India Has World Largest Door; Height Is More Than 173 Feet - Sakshi

దునియాలోనే ఎత్తయిన దర్వాజా.. భారత్‌కే సొంతం!

Jul 4 2023 9:39 AM | Updated on Jul 4 2023 10:02 AM

india has world largest door - Sakshi

భారతదేశం ఎంత గొప్పదంటే ఇక్కడ కనిపించే అద్భుతాలలో కొన్ని ప్రపంచంలో ఎ‍క్కడ వెదికినా కనిపించవు. వీటిని చూసినప్పుడు, విన్నప్పుడు ప్రపంచమే ఆశ్చర్యపోతుంటుంది. ఉదాహరణకు ఆగ్రాలోని తాజ్‌ మహల్‌నే తీసుకుంటే దీనికి ప్రపంచమే ఫిదా అయిపోతుంది. అటువంటి మరో అద్భుతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

ప్రపంచం టెక్నాలజీని చూడకముందే..
ప్రపంచంలో అధునాతన టెక్నాలజీతో ఎన్నో భారీ వస్తువులను రూపొందుతున్నాయి. అయితే ఈ టెక్నాలజీ రాకముందే భారత్‌తో అతి పెద్ద నిర్మాణాలు జరిగాయి. అవి ఎలా నిర్మించారో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. వాటిలో ఒకటే భారత్‌లోని అతి పెద్ద దర్వాజా. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద దర్వాజాగా పేరొందింది. 

ఎక్కడుంది ఈ దర్వాజా?
ప్రపంచంలోని అత్యంత పెద్ద దర్వాజా పేరు బులంద్‌ దర్వాజా. ఇది ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌ సిక్రీలో ఉంది. ఈ దర్వాజా ఎత్తు 53.63 మీటర్లు. అంటే దీనిని అడుగులలో కొలిస్తే 173 అడుగుల కన్నా అధికంగా ఉంటుంది. ఈ దర్వాజా వెడల్పు 35 మీటర్లు. రెడ్‌శాండ్‌ స్టోన్‌తో రూపొందిన ఈ దర్వాజా నేటికీ చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. ఈ రాయితో చెక్కిన వివిధ ఆకృతులు ఈ దర్వాజాపై కనిపిస్తాయి. ఈ దర్వాజాపై పలు గుమ్మటాలు, మీనార్‌లు కూడా కనిపిస్తాయి. ఈ దర్వాజాను చూసేందుకు ప్రతీ యేటా లక్షల మంది ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌ సిక్రీ వస్తుంటారు.

ఈ దర్వాజాను ఎవరు తీర్చిదిద్దారంటే..
చరిత్రకారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ దర్వాజాను మొఘల్‌ పరిపాలకుడు అక్బర్‌ 1602లో తీర్చిద్దారు. అక్బర్‌ గుజరాత్‌పై విజయం సాధించినందుకు స్మృతి చిహ్నంగా దీనిని నిర్మించారు. ఈ దర్వాజాపై కనిపించే తోరణంలో పార్సీ భాషలోని అక్షరాలు కనిపిస్తాయి. సమాజానికి ఐక్యతను చాటేందుకే అక్బర్‌ ఈ దర్వాజాను తీర్చిదిద్దారని చెబుతారు. ఈ భావానికి సంబంధించిన అక్షరాలు ఈ దర్వాజాపై కనిపిస్తాయి. ఈ దర్వాజాను రూపొందించేందుకు 12 సంవత్సరాలు పట్టింది. క్రీస్తుపూర్వం 1571 నుంచి 1558 వరకూ మెఘల్‌ సామ్రాజ్యానికి ఫతేపూర్‌ సిక్రీ రాజధానిగా ఉండేది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement