ఈనాడు దినపత్రికను స్వార్థానికి ఉపయోగిస్తున్నారని, టీడీపీకి కరపత్రంగా అది మారిపోయిందని రామోజీ రావు తోడల్లుడు డాల్ఫిన్ అప్పారావు అన్నారు. రామోజీ, టీడీపీ తమ అక్రమాలకు ఈనాడును వజ్రాయుధంగా మలుచుకున్నారని తెలిపారు. సాక్షి టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.
అన్యాయాలు జరిగినప్పుడు, అక్రమాలు జరిగినప్పుడు ఈనాడుని ఉపయోగిస్తే చాలా బాగుంటుంది. గతంలో అలానే ఉపయోగపడింది. కానీ.. రానురానూ ఈనాడుని స్వార్థానికి ఉపయోగించడం మొదలుపెట్టారు. ఇప్పటికీ అదే పంథాని కొనసాగిస్తున్నారు. తమ అక్రమాలకు పత్రికని వజ్రాయుధంగా మార్చుకున్నారు. ఎన్టీఆర్ రాజకీయంలో అడుగులు వేస్తున్న సమయంలో.. ఈనాడు ఎంతో ఉపయోగపడింది.
ఎన్టీఆర్ అసెంబ్లీ టికెట్లు ఇచ్చే విషయంలో ఈనాడు రిపోర్టర్ల ద్వారా అభ్యర్థుల పేర్లుని ఎంపిక చేసి నేనే ఉత్తరాంధ్ర నుంచి 37 పేర్లు పంపించాను. దాన్నే ఎన్‌టీఆర్ పరిగణనలోకి తీసుకోవడం.. వారంతా విజయం సాధించడంతో నాపై ఆయనకు నమ్మకం కలిగింది. ఆ సమయంలో నాకు ఎంపీ టికెట్ ఇవ్వాలని భావించారు. ఆ పేర్ల జాబితాని రామోజీరావుకు ఎన్టీఆర్ వినిపించడంతో.. రామోజీ నన్ను ఫోన్ చేసి అడిగారు. నాకు తెలీదని చెప్పాను. ఎక్కడ రాజకీయాల్లో ఎదిగిపోతానో అనే భయంతో రాజకీయాల్లోకి వద్దని అడ్డుకున్నారు.
టీడీపీకి కరపత్రంగా ఈనాడు మారిపోయింది
ప్రస్తుతం మార్గదర్శిలో జరిగిన అవకతవకలు బయటపడతాయన్న విషయాన్ని రామోజీ గ్రహించారు. వాటిని ప్రజల్లోకి వెళ్లకూడదని భావించారు. అందుకే... టీడీపీ నేతలు, తెలిసినవారితో పత్రికపై దాడి చేస్తున్నారంటూ మాట్లాడిస్తున్నారు. డిపాజిట్లు అంటే ఏమిటో, చిట్స్ అంటే ఏమిటో తెలియనివారు కూడా మీడియా ముందుకు వచ్చి ఈనాడుపై దాడి, మార్గదర్శిపై దాడి అని మాట్లాడుతున్నారు.
ఈనాడు తెలుగుదేశం పార్టీకి కరపత్రంగా ఉంది. కాబట్టి.. వారు దీన్ని కప్పిపుచ్చాలని భావిస్తున్నారు. సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందనేది చూడాలి. ఇది కరెక్టో, కాదో.. డిపాజిటర్లని విచారించాలి. ప్రతివాదుల్ని పిలవకుండా.. గతంలో కేసు కొట్టించేశారు. ఇప్పుడు మళ్లీ పోరాటం జరుగుతోంది. న్యాయం ఆలస్యమవ్వొచ్చు కానీ.. ధర్మం ఎప్పటికైనా గెలుస్తుంది. ఇప్పుడు మార్గదర్శికి ఈ పరిస్థితి వచ్చిందంటే దానికి రామోజీరావే ప్రధాన కారణం.
చదవండి: చట్ట ప్రకారం చట్టానికి తూట్లు.. రామోజీ నమ్ముకున్న సిద్ధాంతం ఇదే..
Comments
Please login to add a commentAdd a comment