బాలలతో కరపత్రాలు పంపిణీ | govt school kids distribution private school farm plates | Sakshi
Sakshi News home page

బాలలతో కరపత్రాలు పంపిణీ

Published Mon, Nov 6 2017 1:39 PM | Last Updated on Sat, Sep 15 2018 5:14 PM

govt school kids distribution private school farm plates - Sakshi

బీ క్యాంపులోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల గేటు వద్ద కరపత్రాలు పంపిణీ చేస్తున్న బాలుడు

కల్లూరు : చిన్నారులతో పనులు చేయించడం నేరం... బాల కార్మికులుగా మార్చి వారితో పనులు చేయిస్తున్న వారు శిక్షార్హులు. అయితే  కర్నూలు నగరంలోని ఓ ప్రైవేట్‌ కళాశాల యాజమాన్యం ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేసేందుకు కొందరు చిన్నారులను ఎంపిక చేసుకున్నారు. వారందరూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు. వీరికి కొన్ని వందల కరపత్రాలు ఇచ్చి పంపిణీ చేయించడం, ఆ తరువాత రూ. 150 చేతిలో పెట్టి చేతులు దులుపేసుకుంటున్నారు. ఆ చిన్నారులతో ఆదివారం జరిగిన ఎన్‌టీఎస్‌ఈ పరీక్షా కేంద్రాల వద్ద మధ్యాహ్నం 1 గంట సమయంలో మండుటెండలో పబ్లిసిటీ కోసం కరపత్రాలను పంపిణీ చేయించారు. ఇలాంటి ప్రైవేట్‌ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement