pamphlets
-
ఏజెన్సీలో ఎలా?
సాక్షి, ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టులు ఎన్నికలు బహిష్కరించాలని, ప్రచారానికి వచ్చే నాయకులను తరిమికొట్టాలని పిలుపునిచ్చా రు. ఇటీవల కాలంలో వరుసగా కరపత్రాలు, లేఖలు విడుదల చేస్తున్నారు. దీంతో మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉండే ఏజెన్సీ ప్రాంత నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణ యంత్రాంగానికి కత్తిమీద సాములా మారే అవకాశం కనిపిస్తోంది. గోదావరి తీరంలో.. ఒకప్పుడు ఉత్తర తెలంగాణతో పాటు నల్లమల అటవీ ప్రాంతాలు మావోయిస్టులకు కంచుకోటలుగా ఉండేవి. ప్రభుత్వ ఆదేశాల కంటే మావోయిస్టుల హెచ్చరికలే పల్లెల్లో ప్రభావం చూపించేవి. రానురాను మావోయిస్టుల ప్రభావం తెలంగాణలో తగ్గిపోయింది. పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం మావోయిస్టులు బలంగా తమ ఉనికి చాటుతున్నారు. ఆ ప్రభావం సరిహద్దు పంచుకుంటున్న మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలపై కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్‌తో సరిహద్దు ఉన్న గోదావరి ఏజెన్సీలో స్థానిక సంస్థలు మొదలు చట్టసభల వరకు ప్రతీ ఎన్నికల వేళ యుద్ధ వాతావరణం తలపిస్తోంది. గంట ముందుగానే సాధారణ పోలింగ్ కేంద్రాల్లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. కానీ మావోయిస్టుల ప్రభావం ఉన్న సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకే ప్రక్రియ పూర్తి చేస్తారు. ఆ తర్వాత భారీ బందోబస్తు మధ్య ఈవీఎంలను అక్కడి నుంచి తరలిస్తారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లి వచ్చే దారులు, మార్గమధ్యలో ఉన్న కల్వర్టులను పోలీసులు విస్త్రృతంగా తనిఖీలు చేస్తారు. అయినా ఉనికి చాటుకునేందుకు మావోయిస్టులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈసారి ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్ కొనసాగుతుందని రాష్ట్ర ఎన్నికల అధికారులు ప్రకటించారు. అప్రమత్తమైన పోలీసులు ఎన్నికల నేపథ్యంలో ఇటు పోలీసులు, అటు కేంద్ర బలగాలు సరిహద్దులో అడవులను విస్తృతంగా జల్లెడ పడుతున్నాయి. భద్రాద్రి జిల్లా ఎస్పీ వినీత్ ఏజెన్సీ ఏరియాల్లో పర్యటిస్తూ పోలీసు సిబ్బందికి సూచనలు చేస్తున్నారు. అడవుల్లో విస్తృతంగా కూంబింగ్ నిర్వహించడంతో పాటు అటవీ సమీప గ్రామాల్లో ప్రజలకు భరోసా కల్పించేలా పోలీసు కవాతు నిర్వహిస్తున్నారు. కరపత్రాల కలకలం ఈసారి ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత పక్షం రోజులకు మావోయిస్టుల నుంచి లేఖలు వచ్చాయి. ఓట్ల కోసం వస్తున్న రాజకీయ పార్టీలు, నాయకులను నిలదీయండి. మీ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఎన్నికలను బహిష్కరించండి.. అంటూ మావోయిస్టు తెలంగాణ కమిటీ పేరుతో చర్లలో కరపత్రాలు వెలువడ్డాయి. అంతకు ముందు అల్లూరి సీతారామరాజు – భద్రాద్రి కొత్తగూడెం, ఇల్లెందు – నర్సంపేట డివిజన్ కమిటీల పేరుతోనూ లేఖలు వచ్చాయి. -
తిరగబడదాం.. తరిమి కొడదాం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఎన్నికల ప్రచార నగారా మోగించింది. ‘తిరగబడదాం...తరిమికొడదాం’అనే నినాదంతో పోరాటాలే లక్ష్యంగా కార్యాచరణను ప్రకటించింది. బీఆర్ఎస్–బీజేపీ రెండూ తోడు దొంగలని, కలిసే అవినీతి–అక్రమాలకు పాల్పడుతున్నాయంటూ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలన వైఫల్యాలను ఎత్తిచూపుతామని వెల్లడించింది. ఈ మేరకు బీఆర్ఎస్, బీజేపీలపై రూపొందించిన కరపత్రాలు, పోస్టర్లను విడుదల చేస్తూ.. కార్యక్రమాల షెడ్యూల్‌ను ప్రకటించింది. శనివారం హైదరాబాద్ బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ అధ్యక్షతన పార్టీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోదీ, కేసీఆర్‌ల చిత్రాలతో ‘తోడు దొంగలు’పేరుతో రూపొందించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆ పోస్టర్లో బీఆర్ఎస్, బీజేపీలపై 15 అంశాలతో కూడిన ప్రజా చార్జిషిట్‌ను నమోదు చేశారు. అనంతరం మధుయాష్కీ పార్టీ కార్యాచరణను ప్రకటించారు. చార్జిషిట్‌ను ఇంటింటికీ చేరుస్తాం ప్రచార కార్యక్రమంలో భాగంగా నెల రోజుల్లో రాష్ట్రంలోని 75 లక్షల కుటుంబాలకు తమ చార్జిషీట్‌ను చేరుస్తామని మధుయాష్కీ గౌడ్ వెల్లడించారు. ప్రజలను మమేకం చేస్తూ ప్రచార కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళతామని.. 12వేల పంచాయతీల్లో గ్రామ సభలు, 3 వేల డివిజన్ సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. ఇంటింటికీ వెళ్లిన సందర్భంగా పోస్టర్కార్డుపై ప్రజల సంతకాలు తీసుకుని, బీఆర్ఎస్, బీజేపీల వైఫల్యాలపై ప్రజల ఆమోదం తీసుకుంటామని చెప్పారు. ఈ పోరాటంలో తమతో కలసి వచ్చేందుకు ప్రజలు 7661899899 ఫోన్ నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలని కోరారు. కాగా.. నియంతలను మించి కేసీఆర్ ప్రజలపై దాడులు చేస్తున్నారని, ఆయనపై ప్రతి గ్రామానికి వెళ్లి చార్జిషిట్ వేయాలని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మహేశ్‌కుమార్‌గౌడ్, అంజన్‌కుమార్ యాదవ్, వంశీచంద్‌రెడ్డి, సంపత్‌కుమార్, చిన్నారెడ్డి, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, సురేశ్ షెట్కార్, మల్లురవి, రాజయ్య, షబ్బీర్‌అలీ, సీతక్క తదితరులు పాల్గొన్నారు. ప్రజాకోర్టు.. కేసీఆర్‌పై అభియోగాలు.. ప్రచార కార్యక్రమాన్ని ప్రకటించిన అనంతరం Vటీపీసీసీ ప్రచార కమిటీ ఆధ్వర్యంలో ప్రజాకోర్టు నిర్వహించారు. దీనికి కంచె ఐలయ్య జడ్జిగా వ్యవహరించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, కవిత కటౌట్లను బోనులో దోషులుగా నిలబెట్టి వారిపై పీసీసీ నేతలు అభియోగాలు నమోదు చేశారు. చార్జిషిట్‌లోని అంశాలను వాదనలుగా వినిపించారు. న్యాయమూర్తిగా వ్యవహరించిన కంచె ఐలయ్య వారి వాదనలు విన్నారు. సమాజంలో అన్ని వర్గాలను మోసం చేయడంతోపాటు వాగ్దానాలను నిలబెట్టుకోకుండా ప్రజలను వంచించిన కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు తరిమికొట్టాలని, ఓట్లు వేయకుండా తిరస్కరించాలని తీర్పునిచ్చారు. బీఆర్ఎస్ దోపిడీపై పోరాటమే: భట్టి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరకుండా తొమ్మిదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డగోడగా నిలిచిందని.. దిక్కుతోచని స్థితిలో తెలంగాణ సమాజం విలవిల్లాడుతోందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తెలంగాణ ఇచి్చన పారీ్టగా కాంగ్రెస్ మరోసారి నడుం బిగించిందని.. బీఆర్ఎస్ అవినీతి, దోపిడీకి వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేస్తామని ప్రకటించారు. ‘‘ప్రభుత్వంపై అభియోగాల నమోదుతోపాటు ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. పోరాడుదాం, తిరగబడదాం, తరిమికొడదాం, రాష్ట్రాన్ని నిలబెడదాం..’’ అని కాంగ్రెస్ శ్రేణులకు భట్టి పిలుపునిచ్చారు. ఆకాంక్షలను కాలరాసిన కేసీఆర్: రేవంత్ ఉద్యమకారుల ఆకాంక్షలను రాజకీయ ఇంధనంగా మార్చుకుని గద్దెనెక్కిన కేసీఆర్.. తర్వాత ఆ ఆకాంక్షలను కాలరాశాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తరఫున ప్రజాకోర్టు ఏర్పాటు చేస్తున్నామని.. రాజులు, నియంతలను మరిపించే విధంగా ప్రజలపై దాషీ్టకాలకు పాల్పడుతున్న కేసీఆర్, ఆయన కుటుంబంపై చార్జిషిట్ వేస్తున్నామని చెప్పారు. స్వేచ్ఛ, సామాజిక న్యాయం అనేవి రాష్ట్రంలో భూతద్దం వేసి వెతికినా కనిపించడం లేదన్నారు. కాళోజీ స్ఫూర్తితో బీఆర్ఎస్ను తెలంగాణ పొలిమేరలు దాటేవరకు తరిమికొడతామన్నారు. కాంగ్రెస్ ప్రజా చార్జిషిట్‌లోని అంశాలివీ.. భ్రష్ట జుమ్లా పార్టీ (బీజేపీ) తెలంగాణకు ద్రోహం– ఆంధ్రతో స్నేహం కాళేశ్వరంలో అవినీతి–కేసీఆర్‌తో లాలూచీ ప్రాజెక్టులు కట్టలే–జాతీయ హోదా దక్కలే నీళ్లు, నిధుల్లో అన్యాయం–యువతకు ఇవ్వలే ఉద్యోగం రైతులపై అప్పుల భారం–పేదలపై ధరల భారం ప్రభుత్వ ఆస్తులు అమ్ముడు–ప్రజల సొమ్ము దోచుడు బీజేపీ రిష్తేదార్ సమితి (బీఆర్ఎస్) కల్వకుంట్ల కుటుంబం–కావేవీ అక్రమాలకు అనర్హం కాళేశ్వరంతో చోరీ–ఖజానా ఖాళీ కచరా సర్కార్–కర్షకుల ఖూనీకోర్ అబద్ధాలు చెప్పిండు–అధికారంలోకి వచ్చిండు కారు వారసులు–భూబకాసురులు దళిత గిరిజనులకు అవమానం–దక్కలేదు గౌరవం ఇంటికి ఉద్యోగం రాలే–యువత భవిత మారలే అటకెక్కిన ఉచిత విద్య–పడకేసిన ఆరోగ్యం ఆడబిడ్డలపై దాడులు–అయినా ఫామ్‌హౌజ్ వదలరు బడ్జెట్లో కోతలు–సంక్షేమానికి వాతలు (ఈ అంశాలను పోస్టర్లో పేర్కొనడంతోపాటు బైబై మోదీ, బైబై కేసీఆర్ అనే నినాదాలను చేర్చారు) -
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: మంత్రి తలసాని
సనత్‌నగర్: ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడంతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉండే జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంతి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ రూపొందించిన కరపత్రాలు, డోర్ స్టిక్కర్లను ఆదివారం ఆయన తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ, వర్షాకాలంలో పలు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, వాటి బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇంటి పరిసరాల్లో మురుగునీరు, పిచి్చమొక్కలు, వ్యర్థాలు ఉంటే దోమలు వృద్ధి చెంది డెంగీ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుందన్నారు. దోమల నివారణకు జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో ప్రతి రోజూ ఫాగింగ్ చేస్తారన్నారు. కార్యక్రమంలో డీసీ శంకర్, ఎంటమాలజీ ఎస్ఈ దుర్గాప్రసాద్, ఏఈ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. యాదవుల అభివృద్ధికి ప్రభుత్వం అండ: మంత్రి యాదవుల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నల్లగొండ జిల్లా యాదవ సంఘం నూతన కమిటీ సభ్యులు.. అధ్యక్షుడు మేకల యాదయ్య యాదవ్ ఆధ్వర్యంలో మంత్రిని ఆయన నివాసంలో ఆదివారం కలిసి శాలువాతో సత్కరించారు. మంత్రిని కలిసిన వారిలో గౌరవ అధ్యక్షుడు అల్లి వేణుయాదవ్, ప్రధాన కార్యదర్శి కొమ్మనబోయిన సైదులు యాదవ్, ఉపాధ్యక్షుడు కదారి గోపి, సాంస్కృతిక విభాగం మహిళా అధ్యక్షురాలు మంజులత యాదవ్, యూత్ అధ్యక్షుడు దొంగరి శివకుమార్, సల్లా సైదులు, ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోసాల గోపాల కృష్ణ ఉన్నారు. కాగా, మంజుల యాదవ్ ఆధ్వర్యంలో రూపొందించిన గురుకులం, ఇతర పాటల పోస్టర్లను మంతి ఈ సందర్భంగా ఆవిష్కరించారు. -
‘అక్రమాలకు వజ్రాయుధంగా ఈనాడు.. ఆ భయంతోనే నన్ను అడ్డుకున్నారు’
ఈనాడు దినపత్రికను స్వార్థానికి ఉపయోగిస్తున్నారని, టీడీపీకి కరపత్రంగా అది మారిపోయిందని రామోజీ రావు తోడల్లుడు డాల్ఫిన్ అప్పారావు అన్నారు. రామోజీ, టీడీపీ తమ అక్రమాలకు ఈనాడును వజ్రాయుధంగా మలుచుకున్నారని తెలిపారు. సాక్షి టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. అన్యాయాలు జరిగినప్పుడు, అక్రమాలు జరిగినప్పుడు ఈనాడుని ఉపయోగిస్తే చాలా బాగుంటుంది. గతంలో అలానే ఉపయోగపడింది. కానీ.. రానురానూ ఈనాడుని స్వార్థానికి ఉపయోగించడం మొదలుపెట్టారు. ఇప్పటికీ అదే పంథాని కొనసాగిస్తున్నారు. తమ అక్రమాలకు పత్రికని వజ్రాయుధంగా మార్చుకున్నారు. ఎన్టీఆర్ రాజకీయంలో అడుగులు వేస్తున్న సమయంలో.. ఈనాడు ఎంతో ఉపయోగపడింది. ఎన్టీఆర్ అసెంబ్లీ టికెట్లు ఇచ్చే విషయంలో ఈనాడు రిపోర్టర్ల ద్వారా అభ్యర్థుల పేర్లుని ఎంపిక చేసి నేనే ఉత్తరాంధ్ర నుంచి 37 పేర్లు పంపించాను. దాన్నే ఎన్టీఆర్ పరిగణనలోకి తీసుకోవడం.. వారంతా విజయం సాధించడంతో నాపై ఆయనకు నమ్మకం కలిగింది. ఆ సమయంలో నాకు ఎంపీ టికెట్ ఇవ్వాలని భావించారు. ఆ పేర్ల జాబితాని రామోజీరావుకు ఎన్టీఆర్ వినిపించడంతో.. రామోజీ నన్ను ఫోన్ చేసి అడిగారు. నాకు తెలీదని చెప్పాను. ఎక్కడ రాజకీయాల్లో ఎదిగిపోతానో అనే భయంతో రాజకీయాల్లోకి వద్దని అడ్డుకున్నారు. టీడీపీకి కరపత్రంగా ఈనాడు మారిపోయింది ప్రస్తుతం మార్గదర్శిలో జరిగిన అవకతవకలు బయటపడతాయన్న విషయాన్ని రామోజీ గ్రహించారు. వాటిని ప్రజల్లోకి వెళ్లకూడదని భావించారు. అందుకే... టీడీపీ నేతలు, తెలిసినవారితో పత్రికపై దాడి చేస్తున్నారంటూ మాట్లాడిస్తున్నారు. డిపాజిట్లు అంటే ఏమిటో, చిట్స్ అంటే ఏమిటో తెలియనివారు కూడా మీడియా ముందుకు వచ్చి ఈనాడుపై దాడి, మార్గదర్శిపై దాడి అని మాట్లాడుతున్నారు. ఈనాడు తెలుగుదేశం పార్టీకి కరపత్రంగా ఉంది. కాబట్టి.. వారు దీన్ని కప్పిపుచ్చాలని భావిస్తున్నారు. సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందనేది చూడాలి. ఇది కరెక్టో, కాదో.. డిపాజిటర్లని విచారించాలి. ప్రతివాదుల్ని పిలవకుండా.. గతంలో కేసు కొట్టించేశారు. ఇప్పుడు మళ్లీ పోరాటం జరుగుతోంది. న్యాయం ఆలస్యమవ్వొచ్చు కానీ.. ధర్మం ఎప్పటికైనా గెలుస్తుంది. ఇప్పుడు మార్గదర్శికి ఈ పరిస్థితి వచ్చిందంటే దానికి రామోజీరావే ప్రధాన కారణం. చదవండి: చట్ట ప్రకారం చట్టానికి తూట్లు.. రామోజీ నమ్ముకున్న సిద్ధాంతం ఇదే.. -
‘పోరు’ ఎవరికోసం? మావోయిస్టులకు 25 ప్రశ్నలు ఎక్కుపెట్టిన ఆదివాసీలు
చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో మావోయిస్టు పార్టీకి వ్యతిరేకంగా ఆదివాసీల సంఘాల పేరిట పలు గ్రామాల్లో ఆదివారం పెద్దఎత్తున కరపత్రాలు కనిపించాయి. మండల కేంద్రంతోపాటు ఆర్.కొత్తగూడెం, కుదునూరు, కలివేరు గ్రామాల్లో వెలసిన ఈ కరపత్రాలలో ఆదివాసీ సం ఘాలు 25 ప్రశ్నలను సంధించాయి. ‘మావోయిస్టులు ఉన్నది పేదలమైన ఆదివాసీల బతుకులు మార్చడం కోసమే అయితే, మీవల్ల మా బతుకులు ఏం మారాయి? రోడ్లు లేక వైద్యం చేయించుకునేందుకు ఆసుపత్రులకు వెళ్లలేక ఇంకా ఎంతమంది చనిపోవాలి? కరెంట్ లేక ఇంకెంతకాలం చీకటిలో మగ్గాలి? మా ఊళ్లకు రోడ్లు ఎందుకు వేయనియ్యరు? జల్ జంగిల్ జమీన్ మీ కోసమా.. మా కోసమా? అడవుల్లో బాంబులు పెడుతూ మమ్మల్ని తిరగనివ్వకుండా ఎందుకు చేస్తున్నారు? మీరు పెట్టే మీటింగులకు మమ్ముల్ని భయపెట్టి తీసుకెళ్లాల్సిన అవసరం ఏమిటి? మీకు, మీ పార్టీకి ఇలా భయపడుతూ ఎంతకాలం బతకాలి? అంటూ కరపత్రాల్లో పలు ప్రశ్నలను సంధించాయి. (చదవండి: 51 కేసులు, నేరాలు చేయడంలో దిట్ట.. ఏడేళ్లుగా అజ్ఞాతంలో.. చివరికి..) -
వెరైటీ ప్రచారం : పేరు ఆమెది.. ఫోటో అతనిది
బెంగళూరు : మహిళా సాధికారత గురించి పెద్ద పెద్ద లెక్చర్లు ఇచ్చే నాయకులు మహిళలు రాజకీయాల్లోకి వస్తామంటే మాత్రం పెద్దగా సంతోషించరు. దేశ జనభాలో సగం ఉన్న మహిళలు.. రాజకీయాల్లో మాత్రం కనీసం ఒక శాతం కూడా లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం దేశంలోని మహిళా రాజకీయ ప్రతినిధులు ఎందరంటే వేళ్ల మీద లెక్కించి చెప్పగల్గే పరిస్థితి. ఒకవేళ మహిళలు రాజకీయాల్లోకి వచ్చినా పెత్తనం చెలాయించేది మాత్రం వారి కుటుంబంలోని పురుషులు. కేవలం పేరు మోసిన కుటుంబాల నుంచి వచ్చిన ఆడవారు మాత్రమే తమ రాజకీయ హోదాని సరిగ్గా వినియోగించుకోగల్గుతున్నారు. ఇది మన దేశమంతటా సర్వసాధణంగా కనిపించే దృశ్యం. కానీ కర్ణాటకలోని ఓ రాజకీయ పార్టీ మాత్రం ఏకంగా ప్రచారం నుంచే మహిళా అభ్యర్థులు స్థానంలో వారి కుటుంబాల్లోని మగవారి ఫోటోలను ముద్రించి ప్రచారం చేస్తున్నారు. ఈ సంఘటన మంగళూరు ఉల్లాల్‌లో చోటు చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ‘సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా’(ఎస్డీపీఐ) తన పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులు వివారాలతో కూడిన పాంప్లేట్ రూపొందించింది. అయితే ఆ పాంప్లేట్లలో మహిళలకు కేటాయించిన వార్డుల్లో వారి పేర్ల పక్కన ఖాళీ ఫోటో వచ్చే చోట ఖాళీగా వదిలి, ఆ పక్కనే సదరు మహిళా అభ్యర్థుల కుటుంబాలకు చెందిన మగవారి ఫోటోలను ముద్రించారు. అయితే ఇక్కడ ఆసక్తికర అంశం ఏంటంటే ఎస్డీపీఐ పార్టీ ‘మహిళా సాధికారత’ తన సిద్ధాంతంగా ప్రచారం చేసుకోంటోంది. అటువంటి పార్టీ మహిళా అభ్యర్థుల స్థానంలో వారి ఫోటోలను ప్రచురించకపోగా.. వారి కుటుంబానికి చెందిన మగవారి ఫోటోలను ముద్రించి విమర్శల పాలవుతోంది. ట్విటర్లో పోస్టు చేసిన ఈ పాంప్లేట్కు నెటిజన్లు వారిదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. ‘ఇదేనా మీరు ప్రచారం చేసిన మహిళా సాధికారత’, ‘మహిళా సాధికారతకు అసలు సిసలు నిదర్శనం ఇదే’ అంటూ కామెంట్ చేస్తోన్నారు. ఈ విషయం గురించి ఎస్డీపీఐ పార్టీ నాయకుడు ఒకరు మాట్లాడుతూ.. అభ్యర్థుల ఫోటోలు ముద్రించాలనే నిబంధనేం లేదు. ఓటర్లకు వారి అభ్యర్థుల గురించి తెలుసన్నారు. సమయానికి మహిళా అభ్యర్థుల ఫోటోలు లభించకపోవడంతో.. వారి కుటుంబానికి చెందిన పురుషుల ఫోటోలు ముద్రించాం అని తెలిపారు. -
శిద్దా లాంటి నాయకులు అవసరమా..?
దర్శి: మంత్రి శిద్దా రాఘవరావు దర్శి నియోజకవర్గ ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారని, అలాంటి నాయకులు మనకు అవసరమా..? అని టీడీపీ దర్శి మండల మాజీ కన్వీనర్, బీసీ నాయకుడు బల్లగిరి శీనయ్య కరపత్రాలు ముద్రించారు. నియోజకవర్గ ప్రజలు దీనిపై ఆలోచించాలని కోరారు. ఆ కరపత్రాలు ప్రస్తుతం వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో హల్చల్ చేస్తున్నాయి. పట్టణంలోని పలు దుకాణాలు, సెంటర్లలో కూడా దర్శనమిస్తున్నాయి. ఆ కరపత్రాల్లో ఏముందంటే... ‘పార్టీ అధికారంలో లేనప్పుడు నిస్వార్థంతో పనిచేసి పార్టీ జెండా మోసిన కార్యకర్తలను మంత్రి మరిచిపోయారు. టీడీపీని నమ్ముకుని ఎంతో మంది కార్యకర్తలు తమ ఆస్తులను అమ్ముకుని రేయనక పగలనక, ఎండనక వాననక కష్టపడి పనిచేసి పార్టీని గెలిపించారు. పార్టీ గెలిచిన తరువాత వారు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి. బీసీలంటే ప్రాణం, బీసీలే పార్టీకి వెన్నుముక అని ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతుంటే.. దర్శి నియోజకవర్గంలో మంత్రి బీసీలను అణచివేసే ధోరణితో వ్యవహరిస్తున్నారు. మంత్రి స్వప్రయోజనాల కోసం ఎప్పటి నుంచో ఒకే తాటిపై కలిసి మెలిసి ఉన్న టీడీపీ కార్యకర్తలు, నాయకుల మధ్య చిచ్చు రేపే ప్రయత్నం చేస్తున్నారు. అందరూ వ్యతిరేకిస్తే ఇంకో నియోజకవర్గం చూసుకుంటానని, పార్టీ ఫండ్ ఇచ్చి ఎంఎల్సీ తీసుకుంటానని తనమనుషులతో చెప్పిస్తున్నారు. గతంలో ఈ నియోజక వర్గంలో ఓడిన వారు అడ్రస్ లేకుండా పోతున్నారని, గెలిచిన వారు చేసిన ఖర్చులు సంపాదించుకోవద్దా అని అనడమే తప్ప అభివృద్ధి గురించి మాత్రం పట్టించుకోవడం లేదు. దొనకొండ పారిశ్రామిక హబ్ అని పేదల పొలాలు లాక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. పెద్దల నివాసాల వద్ద డ్రైనేజీలను వంకర్లు తిప్పి నిర్మించారు. నామినేటెడ్ పదవుల ఆశ చూపి ఖర్చులు చేయించి చివరకు వారికి పదవులు ఇవ్వకుండా మోసం చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాల ఆశలు చూపి ఒక్క ఉద్యోగం కూడా ఇప్పించలేదు. ప్రభుత్వ కార్యాలయాలు, అభివృద్ధి పనులు, తదితర హామీలిచ్చి అమలు చేయలేదు. వీటన్నింటిపై విద్యావంతులు, అనుభవం కలిగిన పెద్దలు, యువకులు, ఉద్యోగులు. మేధావులు ప్రతిఒక్కరూ ఆలోచించాలి’ అని కరపత్రాల్లో పేర్కొన్నారు. అయితే, ఈ విషయమై బల్లగిరి శీనయ్యను ప్రశ్నించగా నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆ కరపత్రాలను తానే ముద్రించానని చెప్పారు. నియోజకవర్గంలో మంత్రి అతని సామాజికవర్గం వారిని తప్ప ఇతర సామాజికవర్గాల వారిని పట్టించు కోవడం లేదని ఆరోపించారు. టీడీపీ కోసం కష్టపడి పనిచేసిన వారిని దూరంగా పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తులను ఎన్నుకుంటే నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. -
సాగనంపేందుకేనా..!
ప్రొద్దుటూరు టౌన్: అధికారులు అవినీతికి పాల్పడితే నేరుగా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసి పట్టించవచ్చు. లేదంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. ఇదీ సాధారణ పద్ధతి. అయితే ఇందుకు భిన్నంగా ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్నను ఇక్కడి నుంచి సాగనంపాలనే ఉద్దేశంతో కరపత్రాలు వేసి కొత్త సంస్కృతికి అధికారపార్టీ వారు తెరతీశారు. కొద్దిరోజుల కిందట ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్నను బదిలీపై వెళ్లాలని అధికారపార్టీ నేతలు హెచ్చరించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, మీకు ఇష్టం లేకపోతే బదిలీ చేయించుకోమని కమిషనర్ ఆ నేతలకు చెప్పినట్లు తెలిసింది. తాను మాత్రం బదిలీపై వెళ్లనని, సెలవుపెట్టనని చెప్పినట్లు సమాచారం. ఇందుకోసం అధికారపార్టీ నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. పైస్థాయిలో కమిషనర్‌కు పట్టు ఉండటంతో అధికారపార్టీ నేతల మాటలు చెల్లుబాటు కాలేదు. ఈ కారణంగానే టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి వరదరాజులరెడ్డికి ముఖ్య అనుచరుడైన మాజీ కౌన్సిలర్ ఎర్రన్న మున్సిపల్ కమిషనర్ అవినీతికి పాల్పడ్డారని కరపత్రాలు వేసి పంచిపెట్టారు. ఒక దళిత అధికారిపై మరో దళిత నాయకుడు కరపత్రాలు వేయడం గమనార్హం. ఎలాగైనా మున్సిపల్ కమిషనర్‌ను సాగనంపేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార పార్టీ నేతలే ఇలాంటి చర్యలకు పాల్పడటం విడ్డూరంగా ఉందని పట్టణంలో చర్చ నడుస్తోంది. పింఛన్లే ముఖ్య కారణమా! మార్చి నెలకు సంబంధించి మిగతా మున్సి పాలిటీల్లోలాగే ప్రొద్దుటూరుకు 1000 పింఛన్లు మంజూరయ్యాయి. మున్సిపాలిటీ పరిధిలోని 40వార్డులకుగానూ 18 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు కౌన్సిలర్లుగా ఎన్నిక కాగా కొందరు పార్టీ మారడంతో ప్రస్తుతం 9మంది కౌన్సిలర్లు వైఎస్సార్సీపీ వైపు ఉన్నారు. ఈ లెక్కన పూర్తి అర్హులైన 130 మందికి పింఛన్లు ఇవ్వాలని వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు పట్టుబట్టారు. నిబంధనల ప్రకారం వీరికి పింఛన్ ఇవ్వాల్సిందేనని చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కమిషనర్ టీడీపీకి చెందిన 870తోపాటు, వైఎస్సార్సీపీకి చెందిన 130మందితో పింఛన్ల నివేదిక పంపారు. ఈ విషయంపై ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పలుమార్లు జిల్లా అధికారులతో చర్చించారు. ఇది అధికారపార్టీ నేతలకు నచ్చలేదు. కమిషనర్ వాస్తవ పరిస్థితిని ఎంత వివరించినా ఆయన మాట వినకుండా ఆయనను బదిలీ చేయించాలని నిర్ణయించారు. వైఎస్సార్సీపీ సూచించిన వారి పేర్లను పింఛన్ల జాబితాలో చేర్చారని అధికారపార్టీ నేతలు జిల్లా స్థాయిలో అధికారులపై ఒత్తిడి తెచ్చి పింఛన్లు పంపిణీ చేయకుండా నిలిపేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి కొత్త పింఛన్లు పంపిణీ చేయగా, ప్రొద్దుటూరులో మాత్రం పెండింగ్‌లో పడ్డాయి. ఈ కథ ఎప్పుడు కంచికి చేరుతుందో చెప్పలేం. ముగ్గురు కమిషనర్లు.. టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రొద్దుటూరులో నాలుగేళ్లకు ముగ్గురు కమిషనర్లు మారారు. çకమిషనర్లు సంక్రాంతి వెంకటకృష్ణ, ప్రమోద్‌కుమార్, వెంకటశివారెడ్డి బదిలీపై వెళ్లగా ఎంఈ సురేంద్రబాబును కూడా దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయారు. ప్రస్తుతం నాలుగో కమిషనర్‌గా బండి శేషన్న పనిచేస్తున్నారు. ఈ బదిలీల ప్రభావంతో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఈ విధంగా టీడీపీ నేత తన మాట వినని అధికారులను పరోక్షంగా వేధించడాన్ని అధికారపార్టీలోని మరో వర్గం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉంది. -
కరపత్ర యుద్ధం
జోగిపేట(అందోల్): జోగిపేట నగర పంచాయతీలో కరపత్ర యుద్ధం మొదలైంది. ‘‘అవినీతికి మీరంటే మీరే బాధ్యులని.. అభివృద్ధిని మీరు అడ్డుకుంటున్నారంటే మీరే అడ్డుకుంటున్నారంటూ’’ టీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాలు కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటూ ఏకంగా కరపత్రాలు అచ్చువేయించి పంచడం వరకు వెళ్లింది పరిస్థితి. దీంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. 2012–13లో ఏర్పడిన నగర పంచాయతీకి 2014లో పాలకవర్గ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 13, టీఆర్ఎస్ 4, బీజేపీ 1, టీడీపీ 2 కౌన్సిలర్ స్థానాలను దక్కించుకున్నాయి. మెజార్టీ సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీకి చెందిన కవితా సురేందర్‌గౌడ్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. టీడీపీ సభ్యులు టీఆర్ఎస్లో చేరడంతో వారి బలం ఆరుకు చేరింది. టీఆర్ఎస్ తరఫున గెలుపొందిన ఇద్దరు కౌన్సిలర్లు మూడేళ్లుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. నగర పంచాయతీలో అభివృద్ధి పనులు జరగనీయకుండా ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని, కమిషనర్లు, ఏఈలను బదిలీ చేయిస్తున్నారని ఆరోపిస్తూ ఈనెల 17న నగర పంచాయతీ పాలకవర్గం కరపత్రంతో పాటు పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించింది. అదేరోజున జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. న్యాయం మీరే చెప్పండి.. తాను వేసవిలో ప్రజల దాహార్తి తీర్చేం దుకు పెండింగ్ అప్రూవల్ కింద 20 వార్డుల్లో 40 బోర్లు, 12 వార్డుల్లో పైప్లైన్లు వేసానని.., అల్లె చిన్నమల్లయ్య బావి నుంచి 20 లక్షల లీటర్ల నీటిని తరలించేందుకు పైప్‌లైన్ వేసానని.., తనకు రూ.కోటికి పైగా రావాల్సి ఉందని.., ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని.. మీరే న్యాయం చెప్పాలంటూ కాంట్రాక్టర్ ప్రవీణ్‌కుమార్ కరపత్రాలు అచ్చువేయించి పట్టణంలో పంపిణీ చేశారు. పోటీపోటీగా టీఆర్ఎస్.. కాంగ్రెస్ పాలకవర్గం, కాంట్రాక్టర్ కరపత్రాలకు పోటీగా టీఆర్ఎస్కు చెందిన కౌన్సిలర్లు సైతం ఆదివారం కరపత్రాలు పంపిణీ చేశారు. నాయకులంతా పార్టీ కండువాలు ధరించి చైర్‌పర్సన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. కాంట్రాక్టర్ అక్రమంగా టెండర్ దక్కించుకునేందుకు చైర్‌పర్సన్‌తో కుమ్మక్కయ్యాడని.., కమిషనర్లను ఎమ్మెల్యే బదిలీ చేయించలేదని.., కౌన్సిల్ ఒత్తిళ్ల మేరకే వారు బదిలీ అయి వెళ్లారని.., జోగిపేటలో ఎనిమిదేళ్లుగా నిలిచిపోయిన ఉన్నత పాఠశాలకు ఎమ్మెల్యే రూ.1.70 లక్షలు మంజూరు చేయించారని.., పట్టణంలో ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేయించారని.., మిషన్ భగీరథ కారణంగా సీసీ రోడ్లు చేపట్టవద్దని ప్రభుత్వమే ఆదేశించిందని.., సింగూరు నీటిని సేద్యానికి అందించింది తమ ప్రభుత్వమేనంటూ.. కరపత్రాల్లో పేర్కొన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ డీబీ నాగభూషణం, కౌన్సిలర్లు లక్ష్మణ్, భవానీ నాగరత్నంగౌడ్, ఏ.శ్రీకాంత్, సీడీసీ డైరెక్టర్ జైపాల్‌నాయక్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సీహెచ్.వెంకటేశం, మైనార్టీ మాజీ అధ్యక్షుడు నిజామొద్దీన్తో పాటు అందోలు, చౌటకూరు గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఊరేగింపులో పాల్గొన్నారు. కరపత్రపోరుపై సర్వత్రా ఆసక్తి.. కాంగ్రెస్, టీఆర్ఎస్ వర్గాల కరపత్రాల పంపిణీ స్థానికంగా చర్చనీయాంశమైంది. ఒకరు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, మరొకరు అభివృద్ధి పనులు జరగడం లేదంటూ కరపత్రాలు వేయడంపై ప్రజలు చర్చించుకుంటున్నారు. కరపత్రాల్లో ఎవరేం ముద్రించారో తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడే బాగుం డే అంటూ పలువురు చర్చించుకోవడం విశేషం. మొత్తానికి ఎన్నికలకు ముందే రాజకీయం రసవత్తరంగా మారింది. -
బాలలతో కరపత్రాలు పంపిణీ
కల్లూరు : చిన్నారులతో పనులు చేయించడం నేరం... బాల కార్మికులుగా మార్చి వారితో పనులు చేయిస్తున్న వారు శిక్షార్హులు. అయితే కర్నూలు నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాల యాజమాన్యం ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేసేందుకు కొందరు చిన్నారులను ఎంపిక చేసుకున్నారు. వారందరూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు. వీరికి కొన్ని వందల కరపత్రాలు ఇచ్చి పంపిణీ చేయించడం, ఆ తరువాత రూ. 150 చేతిలో పెట్టి చేతులు దులుపేసుకుంటున్నారు. ఆ చిన్నారులతో ఆదివారం జరిగిన ఎన్టీఎస్ఈ పరీక్షా కేంద్రాల వద్ద మధ్యాహ్నం 1 గంట సమయంలో మండుటెండలో పబ్లిసిటీ కోసం కరపత్రాలను పంపిణీ చేయించారు. ఇలాంటి ప్రైవేట్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
టీడీపీ నాయకులను కలవరపెట్టిన కరపత్రం
పశ్చిమగోదావరి, చాటపర్రు (ఏలూరు రూరల్) : సోమవారం ఓ కరపత్రం టీడీపీ నేతలను కలవర పెట్టింది. గ్రామంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను ఎండగడుతూ కొందరు వ్యక్తులు ప్రచురించిన కరపత్రం టీడీపీ నాయకుల చేతుల్లో పడింది. దీన్ని చదివిన నాయకులు ఉలిక్కిపడ్డారు. దమ్ముంటే బహిరంగ చర్చకు రండి అంటూ చింతమనేని సవాల్ విసిరారు. వివరాల్లోకి వెళ్తే.. ఏలూరు మండలం చాటపర్రు గ్రామంలో ‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఏలూరు ఎంపీ మాగంటి బాబు, దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక పెట్రోల్‌బంక్ వద్ద ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇదే సమయంలో కొందరు టీడీపీ కార్యకర్తలు ఆదివారం రాత్రి గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు పంపిణీ చేసిన కరపత్రాలను చింతమనేని ప్రభాకర్‌కు చూపించారు. గ్రామంలోని సుమారు 450 ఎకరాల చెరువులో అక్రమంగా చేపల సాగు చేస్తూ టీడీపీ నాయకులు దొంగచాటుగా లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారని కరపత్రంలో రాసి ఉంది. పాత మరుగుదొడ్లకు సున్నం కొట్టడంతో పాటు ఒకే ఇంట్లో రెండు లేదా మూడు దొడ్లు నిర్మించామంటూ లక్షల రూపాయలు బొక్కేశారని ఆరోపించారు. ఉపాధిహామీ పథకం పనుల్లో తప్పుడు మస్తర్లు వేసి టీడీపీ నాయకులు ఎన్ఆర్ఈజీఎస్ నిధులు కాజేశారని చెప్పారు. రూ.1.50 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనుల్లో భారీ స్థాయిలో అక్రమాలు చోటు చేసుకున్నాయని రాశారు. ప్రజాస్వామ్యంలో బాధ్యత కల్గిన పౌరుడిగా ఈ పత్రాన్ని పంపిణీ చేస్తున్నట్టు కరపత్రంలో ఉంది. ఈ మొత్తం పాఠాన్ని చదివిన చింతమనేని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాసిన వాడికి దమ్ముంటే అభివృద్ధి పనులపై బహిరంగ చర్చలకు రావాలని సవాల్ విసిరారు. -
అసలేం జరుగుతోంది..?
ప్రొద్దుటూరు ఆర్టీవో కార్యాలయం వద్ద కలెక్షన్ కింగ్ అవినీతిపై కరపత్రాలు వేసిందెవరూ.. దళారుల మధ్య విభేదాలే కారణమా? పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నా.. పట్టించుకోని అధికారులు సాక్షి, కడప : వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు ఆర్టీవో కార్యాలయంలో అవినీతి పేరుతో వేసిన కరపత్రాల వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటనపై జిల్లా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మల్లేపల్లె బసిరెడ్డి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రహస్యంగా సమాచారం తెప్పించుకున్నట్లు తెలిసింది. ప్రత్యేకంగా ఆర్టీవో కార్యాలయ ఆవరణలోనే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ల కార్యాలయం ఉండటం.. అలాగే కొంత మంది సిబ్బంది వ్యవహార శైలి వల్ల వసూళ్ల పర్వం సాగుతోందని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇది కరెక్టు కాదని చెప్పే అధికారులు లేకపోవడంతో కొంత మంది సిబ్బంది ఆడిందే ఆట.. పాడిందే పాటగా నడుస్తోంది. దీంతో వాహనదారులు పెద్ద ఎత్తున సొమ్ము ముట్టజెప్పాల్సి వస్తోంది. అయితే కరపత్రాల వ్యవహారంపై డీటీసీ బసిరెడ్డి తెప్పించుకున్న సమాచారం మేరకు స్థానికంగా ఉన్న ఒక డ్రైవింగ్ స్కూలుకు చెందిన వ్యక్తే ఇదంతా చేయిస్తున్నట్లు తెలియ వచ్చినట్లు భోగట్టా. కొంత మంది అధికారులపై ఎందుకు కరపత్రాలు వేయాల్సి వచ్చిందన్న ప్రశ్న అందరినీ ఆలోచింపజేస్తోంది. కొంత మంది దళారులను అధికారులు ప్రోత్సహిస్తుండటం.. మరి కొంత మందిని దూరంగా పెడుతున్న నేపథ్యంలోనే కరపత్రాలు వేసినట్లు తెలుస్తోంది. అధికారులు సమావేశం పెట్టుకొని సిబ్బంది పని తీరును ప్రశ్నించడమో.. లేక ఏమి జరుగుతుందన్న విషయాన్ని తెలుసుకుని ఉంటే బాగుండేదని పలువురు పేర్కొంటున్నారు. ఆర్టీవో కార్యాలయ గేటు బయటనే కొంత మంది దళారులు వాహనదారులను బురిడీ కొట్టిస్తున్నారు. ‘లెసైన్స్ పరీక్ష పాస్ చేయిస్తాం.. ఆర్సీలు ఇప్పిస్తాం.. ఎఫ్‌సీలు తెప్పిస్తాం.. అధికారులను మ్యానేజ్ చేస్తాం’ అంటూ దళారులు వాహనదారులతో భారీగా వసూలు చేస్తున్నారు. ‘కరపత్రాల కలకలం’ పేరుతో సాక్షిలో ఇటీవల కథనం ప్రచురితం కావడంతో ఆర్టీవో రవూఫ్ దళారులపై సీరియస్ అయినట్లు తెలిసింది. దీంతో రవూఫ్ పని నిమిత్తం బయటకు వెళ్లగానే.. సమయం చూసుకొని దళారులు లోపలికి వస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది క్లర్క్‌ల వద్ద అసిస్టెంట్ల రూపంలో ఉన్న దళారులు కూడా సాయంత్రం పూట లోపలికి వెళ్తున్నట్లు తెలియవచ్చింది. ఏదిఏమైనా దళారుల బెడదనుంచి వాహనదారులను రక్షించాలంటే అధికారులు సీరియస్‌గా తీసుకుంటే తప్ప న్యాయం జరగదని పలువురు పేర్కొంటున్నారు. కొన్నేళ్లుగా చక్రం తిప్పుతున్న దళారి ప్రొద్దుటూరు ఆర్టీవో కార్యాలయాన్ని వేదికగా చేసుకొని ఓ బ్రోకర్ కలెక్షన్ కింగ్‌గా మారాడు. అటు అధికారులకు పని చేసిపెట్టడంలో దిట్టగా మారడంతోపాటు.. కొంత మంది అధికారులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు భోగట్టా. ప్రస్తుతం ఎఫ్‌సీలు ఇప్పించడంతోపాటు ఇతర వ్యవహారాల్లో పెద్ద ఎత్తున తీసుకుంటున్న ఆర్ అక్షరంతో మొదలయ్యే పేరు గల బ్రోకర్ కావాల్సినంత స్థాయిలో దోచుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆర్టీవో కార్యాలయ డ్రైవర్‌గా 30 ఏళ్ల క్రితం పని చేసిన ఇతను కొన్ని కారణాల వల్ల మానుకొని తర్వాత దళారి అవతారం ఎత్తాడు. ఇటీవలే కుమారుడు జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఒక కారు గిఫ్టుగా ఇచ్చినట్లు బయట ప్రచారం సాగుతోంది. అంతేకాకుండా అతని సతీమణి కూడా ఒక శాఖలో ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తోంది. ఇతను మాత్రం పెద్ద ఎత్తున ప్రొద్దుటూరు పట్టణంలోని పలువురు ఏజెంట్ల నుంచి మొత్తాలు సేకరించి పనులు చేసిన అధికారుల పనులను చక్కబెడుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు 30 ఏళ్లుగా కార్యాలయ పరిసరాలను నమ్ముకొని జీవితం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. -
‘స్వచ్ఛ’పై నలు‘దిశ’లా ప్రచారం
మహబూబాబాద్ టౌన్ : పరిశుభ్రతతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రధాని నరేంద్రమోదీ అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిం చారు. దీనిపై ఊరూరా అవగాహన కల్పించడానికి మహబూబాబాద్‌కు చెందిన దిశ సామాజిక సేవా సంస్థ సెప్టెంబర్ 30వ తేదీ నుంచి కరపత్రాలు, స్టిక్కర్లు, పోస్టర్లు ముద్రించి విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ సోషల్ మీడియాలో సైతం ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా దిశ వ్యవస్థాపక అధ్యక్షుడు వి.గురునాథరావు ‘సాక్షి’తో మాట్లాడారు. జాతీయ, అంతర్జాతీయ నివేదికల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే 69 శాతం మరుగుదొడ్లు లేవని, సుమారు 30 శాతం పట్టణాల్లో ఇదే పరిస్థితి ఉందన్నారు. యూనిసెఫ్ నివేదిక ప్రకారం దేశంలో శిశు మరణాలు శుభ్రత లేకపోవడంతోనే సంభవిస్తున్నట్లు తెలిపిందన్నారు. ఇటీవల జాతీయ క్రైం నివేదిక ప్రకారం మహిళలు, బాలికలపై జరిగే లైంగిక దాడులు చాలా వరకు బహిర్భూమికి వెళ్లిన సందర్భాల్లోనే జరిగాయని తెలపడం చాలా ఆందోళన కలిగించే విషయమని అన్నారు. ‘నోరు మంచిదైతే ఊరు మంచిదంటారు.. మరి ఊరు బాగుంటే మనమంతా బాగుంటాం.. పెద్దలు ఆరోగ్యంగా ఉండగలుగుతారు.. భవిష్యత్ తరాలకు భరోసా ఉంటుంది’ అని తెలిపారు. ఇలా గ్రామీణ యువతలో స్వచ్ఛ భారత్‌పై చైతన్యం కలిగించేందుకు దిశ సంస్థ కృషి చేస్తుందని అన్నారు. స్వాతంత్య్రం వచ్చి దాదాపు ఏడు దశాబ్దాలు సమీపిస్తున్న తరుణంలో సరైన నిర్ణయం తీసుకుని కేంద్రం చిత్తశుద్ధితో స్వచ్ఛ భారత్‌ను నిర్వహించడం అభినందనీయమన్నారు. దీనికి ప్రజల సహకారం కావాలని ఆయన కోరారు. -
ప్రచారానికి పేకప్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : ఆదివారం జరిగే మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వానికి శుక్రవారం సాయంత్రం తెరపడనుంది. ఐదు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీ ల్లోని 206 వార్డులకు 1182 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ నెల 30 ఆదివారం పోలింగ్ జరగనున్న నేపథ్యం లో పార్టీలు, అభ్యర్థులు గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నా యి. మున్సిపల్ వార్డుల్లో బహుముఖ పోటీ ఉండటంతో అభ్యర్థులకు ప్రతీ ఓటు కీలకంగా మారింది. దీంతో చివరి క్షణం వ రకు ఓటరును ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలు, అభ్యర్థులు తంటాలు పడుతున్నారు. ఈ నెల 18న అభ్యర్థుల తుది జాబి తా వార్డుల వారీగా ఖరారు కావడంతో ఎన్నికల గుర్తులను ఓటర్ల మనసులో నాటేందుకు వినూత్న పద్దతులు అవలంభిస్తున్నారు. అభ్యర్థుల వ్యయంపై ఎన్నికల సంఘం నిఘా తీవ్రం చేయడంతో వీలైనంత తక్కువ హడావుడితో ప్రచారం నడిపిం చారు. గతంలో మాదిరిగా కార్లు, జీపులు వంటివి కాకుండా ఆటోలను ఎన్నికల గుర్తులతో అలంకరించి ప్రచారం చేశారు. ఫ్లెక్సీలు, కటౌట్ల సందడి లేకుండా కేవలం కరపత్రాలు, డోర్ పోస్టర్లకే ప్రచార సామగ్రి పరిమితమైంది. గద్వాల మినహా మి గతా మున్సిపాలిటీల్లో పార్టీలు బహిరంగ సభల జోలికి వెళ్లలే దు. పార్టీల ముఖ్య నేతలు ప్రచార పర్వానికి దూరంగా ఉండటంతో అభ్యర్థులు ఇంటింటి ప్రచారానికే మొగ్గు చూపారు. రోడ్‌షోలు కూడా లేకపోవడంతో వార్డుల్లో చివరి రెండు రోజులు మాత్రమే ప్రచార హడావుడి కనిపించింది. పార్టీలకు కీలకం సాధారణ ఎన్నికల నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతుండటంతో ఫలితాలపై అన్ని పార్టీల్లోనూ ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్, టీ ఆర్ఎస్ చాలా చోట్ల ముఖాముఖి తలపడుతుండగా, బీజేపీ, టీడీపీ, వైఎస్సార్సీపీ తమకు పట్టు ఉన్న చోట బరిలో ఉండటంతో గెలుపోటములు అభ్యర్థులకు కత్తిమీద సాములా మారింది. మున్సిపల్ చైర్మన్ పదవులు రిజర్వయినా పార్టీలు మాత్రం ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నాయి. చైర్మన్ అభ్యర్థులను ప్రకటిస్తే సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచే అవకాశం ఉందని అన్ని పార్టీలు గుంభనంగా వ్యవహరిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో చైర్మన్ గిరీ ఆశిస్తున్న అభ్యర్థులున్న చోట వారిని ఓడించేందుకు సొంత పార్టీ నేతలే ఎత్తుగడలు వేస్తున్నారు. స్వతంత్రులు పెద్ద సంఖ్యలో ఉండటం అన్ని పార్టీలను కలవర పరుస్తోంది. టికెట్ దక్కని ఔత్సాహికులు తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో ఉండటంతో అధికారిక అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం సాయంత్రం ప్రచార పర్వం ముగియనుండటంతో ప్రలోభాల పర్వానికి తెరలేచే సూచనలు కనిపిస్తున్నాయి.