
బీజింగ్ : గాలి ఆడట్లేదని కిటికీ తెరిచాడో విమాన ప్రయాణికుడు! ఈ ఘటన చైనాలోని మిన్యాంగ్ నాన్‌జియావో ఎయిర్‌పోర్ట్‌లో ఏప్రిల్ 27న చోటు చేసుకున్నట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించింది. దీని ప్రకారం చెన్(25).. విమానంలోని అత్యవసర ద్వారం వద్ద సీట్లో కూర్చున్నాడు. సరిగ్గా విమానం టేకాఫ్ అవుతుందనగా ఉన్నట్లుండి కిటికీ తెరిచాడు. అది అత్యవసర ద్వారం కావడంతో పూర్తిగా తెరచుకొని లోపలికి గాలి చొచ్చుకొచ్చింది.
దీంతో కంగారుపడిన సిబ్బంది టేకాఫ్ అర్ధాంతరంగా ఆపేసి ఆ యువకుడిని పోలీసులకు అప్పగించారు. విచారణలో ఆ యువకుడు చెప్పిన సమాధానం పోలీసులను ఆశ్చర్యపరిచింది. తనకు అవగాహన లేకే కిటికీ తెరిచానని, అది అత్యవసర ద్వారం కావడంతో పూర్తిగా ఓపెన్ అయ్యిందని వెల్లడించాడు. 15 రోజుల పాటు విమాన ప్రయాణాలు చేయకుండా ఆ యువకుడిపై నిషేధం విధించడంతోపాటు 70 వేల యెన్‌లను జరిమానా విధించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment