Srinivas Yadav talasani
-
కోడిబాయె లచ్చమ్మది
దినేష్ తేజ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన చిత్రం ‘అలా నిన్ను చేరి’. కొమ్మాల పాటి శ్రీధర్ సమర్పణలో మారేష్ శివన్ దర్శకత్వంలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాలోని మాస్ సాంగ్ ‘కోడిబాయె లచ్చమ్మది..’ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేసి, మాట్లాడుతూ – ‘‘యంగ్ టాలెంట్ తీసే చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తుంటారు. ఈ చిత్రాన్ని కూడా ఆదరించాలి. సినిమా పెద్ద హిట్టవ్వాలి’’ అన్నారు. సుభాష్ ఆనంద్ స్వరపరచిన ‘కోడిబాయె..’ పాటను మంగ్లీ పాడగా, భాను నృత్యరీతులు సమకూర్చారు. ‘‘ఈ పాటలో దినేష్ తేజ్, హెబ్బా పటేల్‌ల మాస్ స్టెప్స్ ఆకట్టుకునే విధంగా ఉంటాయి. తెలంగాణ నుంచి మరో జానపదం చార్ట్ బస్టర్‌గా నిలవనుంది. సినిమాలోని అన్ని పాటలనూ చంద్రబోస్ గారు రాశారు ’’ అని యూనిట్ పేర్కొంది. -
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: మంత్రి తలసాని
సనత్‌నగర్: ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడంతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉండే జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంతి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ రూపొందించిన కరపత్రాలు, డోర్ స్టిక్కర్లను ఆదివారం ఆయన తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ, వర్షాకాలంలో పలు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, వాటి బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇంటి పరిసరాల్లో మురుగునీరు, పిచి్చమొక్కలు, వ్యర్థాలు ఉంటే దోమలు వృద్ధి చెంది డెంగీ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుందన్నారు. దోమల నివారణకు జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో ప్రతి రోజూ ఫాగింగ్ చేస్తారన్నారు. కార్యక్రమంలో డీసీ శంకర్, ఎంటమాలజీ ఎస్ఈ దుర్గాప్రసాద్, ఏఈ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. యాదవుల అభివృద్ధికి ప్రభుత్వం అండ: మంత్రి యాదవుల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నల్లగొండ జిల్లా యాదవ సంఘం నూతన కమిటీ సభ్యులు.. అధ్యక్షుడు మేకల యాదయ్య యాదవ్ ఆధ్వర్యంలో మంత్రిని ఆయన నివాసంలో ఆదివారం కలిసి శాలువాతో సత్కరించారు. మంత్రిని కలిసిన వారిలో గౌరవ అధ్యక్షుడు అల్లి వేణుయాదవ్, ప్రధాన కార్యదర్శి కొమ్మనబోయిన సైదులు యాదవ్, ఉపాధ్యక్షుడు కదారి గోపి, సాంస్కృతిక విభాగం మహిళా అధ్యక్షురాలు మంజులత యాదవ్, యూత్ అధ్యక్షుడు దొంగరి శివకుమార్, సల్లా సైదులు, ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోసాల గోపాల కృష్ణ ఉన్నారు. కాగా, మంజుల యాదవ్ ఆధ్వర్యంలో రూపొందించిన గురుకులం, ఇతర పాటల పోస్టర్లను మంతి ఈ సందర్భంగా ఆవిష్కరించారు. -
మత్స్యకారుల అభివృద్ధికి ఆక్వా ఎగ్జిబిషన్
సాక్షి, హైదరాబాద్: మత్స్యకారులను సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అంతర్జాతీయ ఆక్వా ఎగ్జిబిషన్ (ఆక్వాక్స్) ఏర్పాటు చేయనున్నట్లు మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. సొసైటీ ఫర్ ఇండియన్ ఫిషరీస్ ఆక్వా కల్చర్ సంస్థ సహకారంతో మార్చి 15 నుంచి 18 వరకు హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో నిర్వహిస్తామన్నారు. బుధవారం సచివాలయంలో ఆక్వాక్స్ ఇండియా– 2018 పోస్టర్‌ను మంత్రి ఆవిష్కంచారు. దక్షిణ ఆసియాలోనే తొలిసారిగా రాష్ట్రంలో ఆక్వాక్స్‌ను నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో సుమారు 25 దేశాల ప్రతినిధులు, వివిధ రాష్ట్రాల చేపల పెంపకందారులు హాజరుకానున్నారని చెప్పారు. కొత్త జాతులు ఉత్పత్తి, యంత్ర సామగ్రి, ఉత్తమ మార్కెటింగ్ పద్ధతులు, నాణ్యతపై అవగాహన కల్పించనున్నట్లు తలసాని అన్నారు. కార్యక్రమంలో పశుసంవర్ధక, మత్స్య శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా, మత్స్యశాఖ కమిషనర్ సువర్ణ, సొసైటీ ఫర్ ఇండియన్ ఫిషరీస్ ఆక్వా కల్చర్ (ఎస్ఐఎఫ్ఏ) ప్రెసిడెంట్ రామచంద్రరాజు, సీఈవో వేణు దంతులూరి, డైరెక్టర్ సమీర్ పాత్ర తదితరులు పాల్గొన్నారు. -
సెస్’ అధ్యయనం వాయిదా: తలసాని
సాక్షి, హైదరాబాద్: గొర్రెల పంపిణీ పథకంపై ఏర్పాటు చేసిన ఆర్థిక, సామాజిక అధ్యయనాల కేంద్రం (సెస్) అధ్యయనాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు పశుసంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా గొల్ల, కురుమలకు కలిగిన ఆర్థికలాభం, పెరిగిన మాంసం ఉత్పత్తిని అంచనా వేసేందుకు సెస్ ద్వారా అధ్యయనం చేయించాలని తొలుత భావించామని, అయితే అందుకు కనీసం ఏడాదైనా వేచి చూడాల్సి ఉన్నందున వాయిదా నిర్ణయం తీసుకున్నామన్నారు. గొర్రెల రీసైక్లింగ్‌ను నిరోధించేందుకు అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్ట్‌లతో పాటు ప్రతి జిల్లాలో రెవెన్యూ, పోలీస్, ట్రాన్స్పోర్ట్, పశుసంవర్థక శాఖల అధికారులతో టాస్క్‌ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. గొర్రెలు కొనుగోలు చేస్తున్న దళారులపై 85 కేసులు నమోదు చేశామన్నారు. -
ఆయనేదో పొడిచేసినట్టు!
జీవన్‌రెడ్డిని ఏకవచనంతో సంబోధించిన తలసాని సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని ఉద్దేశించి మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ చేసిన వ్యాఖ్యలు సభలో కొద్దిసేపు గందరగోళాన్ని సృష్టించాయి. ఏకవచన సంబోధనతో తలసాని మాట్లాడ్డాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఖండించారు. కరువుపై చర్చ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతున్నప్పుడు మంత్రి ఏదో అనటంతో.. ‘కరువు కష్టాలు మాకు తెలుసు సిటీలో ఉండే తలసానికి ఏం తెలుసు’ అని జీవన్‌రెడ్డి అన్నారు. దీంతో కలుగజేసుకున్న శ్రీనివాసయాదవ్ ‘ప్రపంచంలో ఈయనొక్కడే మేధావి అయినట్టు, ఆయనొక్కడే వ్యవసాయం చేస్తున్నట్టు, ఊళ్లన్నీ ఈయనే తిరుగుతున్నట్టు, ఆయనేదో పొడిచేసినట్టు, మేమేదో పొడవకుండా ఉన్నట్టు.. ఏం విమర్శలు’ అంటూ అడ్డుకున్నారు. దీంతో కాస్త అసహనానికి గురైన జీవన్‌రెడ్డి.. ‘నేను చెప్పేవన్నీ నిజాలు, రాజకీయాలు చేయాలంటే బాగా చేస్తాం.. 1981లోనే సమితి అధ్యక్షుడిగా ఉన్నా..’ అని అన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడినప్పుడు శ్రీనివాసయాదవ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘జీవన్‌రెడ్డి సీనియర్ సభ్యుడు, ఆయనను ముఖ్యమంత్రి కూడా గౌరవిస్తారు. ఏకవచన సంబోధనతో ఆయనను నువ్వుగివ్వు అనడం, పొడిచేస్తాడా అనటం మంచి పద్ధతి కాదు. మోండా మార్కెట్ నుంచి వచ్చిన శ్రీనివాసయాదవ్ అలా మాట్లాడొద్దు, కనీసం జీవన్‌రెడ్డి వయసుకైనా గౌరవం ఇవ్వాలి కదా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.