
శంషాబాద్: ప్రయాణంలో ఉన్న విమానం డోరు తెరిచే ప్రయత్నం చేసి కలకలం రేపిన ఓ ప్రయాణికుడి ఘటనలో పలు వివరాలు వెల్లడయ్యాయి. స్నేహితులతో ఉజ్జయిని వెళ్లిన ఓ ప్రయాణికుడు ఈ నెల 21 ఇండోర్ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానంలో కొందరు ప్రయాణికులతో గొడవ పడడంతో అతడిని ముందు సీటులో కూర్చోబెట్టారు. ఆ తర్వాత కొద్దిసేపటికి అతడు గాల్లో ప్రయాణిస్తున్న విమానం డోరు తెరిచేందుకు యతి్నంచడంతో అందులోని ఉద్యోగులు నివారించారు.
ఈ విషయమై ఆర్‌జీఐఏ పీఎస్‌లో కేసు నమోదు అయినప్పటికి వివిధ మెడికల్ రిపోర్టుల ఆధారంగా అతడు స్టేషన్ బెయిల్ పొందాడు. అసలు సదరు ప్రయాణికుడు అలా ప్రవర్తించడానికి గల కారణం ఏంటని స్నేహితులను ప్రశి్నంచిన పోలీసులకు అతడు బంగు (మూలికలతో చేసిన మత్తుపదార్థం) సేవించడమే కారణమని తెలిపారు. బంగు మత్తులో ఉన్నందునే సదరు ప్రయాణికుడు అలా ప్రవర్తించినట్లు తెలిపారు.