
యశవంతపుర: ఇంటి తలుపులను ఆలస్యంగా తెరిచి, అన్నం పెట్టలేదనే కోపంతో భర్త భార్యను హత్య చేసిన ఘటన బెంగళూరులో జరిగింది. కొప్పళ జిల్లా గంగావతికి చెందిన మంజుళ మొదటి భర్తను వదిలి, రాము అనే వ్యక్తిని పెళ్లాడి కామాక్షిపాళ్యలో నివాసం ఉంటూ పీణ్యా పారిశ్రామికవాడలో కూలీ పనులు చేసేది. వారికి ఇద్దరు పిల్లలు. ఇటీవల రాము ఇంటికి రాగా మంజుళ ఆలస్యంగా తలుపు తీసిందని, అన్నం పెట్టలేదనే కారణంతో గొడవ పడ్డాడు. ఆమెను చంపి శవాన్ని సూట్‌కేసులో పెట్టుకొని తుమకూరు మార్గంలోని దాబస్‌పేట వద్ద పడేసి రాము చెన్నైకి పారిపోయాడు. కేసును విచారించిన బెంగళూరు గ్రామీణ పోలీసులు నిందితున్ని అరెస్ట్ రిమాండ్‌కు పంపినట్లు ఏఎస్పీ లక్ష్మీ గణేశ్ తెలిపారు.
(చదవండి: రక్షకుడే భక్షకుడై దారుణకాండ)
Comments
Please login to add a commentAdd a comment