![Telangana: Tribal Association Questioning The Maoist Party - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/20/Maoist.jpg.webp?itok=dhmpRg_I)
చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో మావోయిస్టు పార్టీకి వ్యతిరేకంగా ఆదివాసీల సంఘాల పేరిట పలు గ్రామాల్లో ఆదివారం పెద్దఎత్తున కరపత్రాలు కనిపించాయి. మండల కేంద్రంతోపాటు ఆర్.కొత్తగూడెం, కుదునూరు, కలివేరు గ్రామాల్లో వెలసిన ఈ కరపత్రాలలో ఆదివాసీ సం ఘాలు 25 ప్రశ్నలను సంధించాయి.
‘మావోయిస్టులు ఉన్నది పేదలమైన ఆదివాసీల బతుకులు మార్చడం కోసమే అయితే, మీవల్ల మా బతుకులు ఏం మారాయి? రోడ్లు లేక వైద్యం చేయించుకునేందుకు ఆసుపత్రులకు వెళ్లలేక ఇంకా ఎంతమంది చనిపోవాలి? కరెంట్ లేక ఇంకెంతకాలం చీకటిలో మగ్గాలి? మా ఊళ్లకు రోడ్లు ఎందుకు వేయనియ్యరు? జల్ జంగిల్ జమీన్ మీ కోసమా.. మా కోసమా? అడవుల్లో బాంబులు పెడుతూ మమ్మల్ని తిరగనివ్వకుండా ఎందుకు చేస్తున్నారు? మీరు పెట్టే మీటింగులకు మమ్ముల్ని భయపెట్టి తీసుకెళ్లాల్సిన అవసరం ఏమిటి? మీకు, మీ పార్టీకి ఇలా భయపడుతూ ఎంతకాలం బతకాలి? అంటూ కరపత్రాల్లో పలు ప్రశ్నలను సంధించాయి.
(చదవండి: 51 కేసులు, నేరాలు చేయడంలో దిట్ట.. ఏడేళ్లుగా అజ్ఞాతంలో.. చివరికి..)
Comments
Please login to add a commentAdd a comment