
ఫతేపూర్: యూపీ ఇంటర్ బోర్డు 12వ తరగతి పరీక్ష ఫలితాల్లో గమ్మత్తు జరిగింది. తొలుత దివ్యాన్షీ అనే అమ్మాయి రాష్ట్ర టాపర్‌గా నిలిచింది. కానీ దివ్య అనే మరో అమ్మాయికి హిందీ పేపర్ రీ వాల్యుయేషన్‌లో ఎక్కువ మార్కులు రావడంతో దివ్యాన్షిని తోసిరాజని ఆమె నయా టాపర్‌గా అవతరించింది. ఇందులో ట్విస్ట్ ఏమిటంటే వారిద్దరూ కవలలు! వారిద్దరూ చదివింది ఒకే స్కూల్లో.
మొత్తం 500 మార్కులకు దివ్యాన్షి 477 మార్కులతో తొలుత టాపర్‌గా నిలిచింది. కానీ హిందీ తప్ప అన్ని సబ్జెక్టుల్లోనూ ఆమె కంటే దివ్యకే ఎక్కువ మార్కులొచ్చాయి. హిందీలో మరీ 56 మార్కులే రావడంతో ఆమె రీ వాల్యుయేషన్‌కు వెళ్లింది. దాంతో ఏకంగా 38 మార్కులు కలిసి రావడంతో మొత్తం 479 మార్కులతో తన సోదరిని దాటేసింది. అలా మొత్తానికి టాప్ రెండు ర్యాంకులు చేజిక్కించుకున్న కవలలపై ప్రశంసలు కురుస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment