కరపత్రాలు, డోర్ స్టిక్కర్లను ఆవిష్కరిస్తున్న మంత్రి తలసాని, ఎంటమాలజీ అధికారులు
సనత్‌నగర్: ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడంతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉండే జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంతి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ రూపొందించిన కరపత్రాలు, డోర్ స్టిక్కర్లను ఆదివారం ఆయన తన నివాసంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ, వర్షాకాలంలో పలు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, వాటి బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇంటి పరిసరాల్లో మురుగునీరు, పిచి్చమొక్కలు, వ్యర్థాలు ఉంటే దోమలు వృద్ధి చెంది డెంగీ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుందన్నారు. దోమల నివారణకు జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో ప్రతి రోజూ ఫాగింగ్ చేస్తారన్నారు. కార్యక్రమంలో డీసీ శంకర్, ఎంటమాలజీ ఎస్‌ఈ దుర్గాప్రసాద్, ఏఈ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
యాదవుల అభివృద్ధికి ప్రభుత్వం అండ: మంత్రి
యాదవుల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నల్లగొండ జిల్లా యాదవ సంఘం నూతన కమిటీ సభ్యులు.. అధ్యక్షుడు మేకల యాదయ్య యాదవ్ ఆధ్వర్యంలో మంత్రిని ఆయన నివాసంలో ఆదివారం కలిసి శాలువాతో సత్కరించారు. మంత్రిని కలిసిన వారిలో గౌరవ అధ్యక్షుడు అల్లి వేణుయాదవ్, ప్రధాన కార్యదర్శి కొమ్మనబోయిన సైదులు యాదవ్, ఉపాధ్యక్షుడు కదారి గోపి, సాంస్కృతిక విభాగం మహిళా అధ్యక్షురాలు మంజులత యాదవ్, యూత్ అధ్యక్షుడు దొంగరి శివకుమార్, సల్లా సైదులు, ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోసాల గోపాల కృష్ణ ఉన్నారు. కాగా, మంజుల యాదవ్ ఆధ్వర్యంలో రూపొందించిన గురుకులం, ఇతర పాటల పోస్టర్‌లను మంతి ఈ సందర్భంగా ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment