fathepur
-
Vijay prakash kondekar: పట్టువదలని విక్రమార్కుడు
విజయ ప్రకాశ్ కొండేకర్. తెల్లగడ్డం, తెల్లని దోతీ, భుజంపై కండువా, ఒంటిపై అంగి కూడా లేకుండా కనిపిస్తాడు. కానీ పట్టు వదలని విక్రమార్కుడనే పదబంధానికి నిలువెత్తు రూపం. మహారాష్ట్రలోని పుణేకు చెందిన ఈయన స్థానిక సంస్థల నుంచి లోక్‌సభ దాకా ఇప్పటికి ఏకంగా 25 సార్లు పోటీ చేశారు. దశాబ్దాలుగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూనే ఉన్నారు. మహారాష్ట్ర రాష్ట్ర విద్యుత్ బోర్డు నుంచి 1980ల్లో రిటైరయ్యారు. ‘బూటు గుర్తునే గెలిపించండి’ అని రాసున్న ప్లకార్డును ఓ బండిపై పెట్టుకుని కాలినడకన ప్రచారం చేస్తుంటారు. నగర వీధుల్లో అతడిని కొందరు పట్టించుకోకుండా వెళ్తే మరి కొందరు సెలీ్ఫలు తీసుకుంటారు. సోషల్ మీడియాలో ఉచితంగా ప్రచారం దొరికిందంటూ సంతోషిస్తారాయన. గెలిచే అవకాశం లేదని తెలిసినా ప్రచారం కోసం పూరీ్వకుల భూమి, ఇల్లు అమ్మేశాడు. ఎప్పటికైనా ప్రధాని కావాలన్నది ఆయన కలట. దాన్ని నిజం చేసుకోవడానికి ఎన్ని సార్లైనా పోటీ చేస్తూనే ఉంటానంటారు కొండేకర్. ఆయన కంటే ఘనుడు మరొకరున్నారు. ఆయనే కె.పద్మరాజన్. గిన్నిస్ రికార్డు కోసం 170 కంటే ఎక్కువ ఎన్నికల్లో పోటీ చేశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌గాంధీపైనే బరిలో దిగారు! అలాగే యూపీలోని ఆగ్రా జిల్లాకు చెందిన 78 ఏళ్ల హస్నురామ్ అంబేద్కరి ఇప్పటిదాకా ఏకంగా 98సార్లు ఎన్నికల్లో తలపడ్డారు. ఈసారి కూడా ఆగ్రా, ఫతేపుర్సిక్రీ స్థానాల్లో నామినేషన్ వేస్తున్నారు. ఆ రెండింట్లోనూ ఓడి సెంచరీ కొడతారట! ‘నీ భార్యే నీకు ఓటేయదు. ఇతరులెలా వేస్తారు’ అంటూ ఓ బీఎస్పీ నేత అవమానించడంతో విజయం కోసం కాకుండా ఓట్ల కోసం ఆయన ఇలా పోటీ చేస్తూనే ఉన్నారు!! -
దునియాలోనే ఎత్తయిన దర్వాజా.. భారత్‌కే సొంతం!
భారతదేశం ఎంత గొప్పదంటే ఇక్కడ కనిపించే అద్భుతాలలో కొన్ని ప్రపంచంలో ఎక్కడ వెదికినా కనిపించవు. వీటిని చూసినప్పుడు, విన్నప్పుడు ప్రపంచమే ఆశ్చర్యపోతుంటుంది. ఉదాహరణకు ఆగ్రాలోని తాజ్ మహల్‌నే తీసుకుంటే దీనికి ప్రపంచమే ఫిదా అయిపోతుంది. అటువంటి మరో అద్భుతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచం టెక్నాలజీని చూడకముందే.. ప్రపంచంలో అధునాతన టెక్నాలజీతో ఎన్నో భారీ వస్తువులను రూపొందుతున్నాయి. అయితే ఈ టెక్నాలజీ రాకముందే భారత్‌తో అతి పెద్ద నిర్మాణాలు జరిగాయి. అవి ఎలా నిర్మించారో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. వాటిలో ఒకటే భారత్‌లోని అతి పెద్ద దర్వాజా. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద దర్వాజాగా పేరొందింది. ఎక్కడుంది ఈ దర్వాజా? ప్రపంచంలోని అత్యంత పెద్ద దర్వాజా పేరు బులంద్ దర్వాజా. ఇది ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ సిక్రీలో ఉంది. ఈ దర్వాజా ఎత్తు 53.63 మీటర్లు. అంటే దీనిని అడుగులలో కొలిస్తే 173 అడుగుల కన్నా అధికంగా ఉంటుంది. ఈ దర్వాజా వెడల్పు 35 మీటర్లు. రెడ్‌శాండ్ స్టోన్‌తో రూపొందిన ఈ దర్వాజా నేటికీ చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. ఈ రాయితో చెక్కిన వివిధ ఆకృతులు ఈ దర్వాజాపై కనిపిస్తాయి. ఈ దర్వాజాపై పలు గుమ్మటాలు, మీనార్లు కూడా కనిపిస్తాయి. ఈ దర్వాజాను చూసేందుకు ప్రతీ యేటా లక్షల మంది ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ సిక్రీ వస్తుంటారు. ఈ దర్వాజాను ఎవరు తీర్చిదిద్దారంటే.. చరిత్రకారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ దర్వాజాను మొఘల్ పరిపాలకుడు అక్బర్ 1602లో తీర్చిద్దారు. అక్బర్ గుజరాత్‌పై విజయం సాధించినందుకు స్మృతి చిహ్నంగా దీనిని నిర్మించారు. ఈ దర్వాజాపై కనిపించే తోరణంలో పార్సీ భాషలోని అక్షరాలు కనిపిస్తాయి. సమాజానికి ఐక్యతను చాటేందుకే అక్బర్ ఈ దర్వాజాను తీర్చిదిద్దారని చెబుతారు. ఈ భావానికి సంబంధించిన అక్షరాలు ఈ దర్వాజాపై కనిపిస్తాయి. ఈ దర్వాజాను రూపొందించేందుకు 12 సంవత్సరాలు పట్టింది. క్రీస్తుపూర్వం 1571 నుంచి 1558 వరకూ మెఘల్ సామ్రాజ్యానికి ఫతేపూర్ సిక్రీ రాజధానిగా ఉండేది. -
UP Board 12th Result 2022: ముందు అక్క, తర్వాత చెల్లి.. యూపీలో ఇంటర్ టాపర్లుగా కవలలు
ఫతేపూర్: యూపీ ఇంటర్ బోర్డు 12వ తరగతి పరీక్ష ఫలితాల్లో గమ్మత్తు జరిగింది. తొలుత దివ్యాన్షీ అనే అమ్మాయి రాష్ట్ర టాపర్‌గా నిలిచింది. కానీ దివ్య అనే మరో అమ్మాయికి హిందీ పేపర్ రీ వాల్యుయేషన్‌లో ఎక్కువ మార్కులు రావడంతో దివ్యాన్షిని తోసిరాజని ఆమె నయా టాపర్‌గా అవతరించింది. ఇందులో ట్విస్ట్ ఏమిటంటే వారిద్దరూ కవలలు! వారిద్దరూ చదివింది ఒకే స్కూల్లో. మొత్తం 500 మార్కులకు దివ్యాన్షి 477 మార్కులతో తొలుత టాపర్‌గా నిలిచింది. కానీ హిందీ తప్ప అన్ని సబ్జెక్టుల్లోనూ ఆమె కంటే దివ్యకే ఎక్కువ మార్కులొచ్చాయి. హిందీలో మరీ 56 మార్కులే రావడంతో ఆమె రీ వాల్యుయేషన్‌కు వెళ్లింది. దాంతో ఏకంగా 38 మార్కులు కలిసి రావడంతో మొత్తం 479 మార్కులతో తన సోదరిని దాటేసింది. అలా మొత్తానికి టాప్ రెండు ర్యాంకులు చేజిక్కించుకున్న కవలలపై ప్రశంసలు కురుస్తున్నాయి. -
కోమాలో నుంచి కోలుకున్నానని వెరై‘టీ’ విందు
సాక్షి, చిల్పూరు: కోమలోనుంచి కోలుకున్న ఓ వ్యక్తి గ్రామస్తులకు వెరై‘టీ’ విందు ఇచ్చారు. 12 రోజులపాటు రోజుకు వంద మందికి ఇస్తానని ప్రకటించాడు. జనగామ జిల్లా చిల్పూరు మండలం ఫత్తేపూర్ గ్రామానికి చెందిన గుగులోతు భిక్షపతి ఉప్పరి పని మేస్త్రీ. జూలై 13న ఇంట్లో సజ్జపైనున్న వస్తువును తీస్తూ జారిపడ్డాడు. తలకు దెబ్బతగిలి కోమాలోకి వెళ్లాడు. హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన ఆరు రోజుల తరువాత కోమానుంచి తేరుకున్నాడు. 51 రోజుల చికిత్స అనంతరం గురువారం డిశ్చార్జ్ అయి అతను స్వగ్రామం చేరుకున్నాడు. ఇది తనకు పునర్జన్మని, దాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు 12 రోజుల పాటు రోజుకు వందమందికి చాయ్ అందిస్తానని ప్రకటించాడు. గ్రామంలోని రవి హోటల్ వద్ద ఈ ‘టీ’ విందును సర్పంచ్ రూప్లానాయక్ చేతుల మీదుగా ప్రారంభించాడు. (క్లిక్: వాట్సాప్ గ్రూపునకు అడ్మిన్ చేస్తే.. బయటకు తోసేశారు, న్యాయం చేయండి) -
యూపీలో స్విస్ జంటపై దాడి
-
యూపీలో స్విస్ జంటపై దాడి
లక్నో/న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక నగరం ఆగ్రాకు సమీపంలోని ఫతేపూర్ సిక్రీలో స్విట్జర్లాండ్‌కు చెందిన ఓ యువ జంటపై ఐదుగురు యువకులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వీరిద్దరు ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు దాడిలో పాల్గొన్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. స్విట్జర్లాండ్‌లోని లాసన్నేకు చెందిన క్వెంటిన్ జెర్మీ క్లెర్క్(24) తన స్నేహితురాలు మేరీ డ్రోజ్(24)తో కలసి సెప్టెంబర్ 30న భారత్ వచ్చారు. ఈ నెల 21న ఆగ్రా సందర్శించిన వారు 22వ తేదీన ఫతేపూర్ సిక్రీకి వెళ్లారు. ఆ సమయంలో వీరిని రైల్వేస్టేషన్ నుంచి ఐదుగురు యువకులు అనుసరిస్తూ వచ్చి రాళ్లు, కర్రలతో దాడి చేశారు. గాయపడిన క్లెర్క్, డ్రోజ్ నడిరోడ్డుపైనే రక్తపుమడుగులో పడిపోయారు. స్థానికులు 100కి డయల్ చేసి సమాచారం అందించడంతో బాధితులను ఆగ్రాలోని ఆస్పత్రికి తరలించారు. స్విస్ జంటపై దాడి భారత ప్రతిష్టపై ప్రతికూల ప్రభావం చూపుతుందని కేంద్ర పర్యాటక మంత్రి ఆల్ఫాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది చాలా బాధాకరమైన ఘటన అని పేర్కొంటూ ఆయన ఉత్తరప్రదేవ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ రాశారు. బాధ్యులకు త్వరగా శిక్ష పడేలా చూడాలని కోరారు. ఈ ఘటనపై నివేదిక అందజేయాలని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించారు. -
విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం ఫతేపూర్ గ్రామంలో బుధవారం ప్రమాదవశాత్తూ కరెంట్ షాక్‌తో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. గ్రామానికి చెందిన పెద్దోళ్ల గణేశ్ అనే రైతు పొలంలో విద్యుత్ మోటారు చెడిపోయింది. దీనిని బుధవారం సాయంత్రం బండి సాయినాథ్, చింతల నరేష్, ముత్యంలు వెళ్లి మరమ్మతు చేశారు. అనంతరం వారు మోటారును పరీక్షిస్తుండగా దానిపై ఉన్న ఇనుప పైపులు పైన వెళ్తున్న 11కేవీ కరెంట్ లైన్లకు తాకటంతో అక్కడే ఉన్న సాయినాథ్, నరేష్, గణేష్ షాక్ కు గురయ్యారు. సాయినాథ్, నరేష్ అక్కడికక్కడే మృతి చెందగా..తీవ్రంగా గాయపడిన గణేష్‌ను నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.