
హైదరాబాద్: శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఓ ప్రయాణికుడు అలజడి సృష్టించాడు. హైదరాబాద్ నుంచి షార్జా వెళ్లాల్సిన విమానం గేటు వద్దకు రాగానే బాంబు ఉందంటూ హల్ చల్ చేశాడు. దీంతో.. అప్రమత్తమైన సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
అదే సమయంలో.. విమానంలో 136 మంది ప్రయాణికులు ఉన్నారు. దీంతో విమానాన్ని ఐసోలేషన్ ప్రాంతానికి తీసుకెళ్లి తనిఖీలు చేశారు. చివరకు ఎలాంటి బాంబు లేదని తేల్చారు.
మరోవైపు.. గత కొన్నిరోజులుగా పదుల సంఖ్యలో పైగా విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం నాగ్‌పూర్ విమానానికి కూడా బాంబు బెదిరింపు రావడంతో అధికారులు అప్రమత్తమై.. అది ఉత్తదేనని తేల్చారు. ఈ క్రమంలో ఇలాంటి చర్యలను నియంత్రించేందుకు.. బెదిరింపులకు పాల్పడే వ్యక్తులపై విమాన ప్రయాణ నిషేధం విధించే దిశగా పౌర విమానయానశాఖ ఆలోచన చేస్తోంది. అయితే అందుకు తగ్గట్లు నిబంధనల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉంటుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అంటున్నారు.

ఇదీ చదవండి: మా జీతాల్లో కోతలు వద్దు సార్!
Comments
Please login to add a commentAdd a comment