వాస్తుదోషంతో సీఎం దర్వాజ.. 15 ఏళ్ల తర్వాత తెరిచిన సిద్ధరామయ్య.. | Karnataka Siddaramaiah Orders Open Cursed Door That Loses Polls | Sakshi
Sakshi News home page

వాస్తుదోషంతో సీఎం దర్వాజ..15 ఏళ్ల తర్వాత తెరిచిన సిద్ధరామయ్య..

Published Sat, Jun 24 2023 9:16 PM | Last Updated on Sat, Jun 24 2023 9:31 PM

Karnataka Siddaramaiah Orders Open Cursed Door That Loses Polls - Sakshi

కర్ణాటక: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కీలక నిర్ణయం తీసుకున్నారు. విధాన సభలోని సీఎం ఛాంబర్‌లో దురదృష్టంగా భావించే దక్షిణ ద్వారాన్ని మళ్లీ ఓపెన్ చేపించారు. గత 15 ఏళ్లుగా ఆరుగురు ముఖ్యమంత్రుల కాలంలో మూసి ఉన్న ఈ దర్వాజాను మరోసారి తెరిపించారు. ఆయన అధికారంలోకి వచ్చాక వాస్తు దోషాలకు, మూఢ నమ్మకాలకు తెరదించుతూ ఈ ద‍్వారాన్ని తెరిచారు. 

1998లో ఎన్నికల్లో ఓటమి తర్వాత జే హెచ్‌ పటేల్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విధాన సభలోని దక్షిణ ద్వారం మూతపడింది. సిద్ధరామయ్య అధికారంలోకి వచ్చిన 2013లో ఆ ద్వారాన్ని తెరిపించారు. ఆనాటి నుంచి నేటి వరకు ఆరుగురు సీఎంలు పదవి చేపట్టారు. కానీ ఎవరూ కూడా ఆ ద్వారాన్ని తెరిచే సాహసం చేయలేదు. ప్రస్తుతం అధికారంలోకి రాగా... సీఎం సిద్ధరామయ్య మళ్లీ ఆ దర్వాజాను ఓపెన్ చేపించారు.   

2018 తర్వాత ఎన్నికల్లో ఓటమి తర్వాత ముగ్గురు సీఎంలు పదవి మారారు. బీ ఎస్ యడియూరప్ప, బసవరాజ్ బొమ్మై, హెచ్ డీ కుమార స్వామిలు పదవి చేపట్టారు. వీరెవరూ విధాన సభలోని వాస్తు దోషంగా భావించే దక్షిణ ద్వారాన్ని ఓపెన్ చేసే సాహసం చేయలేదు.

విధాన సౌధలోని మూడో ఫ్లోర్‌లో సీఎం ఛాంబర్ ఉంటుంది. దానికి దక్షిణంలో ఓ ద్వారం ఉంటుంది. ఆ ద్వారం వాస్తు దోషంతో ఉందని అసెంబ్లీ సభ్యులందరూ భావిస్తుంటారు. అందుకే చాలా ఏళ్లుగా అది మూతపడి ఉంది. 

ఇదీ చదవండి: 'సీఎం కేసీఆర్‌ ఫొటో సెషన్ తర్వాత ఇదే..' ప్రతిపక్షాల భేటీపై కేంద్ర మంత్రి ఫైర్..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement