ప్రపంచానికి ప్రవేశ మార్గం అని, బెంగుళూరు వాతావరణంలో ఏలియన్స్ తమ బట్టలు ఆరబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఫన్నీగా కామెంట్ పెట్టారు. A mysterious shadow (object?) was seen in Bengaluru skies last night near Hebbal flyover. Did anyone else see? What could this possibly be? A shadow of a building? If it is, then what could possibly be the science behind it? Credits: @SengarAditi pic.twitter.com/8YOIzvIsPv — Waseem ವಸೀಮ್ وسیم (@WazBLR) July 23, 2023 -
దునియాలోనే ఎత్తయిన దర్వాజా.. భారత్‌కే సొంతం!
భారతదేశం ఎంత గొప్పదంటే ఇక్కడ కనిపించే అద్భుతాలలో కొన్ని ప్రపంచంలో ఎక్కడ వెదికినా కనిపించవు. వీటిని చూసినప్పుడు, విన్నప్పుడు ప్రపంచమే ఆశ్చర్యపోతుంటుంది. ఉదాహరణకు ఆగ్రాలోని తాజ్ మహల్‌నే తీసుకుంటే దీనికి ప్రపంచమే ఫిదా అయిపోతుంది. అటువంటి మరో అద్భుతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచం టెక్నాలజీని చూడకముందే.. ప్రపంచంలో అధునాతన టెక్నాలజీతో ఎన్నో భారీ వస్తువులను రూపొందుతున్నాయి. అయితే ఈ టెక్నాలజీ రాకముందే భారత్‌తో అతి పెద్ద నిర్మాణాలు జరిగాయి. అవి ఎలా నిర్మించారో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. వాటిలో ఒకటే భారత్‌లోని అతి పెద్ద దర్వాజా. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద దర్వాజాగా పేరొందింది. ఎక్కడుంది ఈ దర్వాజా? ప్రపంచంలోని అత్యంత పెద్ద దర్వాజా పేరు బులంద్ దర్వాజా. ఇది ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ సిక్రీలో ఉంది. ఈ దర్వాజా ఎత్తు 53.63 మీటర్లు. అంటే దీనిని అడుగులలో కొలిస్తే 173 అడుగుల కన్నా అధికంగా ఉంటుంది. ఈ దర్వాజా వెడల్పు 35 మీటర్లు. రెడ్‌శాండ్ స్టోన్‌తో రూపొందిన ఈ దర్వాజా నేటికీ చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. ఈ రాయితో చెక్కిన వివిధ ఆకృతులు ఈ దర్వాజాపై కనిపిస్తాయి. ఈ దర్వాజాపై పలు గుమ్మటాలు, మీనార్లు కూడా కనిపిస్తాయి. ఈ దర్వాజాను చూసేందుకు ప్రతీ యేటా లక్షల మంది ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ సిక్రీ వస్తుంటారు. ఈ దర్వాజాను ఎవరు తీర్చిదిద్దారంటే.. చరిత్రకారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ దర్వాజాను మొఘల్ పరిపాలకుడు అక్బర్ 1602లో తీర్చిద్దారు. అక్బర్ గుజరాత్‌పై విజయం సాధించినందుకు స్మృతి చిహ్నంగా దీనిని నిర్మించారు. ఈ దర్వాజాపై కనిపించే తోరణంలో పార్సీ భాషలోని అక్షరాలు కనిపిస్తాయి. సమాజానికి ఐక్యతను చాటేందుకే అక్బర్ ఈ దర్వాజాను తీర్చిదిద్దారని చెబుతారు. ఈ భావానికి సంబంధించిన అక్షరాలు ఈ దర్వాజాపై కనిపిస్తాయి. ఈ దర్వాజాను రూపొందించేందుకు 12 సంవత్సరాలు పట్టింది. క్రీస్తుపూర్వం 1571 నుంచి 1558 వరకూ మెఘల్ సామ్రాజ్యానికి ఫతేపూర్ సిక్రీ రాజధానిగా ఉండేది. -
వాస్తుదోషంతో సీఎం దర్వాజ.. 15 ఏళ్ల తర్వాత తెరిచిన సిద్ధరామయ్య..
కర్ణాటక: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కీలక నిర్ణయం తీసుకున్నారు. విధాన సభలోని సీఎం ఛాంబర్లో దురదృష్టంగా భావించే దక్షిణ ద్వారాన్ని మళ్లీ ఓపెన్ చేపించారు. గత 15 ఏళ్లుగా ఆరుగురు ముఖ్యమంత్రుల కాలంలో మూసి ఉన్న ఈ దర్వాజాను మరోసారి తెరిపించారు. ఆయన అధికారంలోకి వచ్చాక వాస్తు దోషాలకు, మూఢ నమ్మకాలకు తెరదించుతూ ఈ ద్వారాన్ని తెరిచారు. 1998లో ఎన్నికల్లో ఓటమి తర్వాత జే హెచ్ పటేల్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విధాన సభలోని దక్షిణ ద్వారం మూతపడింది. సిద్ధరామయ్య అధికారంలోకి వచ్చిన 2013లో ఆ ద్వారాన్ని తెరిపించారు. ఆనాటి నుంచి నేటి వరకు ఆరుగురు సీఎంలు పదవి చేపట్టారు. కానీ ఎవరూ కూడా ఆ ద్వారాన్ని తెరిచే సాహసం చేయలేదు. ప్రస్తుతం అధికారంలోకి రాగా... సీఎం సిద్ధరామయ్య మళ్లీ ఆ దర్వాజాను ఓపెన్ చేపించారు. #WATCH | Karnataka CM Siddaramaiah today entered his chamber in Vidhana Soudha using the 'West Door' which was earlier closed reportedly due to 'Vastu defects'#Bengaluru pic.twitter.com/tH01p2APlj — ANI (@ANI) June 24, 2023 2018 తర్వాత ఎన్నికల్లో ఓటమి తర్వాత ముగ్గురు సీఎంలు పదవి మారారు. బీ ఎస్ యడియూరప్ప, బసవరాజ్ బొమ్మై, హెచ్ డీ కుమార స్వామిలు పదవి చేపట్టారు. వీరెవరూ విధాన సభలోని వాస్తు దోషంగా భావించే దక్షిణ ద్వారాన్ని ఓపెన్ చేసే సాహసం చేయలేదు. విధాన సౌధలోని మూడో ఫ్లోర్లో సీఎం ఛాంబర్ ఉంటుంది. దానికి దక్షిణంలో ఓ ద్వారం ఉంటుంది. ఆ ద్వారం వాస్తు దోషంతో ఉందని అసెంబ్లీ సభ్యులందరూ భావిస్తుంటారు. అందుకే చాలా ఏళ్లుగా అది మూతపడి ఉంది. ఇదీ చదవండి: 'సీఎం కేసీఆర్ ఫొటో సెషన్ తర్వాత ఇదే..' ప్రతిపక్షాల భేటీపై కేంద్ర మంత్రి ఫైర్.. -
బస్సులో టాయిలెట్‌కు వెళ్లి.. ఎగ్జిట్ డోర్ తీసి ఒక్కసారిగా..
సాక్షి, ఏలూరు: ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తూ టాయిలెట్‌కు వెళ్లిన అనంతరం పొరపాటున ఎగ్జిట్ డోర్ తీసి అడుగు బయటపెట్టిన ఓ ప్రయాణికుడు రోడ్డు మీద పడిపోవడంతో మృతి చెందాడు. ఏలూరు రూరల్ ఎస్సై లక్ష్మణబాబు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన ఆకురాతి నన్నయ్య (59) ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రాజెక్టు మేనేజర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆయన విశాఖపట్నం ఎంవీపీ కాలనీలో బంధువుల ఇంటికి ప్రయాణమాయ్యరు. ఈ నెల 11న రాత్రి హైదరాబాద్‌లోని ఇంటర్సిటీ స్మార్ట్ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఎక్కారు. ట్రావెల్స్ బస్సు గురువారం తెల్లవారుజామున ఏలూరు సమీపంలోని జాతీయ రహదారిపై ప్రయాణిస్తోంది. నన్నయ్య కాలకృత్యాలు తీర్చుకునేందుకు బస్సు వెనుక బాగంలోని టాయిలెట్ రూములోకి వెళ్లారు. అనంతరం బయటకు వస్తూ లోపలికి వెళ్లే తలుపు అనుకుని బస్సు వెనుక భాగంలోని ఎమర్జెన్సీ ఎగ్జిట్ తలుపు తీసి ముందుకు వెళ్లటంతో ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయారు. దీంతో పెద్ద శబ్దం రాగా, డ్రైవర్ విషయాన్ని గమనించి బస్సును నిలిపివేశారు. జాతీయ రహదారి పెట్రోలింగ్ పోలీసుల సహకారంతో నన్నయ్యను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఏలూరు రూరల్ ఎస్సై లక్ష్మణబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రావెల్స్ యాజమాన్యం బస్సులో ప్రయాణించే వారికి ఎగ్జిట్ డోర్‌పై అవగాహన కల్పించాల్సి ఉండగా, నిర్లక్ష్యంగా వ్యవహరించటంతోనే ఈ ఘటన చోటుచేసుకుందని అంటున్నారు. చదవండి: (పాపను కాపాడబోయి.. జిల్లా హాకీ కార్యదర్శి గిరి మృతి) -
Viral Video: ఉన్నపలంగా లారీ డోర్ తీసాడు.. తర్వాత ఏమైందంటే..!
-
Viral Video: ఇలాంటి సెక్యూరిటీ గార్డును ఎప్పుడైనా చూశారా..?
-
భయానకం.. ఇలాంటి సెక్యూరిటీ గార్డును ఎప్పుడైనా చూశారా?
వైరల్: కొన్ని వీడియోలకు ఎన్నేళ్లు అయినా.. క్రేజ్ తగ్గదు. రిపీట్ మోడ్‌లో వైరల్ అవుతూనే ఉంటాయవి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. బహుశా.. ఆ వీడియోను గనుక మీరు ఇంతకు ముందు చూడకపోయి ఉంటే ఇప్పుడు చూసేయండి.. సెఫెస్ట్ సెక్యూరిటీ సిస్టమ్ అంటూ ఓ వ్యక్తి సరదా క్యాప్షన్‌తో ఆ వీడియోను పోస్ట్ చేశాడు. ఓ నాగుపాము తలుపు సందులోంచి పడగవిప్పి బుసలు కొడుతూ కనిపించింది. తనను వీడియో తీస్తున్న వ్యక్తిని తదేకంగా చూసి ఆ నాగు.. ఒక్కసారిగా కాటేసే యత్నం చేసింది కూడా. అయితే.. The safest security system! 😂 pic.twitter.com/QwSesTD7HE — Figen (@TheFigen_) December 26, 2022 I would simply have heart attack and be done — troy pachner (@CoachPachner) December 26, 2022 That's huge? Were they able to get him out? Assuming that's in India or possibly South Africa or Australia? Yikes! — C9597 (@MarsBrightStar) December 26, 2022 Never been a fan of the hoodie. — Scott DeSpain (@de_spain1) December 26, 2022 And all I got was a ring doorbell! — XRP_LOON (@LoonXrp) December 26, 2022 Better than a barking dog. — Dennis Cox (@DennisC46601860) December 27, 2022 Haha we need one of those! — Gidgit VonLaRue (@GidgitVonLaRue) December 26, 2022 ఆ ఇంటి వెనక ఒకావిడ భయంతో చూస్తున్న దృశ్యం కనిపిస్తుంది. ఇది ఎప్పుడు ఎక్కడ జరిగిందనే దానిపై క్లారిటీ లేదు. కాకపోతే మన దేశంలోనే జరిగినట్లు తెలుస్తోంది. బహుశా.. అది అలా తలుపులో దూరి ఉంటుందని భావిస్తున్నారు. ఇక ఈ భయానక వీడియోకు కామెంట్లు రకరకాలుగా వస్తున్నాయి. -
ఆ చిన్నారి వెంటనే స్పందించకపోయి ఉంటే.. పాపం ఆ తల్లి...
అనుకోని ప్రమాదంలో పడితే పిల్లలను తల్లిదండ్రులు కాపాడుకోవడం అనేది సర్వసాధారణం. కానీ పెద్దలే అనుకోని ప్రమాదం భారిన పడి..నిస్సహాయ స్థితిలో ఉంటే ఆ సమయంలో పిల్లలు తమకు తోచిన విధంగా చేసి తల్లిదండ్రులను కాపాడటం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అబ్బా మనల్ని రక్షించేంత పెద్దవాళ్ల అయిపోయారంటూ తెగ మురిసిపోతాం. అచ్చం అలాంటి ఘటనే ఇక్కడ చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...ఇక్కడొక తల్లి ఒక నిచ్చెనపై నుంచుని గ్యారేజీ తలుపును రిపైర్ చేస్తోంది. ఐతే అనుకోకుండా నిచ్చెన అకస్మాత్తుగా కింద పడిపోతుంది. దీంతో తల్లి ఆ గ్యారెజ్ తలుపుకు వేలాడుతూ ఉంటుంది. పాపాం హెల్ప్ ..హెల్ప్ అంటూ అరుస్తుంది. పక్కనే ఉన్న చిన్నారి వెంటనే అక్కడ ఉన్న నిచ్చెనను ఏదో రకంగా తన చిట్టి చేతులతో లేపేందుకు ప్రయత్నించి తన తల్లి వేలాడుతున్న దగ్గర పెడతాదు. దీంతో ఆ తల్లి నిచ్చెన సాయంతో నెమ్మదిగా దిగిపోతుంది. అందుకు సంబంధించిన ఘటనను ఐపీఎస్ ఆఫీసర్ దీపాంషు కబ్రా ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి. (చదవండి: బ్రహ్మపుత్ర నదిలో ఈత కొడుతూ వస్తున్న పులి..షాక్‌లో ప్రజలు) माँ गैराज का दरवाज़ा रिपेयर कर रहीं थी कि तभी उनकी सीढ़ी गिर गयी. माँ ऊपर लटके देख नन्हे जांबाज़ ने पूरी जान लगाकर सीढ़ी को वापस लगाकर उनक़ी मदद क़ी... इस छोटे बच्चे क़ी सूझ-बूझ और हिम्मत क़ी जितनी प्रशांसा क़ी जाए कम है. pic.twitter.com/GjX6Ol3pid — Dipanshu Kabra (@ipskabra) December 23, 2022 -
గులాబీ కలర్ వేసినందుకు ఏకంగా రూ. 19 లక్షలు జరిమానా
ఇంటి ముందర తలుపులకు ఎలాంటి కలర్లు ఉండాలో కొన్ని దేశాల్లో షరతులు ఉంటాయి. ఆయా దేశాల్లో ఏ కలర్ పడితే అది వేస్తే అక్కడ అధికారులు అంగీకరించారు. ఐతే ఒక మహిళ మాత్రం నిబంధనలకు విరుద్ధంగా తన ఇంటి ముందర తలుపులకు తనకు నచ్చిన రంగు వేసింది. దీంతో సదరు కౌన్సిల్ అధికారులు ఈ విషయమై అభ్యంతర వ్యక్తం చేస్తూ సుమారు 19 లక్షలు జరిమానా విధించారు. ఈ వింత ఘటన స్కాట్లాండ్లో చోటు చేసుకుంటుంది. వివరాల్లోకెళ్తే...స్కాట్లాండ్లోని ఎడిన్బర్గ్లో ఉన్న మిరాండా డిక్సన్ అనే మహిళ తన ఇంటి ముందర తలుపులకు పింక్(గులాబీ) కలర్ వేసింది. దీంతో ఆ సిటీ కౌన్సిల్ ప్లానర్లు ఈ కలర్‌పై అభ్యంతరరం వ్యక్తం చేస్తూ... తెలుపు రంగు వేయాలని ఆదేశించారు. కానీ ఆ మహిళ మాత్రం తన ఇంటికి ఆ రంగు ఎంతో అందాన్ని ఇచ్చిందని, చూడముచ్చటగా ఉందని చెబుతోంది. ఆమెకు ఈ ఇల్లు 2019లో తన తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా లభించింది. ఈ ఇంటిని రెండేళ్లపాటు మరమత్తులు చేయించింది. ఐతే చివర్లో ఫినిషింగ్ టచ్‌గా ఇంటి ముందు ఉండే తలుపులకు మాత్రం గూలాబి రంగు వేసింది. యూకేలోని బ్రిస్టల్, నాటింగ్‌హిల్, హారోగేట్ వంటి నగరాల్లో ఇంటి ముందు తలుపులు ముదురు రంగులో ఉంటే నా ఇంటి ముఖ ద్వారం మాత్రం ఇలా భిన్నంగా గులాబీ రంగులో ఉండటం తనకు ఆనందంగా ఉంటుందని చెబుతోంది. అదీగాక చాలామంది తన ఇంటి ముందు ఫోటోలు తీసుకునేందుకు ఎగబడుతుంటారని, చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుందని అంటోంది. అంతేగాదు పలువురు తనకు మద్దతు తెలిపారని, ఈ రంగు చాలా బావుటుందంటూ సిటీ కౌన్సలర్లకు నచ్చచెప్పే ప్రయత్నం కూడా చేసింది. కానీ కౌన్సలర్ ప్లానర్లు మాత్రం ససేమిరా అంటూ తెలుపు రంగు వేయాలని ఆదేశించారు. అంతేగాదు ఒకవేళ తలుపులకు రంగు మార్చనట్లయితే సుమారు రూ. 19 లక్షల వరుకు జరిమాన ఎదుర్కోవాల్సి ఉంటుందని తెగేసి చెప్పారు. (చదవండి: లాక్డౌన్ అంటే హడలిపోతున్న చైనా...కంచెలు, గోడలు దూకి పారిపోతున్న జనం) -
తలుపులు ఆలస్యంగా తెరిచిందని...భార్యను చంపి సూట్ కేసులో పెట్టి...
యశవంతపుర: ఇంటి తలుపులను ఆలస్యంగా తెరిచి, అన్నం పెట్టలేదనే కోపంతో భర్త భార్యను హత్య చేసిన ఘటన బెంగళూరులో జరిగింది. కొప్పళ జిల్లా గంగావతికి చెందిన మంజుళ మొదటి భర్తను వదిలి, రాము అనే వ్యక్తిని పెళ్లాడి కామాక్షిపాళ్యలో నివాసం ఉంటూ పీణ్యా పారిశ్రామికవాడలో కూలీ పనులు చేసేది. వారికి ఇద్దరు పిల్లలు. ఇటీవల రాము ఇంటికి రాగా మంజుళ ఆలస్యంగా తలుపు తీసిందని, అన్నం పెట్టలేదనే కారణంతో గొడవ పడ్డాడు. ఆమెను చంపి శవాన్ని సూట్‌కేసులో పెట్టుకొని తుమకూరు మార్గంలోని దాబస్‌పేట వద్ద పడేసి రాము చెన్నైకి పారిపోయాడు. కేసును విచారించిన బెంగళూరు గ్రామీణ పోలీసులు నిందితున్ని అరెస్ట్ రిమాండ్‌కు పంపినట్లు ఏఎస్పీ లక్ష్మీ గణేశ్ తెలిపారు. (చదవండి: రక్షకుడే భక్షకుడై దారుణకాండ) -
Mars Doorway: అంగారకుడి మీద ‘తలుపు’ మిస్టరీ వీడింది
అంగారక గ్రహం మీద తలుపులాంటి నిర్మాణం(డోర్‌వే) ఉన్న ఓ ఫోటోను తాజాగా నాసా విడుదల చేసింది. మార్స్ రోవర్ క్యూరియాసిటీ తీసిన ఈ ఫొటోలో ఒక పెద్ద బండరాయికి ఎవరో చెక్కినట్లు ఉన్న ఆ తలుపు నిర్మాణం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో ఇది ఏలియన్లు నిర్మించిందేంటూ ప్రచారం మొదలైంది. మార్స్ మీద ఏలియన్ల ఉనికి ప్రచారం ఈనాటిది కాదు. తరచూ ఏలియన్ల ఉనికిని ప్రస్తావిస్తూ బోలెడన్ని కథనాలు వెలువడేవి. అయితే తాజాగా బయటపడిన తలుపు తరహా నిర్మాణం మాత్రం ఆ వాదనను బలంగా సమర్థించింది. అది ఏలియన్ల పనేనంటూ వాదించడం మొదలుపెట్టారు కొందరు. ఈ తరుణంలో డోర్‌వే మిస్టరీని చేధించే పనిలోకి దిగారు పరిశోధకులు. చివరికి అదొక రాయి భాగం మాత్రమే అని తేల్చారు. సాధారణంగా.. అంగారకుడి మీద భూకంపాలు సంభవిస్తుంటాయి. ఈ క్రమంలో మే 4వ తేదీన కూడా భారీ భూకంపం సంభవించినట్లు నాసా గుర్తించింది. ఈ నేపథ్యంలో అలాంటి రాయి భాగం ఏదైనా ఆ తరహా నిర్మాణంలో ఏర్పడి ఉంటుందని భావిస్తున్నారు. అంతేకాదు రోవర్ దానిని ప్రత్యేకమైన యాంగిల్లో ఫొటో తీయడం వల్లే.. అదంతా ప్రత్యేకంగా ఏదో తలుపు నిర్మాణం లాగా కనిపించింది. మార్స్‌పై ఇలాంటి భాగాలు చాలానే ఉన్నాయని నాసా నిర్ధారించింది. ఇక డోర్ తరహా బండరాయి ఫొటోల ద్వారా చూడడానికి పెద్దదిగా కనిపిస్తున్నప్పటికీ.. వాస్తవానికి అది సెంటీమీటర్లు లేదంటే ఇంచుల్లో మాత్రమే ఉంటుందని, అదేంటో పూర్తిస్థాయిలో అంచనాకి రావడానికి మరిన్ని పరిశోధనలు అవసరమని నాసా స్పష్టం చేస్తోంది. చదవండి: చంద్రుడిపై పచ్చదనం.. మొలకెత్తిన విత్తనాలు -
ప్రాణం పోయినా సరే ‘తల’పెడితే.. తగ్గేదేలే!.. ఇతరులకు నో ఎంట్రీ!
చీమా.. చీమా.. ఏమిటలా కుట్టావ్ అంటే.. నా పుట్టలో వేలుపెడితే కుట్టనా? అంటుందట. కానీ ఈ చీమ కుట్టకున్నా.. తమ గూట్లో మాత్రం వేలు పెట్టనివ్వదు. తన తలను పణంగా పెట్టి మరీ గూడును కాపాడేస్తుంది. ప్రాణం పోయినా సరే.. తగ్గేదే లేదంటూ నిలబడుతుంది. ఏమిటీ.. ఓ చీమ గురించి ఇంత ఉపోద్ఘాతమేంటి అనిపిస్తోందా? దాని గురించి తెలిస్తే.. భలే ఉందిలే అనుకోకుండా ఉండలేరు. మరి ఆ చీమ ఏమిటి? దాని ప్రత్యేకతలేమిటో తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ గూటికి తగినట్టుగా తల.. సాధారణంగా ఇంటిని కాపాడటానికి గేట్లు, తలుపులు పెట్టుకుంటాం. అవసరమైతే తీసి, మళ్లీ వేసేస్తుంటాం. కానీ చెట్ల కాండంపై రంధ్రాల్లో జీవించే ‘డోర్ హెడ్’ చీమలు మాత్రం స్పెషల్. అవి తమ గూటిని కాపాడుకునేందుకు తలనే అడ్డుపెట్టి చేసే పోరు మరీ స్పెషల్.‘సెఫలోట్స్/సెరెబరా’ జాతికి చెందిన ఈ చీమల తలపై భాగం బల్లపరుపుగా, గుండ్రంగా ఉంటుంది. అంతేకాదు.. దాదాపుగా తమ గూడు రంధ్రానికి సరిపడే పరిమాణంలో ఉంటుంది. ఈ చీమలు ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు.. గూటి లోపలికి వెళ్లి.. తమ తలను గూటి రంధ్రానికి అడ్డు పెట్టేస్తుంటాయి. అందుకే వీటిని ‘లివింగ్ డోర్స్’ అని కూడా పిలుస్తుంటారు. సాధారణంగా బీటిల్స్ (ఒకరకం చిన్నసైజు పురుగులు) చెట్ల కాండాలపై గుహల్లా రంధ్రాలు చేస్తుంటాయని.. వీటినే తమ గూడుగా చేసుకుని జీవిస్తుస్తున్న ఒకరకం చీమలు.. వాటిల్లోకి ప్రవేశించే రంధ్రాల వద్ద ‘డోర్‌హెడ్’ చీమలను కాపలాగా ఉంచుతాయని అమెరికాలోని లూయిస్విల్లే యూనివర్సిటీ పరిశోధకుడు స్టీవ్ యనోవిక్ తెలిపారు. ఈ చీమలపై ఆయన విస్తృత పరిశోధన చేశారు. ‘డోర్‌హెడ్’ చీమలు తమ చీమలనే లోనికి రానిస్తాయని.. చెట్లపై తిరిగే చిన్న పురుగులు, కీటకాలు వంటివి గూడులోకి వెళ్లకుండా అడ్డుకుంటాయని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా చాలాచోట్ల ఈ తరహా ‘డోర్ హెడ్’ చీమలు ఉన్నాయన్నారు. చెట్ల కాండాల్లో బీటిల్స్ చేసే రంధ్రాలకు సమాన సైజులో ‘డోర్ హెడ్’ చీమల తల సైజు ఉండటం విశేషమని.. లక్షల ఏళ్ల పరిణామ క్రమంలో ఇలా అభివృద్ధి చెంది ఉంటాయని పేర్కొన్నారు. ప్రాణం పోయినా.. తగ్గేదే లే.. చీమల్లో చాలా రకాలు కుడతాయి. ఇందుకోసం వాటికి ప్రత్యేకంగా గొట్టంవంటి నిర్మాణం (స్టింగ్) ఉంటుంది. కానీ ‘డోర్ హెడ్’ చీమలకు స్టింగ్ ఉండదు. దాంతో కుట్టలేవు. కానీ శత్రు పురుగులు, కీటకాలు గూడులోకి వెళ్లకుండా అడ్డుకునేందుకు ప్రాణాలనైనా పణంగా పెడతాయని.. పురుగులు ఈ చీమల తలపై గట్టిగా దాడి చేసినా, కుట్టినా వెనక్కితగ్గవని స్టీవ్ యనోవిక్ చెప్పారు. తాము పరిశీలించిన ‘డోర్ హెడ్’ చీమల్లో చాలా వాటికి తలపై గాయాల గుర్తులు ఉన్నాయని వివరించారు. చీమల గూడు నిరంతరం మూసేసి ఉండదని.. ఏదైనా ప్రమాదం వస్తున్న సంకేతాలు కనబడగానే ‘డోర్‌హెడ్’ చీమలు ద్వారానికి తలుపులా తమ తలను అడ్డుపెట్టేస్తాయని తెలిపారు. -
ఆ గ్రామంలో దొంగతనం, దోపిడీ కేసులు శూన్యం
ఒడిశా ,భువనేశ్వర్: తలుపులు లేని ఇళ్లు ఉండే ఊరు అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది మహారాష్ట్రలోని షిర్డీ దగ్గరలో ఉన్న శని సింగనా పూర్. ఇటువంటి గ్రామ మే సరిగ్గా ఒడిశా రాష్ట్రంలో కూడా ఉంది. ఇదే కేంద్రాపడా కోస్తా జిల్లా రాజకనికా సమితిలోని సియాలియా. ఈ గ్రామంలో ఏ ఇంటికీ తలుపులు ఉండవు. ప్రవేశ ద్వారాలు మాత్రమే ఉంటాయి. ఇళ్ల నిర్మాణం ప్రారంభం నుంచే ఈ విధంగా నిర్మాణ శైలి కొనసాగుతుంది. ఇక్కడి గ్రామ దేవతపై ఉన్న నమ్మకంతో ఇళ్లకు తలుపులు, తాళాలు వేయించుకోమని గ్రామస్తుల గట్టి నమ్మకం. దాదాపు 1,200 మంది ఈ గ్రామంలో నివశిస్తున్నారు. అక్కడి మా ఖొరాఖాయి సియాలియా గ్రామదేవత. ఎండవానల్లో బహిరంగ పీఠంపై పూజలందుకునే దేవతను ఖొరాఖాయిగా వ్యవహరిస్తారు. సియాలియా గ్రామదేవత పూజా ప్రాంగణం కూడా తలుపులు లేకుండానే ఉంటుంది. గ్రామంలో దొంగతనానికి పాల్పడినా, ఇళ్లకు తలుపులు అమర్చినా ఖొరాఖాయి అమ్మవారి ఆగ్రహానికి గురికాక తప్పదంట. ఈ నేపథ్యంలో పలు కథనాలు కూడా స్థానికంగా ప్రచారంలో ఉన్నాయి. రాజ్కనికా పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఈ సియాలియా గ్రామం ఉండగా, ఇదే గ్రామం నుంచి ఇప్పటివరకు దొంగతనాలు, దోపిడీలకు సంబంధించిన కేసులు నమోదైనట్లు చరిత్రలో లేదు. సియాలియా గ్రామదేవత మూఢనమ్మకం.. తలుపులు లేకుండా ఇళ్ల నిర్మాణం వ్యవస్థ పట్ల అక్కడక్కడ విముఖత వ్యక్తమవుతోంది. గ్రామ ఆచారం ఉల్లంఘనకు పాల్పడితే గ్రామ దేవత ఆగ్రహానికి గురికావడం తప్పదనే కథనాలు సంస్కరణకు కళ్లెం వేస్తున్నాయి. లోగడ గ్రామస్తుడు ఇంటికి తలుపులు బిగించడంతో కొద్దికాలంలోనే ఆ ఇల్లు అగ్నిప్రమాదానికి గురైందని, ఇదే గ్రామ దేవత ఆగ్రహానికి నిదర్శనమని స్థానికుల వాదన. అది మొదలుకుని గ్రామదేవతపై భారం వేసిన గ్రామస్తులు ఎవ్వరూ తమ ఇంటికి తలుపులు బిగించకపోవడం గమనార్హం. గోప్యతకు అడ్డంకి.. గ్రామంలోని కుటుంబ జీవనంలో గోప్యతకు ఇది అడ్డంకి మారి చాలా ఇబ్బందికరంగా ఉంది. వివాహం పురస్కరించుకుని, ఇతర ప్రాంతాల నుంచి విచ్చేసే కోడళ్లకు తలుపులు లేని ఇళ్లల్లో కాపురం చేయడం ఎలా అర్థం కాని పరిస్థితి. గోప్యతకు తావు లేకుండా ఉన్న ఇంటిలో కాపురం చేయడం పట్ల అసహనం కొత్తగా వచ్చే కోడళ్లు ఆశ్చర్యపడుతూ అసహనం వ్యక్త చేస్తున్నారు. మరో వైపు గ్రామ దేవత ఆగ్రహం పట్ల ప్రచారంలో ఉన్న పలు కథనాలు కొత్త కోడళ్లకు దిక్కుతోచని పరిస్థితిల్లోకి నెట్టివేశాయి. వర్ధమాన కాలమాన పరిస్థితుల్లో సామాజిక జీవన స్రవంతితో సర్దుబాటు కోసం తలుపులు లేని ద్వార బందాలకు మొక్కుబడి తెరదించి ఇప్పుడు పబ్బం గడుపుతున్నారు. క్రమంగా కొత్త కోడళ్లకు గ్రామ ఆచారం అలవాటు అయ్యేలా పెద్దలు చూస్తున్నారు. ఇప్పటికీ ఆ గ్రామ సంస్కారానికి వారధులుగా సియాలియా గ్రామ పెద్దలు ఉన్నారు. ఎన్నో కథనాలు.. కలపతో తయారు చేసిన తలుపు మీద తేలియాడుతూ ఒక విగ్రహం గ్రామంలో నదీ తీరానికి చేరింది. ఈ విగ్రహాన్ని గ్రామం శివారుకు తరలించి గ్రామ దేవతగా కొలుస్తున్నారు. నీటిలో తేలియాడుతూ గ్రామం చేరిన దేవతకు ఎండవానలు లేక్కేమిటనే నినాదంతో బహిరంగ వేదికపై నిత్య పూజార్చనలు నిరవధికంగా కొనసాగించడంతో ఆ దేవతను ఖొరాఖియాగా స్థానికులు పేర్కొంటారు. కలప తలుపునే వాహనంగా చేసుకుని గ్రామానికి విచ్చేసిన దేవత పట్ల భక్తిపరమైన గౌరవ భావంతో సియాలియా గ్రామస్తులు ఇళ్లకు తలుపులు ఏర్పాటు చేయరని మరో కథనం. ఇళ్లల్లో ఉండే బీరువాలకు ఇకపై నుంచి తాళాలు కూడా వేయరని గ్రామస్తులు చెబుతుంటారు. ఉచ్ఛారణ లోపం.. ఉచ్ఛారణ లోపంతో గ్రామం పేరు సియాలియాగా మారిందని ఓ వర్గం విచారం వ్యక్తం చేస్తోంది. నదిలో కలప తలుపుపై తేలియాడుతూ తీరం చేరిన గ్రామదేవత ఎదురుగా శవాన్ని కుక్క, నక్క చీల్చుతున్నట్లు తారసపడింది. ఈ సన్నివేశం దృష్ట్యా ఆ గ్రామానికి శైవాలయ లేదా శవాలయ అని నామకరణం చేశారు. కాలక్రమంలో వాడుకలో ఆ గ్రామం పేరు సియాలియాగా స్థిరపడిపోయిందని ఆ వర్గం చెబుతోంది. -
కారు డోర్ లాక్ అయి బాలుడు మృతి
సాక్షి, కొవ్వూరు రూరల్: కారులోకి వెళ్లి తలుపులు వేసుకున్న ఏడేళ్ల బాలుడు సాయిబాబా ఊపిరి ఆడక మృతిచెందిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరులో సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన కళ్లేపల్లి రాధా కుమార్తె లక్ష్మికి దేవరపల్లి మండలం యాదవోలుకు చెందిన అనిశెట్టి శ్రీనివాసరావుతో వివాహం జరిపించారు. వారికి ఇద్దరు పిల్లలు. సాయిబాబా (7), రెండేళ్ల కుమార్తె వైసు ఉన్నారు. శ్రీనివాసరావు ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో లక్ష్మి ఇద్దరు పిల్లలతోపాటు దొమ్మేరులో తల్లిదండ్రుల వద్ద ఉంటున్నారు. సోమవారం సాయిబాబా ఆడుకుంటూ అక్కడ పార్క్ చేసి ఉన్న కారులోకి ఎక్కాడు. డోర్ వేసుకోవడంతో లాక్‌పడింది. కొంతసేపటికి ఊపిరి ఆడక మృతిచెందాడు. సాయంత్రం కారు వద్దకు వచ్చి డోర్ తీసిన యజమాని లోపల బాలుడు మరణించి ఉండటాన్ని గుర్తించారు. చిన్నారి మరణంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. -
వార్డ్‌రోబూ ముసలాయనా మృత్యువూ
మా నాన్న గదిలోని వార్డ్‌రోబు మామూలు కర్ర సామగ్రి కాదు. అది ఇంటి లోపల మరో ఇల్లులా ఉండేది. మా నాన్న పూర్వీకుల నుంచి మాకు సంక్రమించిన ఆ వార్డ్‌రోబు మేం ఇల్లు మార్చినప్పుడల్లా మా వెంట వచ్చి ఆఖరుకు మిరాఫ్లోర్స్‌లోని మా నాన్న పడకగదిలోకి చేరింది. దాన్ని పంతొమ్మిదవ శతాబ్దంలో ఒక మతిస్థిమితం లేని వడ్రంగి అత్యంత నైపుణ్యంతో తయారు చేశాడట. అది మూడు భాగాలుగా ఉండేది. ఒక్కో భాగానిది ఒక్కో విలక్షణత్వం. ఎడమవైపు భాగానికి ఇంటి తలుపంత పెద్ద తలుపు! దాని తాళంకప్ప నుంచి వేలాడే పెద్ద తాళంచెవి తుపాకిలా, రాజదండంలా, గదలా– ఇలా రకరకాల ఆటబొమ్మలుగా పనికొచ్చే విధంగా ఉండేది. తన సూట్లను, తను ఎన్నడూ తొడుక్కోని ఇంగ్లీషు కోటును నాన్న ఈ భాగంలో వేలాడదీసేవాడు. గంధపు చెక్కల, కలరా ఉండల సువాసన నిండిన ప్రపంచంలాంటి ఆ వార్డ్‌రోబు లోనికి ప్రవేశించాలంటే తప్పనిసరిగా ఆ తలుపు ద్వారానే వెళ్లాలి. రకరకాల వస్తువులు ఉండే మధ్యభాగం మాకు మూడుభాగాల్లోని అత్యంత ప్రీతికరమైన భాగం. అందులో కిందవైపు నాలుగు పెద్దపెద్ద సొరుగులు. నాన్న చనిపోయిన తర్వాత మా అన్నదమ్ముల్లో ఒక్కొక్కరికి ఒక్కో సొరుగు సంక్రమించింది. సొరుగులకు పైన ఒక పెద్ద అర. అందులో నాన్నకిష్టమైన పుస్తకాలు దాదాపు ముప్పై ఉండేవి. వార్డ్‌రోబులోని మధ్యభాగానికి ఒక పెద్ద దీర్ఘ చతురస్రాకారపు తలుపు. ఆ తలుపును ఎప్పుడూ తాళంవేసి మూసి ఉంచేవాళ్లు. అందులో ఏముందో మాకెవ్వరికీ తెలియదు. బహుశా కాయితాలు, చిన్నప్పటి ఫొటోలు ఉండవచ్చు. అవి చిరిగిపోతే జీవితంలో కొంత భాగం చిరిగిపోతుందనే భయం వల్ల జాగ్రత్తగా దాచి ఉంటారు. నిజానికి అప్పటికే మేం జీవితంలోని కొంత భాగాన్ని నష్టపోయాం. ఇక కుడివైపు ఉన్న భాగానికి ఇంకో తలుపు ఉండేది. కాని ఆ తలుపుకు ఒక వాలు అంచుల అద్దాన్ని బిగించారు. ఈ భాగంలో కూడా షర్టులు, అండర్వేర్ల కోసం కింద సొరుగులు ఉండి వాటి పైభాగాన ఒక మనిషి నిటారుగా నిలబడగలిగేటంత పెద్ద అర ఉండేది. పైభాగంలో పుస్తకాల అర వెనుక నుంచి ఎడమవైపు భాగాన్ని కుడివైపు భాగంతో కలుపుతూ ఒక పొడవైన ఖాళీ స్థలం ఉండేది. ఎడమవైపు తలుపు ద్వారా లోపలికి దూరి కొన్ని క్షణాల తర్వాత అద్దం ఉన్న కుడివైపు తలుపును తోసుకుని తలను బయటకు పెట్టే ఆట మాకు బాగా నచ్చేది. దాగుడుమూతల ఆట సమయంలో పైభాగంలోని తోవలాంటి ఆ ఖాళీ స్థలం దాక్కోవడానికి మాకు చక్కగా పనికొచ్చేది. అక్కడ దాక్కున్నప్పుడు మా స్నేహితులెవరూ మమ్మల్ని కనుక్కోలేకపోయేవాళ్లు. మేం వార్డ్రోబులో ఉన్నామని తెలిసినా పైకి వెళ్లి కాఫిన్లో మాదిరి ఆ మధ్యభాగంలో కాళ్లు చాపి పడుకుని ఉన్నామని వాళ్లు ఊహించలేకపోయేవాళ్లు. మా నాన్న మంచం ఆ వార్డ్‌రోబులోని కుడివైపు భాగానికి సరిగ్గా ఎదురుగా ఉండేది. దిండ్లపై తలను పెట్టుకుని న్యూస్‌పేపరు చదువుకుంటున్నప్పుడు నాన్న తన ప్రతిబింబాన్ని అద్దంలో చూసుకోగలిగేవాడు. ఆయన అద్దంలో తనను తాను చూసుకోవడం కన్న ఎక్కువగా పూర్వం అందులో చూసుకున్నవాళ్లను వీక్షించేవాడు. ‘‘మంత్రివర్గ సమావేశానికి వెళ్లే ముందు ఖ్వాన్ ఆంటోనియో రిబేరో ఎస్టాడా తన టైను సరిచేసుకుంటూ ఆ అద్దంలోనే చూసుకున్నాడు’’ అనీ, ‘‘సాన్ మార్కోస్ విశ్వవిద్యాలయంలో ప్రసంగించడానికి వెళ్లే ముందు డాన్ రమోన్ రిబేరో అల్వారెజ్ డెల్ విల్లార్ ఆ అద్దంలోనే చూసుకున్నాడు’’ అనీ, ‘‘ఎన్నిసార్లు కాంగ్రెస్ సమావేశంలో ప్రసంగించడానికి వెళ్లే ముందు నా తండ్రి డాన్ జూలియో రిబేరో బెనైట్స్ తయారవుతూ ఆ అద్దంలో తనను తాను చూసుకోలేదూ?’’ అనీ అంటూ ఉండేవాడు మా నాన్న. నాన్న పూర్వీకులంతా ఆ అద్దపు లోతుల్లో బంధింపబడ్డారు. వాళ్ల రూపాలనూ వాటి మీద పడిన తన ప్రతిబింబాన్నీ చూసుకుని ఆ క్షణాన వాళ్లతో కలసి జీవించినట్టు ఊహించుకునేవారు. ఆ అద్దం కారణంగా దివంగతుల ప్రపంచంలోకి మా నాన్న ప్రవేశించేవాడు. అదేవిధంగా తన పూర్వీకులను ఈ బతికి ఉన్న ప్రపంచంలోకి తీసుకొచ్చేవాడు. తన వివాహపు రోజు నుంచి నాన్న మద్యపానాన్నీ, స్నేహితులతో కలవడాన్నీ మానేశాడు. అరుదుగా మా తోటలో పళ్లచెట్లు విరగకాసి మరులుగొలిపినప్పుడో లేక మేం అందమైన డిన్నర్ సెట్ కొన్నప్పుడో నాన్న తన పాత సహచరులను మా ఇంటికి ఆహ్వానించేవాడు. ఆ విధంగా మా ఇంటికి మొదట వచ్చినవాడు అల్బర్టో రికెట్స్. ఆయన అచ్చు గుద్దినట్టుగా సరిగ్గా నాన్నలాగే ఉండేవాడు కాని సైజు మాత్రం చాలా చిన్నది. వాళ్లిద్దరు ఒక్కంతే తెల్లగా, ఒక్కంతే బక్కపలచగా ఉండేవాళ్లు. వాళ్లిద్దరూ ఒకరినొకరు కలుసుకుని పది పన్నెండేళ్లయింది. ఈ పది పన్నెండు సంవత్సరాల కాలంలో రికెట్స్ ఒక మందుల కంపెనీలో పనిచేసి బాగా ధనవంతుడయ్యాడు. ఇప్పడు ఆ కంపెనీకి ఆయనే యజమాని. మా నాన్నేమో ఎంతో కష్టం మీద మిరాఫ్లోర్స్‌లో ఇల్లు కొనగలిగాడు. ఈ పది పన్నెండేళ్ల కాలంలో రికెట్స్ సాధించినది మరొకటి ఉంది. అదేమిటంటే ఆయనకు ఓ కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరు అల్బర్టో జూనియర్. రికెట్స్ మొదటిసారి మా ఇంటికి వచ్చినప్పుడు తన కొడుకును వెంట తెచ్చాడు. ఇద్దరు స్నేహితులు ఉంటే వాళ్ల పిల్లలు ఒకరితో ఒకరు నిజమైన స్నేహితులుగా ఉండటమన్నది అరుదు కనుక మొదట్లో మేము జూనియర్ అల్బర్టోను సందేహించాము. అతడు బక్కపలుచగా, వికారంగా, కొన్నిసార్లు పూర్తి ముభావంగా ఉండటాన్ని గమనించాం మేము. నాన్న తన స్నేహితునితో మా పండ్లతోటలో తిరుగుతూ చీనీ చెట్టును, మేడిచెట్టును సీమరేగు చెట్టును, ఇంకా తీగల చెట్లను చూపిస్తుంటే మేం మా గదిలో ఆడుకోవటానికి జూనియర్ అల్బర్టోను మాతో తీసుకువెళ్లాము. ఆ అబ్బాయికి తోబుట్టువులు లేరు కనుక మేం కనిపెట్టి ఆడుకునే ఆటలేవీ అతనికి తెలియవు. ఆటలో రెడ్ ఇండియన్లా నటించాల్సినప్పుడు ఆ పాత్రను అతడు సరిగ్గా చెయ్యలేదు. ఇక టెన్నిస్ రాకెట్‌ను ఆటలో మెషిన్‌గన్‌లా కూడా వాడుకోవచ్చని అతనికి తెలియదు. మాకిష్టమైన ఆటను అతనితో కలసి వార్డ్రోబులో ఆడటం దండగని నిర్ణయించడానికి మాకు ఎక్కువ సమయం పట్టలేదు. దానికి బదులు నేల మీద బొమ్మకారును నెట్టడం, చెక్కముక్కలతో ఇల్లు కట్టడం వంటి చిన్న చిన్న ఆటలను ఎవరి బొమ్మలతో వారే ఆడుకునేలా మా కాలక్షేపాన్ని సాగించాం. మధ్యాహ్న భోజన వేళకు ముందు ఆడుకుంటున్న మాకు బయట ఉన్న మా నాన్న, అతని స్నేహితుడూ కిటికీలోంచి కనిపించారు. వివిధ రకాల పూల చెట్లను చూపించడం మిగిలిపోయింది. కనుక అప్పుడు వాళ్లు తోటలో పచార్లు చేస్తున్నారు. తోట పనిలోని ఆనందాన్ని మా నాన్న గుర్తించి అప్పటికి కొన్ని సంవత్సరాలైంది. ఒక పొద్దుతిరుగుడు పువ్వులో లేక గులాబి పువ్వులో గొప్ప జీవిత సత్యం దాగి ఉండటాన్ని గ్రహించాడు మా నాన్న. ఒకప్పుడైతే తీరిక వేళల్లో మా నాన్న విసుగూ అలసటా కలిగించే పుస్తక పఠనం చేస్తూ జీవిత పరమార్థాన్ని గురించి ఆలోచించేవాడు. కాని ఇప్పుడలా కాదు. చెట్లకు నీరు పారించడం, మొక్కల ఆకులను, కొమ్మలను కత్తిరించడం, చెట్లకు అంటుకట్టడం, కలుపు తీయడం చేస్తున్నాడు. పుస్తకాల మీద ఆయనకున్న ప్రేమ ఒకేసారి ఏకమొత్తంగా మొక్కల మీదికి, పువ్వుల మీదికి మళ్లింది. పూర్తి తోటను తయారు చేసి వోల్టేర్ నవలలోని ఒక పాత్ర చెప్పినట్టు తన ఆనందమంతా తోటపనిలోంచే వచ్చిందని నిర్ణయించాడు. ‘‘ఏదో ఒకనాడు టార్మాలో భూమి కొని తీరుతాను. కాని ఇట్లాంటి చిన్న ప్లాట్ కాదు. పెద్ద ఫామ్‌నే కొంటాను. అప్పుడు నీకు నా తడాఖా తెలుస్తుంది అల్బర్టో’’ అని నాన్న అనటం మాకు వినపడింది. ‘‘టార్మాకు బదులు చాక్లకాయో అయితే ఎలా ఉంటుంది పెరికో? అది లిమా నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాని వాతావరణం మాత్రం లిమాలో ఉన్నట్టే ఉంటుంది’’ అన్నాడు నాన్న స్నేహితుడు. అక్కడ తాను అన్ని సౌకర్యాలతో కూడిన పెద్ద ఇంటిని కడుతున్న విషయాన్ని నాన్నకు చెప్పాడు.‘‘కానీ నా తాత టార్మాలో నివసించేవాడు. చాక్లకాయోలో కాదు కదా’’ అన్నాడు నాన్న.టార్మాలో అయితే నాన్నకు తన పూర్వీకులతో కలసి నివసించినట్టు! నాన్నను తన స్నేహితుడు యవ్వన దశలో పెరికో అని పిలిచేవాడట.అల్బర్టో జూనియన్ తన బొమ్మకారును మంచం కిందికి పంపి అక్కడికి పాక్కుంటూ వెళ్లాడు దాన్ని తేవటానికి. అతడు బిగ్గరగా వేసిన గెలుపు కేరింత వినపడింది మాకు. అతనికి మంచం కింద ఫుట్‌బాల్ దొరికింది. అతన్ని ఉల్లాసంగా ఉంచడానికి ఎంతగానో యాతన పడుతున్న మాకు ఫుట్‌బాల్ ఆడాలనే ఆ ఒంటరి అపరిశుభ్ర బాలుని రహస్యమైన కోరిక తెలిసిపోయింది. అప్పటికే అతడు లేసులతో ఆ ఫుట్‌బాల్‌ను పట్టుకుని దాన్ని తన్నబోయాడు. కాని మేము అతన్ని వారించాం. గదిలో ఫుట్‌బాల్ ఆడటం పిచ్చితనమే. తోటలో ఆడటమేమో నిషేధితం. కనుక మాకు వీధిలోకి వెళ్లటం తప్ప వేరే మార్గం లేకపోయింది. ఆ వీధి కొన్నేళ్ల కిందట మేము గోమెజ్ సోదరులతో ఆడిన ఉద్వేగపూరిత క్రీడలకు మైదానంగా ఉండేది. ఆ గేములను మేము పూర్తి చీకటి పడేదాకా నాలుగైదు గంటలు ఆడేవాళ్లం. అప్పుడు మాకు ఒకరికొకరు గాని, ప్రత్యర్థులు చేసిన గోల్స్ గాని కనపడేవి కావు. ఆట అప్పుడు ఒక దయ్యాల తోపులాటలా ఒక భయంకరమైన చీకటి యుద్ధంలా తయారయ్యేది. అందులో అన్ని రకాల ఫౌల్‌లు, మోసాలు చోటు చేసుకునేవి. పిల్లలమే అయినా మా ఆటల్లో మేము కనబరచినంత కసిని, ప్రగాఢమైన పట్టుదలను లేక ఆత్మాభిమానాన్ని ప్రొఫెషనల్ జట్లు కూడా కనబరచి ఉండవు. అందుకే గోమోజ్ కుటుంబం వెళ్లిపోయిన తర్వాత మేం ఫుట్‌బాల్ ఆటను పూర్తిగా మానేశాం. అలాంటి వర్ణనీయ క్రీడా సమరాల వంటి గేములు మళ్లీ జరగవు అని ఫుట్‌బాల్‌ను మంచం కింద దాచి ఉంచేశాం. ఇప్పుడు జూనియర్ అల్బర్టో దాన్ని వెలికితీసే దాకా ఆ ఫుట్‌బాల్ మంచం కింద అలానే పడి ఉంది. అతడు కోరుతున్నది ఫుట్‌బాల్ ఆట అయితే అతనికి మొహమ్మొత్తేటంతగా ఆడుదామని నిర్ణయించుకున్నాం.మా ఇంటి గోడ ముందు గోల్‌పోస్టు ఉంచాం. ఎందుకంటే గోల్ అయినప్పడు బంతి గోడను తాకి వెనక్కి వస్తుంది. జూనియర్ అల్బర్టోను గోల్‌పోస్టులో నిల్చోబెట్టాం. మా మొదటి ప్రయత్నాలను అతడు ధైర్యంగానే ఎదుర్కొని గోల్ అవకుండా కాపాడాడు. కాని ఆ తర్వాత మేం విజృంభించి ధనాధన్ గోల్ తర్వాత గోల్ చేశాం. ఆ అబ్బాయి నేల మీద పారాడుతూ, కాళ్లూ చేతులూ బార్లా చాపి బంతిని ఆపలేకపోతుంటే అది చూసి మాకు ఆనందోత్సాహాలు కలిగాయి. తర్వాత గోల్ కొట్టడానికి అతని వంతు వచ్చింది. గోల్ ఆపడం నా పని. బక్కపలుచగా ఉన్న అతడు బంతిని తన్నుతున్నప్పుడు ఒక కంచర గాడిద తన్నినట్టనిపించింది. మొదటి గోల్‌ను నేను ఆపగలిగాను. కాని తర్వాత కొంతసేపటి దాకా నా అరచేతులు మండాయి. గోల్‌పోస్టు మూలలోకి తన్నిన అతని రెండో గోల్ గొప్పది. కాని అతడు చేసిన మూడో గోల్ అత్యంత సుందరమైనదీ బ్రహ్మాండమైనదీనూ. ఆ బంతి నా చేతుల మధ్యలోంచి దూసుకుపోయి, గోడపై నుంచి వెళ్లి, మల్లెచెట్టు కొమ్మల మధ్యలోంచి సైప్రెస్చెట్టు మీదుగా పోయి, తుమ్మచెట్టు కొమ్మను తాకి అక్కణ్ణుంచి మా ఇంటి లోపలికి అదృశ్యమైంది. ఎప్పట్లాగానే మేము వీధి పేవ్మెంట్ గట్టుమీద కూర్చుని బంతిని తీసుకొచ్చే పనిమనిషి కోసం నిరీక్షించసాగాం. కాని ఎవరూ రాలేదు. మేం లేచి బంతిని వెతకటానికి వెళ్లాలనుకున్న సమయంలో మా ఇంటి దొడ్డిదారి తలుపును తెరుచుకుని నాన్న వచ్చాడు. అతని చంకలో ఫుట్‌బాల్ ఉంది. ఆయన బాగా పాలిపోయి ఉన్నాడు. మాతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా వీధి చివరిదాకా నడిచి, ఎదురుగా ఈలవేస్తూ వస్తున్న కూలివాడి దగ్గరకు చేరాడు. ఆ బంతిని వాడి చేతుల్లో పెట్టి మావైపు ఒక్క చూపు కూడా చూడకుండా ఇంట్లోకి వెళ్లిపోయాడు. జరిగిన విషయం అర్థం కావడానికి ఆ కూలివాడికి కొంత సమయం పట్టింది. అర్థం అయిన తక్షణమే వాడు బంతిని తీసుకుని పరుగెత్తడంతో వాణ్ణి పట్టుకునే అవకాశం లేకపోయింది మాకు. మధ్యాహ్న భోజనానికి మమ్మల్ని పిలవటం కోసం అమ్మ ద్వారం దగ్గర వేచి ఉంది. ఆమె ఎంత ఆందోళనగా ఉన్నదంటే ఆమెను చూడగానే ఏదో జరగరాని ఘోరం జరిగినట్టు తెలిసిపోయింది మాకు. లోపలికి రావలసిందిగా ఒక తొందరతో కూడిన చిన్న సంజ్ఞ చేసింది. మేం ఆమెను దాటుకుంటూ పోతుంటే ‘‘అలా ఎందుకు చేశార్రా మీరు?’’ అన్నదామె. మా నాన్న గదికి ఉన్న ఒక ఊచలు లేని కిటికీ సగం తెరిచి ఉండటాన్ని గమనించగానే ఏం జరిగి ఉంటుందో మేము ఊహించగలిగాం. జూనియర్ అల్బర్టో అద్భుతంగా తన్నిన ఆ బంతి నమ్మశక్యంకాని విధంగా అర్ధచంద్రాకారపు బాటలో పయనించి గోడలు, చెట్లు, ఊచలు మొదలైనవాటిని దాటి వార్డ్రోబుకు ఉన్న అద్దానికి సరిగ్గా నట్టనడుమ తగిలింది. అల్బర్టో జూనియర్ కాని మరెవరైనా కాని జీవితమంతా ప్రయత్నించినా అట్లాంటి షాట్‌ను మళ్లీ కొట్టడం సాధ్యం కాదు.లంచ్ తినడం మాకు ఇబ్బందికరమైంది. అతిథి ముందు మమ్మల్ని తిట్టలేక నాన్న తన కోపాన్ని దిగమింగుకున్నాడు. ఆయన పాటించిన మౌనాన్ని ఛేదించే ధైర్యం ఎవ్వరికీ లేకపోయింది. భోజనం తర్వాత మేము పండ్లరసాలను తీసుకుంటున్నప్పుడు నాన్న కొంచెం మెత్తబడి మాకందరికీ కొన్ని ఆహ్లాదకరమైన కథలు చెప్పాడు. నాన్న నర్మగర్భంగా చేసిన సూచనను అల్బర్టో గ్రహించడంతో ఆ భోజనాలు నవ్వులతో ముగిశాయి. కాని అప్పటికే ఆలస్యమైపోయింది. ఆ మధ్యహ్న భోజనమేగాక పాత మిత్రుణ్ణి ఆహ్వానించడమనే అరుదైన సదుద్దేశం పూర్తి ప్రహసనంగా మారిన విషయం మా మానసుల్లోంచి చెరగిపోలేకపోయింది. తండ్రీ కొడుకులిద్దరూ త్వరగానే వెళ్లిపోయారు. నాన్నకు మమ్మల్ని శిక్షించే అవకాశం దొరికిందని మేము భయపడ్డాం. కాని స్నేహితుని రాక వల్ల అలసిపోయి ఆయన మాతో ఒక్క మాట కూడా మాట్లాడకుండానే పగటి కునుకులోకి జారుకున్నాడు. నిద్రలోంచి మేల్కొనగానే నాన్న మమ్మల్నందర్నీ తన గదిలో సమావేశపరచాడు. దిండ్ల మీద తలను ఆనించిన ఆయన తాజాగా, ప్రశాంతంగా కనిపించాడు. మధ్యాహ్నపు వెలుతురు గదిలోకి పుష్కలంగా వచ్చేలా కిటికీ తలుపులను బార్లా తెరిచాడు.వార్డ్రోబును చూపిస్తూ ‘‘అటు చూడండి’’ అన్నాడు. ఆ దృశ్యం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. అద్దాన్ని పోగొట్టుకోవడం ద్వారా వార్డ్‌రోబు తన ప్రాణాన్నే కోల్పోయినట్టు ఉంది. ఇంతకు మునుపు అద్దం ఉండిన చోట ఇప్పుడు కేవలం ఒక నల్లని దీర్ఘ చతురస్రాకారపు చెక్క మాత్రమే ఉంది. అది ఏమీ చెప్పని, దేన్నీ ప్రతిఫలించని దిగులు నిండిన ఖాళీ ప్రదేశం అనిపించింది. తళతళ మెరిసే తటాకపు నీళ్లన్నీ ఒక్కసారిగా ఆవిరైపోయినట్టు ఉన్నది ఆ ఖాళీ స్థలం.‘‘నా పూర్వీకులు తమను తాము చూసుకున్న అద్దం అది’’ అని మమ్మల్ని వెళ్లిపొమ్మన్నట్టు చేయి ఊపాడు నాన్న.ఆ రోజు నుంచి మా నాన్న తన పూర్వీకుల గురించిన ప్రస్తావన తేవడం మేమెరుగం. తను అదృశ్యమవుతూ ఆ అద్దం తన పూర్వీకులను కూడా అదృశ్యం చేసింది. గతం మా నాన్నను బాధించడం మానేసింది. పైగా నాన్న తన భవిష్యత్తులోకి కుతూహలంతో చూడనారంభించాడు.బహుశా తనింకా ఎక్కువకాలం జీవించేది లేదని ఆయనకు తెలిసిందేమో! అందువల్ల తన పూర్వీకులను కలుసుకోవడానికి ఆయనకు అద్దపు అవసరం లేకపోయింది. మరో జన్మలో కూడా వాళ్లను కలుసుకోలేననుకున్నాడు. ఎందుకంటే ఆయనకు పునర్జన్మ మీద నమ్మకం లేదు. అతన్ని బంధించిన పుస్తకాల ప్రపంచం, పువ్వుల ప్రపంచంలో కూడా వాళ్లను కలువలేననుకున్నాడు. ఆయనకు అదొక శూన్యం నిండిన ప్రదేశం. పెరూవియన్ కథ : హూలియో రమోన్ రిబేరో అనువాదం: ఎలనాగ -
గాలి కోసం.. విమానం కిటికీ తెరిచాడు
బీజింగ్ : గాలి ఆడట్లేదని కిటికీ తెరిచాడో విమాన ప్రయాణికుడు! ఈ ఘటన చైనాలోని మిన్యాంగ్ నాన్‌జియావో ఎయిర్‌పోర్ట్‌లో ఏప్రిల్ 27న చోటు చేసుకున్నట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించింది. దీని ప్రకారం చెన్(25).. విమానంలోని అత్యవసర ద్వారం వద్ద సీట్లో కూర్చున్నాడు. సరిగ్గా విమానం టేకాఫ్ అవుతుందనగా ఉన్నట్లుండి కిటికీ తెరిచాడు. అది అత్యవసర ద్వారం కావడంతో పూర్తిగా తెరచుకొని లోపలికి గాలి చొచ్చుకొచ్చింది. దీంతో కంగారుపడిన సిబ్బంది టేకాఫ్ అర్ధాంతరంగా ఆపేసి ఆ యువకుడిని పోలీసులకు అప్పగించారు. విచారణలో ఆ యువకుడు చెప్పిన సమాధానం పోలీసులను ఆశ్చర్యపరిచింది. తనకు అవగాహన లేకే కిటికీ తెరిచానని, అది అత్యవసర ద్వారం కావడంతో పూర్తిగా ఓపెన్ అయ్యిందని వెల్లడించాడు. 15 రోజుల పాటు విమాన ప్రయాణాలు చేయకుండా ఆ యువకుడిపై నిషేధం విధించడంతోపాటు 70 వేల యెన్లను జరిమానా విధించినట్లు సమాచారం. -
ప్రాణభయంతో విమానం రెక్కలోంచి దూకేశారు
డల్లాస్ : ప్రాణ భయంతో విమానం రెక్కలోంచి ప్రయాణికులు దూకేసిన ఘటన అల్బుకర్క్యూ ఇంటర్నేషనల్ సన్‌పోర్ట్(మెక్సికో)లో చోటు చేసుకుంది. పెద్ద శబ్దంతో విమానం ల్యాండ్ కాగా.. పేలిపోతుందన్న భయంతో ప్రయాణికులు ఈ పనికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులకు గాయాలైనట్లు తెలుస్తోంది. సౌత్ వెస్ట్ ఎయిర్వేస్కు చెందిన విమానం ఆదివారం రాత్రి ప్రయాణికులతో ఫోయెనిక్స్(అరిజోనా) నుంచి లవ్ ఫీల్డ్(డల్లాస్)కు బయలుదేరింది. అయితే కాసేపటికే క్యాబిన్లో ఏదో వాసన వస్తున్న విషయాన్ని గమనించిన సిబ్బంది విషయాన్ని పైలెట్ దృష్టికి తీసుకెళ్లారు. ఇంతలో వేడి ఎక్కువగా ఉందంటూ ప్రయాణికులు గగ్గోలు పెట్టారు. క్యాబిన్లో పొగలు రావటం ప్రారంభం కాగా.. ప్రమాద సంకేతాలు కనిపించటంతో పైలెట్ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండ్‌కు సిద్ధమయ్యాడు. అల్బుకర్క్యూ ఇంటర్నేషనల్ సన్‌పోర్ట్‌లో విమానం ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యింది. విమానం ల్యాండ్ అయ్యాక ప్రయాణికులంతా బయటకు వస్తున్న క్రమంలో.. ఇద్దరు ప్రయాణికులు మాత్రం విమానం రెక్క వద్ద ఉన్న ఎమర్జెన్సీ డోర్ నుంచి రన్‌వే పైకి దూకేశారు. అది గమనించిన ఓ ప్రయాణికుడు వారిద్దరూ అలా దూకటాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సుమారు 8 అడుగుల ఎత్తు నుంచి దూకటంతో వారికి గాయాలైనట్లు ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. ప్రయాణికులందరినీ వేరే విమానంలో తరలించిన ఎయిర్వేస్.. గాయపడిన వాళ్లను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. A flight to remember. Something I hope I never experience again. You see these things in movies and never expect it to happen to you! Most importantly everyone is safe but man what a scare! @CNN @NBCDFW @CBS @wfaa @PhilthaThrill pic.twitter.com/BvwAqqIOZC — Brandon Cox (@brandoncox91) 12 March 2018 -
ప్రధానాలయ ద్వారాల తొలగింపు
యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవస్థానంలోని ప్రధానాలయ ద్వారాలను శుక్రవారం తొలగించారు. యాదాద్రి అభివృద్ధిలో భాగంగా మరో రెండు రోజుల్లో రాజగోపురాన్ని తొలగించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ముందుగా ద్వారాలను, భద్రతా పరంగా ఉన్న గేట్లను తొలగించారు. మరోవైపు నాలుగు రాజగోపురాల పనులు వేగంగా జరుగుతున్నాయి. దసరా మరో పది రోజులు మాత్రమే ఉండడంతో కాంట్రాక్టు అధికారులు పనులను వేగంగా చేస్తున్నారు. మూడు రాజగోపురాలకు బేస్మేంట్ పనులు దాదాపుగా పూర్తి చేశారు. -
అమ్మకానికి మార్గరెట్ థాచర్ నివాసం...!
బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్ ప్యాలెస్ ను అమ్మకానికి పెట్టారు. ఆరంతస్తుల ఆ అపూర్వ భవనంలో సిబ్బంది క్వార్టర్స్, లూయిస్ ఫైర్ ప్లేస్ లు... ఓ ప్రధానమంత్రికి కావలసిన అన్నిరకాల హంగులూ ఉన్నాయి. దానికి తోడు... నీలి రాతితో మెరసి పోతున్న ఆ సౌధాన్ని.. కొనేవారి కోసం యజమానులు నిరీక్షిస్తున్నారు. మాజీ ప్రధాని చివరిగా నివసించిన ఆ భవనంలోని ప్రత్యేకతలను బట్టి... దాని ఖరీదును ముఫ్ఫై మిలియన్ల యూరోలుగా నిర్ణయించారు. లండన్ లోని 73 ఛెస్టర్ స్క్వేర్ లో ఉన్న ఆ భవంతిలో అంతకు ముందు కవి మాథ్యూ ఆర్నాల్డ్, నవలా రచయిత మేరీ షెల్లీ, 1930 కంజర్వేటివ్ ప్రధాని స్టాన్లీ బాల్డ్ విన్ నివసించారు. ఇటీవల లగ్జరీ డెవలపర్ లెకాన్ ఫీల్డ్ కొన్ని మిలియన్ పౌండ్లతో పునరుద్ధరించి, మూడేళ్ళ తర్వాత మార్కెట్లో అమ్మకానికి పెట్టారు. ఈ భవంతిలోని ప్రధాన ద్వారాలకు థాచర్ ఇష్టంతో పొదిగించుకున్న 73 నీలి ఫలకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. హాల్లోని ఫ్లోరింగ్, లాబీలకు కూడ అదేరకం రాయిని వినియోగించారు. ఇటువంటి ప్రత్యేకతలు కొనుగోలుదారులను అమితంగా ఆకట్టుకునేట్టుగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ భవనానికి ఏర్పాటు చేసిన బాంబ్ ప్రూఫ్ తలుపులు ఆ నాయకురాలి జీవితానికి గుర్తులుగా నిలుస్తున్నాయి. థాచర్ 1984 లో బ్రైటన్ హోటల్ బాంబు దాడి నుంచి తప్పించుకున్న తర్వాత బాంబ్ ఫ్రూఫ్ తలుపుల అవసరం మరింత పెరిగింది. అంతేకాదు ఈ ప్యాలెస్ లో ప్రదర్శన శాలలు, మోడరన్ జిమ్, సినిమా హాల్, 500 సీసాలు పట్టే వైన్ సెల్లార్ వంటి మరెన్నో ఆధునిక హంగులూ ఉన్నాయి. మేడమీది రెండో అంతస్తులో మాస్టర్ సూట్లు, డబుల్ బెడ్ రూమ్, డ్రెస్సింగ్ ఏరియా, మాస్టర్ బాత్ రూమ్ సహా అనేక ప్రత్యేక ఆకర్షణలు కొనుగోలుదారులను ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. అలాగే భవనంలోని మరో ఐదు బెడ్ రూమ్ లు, సిబ్బంది వసతి గృహాలతోపాటు ఇటాలియన్ ఫర్నిచర్, పాలరాతి టేబుల్ రాచరికపు అందాలను ఉట్టిపడేలా చేస్తున్నాయి. థాచర్ త్రండి ఆల్ ఫ్రెడ్ రాబర్ట్స్ 'గ్రాంథం' ప్రాంతానికి 1945 నుంచి 1946 వరకు మేయర్ గా పనిచేశారు. దీంతో ఆమె తన బాల్యాన్ని గ్రాంథం లో గడిపింది. స్థానిక గ్రామర్ స్కూల్లో చదివిన మార్గరెట్... ఆక్స్ ఫర్డ్ సోమర్ విల్లె కాలేజీలో కెమిస్ట్రీ లో పట్టభద్రత పొందింది. అనంతరం ఓ పరిశోధన రసాయన శాస్త్రవేత్తగా పనిచేసి, ఆమెకు 25 ఏళ్ళ వయసున్నపుడు రాజకీయాల్లో అడుగు పెట్టింది. 1951 లో కంజర్వేటివ్ అభ్యర్థిగా ఎంపికై... 1970 లో పార్టీ నాయకురాలిగా ఎదిగింది. తర్వాత మూడు పర్యాయాలు జనరల్ ఎన్నికల్లో గెలిచి మొదటి బ్రిటిష్ ప్రధానమంత్రిగా థాచర్ ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించింది. -
తెరుచుకోని ఓ తలుపు కథ..
న్యూజెర్సీలోని కెండాల్ పార్క్.. జనవరి 23వ తేదీ శనివారం ఉదయం.. షాన్ ఇన్ బయటకి వెళ్లడానికి రెడీ అవుతున్నాడు.. షూ వేసుకుని చకచకా మెట్లు దిగాడు.. బయటకు వెళ్లడానికి తలుపు తీశాడు. ఒక తలుపు తెరుచుకుంది.. మరో తలుపు మాత్రం తెరుచుకోలేదు!! ఎందుకు? ఫొటో చూడండి మీకే అర్థమవుతుంది.. అమెరికాలోని మంచు తుపాను తీవ్రతను తెలిపే దృశ్యమిది. షాన్ ఇన్ తలుపు తీయగానే.. బయట పేరుకుపోయిన మంచు మరో తలుపులా తయారై.. అతనికి అడ్డుగా నిల్చుంది. దీంతో బెంబేలెత్తిన షాన్ఇన్ ఎమర్జెన్సీ సర్వీసుకు ఫోన్ చేశాడు. అయితే.. మంచు తుపాను వల్ల వారు ఆదివారం ఉదయానికి ఆ ప్రాంతానికి చేరుకోగలిగారు. గంటకు పైగా శ్రమించి.. మంచును తొలగించి.. తెరుచుకోని ఆ తలుపును ఎట్టకేలకు తెరిచారు. -
డోర్ నాబ్స్‌తో జర జాగ్రత్త!
జెర్మ్స్‌తో హార్మ్స్ మనం ఆఫీసుల్లో పనిచేసే సమయంలో ఇతరుల క్యాబిన్స్లోకి ప్రవేశించే ముందు, వాష్రూమ్లలోకి వెళ్లే ముందు ఆ డోర్ నాబ్ పొడిగా ఉందో లేదో చూసుకోండి. ఒకవేళ పొడిగా లేకపోతే కొన్ని పేపర్ న్యాప్కిన్స్ను ఎప్పుడూ దగ్గర పెట్టుకొని, ఆ న్యాప్కిన్ను నాబ్ చుట్టూ చుట్టి తెరవండి. ఎందుకంటే మీ కొలీగ్స్‌లో ఎవరికైనా జలుబు వంటి అనారోగ్యాలు ఉంటే అవి డోర్ నాబ్స్ ద్వారా ఇతరులకు తేలిగ్గా సంక్రమిస్తాయని ‘ఇంటర్సైన్స్ కాన్ఫరెన్స్ ఆన్ యాంటీమైక్రోబియల్ ఏజెంట్స్ అండ్ కీమోథెరపీ’ అనే సదస్సులో పాల్గొన్న నిపుణులు తెలిపారు. ఈ విషయాన్ని నిరూపించడం కోసం వారు ఒక ప్రయోగం చేశారు. కొన్ని డోర్నాబ్స్కు ఏమాత్రం హాని చేయని సూక్ష్మజీవి అయిన ‘బ్యాక్టీరియోఫేజ్ ఎమ్మెస్-2’ను పూశారు. ఆ తర్వాత పరీక్షిస్తే అక్కడి 60% మంది చేతులకు ఈ సూక్ష్మజీవి అంటుకుని ఉంది. తద్వారా తేలిన విషయం ఏమిటంటే... ఒకవేళ హాని చేయని ఈ సూక్ష్మజీవికి బదులుగా హాని చేసే హ్యూమన్ నోరోవైరస్ వంటి వ్యాధికలిగించేది ఏదైనా ‘బ్యాక్టీరియోఫేజ్ ఎమ్మెస్-2’ స్థానంలో ఉంటే... ఆ 60% మందీ నీళ్ల విరేచనాలు, వాంతులు వంటి దుష్పరిణామాలతో బాధపడేవారు.