State Topper
-
పదో తరగతి స్టేట్ టాపర్లను సన్మానించిన డీకే శివకుమార్
బెంగళూరు: పదో తరగతిలో 625 మార్కులకు 625 మార్కులు సాధించిన 'అంకిత'ను నటుడు రిషబ్ శెట్టితో పాటు.. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ కూడా ప్రశంసించారు. స్టేట్ టాపర్‌గా నిలిచిన రైతు బిడ్డకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.10వ తరగతి పరీక్షలో 625/625 మార్కులు సాధించిన బాగల్కోట్కు చెందిన అంకితను మంగళవారం కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సన్మానించారు. అంతే కాకుండా ఆ విద్యార్ధి ప్రతిభకు మెచ్చి ప్రోత్సాహక బహుమతిగా రూ.5 లక్షలు ప్రదానం చేశారు.అంకితను మాత్రమే కాకుండా మండ్య విద్యార్థి నవనీత్‌ను కూడా డీకే శివకుమార్ సత్కరించి.. ప్రోత్సాహక బహుమతిగా రూ.2 లక్షలు అందించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.#WATCH | Karnataka Deputy CM DK Shivakumar felicitates Ankitha, a student from Bagalkot who got 625/625 marks in the 10th exam and awarded Rs 5 lakhs.DK Shivakumar also felicitated Navneet, a student from Mandya, and also awarded Rs 2 lakhs. pic.twitter.com/mvpdJIfVng— ANI (@ANI) May 14, 2024 -
Ankita Basappa: ఒక్క మార్కూ వదల్లేదు!
నూటికి నూరు శాతం అంకితం చదువుల తల్లి సరస్వతే అయినా ఆడపిల్ల చదువుకు వెనుకా ముందు ఆలోచించేవారు ఇంకా ఉన్నారు. అలాంటి వారందరూ అంకితను చూసి ఆలోచన మార్చుకోవాలి. ఎందుకంటే కర్నాటక రైతు బిడ్డ అంకిత పదవ తరగతి ఫలితాల్లో 625కు 625 మార్కులు తెచ్చుకుంది. రాష్ట్రం మొత్తం మీద సెంట్ పర్సెంట్ వచ్చింది అంకితకే. ఇలాంటి అంకితలు ఎందరో ఉంటారు చదువులో ్ర΄ోత్సహిస్తే.మే 9 వ తేదీ. ఆ ఫోన్ వచ్చేసరికి బసప్ప పొలంలో ఉన్నాడు. అవతలి వైపు ఉన్నది స్కూల్ టీచరు.‘బసప్ప గారు మీ అమ్మాయికి పదవ తరగతిలో స్టేట్ ఫస్ట్ మార్కులు వచ్చాయి’ ‘ఓ.. ఎన్ని మార్కులు వచ్చాయి సార్?’‘ఎన్ని వచ్చాయి ఏంటి బసప్ప గారు. అంతకు మించి వేయలేక 625కు 625 వేశారు. అంత బాగా చదివింది మీ అమ్మాయి. ఇన్ని మార్కులు ఇంకెవరికీ రాలేదు’...కర్నాటకలోని బాగల్కోట్కు దాదాపు గంట దూరంలో ఉండే చిన్న పల్లె వజ్రమట్టి. ఆ ఊరే బసప్పది. ఆరెకరాల రైతు. పెద్దమ్మాయి అంకిత. ఇంకా ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. వార్త తెలిశాక ఇంటికి ఆఘమేఘాల మీద చేరుకున్నాడు. మరి కాసేపటిలో ఊరు ఊరంతా ఆ ఇంటి ముందే ఉంది. సందడి చేసింది. కోలాహాలం సృష్టించింది. పులకరించింది. మరి ఒక చిన్న పల్లెటూరి నుంచి అంత బాగా చదివితే ఆ అమ్మాయిని ఆశీర్వదించకుండా ఎలా? అంకితను చూసి ప్రతి ఒక్కరూ మెటికలువిరవడమే.హాస్టల్లో ఉండిఅంకిత తన ఊరికి నలభై నిమిషాల దూరంలో ఉన్న ముధోల్లోని ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకుంది. స్కూల్ హాస్టల్లో ఉండి చదువుకుంటూనే సెలవుల్లో ఇంటికి వచ్చేది. ‘నేను సెల్‌ఫోన్ వాడను. ఏ రోజు పాఠాలు ఆ రోజు చదువుకుంటాను. డిజిటల్ లైబ్రరీలో అదనపు మెటీరియల్ చదివాను. ఉదయం ఐదుకు లేస్తాను. మళ్లీ రాత్రి చదువుతూనే నిద్ర΄ోతాను. ఇంట్లో ఉంటే ఇంటి పనులు ఏవో ఒకటి చేయాల్సి వస్తుంది. కాని హాస్టల్లో ఉంటే చదువు తప్ప వేరే పనేముంది. నా పాఠాలు అయ్యాక ఆడుకోవడం కూడా నేను మానలేదు. మా స్కూల్ టీచర్లు ముందు నుంచి నాకు మంచి మార్కులు వస్తాయని ఊహించారు. వారు నాకు అన్ని విధాల స΄ోర్ట్ చేస్తూ వచ్చారు. నాకు సెంట్ పర్సెంట్ వచ్చినందుకు ఆనందమే. కాని నా కంటే మా అమ్మా నాన్నలు, స్కూల్ టీచర్లు ఎక్కువ సంతోషపడటం నాకు ఎక్కువ ఆనందాన్ని ఇచ్చింది. మా స్కూల్లో మంచి క్రమశిక్షణ ఉంటుంది. అందువల్లే నేను బాగా చదివాను‘ అని చెప్పింది అంకిత.ఐ.ఏ.ఎస్. కావాలని‘మా అమ్మాయి బాగా చదువుతుందనుకున్నాము గాని ఇంత బాగా చదువుతుందని అనుకోలేదు. మేము ఇక ఆమె ఎంత చదవాలంటే అంత చదివిస్తాము. ఏది చదవాలన్నా ఎంత కష్టమైనా చదివిస్తాము’ అన్నారు బసప్ప, అతని భార్య గీత. భర్తతో పాటు పొలానికి వెళ్లి పని చేసే గీత కూతురిని చూసి మురిసి΄ోతోంది. ‘నేను ఇంటర్లో సైన్స్ చదివి ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నాను. ఆ తర్వాత ఐ.ఏ.ఎస్. చేస్తాను’ అంది అంకిత.ముఖ్యమంత్రి ప్రశంసఅంకితకు వచ్చిన మార్కుల గురించి విని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అభినందనలు తెలియచేశారు. ఇంకా బాగల్కోట్ ప్రభుత్వ అధికారులు ప్రశంసలు తెలియచేశారు. ఇక కర్నాటక డెప్యూటీ చీఫ్ మినిస్టర్ డి.కె.శివకుమార్ తానే స్వయంగా ఇంటికి వచ్చి అభినందిస్తానని కబురు పంపారు. అంకిత విజయం బాగా చదివే అమ్మాయిలందరికీ అంకితం. -
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
కర్ణాటకలో తాజాగా పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. స్టేట్ టాపర్‌గా నిలిచిన విద్యార్ధి ఫోటోను పాన్ ఇండియా స్టార్హీరో రిషబ్ శెట్టి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఈ విజయం ఎంతో మంది విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు.కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాకు చెందిన అంకిత కొసప్ప ఎస్ఎస్ఎల్సీ పరీక్షా ఫలితాల్లో దుమ్మురేపింది. అన్ని సబ్జెక్టుల్లోనూ నూటికి నూరుశాతం మార్కులతో అదరగొట్టింది. ఏకంగా 625/625 మార్కులు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఆమె తండ్రి బసప్ప ఒక రైతు. తల్లి గృహిణి. ఆమె సాధించిన మార్కులతో వారి కుటుంబంలో పండుగ వాతావరణం ఉంది. అంకిత ముధోల్ తాలుకాలో ఉన్న మొరార్జీ దేశాయ్ పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసింది. భవిష్యత్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేసి ఆపై ఐఏఎస్ కావాలనేది తన టార్గెట్ అని ఆమె తెలిపింది. అంకిత విజయం పట్ల కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి శుభాకాంక్షలు తెలిపాడు. ఆమె తల్లిదండ్రుల ఫోటోను ఆయన షేర్ చేశారు. ఈ ఏడాది ఫలితాల్లో ఏడుగురు విద్యార్థులు 624 మార్కులు సాధించారని అక్కడి ప్రభుత్వం వెళ్లడించింది. View this post on Instagram A post shared by Rishab Shetty (@rishabshettyofficial) -
2023 ఏపీ SSC స్టేట్ ర్యాంకర్ జ్యోత్స్న
-
UP Board 12th Result 2022: ముందు అక్క, తర్వాత చెల్లి.. యూపీలో ఇంటర్ టాపర్లుగా కవలలు
ఫతేపూర్: యూపీ ఇంటర్ బోర్డు 12వ తరగతి పరీక్ష ఫలితాల్లో గమ్మత్తు జరిగింది. తొలుత దివ్యాన్షీ అనే అమ్మాయి రాష్ట్ర టాపర్‌గా నిలిచింది. కానీ దివ్య అనే మరో అమ్మాయికి హిందీ పేపర్ రీ వాల్యుయేషన్‌లో ఎక్కువ మార్కులు రావడంతో దివ్యాన్షిని తోసిరాజని ఆమె నయా టాపర్‌గా అవతరించింది. ఇందులో ట్విస్ట్ ఏమిటంటే వారిద్దరూ కవలలు! వారిద్దరూ చదివింది ఒకే స్కూల్లో. మొత్తం 500 మార్కులకు దివ్యాన్షి 477 మార్కులతో తొలుత టాపర్‌గా నిలిచింది. కానీ హిందీ తప్ప అన్ని సబ్జెక్టుల్లోనూ ఆమె కంటే దివ్యకే ఎక్కువ మార్కులొచ్చాయి. హిందీలో మరీ 56 మార్కులే రావడంతో ఆమె రీ వాల్యుయేషన్‌కు వెళ్లింది. దాంతో ఏకంగా 38 మార్కులు కలిసి రావడంతో మొత్తం 479 మార్కులతో తన సోదరిని దాటేసింది. అలా మొత్తానికి టాప్ రెండు ర్యాంకులు చేజిక్కించుకున్న కవలలపై ప్రశంసలు కురుస్తున్నాయి. -
ప్రియ చదువు కోసం.. మొత్తం ఊరే కదిలింది!
జ్ఞానం, నైపుణ్యం ఉన్నా.. సరైన ప్రోత్సాహం లేక ముందుకు వెళ్లలేక ఆగిపోతున్నారు ఎందరో. మన దేశంలో ఆర్థిక పరిస్థితులు సహకరించక మధ్యలోనే వదిలేస్తున్న పిల్లల్ని చూస్తున్నాం. పదో తరగతిలో టాపర్‌గా నిలిచిన ప్రియాకి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అమ్మ, నాన్నమ్మల కాయకష్టంతో.. కష్టపడి చదువుకుంది. స్టేట్ టాపర్‌గా నిలిచిన చదువుల బిడ్డకు.. ఉన్నత చదువుల కోసం డబ్బుల్లేవు. ఇలాంటి తరుణంలో ఊహించని సాయం.. ఆమె చదువు బండి ముందుకు వెళ్లడానికి చేతులు చాచింది. ప్రియాన్షు కుమారి.. తండ్రి కౌశలేంద్ర శర్మ ఆమె పసితనంలో ఉన్నప్పుడే చనిపోయాడు. కొద్దిరోజులకే కుటుంబ పెద్దగా ఉన్న తాత కూడా అనారోగ్యంతో కన్నుమూశాడు. అప్పటి నుంచి నాన్నమ్మ, అమ్మ.. ఇద్దరూ ఆ ఇంటిని, ప్రియాన్షు, ఆమె సోదరి పోషణను చూసుకుంటూ వస్తున్నారు. వచ్చే సంపాదనతో ఆ ఇద్దరు ఆడబిడ్డలకు మంచి బట్ట, తిండితో పాటు చదువును సైతం అందిస్తూ వచ్చారు. ఈ క్రమంలో.. ప్రియాన్షు ఈ ఏడాది బోర్డు ఎగ్జామ్‌లో 472 మార్కులతో స్టేట్ ఫస్ట్ వచ్చింది. ఈ వార్త తెలియగానే ఆ కుటుంబమే కాదు.. ఊరు మొత్తం సంబురాలు చేసుకుంది. కష్టపడి చదువుకున్న ప్రియాన్షు గురించి ఆ ఊరికి బాగా తెలుసు. అందుకే ఆ ఊరి మాజీ సర్పంచ్, రిటైర్డ్ సైనికుడు సంతోష్ కుమార్.. ఆమె పైచదవులకు అవసరమయ్యేందుకు కొంత డబ్బును అందించాడు. ఇది తెలిసి.. ఊరు ఊరుకుంటుందా?.. మొత్తం కదిలింది. స్టేట్ టాపర్‌గా నిలిచి.. ఎక్కడో బీహార్‌లోని మారుమూల పల్లె సుమేరా పేరును హెడ్‌లైన్స్‌లో నిలిపింది ప్రియా. అందుకే ఆమె చదువులు ఆగిపోకూడదని నిర్ణయించుకుంది. ఆ తల్లులను విశ్రాంతి తీసుకోమని కోరుతూ.. ప్రియా చదువుల కోసం కొంత ఆర్థిక సాయం అందించింది. అంతేకాదు.. సాయం చేయడానికి ఎవరైనా అధికారులు, ప్రజాప్రతినిధులు ముందకు వస్తారేమో.. వద్దని అంటున్నారు ఆ ఊరి ప్రజలు. తమ ఊరి బిడ్డను తామే చదివించుకుని.. ఆమె ఉన్నత లక్ష్యమైన సివిల్స్ కలను నెరవేర్చేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు కూడా. -
ఒక్క మార్కు తగ్గిందని రివాల్యుయేషన్‌కి వెళితే..
బెళగావి: పదోతరగతి పరీక్ష ఫలితాల్లో 625 మార్కులకు గాను 624 మార్కులు సాధించి మిగిలిన ఒక్క మార్కు కోసం రివాల్యుయేషన్‌కు వెళ్లి 100 శాతం మార్కులు సాధించాడు ఓ కర్ణాటక విద్యార్థి. బెళగావికి చెందిన మహ్మద్ కైఫ్ ముల్లా నగరంలోని ఓ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పదో తరగతి పూర్తి చేశాడు. ఇటీవల ఆ రాష్ట్ర పదో తరగతి బోర్డు ప్రకటించిన పరీక్ష ఫలితాల్లో కైఫ్‌కు 625 మార్కులకు గాను 624 మార్కులు వచ్చాయి. సైన్స్ సబ్జెక్టులో ఒక్క మార్కు తక్కువగా వచ్చింది. అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలే రాసినా ఒక్క మార్క్ ఎలా పోయిందా? అని కైఫ్ అసంతృప్తి చెందాడు. 100 శాతం మార్కులు వస్తాయన్న ఆత్మవిశ్వాసంతో అతను రివాల్యుయేషన్‌కి దరఖాస్తు చేశాడు. అతను అనుకున్నదే నిజమైంది. రివాల్యుయేషన్లో కైఫ్‌కు ఆ ఒక్క మార్కు కూడా కలిసి వచ్చింది. దీంతో అతను 100 శాతం మార్కులు సాధించి స్టేట్ టాపర్‌గా నిలిచాడు. ఈ సందర్భంగా కైఫ్ మాట్లాడుతూ.. టాపర్‌గా నిలవడం సంతోషంగా ఉందని తెలిపాడు. ప్రస్తుతం ఆర్ఎల్ఎస్ అనే కాలేజీలో ఇంటర్మీడియేట్ చదువుతున్న కైఫ్ ఐఏఎస్ కావడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు కృషి చేస్తానని తెలిపారు. -
వికసించిన విద్యా కుసుమం
♦ టెట్‌లో స్టేట్ టాపర్‌గా స్నేహలత ♦ తెలంగాణ వ్యాప్తంగా మెతుకుసీమ ఖ్యాతి పాపన్నపేట: స్నేహలత.. విద్యాకుసుమమై వికసించింది. టెట్‌లో స్టేట్ టాపర్‌గా నిలిచింది. మెతుకుసీమ ఖ్యాతిని తెలంగాణ వ్యాప్తంగా చాటిచెప్పింది. పాపన్నపేట మండలం ముద్దాపూర్‌కు చెందిన ఊరడి స్నేహలత శుక్రవారం ప్రకటించిన టెట్-1పేపర్(డైట్)లో 150 మార్కులకుగానూ 134 మార్కులు సాధించింది. మొదటి ప్రయత్నంలోనే స్టేట్ టాపర్‌గా నిలవడం గమనార్హం. మాస్టారింట్లో మెరిసిన ముత్యం ముద్దాపూర్ గ్రామానికి చెందిన ఊరడి పోచమ్మ దినసరి కూలీ. రెక్కలు ముక్కలు చేసుకుంటూ కొడుకు నర్సింలును చదివించి టీచర్‌ను చేసింది. నర్సింలు ప్రస్తుతం కొల్చారం ఉన్నతపాఠశాలలో గణితం స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. నర్సింలు-విజయలక్ష్మి దంపతులకు స్నేహలత, సంపత్‌కుమార్ సంతానం. స్నేహలత చిన్నప్పటి నుంచే చదువులో చురుకైన విద్యార్థిని. ఒకటి నుంచి 7వ తరగతి మెదక్ పట్టణంలోని సరస్వతి శిశుమందిర్‌లో, 8వ తరగతి కృష్ణవేణి టాలెంట్స్కూల్, 9, 10 తరగతులు వర్గల్ నవోదయలో, ఇంటర్ బోడుప్పల్లో చదివి, రంగారెడ్డి జిల్లా సూరారంలో డైట్ పూర్తిచేసింది. ఇంటర్ తరువాత బీవీఆర్ఐటీలో ఇంజనీరింగ్‌లో సీటు వచ్చినప్పటికీ ఉపాధ్యాయ వృత్తిపై మమకారంతో డైట్ పూర్తిచేసింది. అనంతరం మొదటిసారిగా అర్హతపరీక్ష రాసి 134 మార్కులు సాధించింది. స్మితాసబర్వాల్ ఆదర్శం జిల్లా కలెక్టర్‌గా పనిచేసి ప్రస్తుతం సీఎం కేసీఆర్ అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్న స్మితాసబర్వాల్ నా ఆదర్శం. ఐఏఎస్ లక్ష్యంగా చదువు కొనసాగిస్తా. నిరుపేదల అభివృద్ధే ధ్యేయంగా కలెక్టర్‌గా సేవలందిస్తా. అంత వరకు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి సివిల్స్ సాధిస్తా. నా తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల మార్గదర్శకం మేరకు ఈరోజు టెట్‌లో స్టేట్ టాపర్‌గా నిలిచాను. - స్నేహలత -
‘సత్య’వ్రతుడు
నిరాడంబరుడు, సేవాతత్పరుడు పోటీ పరీక్షల్లో హ్యాట్రిక్ టాపర్ సర్వే, ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కుమార్ ప్రస్థానం ఏ రంగంలోనైనా రాణించేవారు ఎందరో ఉంటారు. బహు రంగాల్లో రాణించే వారు కొందరే ఉంటారు. వృత్తి, ప్రవృత్తిలోనే కాదు.. నీతి, నిజాయతీ, దయాగుణంతో నడిచే వారు అరుదుగా ఉంటారు. అవన్నీ కలగలిసిన ఒకాయన నిరుపేదలకు ఆపన్న హస్తం అందిస్తున్నారు. కోచింగ్ తీసుకోకుండా ఏకంగా మూడు పోటీ పరీక్షల్లో స్టేట్ టాపర్‌గా నిలిచారు. గ్రూప్-1 ఆఫీసర్ హోదాలో ఓ శిథిల క్వార్టరులో ఉంటున్నారు. ఆయన మిమిక్రీ, వెంట్రిలాక్విజం ఆర్టిస్ట్ కూడా. విధి నిర్వహణలోనూ పలు అవార్డులందుకుంటున్నారు. నిస్వార్థం, నిరాడంబరత, ఆదర్శం మేళవించిన ఆ అధికారి పేరు చెన్నారెడ్డి వెంకట సత్యనారాయణ కుమార్. విశాఖ జిల్లా సర్వే, ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డెరైక్టర్! ఆశ్చర్యంగా ఉందా? అయితే ఈ కథనం చదవండి... విశాఖపట్నం: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన కుమార్‌కు చిన్నప్పట్నుంచి చదువుతో పాటు మిమిక్రీ అంటే పిచ్చి. రేడియో, టీవీల్లో వచ్చే నేరెళ్ల వేణుమాధవ్ వంటి ప్రముఖుల మిమిక్రీ షోలు చూసి స్వతహాగా అనుకరించడం నేర్చుకున్నారు. మిమిక్రీపై ఆసక్తి చూపితే కెరీర్ పాడవుతుందని, చదువు ముఖ్యమని తల్లి భుజంగవేణి కుమారుడికి హితబోధ చేసేది. అమ్మ చెప్పిన మాటలను ఒంట బట్టించుకుని చదువులో రాణిస్తూనే, తనకిష్టమైన మిమిక్రీ, వెంట్రిలాక్విజంపై ఆసక్తి పెంచుకున్నారు. 18 ఏళ్ల వయసులో ఇచ్చిన తొలి షోను అంతా మెచ్చుకోవడంతో దూసుకెళ్లారు. జెమినీ, దూరదర్శన్, ఆకాశవాణితో పాటు పలు సంస్థల తరఫున ప్రదర్శనలిచ్చి జాతీయ అవార్డులు, సన్మానాలు పొందారు. ఉద్యోగ ప్రస్థానం.. కుమార్ ఉద్యోగ ప్రస్థానంలోనూ ఎంతో ప్రత్యేకత ఉంది. విశాఖలో పాలిటెక్నిక్, విజయవాడలో బీటెక్ (సివిల్) చదివారు. అనంతరం తొలిసారి జేఈ ఉద్యోగానికి ఆర్ఆర్బీ (సికింద్రాబాద్) పరీక్ష రాసి 2002లో జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంకు సాధించారు. ఆ ఉద్యోగంలో ఉంటూ 2005లో సెక్షన్ ఇంజినీర్ పోస్టుకి ఆర్ఆర్బీ (కోల్‌కతా) ఎగ్జామ్ రాసి దేశంలోనే మరోసారి టాపర్‌గా నిలిచారు. ఆ పోస్టులో ఉంటూనే ఏపీపీఎస్సీ 2007లో వెలువరించిన గజిటెడ్ ఎగ్జామ్‌లోనూ స్టేట్ ఫస్ట్ ర్యాంకు పొందారు. సర్వే, ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డెరైక్టర్ (గ్రూప్-1 కేడర్)గా శ్రీకాకుళం జిల్లాలో నియమితులయ్యారు. అనంతరం తూర్పుగోదావరి బదిలీ అయి, రెండున్నరేళ్లుగా విశాఖ జిల్లాలో ఏడీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన తనకిష్టమైన మిమిక్రీ, వెంట్రిలాక్విజం షోలివ్వక పోయినా ఉన్నతాధికారుల కోరికపై అప్పుడప్పుడూ తన ప్రతిభను చాటుకుంటున్నారు. పురస్కారాలివీ.. కుమార్ వృత్తి, ప్రవత్తిలో పలు అవార్డులందుకున్నారు. నేషనల్ సర్వే డే రాష్ట్ర అవార్డు, బెస్ట్ సిటిజన్ జాతీయ, రాష్ట్ర అవార్డులు, ఆంధ్రరత్న రాష్ట్ర అవార్డు, లైఫ్‌టైమ్ ఎచీవ్మెంట్ అవార్డు, విశాఖ మదర్ థెరీసా సంస్థ ఆణిముత్యం, మదర్ ఇండియా ఇంటర్నేషనల్ సంస్థ జాతీయ అవార్డ, ఒంగోలు నేషనల్ ఆర్ట్స్ అకాడమీ రాష్ట్రస్థాయి ఉగాది పురస్కారాలు, అర్పిత సంస్థ ఆంధ్రరత్న వంటి 15 అవార్డులు, ఎన్నో సత్కారాలు అందుకున్నారు. నిరాడంబరత.. విధి నిర్వహణలో కుమార్ సమర్థవంతుడన్న పేరుంది. సర్వే, ల్యాండ్ రికార్డ్స్ విభాగం ఎంతో కీలకమైనది. శ్రీకాకుళం జిల్లాలో ఆయన ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం తూర్పు గోదావరికి బదిలీ చేసింది. అక్కడ ల్యాండ్ రికార్డ్స్ నిర్వహణలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపినందుకు స్టేట్ అవార్డు ఇచ్చింది. అనంతరం విశాఖ జిల్లాకు ట్రాన్స్ఫర్ చేసింది. ఇక్కడ ప్రభుత్వ భూముల గుర్తింపు, కంచె వేయించి పరిరక్షణ పనులు చేపట్టారు. చిన్నపాటి ప్రభుత్యోద్యోగులే బహుళ అంతస్తుల భవనాల్లో ఉండే ఈ రోజుల్లో నిరాడంబరత కోరుకునే కుమార్ ఓ శిథిలమైన సాదాసీదా ఆర్ అండ్ బీ క్వార్టరులో ఉంటున్నారు. ఆధ్యాత్మిక చింతన ఉన్న కుమార్ పురాణాలు, ఇతిహాసాలను బాగా ఔపోసన పట్టారు. తనను అవే మార్చాయంటారాయన. తన పుట్టినరోజును అనాథలు, వృద్ధుల ఆశ్రమాల్లో జరుపుకుంటారు. 30 మంది పేద పిల్లలకు కంప్యూటర్ శిక్షణ ఇప్పిస్తున్నారు. ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయిస్తుంటారు. నా ఆస్తులు ట్రస్టుకే.. నేను సర్కారు బడిలోనే చదివాను. ఒక్కరోజూ కోచింగ్ గడప ఎక్కలేదు. కేవలం మార్కెట్లో దొరికే పోటీ పరీక్షల పుస్తకాలతో కుస్తీపట్టే స్టేట్ టాపర్ ర్యాంకులు సాధించాను. పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి సూచనలు, సలహాలు ఇస్తున్నాను. నాకొచ్చే జీతంలో ఎలాంటి సేవింగ్స్ చేయడం లేదు. చట్టబద్ధంగా ట్యాక్స్ చెల్లిస్తాను. కర్మయోగాన్ని నమ్ముతాను. నా తదనంతరం ఆస్తిపాస్తులు మదర్ థెరిసా ట్రస్టుకివ్వాలని నిర్ణయించుకున్నాను. నా భార్య కడప జిల్లా రాజంపేటలో స్టేట్ బ్యాంకు మేనేజరుగా పనిచేస్తున్నారు. ఆమె కూడా నా నిర్ణయాలకు సహకరిస్తున్నారు. -సీహెచ్వీఎస్ఎన్ కుమార్, ఎ.డి. -
తుడా కార్యదర్శిగా మాధవీలత
సాక్షి, నెల్లూరు: నెల్లూరు ఆర్డీవో కె. మాధవీలత తుడా (తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) కార్యదర్శిగా తిరుపతికి బదిలీ అయ్యారు. ఈ మేరకు గురువారం సాయంత్రం ఉత్తర్వులు వెలువడ్డాయి. మాధవీలత తనకు తానుగా బదిలీపై వస్తున్నారు. నంద్యాల ఆర్డీవోగా పని చేస్తూ 2011, జూన్‌లో నెల్లూరుకు బదిలీపై వచ్చారు. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం మల్‌కాట్‌పల్లికి చెందిన మాధవీలత తొలుత ఇక్రిశాట్లో శాస్త్రవేత్తగా పనిచేశారు. ఆ తర్వాత 2007లో గ్రూప్-1లో మహిళల విభాగంలో స్టేట్ టాపర్‌గా నిలిచారు. ప్రొబెషనరీ పీరియడ్ కింద తొలుత రంగారెడ్డి డెప్యూటీ కలెక్టర్‌గా పనిచేశారు. 2008 అక్టోబర్‌లో నంద్యాల ఆర్డీవోగా వెళ్లారు. ఆ తర్వాత నెల్లూరుకు వచ్చారు. రాష్ట్రంలోనే ప్రప్రథమంగా జిల్లాలో ఉన్నతాధికారుల అండదండలతో మొబైల్ రెవెన్యూ సర్వీసులను ఆమె ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా నేరుగా గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని తీసుకెళ్లి అక్కడికక్కడే రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వడం ద్వారా మన్ననలు సైతం పొందారు. కడప జిల్లా సిద్దవటం మండలం కొత్తపల్లెకు చెందిన వెంకట్‌రామ్‌మునిరెడ్డి మాధవీలత భర్త. ఆయన నెల్లూరు ఏరువాక కేంద్రంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు.