సాక్షి,హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. హైదరాబాద్ నుంచి చండీగఢ్‌కు వెళ్తున్న ఇండిగో విమానంలో బాంబు ఉందంటూ శుక్రవారం మధ్యాహ్నం అంగతకులు బాంబు బెదిరింపులకు పాల్పడ్డారు. అగంతకుల ఫోన్ కాల్‌తో ఎయిర్ పోర్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. 130 ప్రయాణికులతో చండీగఢ్‌కు వెళ్తున్న ఇండిగో విమానాన్ని నిలిపివేశారు. ప్రయాణికుల్ని దించి సోదాలు నిర్వహించారు.
గతకొన్ని రోజులగా విమానాలకు బాంబుల బెదిరింపుల బెదడ ఎక్కువైంది. ఈ బాంబు బెదిరింపులపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు స్పందించారు. 9 రోజులుగా విమానాలకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. వాటిపై కేంద్రం దృష్టి సారించింది. విమానంలో బాంబ్ పెట్టామంటూ ఫేక్ కాల్ చేసిన బాలుడిని ముంబై పోలీసులు పట్టుకున్నారు. ఇప్పటికీ వస్తున్న బాంబు బెదిరింపులపైఫేక్ కాల్స్ లేదంటే ఉగ్రకోణం ఉందా? అనే దిశగా విచారణ చేపడుతున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment