Akbar
-
చవితి చంద్రుడు.. పున్నమి చంద్రుడు
అక్బర్ పాదుషా ఆస్థానంలో చేరిన అనతి కాలంలోనే బీర్బల్ ఆయనకు తలలో నాలుకలా మారాడు. బీర్బల్ చమత్కారాలను అక్బర్ పాదుషా అమితంగా ఇష్టపడేవాడు. తన తెలివితేటలతో బీర్బల్ ఎన్నో చిక్కు సమస్యలను పరిష్కరించి, మొఘల్ సామ్రాజ్యంలోనే అమిత మేధావిగా గుర్తింపు పొందాడు.బీర్బల్ తెలివి తేటలను అక్బర్ పాదుషా గుర్తించి, అతడిని తన ఆంతరంగికుడిగా చేసుకున్నాడు. మిగిలిన మంత్రులు చెప్పే మాటల కంటే బీర్బల్ మాటకు అక్బర్ పాదుషావారు ఎక్కువ విలువ ఇచ్చేవాడు. ఇదంతా ఆస్థానంలోని మిగిలిన మంత్రులకు, ఇతర ఉన్నత రాజోద్యోగులకు కంటగింపుగా ఉండేది. అదను చూసి బీర్బల్‌ను దెబ్బతీయడానికి ఎప్పటికప్పుడు విఫలయత్నాలు చేస్తుండేవారు. అసూయపరుల ప్రయత్నాలు ఎలా ఉన్నా, బీర్బల్ పేరు ప్రతిష్ఠలు మాత్రం అంతకంతకు పెరగసాగాయి. మొఘల్ సామ్రాజ్యంలోనే కాదు, బీర్బల్ ప్రఖ్యాతి పొరుగు దేశాలకూ పాకింది. బీర్బల్ ప్రఖ్యాతి ఆ నోటా ఈ నోటా పర్షియా రాజు వరకు చేరింది. బీర్బల్ తెలివితేటలను ప్రత్యక్షంగా చూడాలనే ఉద్దేశంతో ఆయన బీర్బల్‌కు తమ దేశానికి ప్రత్యేక అతిథిగా రావాలంటూ ఆహ్వానం పంపాడు. అక్బర్ పాదుషా అనుమతితో బీర్బల్ పర్షియాకు ప్రయాణమయ్యాడు. పర్షియా రాజ్యంలో అడుగుపెడుతూనే బీర్బల్‌కు ఘనస్వాగతం లభించింది. పర్షియా రాజు బీర్బల్‌కు ఘనంగా అతిథి మర్యాదలు చేశాడు. అడుగడుగునా చక్కని విడిది వసతులు, రుచికరమైన విందులు ఏర్పాటు చేశాడు. పర్షియా రాజ్యంలోకి అడుగుపెట్టినది మొదలుకొని, పర్షియా రాజభటులు, ఉద్యోగులు బీర్బల్‌ను అంటిపెట్టుకుని ఉంటూ ఆయనకు కావలసిన ఏర్పాట్లన్నీ సజావుగా జరిగేలా చూసుకున్నారు. దగ్గర ఉండి మరీ వారు బీర్బల్‌ను రాజధానికి తీసుకువచ్చారు. రాజధానికి చేరుకున్న రోజు బీర్బల్ విశ్రాంతికి విలాసవంతమైన అతిథిగృహంలో ఏర్పాట్లు చేశారు. మరునాడు బీర్బల్ రాజోద్యోగులు వెంటరాగా పర్షియా రాజు దర్బార్‌లోకి అడుగుపెట్టాడు. బీర్బల్‌ను పర్షియా రాజు తన పక్కనే ఉన్నతాసనం మీద కూర్చోబెట్టుకుని, కుశల ప్రశ్నలు వేశాడు.‘బీర్బల్గారు! మీ వంటి మేధావి మా మిత్రుడైన అక్బర్ ఆస్థానంలో మంత్రిగా ఉండటం మాకూ గర్వకారణమే! మీకు నచ్చినన్ని రోజులు మా రాజ్యంలో అతిథిగా ఉండండి. రాజ్యం నలుమూలలా మీకు నచ్చినట్లు సంచారం చేయవచ్చు. అందుకు తగిన ఏర్పాట్లు చేయిస్తాను. మా రాజ్యంలోని పరిస్థితులను గమనించి, మెరుగు పరచుకోవలసిన అంశాలేమైనా ఉంటే సలహాలు ఇవ్వండి’ అని అన్నాడు.పర్షియా రాజ్యంలో కొన్నాళ్లు గడిపాక, బీర్బల్ తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాడు. తన రాజ్యానికి తిరిగి బయలుదేరాలనుకుంటున్నానని పర్షియా రాజుకు తెలియజేశాడు. బీర్బల్ తిరుగు ప్రయాణానికి ముందురోజు అతడి గౌరవార్థం పర్షియా రాజు ఘనంగా విందు ఏర్పాటు చేశాడు. పర్షియా రాజ దర్బారులోని మంత్రులు, సేనానాయకులు, ఉన్నతోద్యోగులు, రాజ్యంలోని కులీనులు, పెద్ద పెద్ద వర్తకులు ఆ విందులో పాల్గొన్నారు. విందులో కబుర్లాడుకుంటుండగా, పర్షియా మంత్రుల్లో ఒకరు వచ్చి బీర్బల్తో మాటలు కలిపాడు. ‘బీర్బల్ మహాశయా! మా రాజుగారి గురించి మీ అభిప్రాయం ఏమిటి?’ అని అడిగాడు.‘మీ రాజావారికేం? ఆయన పున్నమి చంద్రుడు’ అని బదులిచ్చాడు బీర్బల్.‘మరి మీ రాజావారి గురించి ఏమంటారు?’ అడిగాడా మంత్రి.‘మా రాజావారు చవితి చంద్రుడు’ అన్నాడు బీర్బల్. అక్బర్ పాదుషాను చవితి చంద్రుడితోను, తనను పున్నమి చంద్రుడితోను పోలుస్తూ బీర్బల్ అన్న మాటలకు పర్షియా రాజు పట్టరాని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోయాడు. సాగనంపేటప్పుడు బీర్బల్‌కు అనేక విలువైన కానుకలు ఇచ్చాడు. అక్బర్ పాదుషాకు అందజేయమంటూ మరిన్ని కానుకలనిచ్చాడు. వాటిని మోసుకుపోవడానికి గుర్రబ్బగ్గీలను, సేవకులను ఇచ్చి ఘనంగా వీడ్కోలు పలికాడు.బీర్బల్ ఢిల్లీకి చేరుకున్నాడు. అక్బర్ పాదుషా దర్బారులోకి అడుగుపెట్టాడు. అక్బర్ పాదుషా చిర్రుబుర్రులాడుతూ కనిపించాడు. బీర్బల్‌కు ఏమీ అర్థంకాలేదు.పర్షియా రాజు వద్ద బీర్బల్ అన్న మాటలు వేగుల ద్వారా అప్పటికే అక్బర్ పాదుషా చెవికి చేరాయి.అక్బర్ పాదుషా ఇక ఉక్రోషాన్ని అణచుకోలేక నేరుగా విషయంలోకి వచ్చేశాడు.‘మా గురించి ఏమనుకుంటున్నావు బీర్బల్? పొరుగు రాజు వద్ద పరువు తీస్తావా?’ అన్నాడు కోపంగా.‘పొరుగు రాజు వద్ద నేను మిమ్మల్ని పొగిడాను జహాపనా!’ అన్నాడు బీర్బల్.‘చాలు, చాలు! ఇక బొంకకు. అక్కడ నువ్వన్న మాటలన్నీ నాకు తెలుసు. పర్షియా రాజు పున్నమి చంద్రుడా? నేను చవితి చంద్రుణ్ణా? ఇదేనా నన్ను పొగడటం?’ మరింత కోపంగా అన్నాడు అక్బర్ పాదుషా.‘జహాపనా! నిజమే, ఆయన పున్నమి చంద్రుడు. పున్నమి తర్వాత చంద్రుడు క్షీణించడం ప్రారంభిస్తాడు. తమరు చవితి చంద్రుడు. భవిష్యత్తులో తమరు ఇంకా వృద్ధిలోకి వస్తారు. అందుకే అలా పొగిడాను. నా అదృష్టం బాగులేదు కనుక నన్ను తమరు అపార్థం చేసుకున్నారు’ అన్నాడు బీర్బల్.బీర్బల్ వివరణతో అక్బర్ సంతోషించాడు. తన మెడలోని హారాన్ని బహూకరించి సత్కరించాడు. -
శ్రీరాముని గుర్తుగా అక్బర్ ఏం చేశాడు?
ఆదర్శ పురుషునిగా పేరొందిన శ్రీరామునిపై మొఘల్ చక్రవర్తి అక్బర్ తన భక్తిని చాటుకున్నాడని చరిత్ర చెబుతోంది. శ్రీరాముని నాణాన్ని రూపొందించడమే కాకుండా పర్షియన్ భాషలోకి రామాయణాన్ని అనువదింపజేశాడు. మొఘలుల కాలంలో అక్బర్ చక్రవర్తిపై రాముని ప్రభావం అధికంగా ఉంది. నాటికాలంలో అక్బర్ ఆగ్రాలోని ఫతేపూర్ సిక్రీ ప్యాలెస్‌లో ఎర్ర ఇసుకరాయిపై శ్రీరాముని ఆస్థానం చెక్కించాడు. అక్బర్ తల్లి హమీదా బాను బేగం ఉండే మరియమ్ మహల్లో ఒక స్తంభంపై శ్రీరాముని ఆస్థానంతోపాటు, హనుమంతుని చిత్రం కనిపిస్తుంది. అక్బర్ తల్లి హమీదా బాను బేగం రామాయణ, మహాభారత ఇతిహాసాలను అమితంగా ఇష్టపడేవారని అందుకే ఆమె నివాసభవనంలో శ్రీరాముడు, శ్రీకృష్ణుని చిత్రాలు కనిపిస్తాయని మాజీ ఏఎస్ఐ డైరెక్టర్, పురావస్తు శాస్త్రవేత్త పద్మశ్రీ కేకే ముహమ్మద్ తెలిపారు. తన తల్లి ఆసక్తిని గమనించిన అక్బర్ రామాయణం, మహాభారతాలను పర్షియన్ భాషలోకి అనువదింపజేశారని చరిత్ర చెబుతోంది. అక్బర్ తల్లి నివాస భవనంలో శ్రీకృష్ణుడు వేణువు వాయిస్తున్న పెయింటింగ్ కూడా కనిపిస్తుంది. -
కాలనీలో కత్తిపోట్ల కలకలం..
నిజామాబాద్: నిజామాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధి చంద్రశేఖర్ కాలనీలో కత్తిపోట్ల కలకలం సృష్టించింది. పాతకక్షలను దృష్టిలో పెట్టుకుని కొంతమంది మధ్య జ రిగిన గొడవలో ఆవేశం పట్టలేక ఓ యువకుడు కత్తితో ముగ్గురిపై దాడి చేయగా వారు చికిత్స పొందుతున్నారు. శుక్రవారం రూరల్ ఎస్సై జి మహేశ్ తెలిపిన వివరాలు.. చంద్రశేఖర్ కాలనీ గురువారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఓ విందులో ఎస్కే హుస్సేన్, ఎస్కే అక్బర్, అబ్దుల్, సద్దాం పాల్గొన్నారు. వీరిమధ్య మాటమాట పెరిగటంతో గొడవ జరిగింది. ఇంతలో సద్దాం తన స్నేహితుడు అమీర్‌ఖాన్‌కు ఫోన్‌చేసి తనను కొడుతున్నారని చెప్పాడు. దీంతో ఆయన స్నేహితులతో కలిసి అక్కడకు చేరుకున్నారు. ఇందులో ఎస్కే నవీద్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి వెళ్లి ఏమైందని ఎందుకని కొడుతున్నారని అడుగగా కర్రలతో కొట్టారు. ఈ ఘటనలో హుస్సేన్, అక్బర్, అమీర్‌ఖాన్‌కు గాయలు కాగా, ఎస్కే నవీద్‌ను సద్దాం కత్తితో పొడిచాడు. వీరిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అమీర్‌ఖాన్ బావ షేక్ మోబిన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కత్తితో దాడి చేసిన సద్దాంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
దునియాలోనే ఎత్తయిన దర్వాజా.. భారత్‌కే సొంతం!
భారతదేశం ఎంత గొప్పదంటే ఇక్కడ కనిపించే అద్భుతాలలో కొన్ని ప్రపంచంలో ఎక్కడ వెదికినా కనిపించవు. వీటిని చూసినప్పుడు, విన్నప్పుడు ప్రపంచమే ఆశ్చర్యపోతుంటుంది. ఉదాహరణకు ఆగ్రాలోని తాజ్ మహల్‌నే తీసుకుంటే దీనికి ప్రపంచమే ఫిదా అయిపోతుంది. అటువంటి మరో అద్భుతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచం టెక్నాలజీని చూడకముందే.. ప్రపంచంలో అధునాతన టెక్నాలజీతో ఎన్నో భారీ వస్తువులను రూపొందుతున్నాయి. అయితే ఈ టెక్నాలజీ రాకముందే భారత్‌తో అతి పెద్ద నిర్మాణాలు జరిగాయి. అవి ఎలా నిర్మించారో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. వాటిలో ఒకటే భారత్‌లోని అతి పెద్ద దర్వాజా. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద దర్వాజాగా పేరొందింది. ఎక్కడుంది ఈ దర్వాజా? ప్రపంచంలోని అత్యంత పెద్ద దర్వాజా పేరు బులంద్ దర్వాజా. ఇది ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ సిక్రీలో ఉంది. ఈ దర్వాజా ఎత్తు 53.63 మీటర్లు. అంటే దీనిని అడుగులలో కొలిస్తే 173 అడుగుల కన్నా అధికంగా ఉంటుంది. ఈ దర్వాజా వెడల్పు 35 మీటర్లు. రెడ్‌శాండ్ స్టోన్‌తో రూపొందిన ఈ దర్వాజా నేటికీ చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. ఈ రాయితో చెక్కిన వివిధ ఆకృతులు ఈ దర్వాజాపై కనిపిస్తాయి. ఈ దర్వాజాపై పలు గుమ్మటాలు, మీనార్లు కూడా కనిపిస్తాయి. ఈ దర్వాజాను చూసేందుకు ప్రతీ యేటా లక్షల మంది ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ సిక్రీ వస్తుంటారు. ఈ దర్వాజాను ఎవరు తీర్చిదిద్దారంటే.. చరిత్రకారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ దర్వాజాను మొఘల్ పరిపాలకుడు అక్బర్ 1602లో తీర్చిద్దారు. అక్బర్ గుజరాత్‌పై విజయం సాధించినందుకు స్మృతి చిహ్నంగా దీనిని నిర్మించారు. ఈ దర్వాజాపై కనిపించే తోరణంలో పార్సీ భాషలోని అక్షరాలు కనిపిస్తాయి. సమాజానికి ఐక్యతను చాటేందుకే అక్బర్ ఈ దర్వాజాను తీర్చిదిద్దారని చెబుతారు. ఈ భావానికి సంబంధించిన అక్షరాలు ఈ దర్వాజాపై కనిపిస్తాయి. ఈ దర్వాజాను రూపొందించేందుకు 12 సంవత్సరాలు పట్టింది. క్రీస్తుపూర్వం 1571 నుంచి 1558 వరకూ మెఘల్ సామ్రాజ్యానికి ఫతేపూర్ సిక్రీ రాజధానిగా ఉండేది. -
ప్రియుడితో పిజ్జాహట్‌కు.. మొదటి భార్యతో కలిసి వీడియో రికార్డింగ్
సాక్షి, హైదరాబాద్(హిమాయత్‌నగర్): విడాకులు తీసుకుని వేరుగా ఉంటున్న భార్యపై మోజు తగ్గలేదు. వెంటపడుతూ వేధిస్తుండటంతో..గతంలో ఒకసారి ఊచలు కూడా లెక్కపెట్టాడు. అయినా బుద్ధిమారలేదు. మరో మారు మాజీ భార్యపై దాడి చేసి జైలు కెళ్లాడు.. చందులాల్ బారాదరికి చెందిన ఎండీ అక్బర్. అందరూ చూస్తుండగా మొదటి భార్యపై దాడికి పాల్పడిన సంఘటన నారాయణగూడ పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. అక్బర్, హబీబా 9ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే హబీబా కంటే ముందే అక్బర్ అనీజ్ ఫాతిమా అనే యువతిని వివాహం చేసుకున్నాడు. కొంతకాలం అక్బర్ హబీబా కలిసి ఉన్నారు. వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు కూడా తీసుకున్నారు. అయితే ఆమెపై మోజు తగ్గక ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ వెంబడించేవాడు అక్బర్. గతంలో రాంగోపాల్‌పేట పీఎస్ పరిధిలో హబీబాపై దాడి చేయగా..రెండు రోజుల పాటు జైలుకు వెళ్లొచ్చాడు. చదవండి: (వైద్యుని ఆత్మహత్య వెనుక హనీట్రాప్.. నగ్నచిత్రాలను పంపి వీడియోకాల్) కొద్దిరోజులుగా ఆ కేసును వాపస్ తీసుకోమని వెంటపడుతున్నాడు. మంగళవారం హబీబా తనకు కాబోయే భర్తతో హిమాయత్‌నగర్‌లోని పిజ్జాహట్‌కు వచ్చింది. అక్కడికి వచ్చిన అక్బర్ తన మొదటి భార్య అనీజా ఫాతిమాతో హబీబా వీడియో తీయించాడు. తన వీడియో ఎందుకు తీస్తున్నారంటూ హబీబా అడగడంతో అందరూ చూస్తుండగా అక్బర్ ఆమెపై దాడి చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అక్బర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు అడ్మిన్ ఎస్సై సంధ్య తెలిపారు. చదవండి: (మిసెస్ ఇండియా తెలంగాణగా ఇందూ అగర్వాల్) -
అక్బర్ మహిళల్ని వేధించేవాడు
జైపూర్: రాజస్తాన్ బీజేపీ చీఫ్ మదన్‌లాల్ సైనీ సరికొత్త వివాదానికి తెరలేపారు. మొఘల్ చక్రవర్తి అక్బర్ మారువేషంలో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించేవాడని ఆయన ఆరోపించారు. మేవార్ రాజు మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా గురువారం జైపూర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..‘అక్బర్ మహిళలు మాత్రమే పనిచేసే మీనా బజార్లను ఏర్పాటు చేశాడని ప్రపంచమంతటికీ తెలుసు. అందులోకి పురుషులకు ప్రవేశం నిషిద్ధం. కానీ అక్బర్ మాత్రం మారువేషంలో మీనాబజార్లలోకి ప్రవేశించి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఈ క్రమంలోనే బికనీర్ రాణి కిరణ్‌దేవిని కూడా వేధించడంతో ఆమె అక్బర్ గుండెలపైకి కత్తి దూసింది. వెంటనే అక్బర్ తన ప్రాణాల కోసం వేడుకున్నాడు. అక్బర్ కంటే మహారాణా ప్రతాప్ చాలా గొప్పవాడు. ఎందుకంటే ఆయన తన మతం, సంస్కృతి, గౌరవం కోసం పోరాడాడు. ఇతరుల భూములను లాక్కోలేదు’ అని వ్యాఖ్యానించారు. కాగా, సైనీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత అర్చనా శర్మ తీవ్రంగా మండిపడ్డారు. సైనీ చేసిన వ్యాఖ్యలు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాణా ప్రతాప్ ధైర్యసాహసాలను దేశమంతా గౌరవిస్తోందనీ, కానీ చరిత్రకు ఇలాంటి తప్పుడు వక్రీకరణల కారణంగా సమాజంలో విద్వేషాలు వేళ్లూనుకుంటాయనీ, అంతిమంగా దేశసమగ్రతకు నష్టం జరుగుతుందని ఆమె హెచ్చరించారు. -
‘అక్బర్ గొప్ప చక్రవర్తేం కాదు’
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘అక్బర్ కంటే మహారాణా ప్రతాప్ చాలా గొప్ప చక్రవర్తి’ అని పేర్కొన్నారు. గురువారం లక్నో ఐఎమ్‌ఆర్‌టీలో నిర్వహించిన ఒక కార్యక్రమానికి యోగి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యోగి మాట్లాడుతూ.. ‘మహారాణా ప్రతాప్ గొప్పవీరుడు, శౌర్యవంతుడు. వేరేమతానికి చెందిన వాడైన విదేశీయుడు అక్బర్ చక్రవర్తిత్వాన్ని ఆయన ఒప్పుకోలేదు. అంతేకాక ఆ విషయాన్ని నేరుగా అక్బర్ రాయబారితోనే చెప్పగలిగాడు. మహారాణా ప్రతాప్ రాజ్యాన్ని కోల్పోయి దేశాలు పట్టుకుతిరిగినా తన ఆత్మగౌరవాన్ని మాత్రం వదులుకోలేదు. అందుకే విదేశియుడైన అక్బర్‌ను చక్రవర్తిగా ఒప్పుకోలేదు. కానీ దురదృష్టం కొద్ది మన చరిత్రకారులు ఇలాంటి అంశాలను పట్టించుకోలేదు. ఫలితంగా ఒక తరం మొత్తం ఇలాంటి గొప్ప విషయాలు తెలుసుకునే అవకాశం కొల్పోయింది. మహారాణా ప్రతాప్ జీవితం నేటి తరానికి ఎంతో ఆదర్శదాయకం. ఆయన జీవితం నుంచి నేటి యువత శౌర్యం, ప్రతాపం వంటి లక్షణాలను అలవర్చుకోవా’లని సూచించారు. ఈ కార్యక్రమంలో యోగి ‘యువశౌర్య’ అనే పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ పుస్తకంలో మహారాణా ప్రతాప్ జీవితం, ధైర్యసాహసాల గురించి వ్యాసాలు, కథలను పొందుపర్చారు. గతంలోనూ... ముస్లీం పాలకుల గురించి నోరు పారేసుకోవడం బీజేపీ నేతలకు ఇదే ప్రథమం కాదు. కొన్ని రోజుల క్రితం బల్లియా సురేంద్ర సింగ్ అనే ఒక బీజేపీ ఎమ్మేల్యే ప్రపంచ వింతల్లో ఒకటైన ‘తాజమహల్’ పేరును ‘రామ్ లేదా క్రిష్ణ మహల్ లేదా రాష్ట్ర భక్తి మహల్’గా మార్చాలన్నారు. బీజేపీ నేతల వ్యాఖ్యల గురించి సమాజ్‌వారి పార్టీ నేత రాజేంద్ర చౌదరి మాట్లాడుతూ.. ‘2019 ఎన్నికల నాటికి సమాజాన్ని మతం ప్రతిపాదికను చీల్చాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. కానీ వారు ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. బీజేపీ, ఆ పార్టీ నేతలు ఎవరు కూడా చరిత్రను మార్చలేరు. అది తెలియకుండా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నార’ని విమర్శించారు. -
400 ఏళ్లకు పూర్వమే ‘బడ్జెట్’ ప్రవేశపెట్టారు
వెబ్ డెస్క్, హైదరాబాద్ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2018-19 ఏడాదికిగాను కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అసలు బడ్జెట్‌ను ఎప్పటి నుంచి ప్రవేశపెడుతున్నారు?. స్వాతంత్ర్యం రాకముందు మనదేశంలో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ ఏదో మీకు తెలుసా?. దాదాపు 400 ఏళ్ల క్రితం(16వ శతాబ్దంలో) బడ్జెట్‌ను తొలిసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ అనే పదం ఫ్రెంచ్ పదమైన ‘బౌగెట్టె’ నుంచి ఉద్భవించింది. అయితే, ఇప్పటిలాగా ఓ సూట్ కేసులో కాకుండా ఓ సంచితో ఆర్థిక శాఖ మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి బడ్జెట్‌ను ప్రకటించేవారు. తొలిసారిగా అక్బర్ చక్రవర్తి నవరత్నాల్లో ఒకరైన రాజా తోడర్మల్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇలా ప్రతి ఏటా బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం అక్బర్ ఆనవాయితీగా నిర్వహించారు. బడ్జెట్ ప్రవేశపెట్టే రోజును రాజ్యంలో పెద్ద ఉత్సవం చేసేవారు. అచ్చూ ఇప్పటిలానే సంవత్సరం వ్యవధిలో ఉండే ఖర్చులు, ఆదాయాలను పద్దులో రాసుకునేవారు. రాజా తోడర్మల్ ఆర్థిక మంత్రిగా పని చేసిన కాలంలో భారీ ఎత్తున భూ సంస్కరణలను ప్రవేశపెట్టారు. ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న వ్యవసాయ రంగంలో మార్పులు తెచ్చేందుకు ప్రయత్నించారు. ప్రస్తుత ఏడాదికి వ్యవసాయంపై పన్నును నిర్ణయించేందుకు గత పదేళ్లలో పంటల ఉత్పత్తి సగటును తీసుకునేవారు. ఒకటింట నాలుగో వంతు పన్ను ఆదాయం వ్యవసాయం ద్వారానే అందేది. అయితే, ఆ కాలంలో పన్నును వసూలు చేయడం పెద్ద సవాలుగా ఉండేది. భూమి ఎక్కువగా ఉన్న రైతులు వద్ద నుంచి ఎక్కువ పన్ను వసూలు చేసేవారు. అక్బర్ వద్ద ఆర్థిక మంత్రిగా పని చేయడానికి కంటే ముందు రాజా తోడర్మల్ మూడో మొగల్ చక్రవర్తి షేర్ షా సూరి వద్ద పని చేశారు. ఈ సమయంలో ఆర్థిక శాస్త్రం, పన్ను తదితర అంశాలపై పట్టు సాధించారాయన. ఆ తర్వాత కాలంలో సొంతగా బడ్జెట్ స్పీచ్‌లను తయారు చేశారు. మొఘల్ రాజ్యంలో అతిపెద్ద రోడ్డు అయిన గ్రాండ్ ట్రంక్ రోడ్డు షేర్ షా సూరి కాలంలో నిర్మితమైంది. మౌలిక వసతుల కల్పన కొరకు షేర్ షా సూరి ప్రజల వద్ద నుంచి పెద్ద ఎత్తున పన్నులు వసూలు చేసేవారు. ఈయన కాలంలోనే తొలిసారిగా టోల్ ట్యాక్స్‌ను ప్రవేశపెట్టారు. రాజా తోడర్మల్ సలహా మేరకే వస్తు మార్పిడి పద్దతి స్థానంలో డబ్బును తీసుకొచ్చారు. ప్రస్తుతం మనం వినియోగిస్తున్న రూపాయి పదం రూపయా నుంచి ఉద్భవించింది. భారత్‌లోకి బ్రిటిష్ ప్రవేశించకముందు మొఘల్ చక్రవర్తుల్లో సూరి నుంచి అక్బర్ వరకూ 40 శాతం నిధులను రక్షణ రంగానికి కేటాయించేవారు. శత్రు దేశాలు తరచూ యుద్ధాలకు దిగడమే ఇందుకు కారణం. 1962లో భారత్-చైనాల మధ్య యుద్ధం జరిగిన సమయంలో రక్షణ శాఖకు కేటాయించిన మొత్తం కేవలం 1.59 శాతం నిధులే. కానీ, తర్వాతి 30 ఏళ్లలో రక్షణ శాఖ బడ్జెట్‌ను మూడు శాతానికి పెంచారు. గత మూడేళ్లుగా రూ. 2.74 లక్షల కోట్లను రక్షణ శాఖకు నిధులుగా కేటాయిస్తువస్తున్నారు. -
సినిమా రైలు.. డ్రైవర్ లేకుండా పరుగులు తీసి!
చంఢీగఢ్ : 20కి పైగా సినిమాల్లో ఉపయోగించిన రైలింజిన్ డ్రైవర్ లేకుండా రెండు కిలోమీటర్ల మేర ప్రయాణించి పట్టాలు తప్పింది. హరియాణాలోని రెవారిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. ఆ స్టీమ్ ఇంజిన్ పేరు అక్బర్. దీని ప్రత్యేకత ఏంటంటే.. సుల్తాన్, బాగ్ మిల్కా బాగ్, రంగ్ దే బసంతి సహా 20కి పైగా బాలీవుడ్ సినిమాల్లో ఈ రైలింజిన్‌ను వినియోగించడం గమనార్హం. ఉన్నతాధికారుల సందర్శనార్థం ఆదివారం అక్బర్‌ను బయటకు తీశారు. ఈ క్రమంలో 65 ఏళ్ల లోకో పైలెట్ (రైలు డ్రైవర్) ఇంజిన్‌ను స్టార్ట్ చేశాడు. బ్రేక్ లెవర్స్ జామ్ అయ్యాయని గుర్తించిన డ్రైవర్ వెంటనే అదనపు డ్రైవర్‌తో కలిసి ఇంజిన్‌నుంచి దూకేశాడని డివిజనల్ రైల్వే మేనేజర్ తెలిపారు. రెండు కిలోమీటర్లు ప్రయాణించిన అనంతరం ఇంజిన్ పట్టాలు తప్పినట్లు గుర్తించామని, త్వరలో మరమ్మతులు చేస్తామన్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టారు. మొఘల్ రాజు అక్బర్ పేరు మీదుగా ఈ స్టీమ్ ఇంజిన్‌కు ఆయన పేరు పెట్టారు. భారత రైల్వేల్లో పురాతన స్టీమ్ రైలింజన్లలో ఒకటైన అక్బర్‌ను చిత్తరంజన్ లోకోమెటీవ్ వర్క్స్ తయారుచేయగా.. 1965 నుంచి సేవల్ని అందిస్తోంది. దూకేశాడు. పట్టాలు తప్పడంతో బాగా దెబ్బతిందని, మరమ్మతులకు బాగా ఖర్చు అవుతుందని అధికారులు వాపోతున్నారు. -
‘అక్బర్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ స్పందించాలి’
హైదరాబాద్: సమాజాన్ని విభజించేలా ఉన్న మజ్లిస్ నేత అక్బరుద్దీన్ వ్యాఖ్యలను తమ పార్టీ ఖండిస్తోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు తెలిపారు. హిందుత్వ శక్తులు ముస్లిం ఐక్యతను దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నాయని అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని కృష్ణసాగర్ డిమాండ్ చేశారు. అక్బర్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ విధానం ఏమిటని ప్రశ్నించారు. పాత నేరస్తుడైన అక్బర్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. హైదరాబాద్ ఎంపీ స్థానం బీజేపీ గెలిచే అవకాశం ఉందనే భయంతోనే అక్బర్ ఇలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. మజ్లిస్ పార్టీ ఓ పరాన్న జీవి అని ఇంతుకుముందు కాంగ్రెస్, ఇప్పుడు టీఆర్ఎస్ మద్దతుతో బతుకుతోందని వ్యాఖ్యానించారు. యూపీలో లాగానే ఇక్కడ కూడా ముస్లింలు బీజేపీకి ఓటు వేస్తారనే భయం ఎంఐఎంను వెంటాడుతుందన్నారు. మతం పేరుతో ఓట్లు అడుగుతున్న మజ్లిస్‌పై వీడియోతో సహా ఎన్నికల కమిషన్‌కు ఆధారాలు ఇస్తామని తెలిపారు. -
విద్యార్థిని దారుణ హత్య: నిందితుడి అరెస్ట్
-
విద్యార్థిని దారుణ హత్య: నిందితుడి అరెస్ట్
రంగారెడ్డి: గండిపేటలోని ఓ ఫాంహౌస్ సమీపంలో దారుణ హత్యకు గురైన యువతి కేసులో 24 గంటల్లోపే పోలీసులు పురోగతి సాధించారు. ఆదివారం హత్యకు గురైన విద్యార్థినిని అమీనాగా గుర్తించారు. ఫలక్‌నుమాలో అమీనా 9వ తరగతి చదువుకుంటోంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అమీనాను బైక్ పై తీసుకువెళ్లిన వ్యక్తిని ఫలక్‌నుమాలో నివాసముంటున్న అక్బర్‌గా గుర్తించారు. (చదవండి: గొంతుకోసి, రాళ్లతో కొట్టి యువతి హత్య) యువతి చేతులు, కాళ్లు కట్టేసి దుండగులు రాళ్లతో కొట్టి చంపిన విషయం తెలిసిందే. డబ్బుకోసమే అమీనాను హత్య చేశానని అక్బర్ పోలీసుల విచారణలో అంగీకరించాడు. మొదటగా డబ్బు కోసమే అమీనాను బెదించానని, డబ్బులు ఇవ్వకపోవడంతో బ్లేడుతో దాడి చేశానని చెప్పాడు. గాయపడ్డ అమీనా తనను ఆస్పత్రికి తీసుకెళ్తే డబ్బులు ఇస్తానందని తెలిపాడు. ఆసుపత్రి తీసుకెళ్తానని చెప్పి..మార్గమధ్యలో హత్య చేసినట్టు అక్బర్ చెప్పాడు. -
అలా అరిచినందుకే.. శిక్షపడింది..!
లండన్ః పాకిస్తాన్ సంతతికి చెందిన ఓ వ్యక్తి ''అల్లాహ్ -ఒ-అక్బర్'', ''బూమ్'' అంటూ విమానంలో అరవడం, ప్రయాణీకులను భయభ్రాంతులకు గురిచేయడంతో అతడికి పది వారాల జైలు శిక్ష పడింది. అతడు వాడిన పదాలు తప్పు కాకపోయినప్పటికీ విమానంలో అలా ప్రవర్తించడాన్ని కోర్టు తప్పుబట్టింది. షెహరాజ్ సర్వార్ అనే వ్యక్తి విమానంలో అల్లకల్లోలం సృష్టించడంతో అతడికి లండన్ కోర్టు ఏడు వారాల జైలు శిక్ష విధించింది. ఫిబ్రవరి నెలలో దుబాయ్ నుంచి బర్మింగ్ హామ్ వెడుతున్న ఎమిరేట్స్ బోయింగ్ 777 విమానంలో ప్రయాణించినప్పుడు అతడు చేసిన హడావుడికి ప్రయాణీకులను హడలి పోయేలా చేసింది. కాసేపు ఏం జరుగుతోందో తెలియక అంతా ఖిన్నులైపోయారు. అల్లాహ్-ఒ-అక్బర్ అంటూ అతి పెద్ద గొంతుతో, భీకరంగా పదే పదే అరుస్తూ ప్రయాణీకుల గుండెల్లో విమానాలు పరిగెత్తిచాడు. చివరికి విమానం ల్యాండ్ అయిన తర్వాత కూడ 'బూమ్' అంటూ గట్టిగా అరిచి అందర్నీ భయపెట్టినట్లు బర్మింగ్ హామ్ క్రౌన్ కోర్టు ప్రాసిక్యూటర్ అలెక్స్ వారెన్ తెలిపారు. క్యాబిన్ సిబ్బంది కూర్చోమని చెప్పినా వినకుండా సదరు వ్యక్తి అరుస్తూనే ఉండటంతో కొందరు ప్రయాణీకులు ఆగ్రహంతో పోలీసులకు ఫిర్యాదు చేశారని, అనంతరం అతడ్ని అరెస్టు చేసినట్లు అలెక్స్ వారెన్ కోర్టుకు తెలిపారు. సర్వార్ హింసాత్మక ప్రవర్తనపై ప్రయాణీకులనుంచి వెల్లువెత్తిన నేరారోపణలను ఆయన కోర్టుకు వివరించారు. ప్రాసిక్యూషన్ వాదనలు విన్న న్యాయమూర్తి ఫ్రాన్సిస్ లయర్డ్ .. విమానంలో 38 ఏళ్ళ సర్వార్ విపరీత ధోరణితో ప్రవర్థించినట్లుగా నిర్ధారించారు. శిక్షించకుండా వదిలేస్తే మరోసారి విమానాల్లో ప్రయాణీకులను భయపెట్టే ఇటువంటి ప్రయత్నాలు జరిగే అవకాశం ఉండటంతో నిందితుడు సర్వార్ కు 10 వారాల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. నిందితుడికి జైలు శిక్ష ముగిసిన తర్వాత 12 నెలల పర్యవేక్షణ ఆర్డర్ తో విడుదల చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. సర్వార్.. పాకిస్తాన్ లోని తన అమ్మమ్మ అంత్యక్రియలకు వెళ్ళి తిరిగి వస్తుండగా ఇటువంటి ఘటన జరిగిందని, అతడు కలత చెంది ఉండటంతోనే ఇలా జరిగి ఉండొచ్చని వాదించిన నిందితుడి తరపు న్యాయవాది బల్బీర్ సింగ్ సైతం తన క్లైంట్ ప్రవర్తన అవివేకంతోనే జరిగిందని ఒప్పుకున్నారు. ప్రయాణీకులను భయపెట్టే విధంగా అల్లాహ్-ఒ-అగ్బర్ అంటూ అరవడం మూర్ఖత్వమే అయినప్పటికీ, దేవుడా నీవు ఎంతో గొప్పవాడవు అంటూ ప్రార్థించడమేనని, అతడి చర్యలు ఇతర ప్రయాణీకులకు ఇబ్బంది కలిగినందుకు క్షమించమంటూ సింగ్ కోర్టుకు విన్నవించారు. -
అమర్-అక్బర్-ఆంటోనీ మళ్లీ పుట్టారు!
అమర్.. అక్బర్.. ఆంటోని.. అన్నదమ్ముల ఆత్మీయ అనుబంధానికి అద్దంపట్టిన వెండితెర దృశ్యరూపం. సినిమా విడుదలై, హిట్టై 39 ఏళ్లు గడిచాయి. ఇప్పుడు ఆ ముగ్గురూ మరో రూపంలో పునర్జన్మ పొందారు. పులి కూనలుగా భూమి మీదకు పాదంమోపి, గురువారం నామకరణ మహోత్సవం జరుపుకొన్నారు. మంగళూరు శివారులోని పిలికులా జాతీయ పార్కు పులలకు ఫేమస్. అక్కడి నేత్రావతి, విక్రమ్ అనే జంటకు మార్చిలో జన్మించిన కూనలే ఈ అమర్, అక్బర్, ఆంటోనీ, నిషాలు. నిధుల కొరతతో సతమతమవుతోన్న పార్క్ నిర్వాహకులు.. పులులను దత్తత తీసుకోవాల్సిందిగా(నిర్వహణా బాధ్యతలు తీసుకోవాల్సిందిగా) చేసిన అభ్యర్థనలకు మంచి స్పందన లభించింది. అబుదాబికి చెందిన మిచెల్ డిసౌజా అనే వ్యక్తి నాలుగు పులి పిల్లల సంరక్షణార్థం ఏడాదికి రూ.5 లక్షల వితరణ ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. దీంతో పులి పిల్లలకు పేరుపెట్టే అవకాశం ఆయనకు లభించింది. బాలీవుడ్ హిట్ సినిమా అమర్- అక్బర్- ఆంటోనీ పేర్లను మూడు మగ పులి పిల్లలలకు, ఆడ పిల్లకేమో నిషా అని పేరు పెట్టాయన. ప్రస్తుతం పిలికులా పార్క్ లో 11 పులులు ఉన్నాయని, సంరక్షణా బాధ్యతలు స్వీకరించాలనుకునేవారు తమను సంప్రదించవచ్చని చెబుతున్నారు జూ డైరెక్టర్ హెచ్ జే భండారి. మీరూ pilikulazoo.com ను దర్శించి, ఏదేని జంతువునో, పక్షినో దత్తత తీసుకుని ఇష్టమైన పేరు పెట్టుకోండిమరి! -
శివాలయం కట్టించిన అక్బర్..!
జైపూర్ః భరత భూమి సర్వ మానవ సమానత్వానికి పెట్టింది పేరు. హిందూ ముస్లిం భాయి భాయి అన్న నానుడి... ఈ పుణ్యభూమిలో అనుచరణలోనే ఉంది. తీవ్రమైన మతాచారాలు, కుల తత్వాలు ఆచరించే రోజుల్లోనే అక్బర్ చక్రవర్తి... మీరాబాయి భజనలు వినడానికి వెళ్లేవాడట. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అన్ని మతాలవారి ఆదరణను పొందారు. తమిళనాడు శ్రీరంగ దేవాలయం, భద్రాద్రి రాముని ఆలయాల్లో సన్నాయి వాయించేది ముస్లింలే. చెప్పుకుంటూ పోతే చరిత్రలో ఎన్నో ఉదాహరణలు. కష్టాల్లో ఉన్నపుడు ఆదుకున్నవాడినే దేముడు అంటాం. అదే జైపూర్ వాసికి అనుభవపూర్వకమైంది. చిన్ననాడు మసీదులో ప్రార్థనలతోపాటు.. సమీప దేవాలయంలోనూ పూజలు చేసిన అక్బర్ ఖాన్.. కష్టాలు తీరడంతో ఆ పరమేశ్వరుని భక్తుడయ్యాడు. ఈ నేపథ్యంలో ఏకంగా దేవాలయ నిర్మాణానికి నడుం కట్టాడు. 'అల్లా కహో యా రామ్.. క్యా ఫరక్ పడ్తాహై' అంటూ అతడు మత సామరస్యాన్ని చాటి చెప్తున్నాడు. తాను విశ్వసించిన సిద్ధాంతాన్ని పాటిస్తున్నాడు జైపూర్ వాసి అక్బర్ ఖాన్. ఆ పరమ శివుడే తన రక్షకుడుగా భావిస్తున్నాడు. అందుకే జైపూర్ లో శివాలయం కట్టించేందుకు పూనుకున్నాడు. మసీదులో ప్రార్థనలతోపాటు చిన్నతనంలో తన స్నేహితులతో అనేక దేవాలయాలను దర్శించిన అక్బర్.. కష్టాల్లో అల్లాకు ప్రార్థనలతోపాటు పూజలు కూడ చేసేవాడు. అదే భక్తితో ప్రస్తుతం 39 ఏళ్ళ అక్బర్ ఖాన్ శివాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. తాను నిర్మించిన ఆలయాన్ని ఏప్రిల్ 30న ప్రజలకు అంకితం చేసే ముందు గణేశ హోమం, యజ్ఞ యాగాదులు నిర్వహించి, కైలాస యాత్ర, భజన కార్యక్రమాలు చేపట్టేందుకు రాజస్థాన్ లోని టాంక్ టౌన్ లో ప్రత్యేక ఆహ్వాన కార్యక్రమాలను కూడ అక్బర్ ఖాన్ ఏర్పాటు చేశాడు. మానసికంగా, శారీరకంగా ఎప్పుడు కష్టం అనిపించినా శివుడ్ని తల్చుకుంటానని, వెంటనే కష్టాలు అదృశ్యమౌతాయని ఖాన్ చెప్తున్నాడు. పరమశివుడ్ని ప్రార్థించిన తర్వాతే తన జీవితంలో ఆనందం వెలుగు చూసిందని వెల్లడించాడు. ఓమ్ విహార్ కాలనీలోని వంద చదరపు మీటర్ల స్థలంలో భూతేశ్వర్ మహాదేవ్ ఆలయం నిర్మించిన ఖాన్...ఆలయంలో పార్వతీ పరమేశ్వరులతోపాటు.. వినాయకుడు, కుమారస్వామి ప్రతిమలను కూడ స్థాపించాడు. నన్ను భక్తుడుగా మార్చుకొని, నా కష్టాలను తీర్చిన పరమేశ్వరుడికి.. చంద్రుడికో నూలు పోగులా ఆలయ నిర్మాణం చేపట్టి... నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని ఖాన్ చెప్తున్నాడు. ఎవరివద్దా ఎటువంటి విరాళాలు, ఆర్థిక సాయం సేకరించకుండానే గుడి నిర్మాణం చేపట్టానని, ఇప్పటి వరకూ ఓమ్ విహార్ కాలనీలో ఆలయం లేకపోవడంతో ఇక్కడ నిర్మించానని చెప్తున్నాడు. అయితే ఆలయ నిర్మాణ విషయంలో సమాజంనుంచీ, స్వంత కమ్యూనిటీ నుంచి కూడ ఎటువంటి అభ్యంతరాలు ఎదుర్కోలేదని అక్బర్ ఖాన్ చెప్తున్నాడు. అల్లా అని పిలిచినా, రామ్ అన్నా ఒక్కటేనని, ఏ మతస్థులైనా ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకోవడం అవసరమన్న స్పష్టమైన సందేశాన్ని ఆలయ నిర్మాణంతో ప్రజలకు ఇవ్వాలనుకున్నానని ఖాన్ తెలిపాడు. ఈ నూతన శివాలయం ఏప్రిల్ 30న ప్రారంభమై భక్తులకు అందుబాటులోకి వస్తుందని అక్బర్ వెల్లడించాడు. -
ఆధిపత్య పోరు..!
మైనార్టీ సంక్షేమ శాఖలోకార్యదర్శి వర్సెస్ డెరైక్టర్ అధికార ఉత్తర ప్రత్యుత్తరాలపై మెమో జారీ చేసిన కార్యదర్శి తీవ్రంగా పరిగణించి ప్రభుత్వానికి సుదీర్ఘ లేఖ రాసిన డెరైక్టర్ ఉపముఖ్యమంత్రి జోక్యం చేసుకున్నా ఆగని వివాదం గాడి తప్పుతున్న మైనార్టీ సంక్షేమం సిటీబ్యూరో: రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమం దేవుడెరుగు గానీ....శాఖ కార్యదర్శి , డెరైక్టర్ల మధ్య ఆధిపత్య పోరు పరిపాలన యంత్రాంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రభుత్వం మైనార్టీ సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలు లక్ష్యానికి చేరుకోగా పోగా, వాటిపై అధికారుల్లో కనీసం జవాబు దారీతనం కరువైంది. కొంత కాలంగా ఇరువురి మధ్య రగులుతున్న అంతర్గత వివాదానికి ఇటీవల ఒక అధికారి సర్వీస్ పొడిగింపు ప్రతిపాదనల వ్యవహారం మరింత ఆజ్యం పోసినట్లయింది. ఈ నేపథ్యంలో మైనార్టీ సంక్షేమ విభాగాలపై డెరైక్టర్ అజమాయిషీ లేకుండా చేసేవిధంగా కార్యదర్శి మెమో జారీ చేయడం సంచలనం సృష్టించింది. దీనిని తీవ్రంగా పరిగణించిన డెరైక్టర్ ప్రభుత్వానికి సుదీర్ఘ లేఖను రాయడం చర్చనీయాంశంగా తయారైంది. సాక్షాత్తు ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ జోక్యం చేసుకున్నా వివాదానికి తెర పడనట్లు తెలుస్తోంది. ప్రచ్ఛన్న యుద్దం.. మైనార్టీ సంక్షేమ శాఖపై ప్రత్యేకంగా మంత్రి ప్రాతినిధ్యం లేక పోవడం ఉన్నత స్థాయి అధికారుల మధ్య ఆధిపత్యం పోరుకు దారి తీసినట్లయింది. గత ఏడాది కాలంగా కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, డెరైక్టర్ ఎంజే అక్బర్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల కార్యదర్శి ‘‘ 2014 అక్టోబర్ 28న లేఖ నంబర్ 1501/2014-2 ద్వారా జారీ అయినా మెమో (మైనార్టీ సంక్షేమ విభాగాల ద్వారా ప్రభుత్వానికి పంపించే ప్రతిపాదనలు, ఉత్తర ప్రత్యుత్తరాల అంశం)’ పై తిరిగి కార్లిఫికేషన్ ఇస్తూ అదే నంబర్‌తో మరో మెమో జారీ చేయడం కలకలం రేపింది. ఈ మెమోలో ‘ మైనార్టీ సంక్షేమ శాఖ డెరైక్టర్ శాఖాపరమైన అధిపతి. డెరైక్టర్ నిధుల పంపిణీ, పాలసీ సంబంధించిన అంశాలకు పరిమితం. తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇండిపెండెంట్ సంస్థ. మైనార్టీ సంక్షేమ శాఖ పరిధిలో పనిచేస్తోంది. ఇతర కార్పొరేషన్ల మాదిరిగా ఇండిపెండెంట్‌గా కార్యకలాపాలు కొనసాగించాలి, అంటూ పేర్కొనడం మైనార్టీ విభాగాలపై డెరైక్టర్ ఆజమాయిషి లేకుండా చేసినట్లయింది. ప్రభుత్వానికి సుదీర్ఘ లేఖ... రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి జారీ చేసిన మెమోపై తీవ్రంగా స్పందించిన డెరైక్టర్ ఒక అడుగు ముందుకువేసి ప్రభుత్వానికి సుదీర్ఘ లేఖ రాశారు. ఈ నెల 9వ తేదిన లేటర్ నెంబర్ సీ /49సీఎండబ్ల్యు/ఎడిఎంఎన్/2016 ద్వారా గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోలు , మెమోలు, ఆదేశాలను కోడ్ చేస్తూ సుమారు ఏడు పేజీల సుద్ఘీ లేఖాస్త్రాన్ని సంధించడం శాఖలో సంచలనం సృష్టించింది. ప్రభుత్వం మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా 2014 అక్టోబర్ 28న జారీ చేసిన మెమోకు కార్లిఫికేషన్గా ఇటీవల జారీ అయినా మెమో భిన్నంగా ఉందని, ఇది పరిపాలన యంత్రాంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొనడం కారద్యర్శిపై ఎదురుదాడికి దిగినట్లయింది. వాస్తవంగా 2014లో మైనార్టీ సంక్షేమ శాఖ సహయ కార్యదర్శి ఒక మెమో జారీ చేస్తూ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్, మైనార్టీ కిస్ట్రియన్(మైనార్టీ) కార్పొరేషన్లు ప్రభుత్వానికి పంపించే ప్రతిపాదనలు,అధికార ఉత్తర ప్రత్యుత్తరాలు డెరైక్టర్ ద్వారా సమర్పించాలని, నేరుగా సంబంధిత శాఖ కార్యదర్శి, ప్రభుత్వానికి పంపవద్దని సూచించిన విషయాన్ని ఆయన లేఖలో ప్రస్తావించారు. అదే విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వం మైనార్టీ కమిషనరేట్ (డెరైక్టరేట్) ఏర్పాటు నేపథ్యంలో జారీ చేసిన జీవో నంబర్ 37,161,130.345 లతో పాటు జారీ అయినా మెమోల్లో గల మైనార్టీ సంక్షే మ శాఖ డెరైక్టరేట్‌కు గల అధికారాలు, విభాగాల ద్వారా అమలయ్యే పథకాలపై పర్యవేక్షణ, తదితర అంశాలను డెరైక్టర్ లేఖలో వివరించారు. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు తర్వాత కూడా జారీ కాబడిన మెమోలోని అంశాలను కోడ్ చేస్తూ... ఇటీవల కార్లిఫికేషన్ ఇచ్చిన మెమోను అనుసరించి తగిన పరిష్కా రం చూపాలని లేఖలో విజ్ఞప్తి చేయడం కార్యదర్శిని సవాల్ చేసినట్లయింది. దీంతో ఇరువురి మధ్య వివాదం మరింత పెరిగినట్లయింది. -
భద్రత గ‘గన్’మే!
సాక్షి, సిటీబ్యూరో: ‘వెపన్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ’... పోలీసు శిక్షణలో... అందులోనూ భద్రత అధికారులుగా విధులు నిర్వర్తించే వారికి పదే పదే చెప్పే అంశమిది. ప్రముఖుల భద్రతకు జారీ చేసే ఆయుధాన్ని శరీరంలో ఓ భాగంగా పరిగణించాలన్నది దీని ఉద్దేశం. ప్రజాప్రతినిధులతో పాటు కీలక వ్యక్తుల వెంట ఉండే గన్‌మెన్ ఈ విషయంలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ఆయుధాన్ని ఇష్టం వచ్చినట్లు ప్రదర్శించడం... ఎక్కడపడితే అక్కడ పెట్టి వెళ్లిపోవడం... సాధారణ వ్యక్తులకు ఇవ్వడం సర్వ సాధారణ విషయంగా మారిపోయింది. మంగళవారం నారాయణగూడ ఠాణా పరిధిలో డ్రైవర్ అక్బర్ ప్రాణాలు తీసిందీ గన్‌మెన్ రవీందర్ నిర్లక్ష్యమే. గన్‌మెన్‌కు ప్రతి నెలా నిర్వహించే రిఫ్రెషర్ కోర్సుల్లోనూ ఇవే అంశాలను పునరుద్ఘాటిస్తున్నా... పట్టించుకునే దాఖలాలే లేవు. గన్‌మెన్ నిర్లక్ష్యాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నా... పట్టించుకునే పరిస్థితి ఉన్నతాధికారులకు లేదు. పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పిలిచే గన్‌మెన్ నిబంధనల ప్రకారం ఆయుధ నిర్వహణలో ఎలా చేయాలంటే... * పోలీసులు, గన్‌మెన్‌కు ఇచ్చే శిక్షణలో వెపన్ హ్యాండ్లింగ్ అనేది ఓ ప్రధానమైన సబ్జెక్ట్. * విధుల్లోకి వచ్చే ముందు వారి కార్యాలయాల్లో ఉండే బెల్ ఆర్మ్స్ నుంచి ఆయుధంతో పాటు తూటాలను తీసుకుంటారు. * ప్రతి పీఎస్ఓ 24 గంటల పాటు విధుల్లో ఉంటే... మరో 24 గంటల పాటు ఆఫ్ తీసుకుంటారు. * ఈ నేపథ్యంలోనే 24 గంటలూ తనకు కేటాయించిన ఆయుధాన్ని కచ్చితంగా శరీర భాగంగానే భావిస్తూ దగ్గర ఉంచుకోవాల్సిందే. * దీన్ని రిలీవర్‌కు లేదా అత్యవసరమైతే ఆయా ప్రాంతాల్లో ఉండే గార్డ్స్‌కు మాత్రమే ఇచ్చి, మళ్లీ తీసుకోవాలి. * మిషన్ గన్లు, ఏకేలు, కార్బైన్లు మినహా సార్ట్ వెపన్స్‌గా పిలిచే రివాల్వర్, పిస్టల్‌ను గన్‌మెన్ బయటకు కనిపించే విధంగా ధరించకూడదు. * దాన్ని కచ్చితంగా సేఫ్టీ మోడ్‌లో పౌచ్‌లో పెట్టి దుస్తులకు లోపలి భాగంలోనే భద్రపరుచుకోవాలి. * విధుల్లో ఉండి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలోనూ ఆయుధాన్ని శరీరం నుంచి తీసి విడిగా ఎక్కడా పెట్టకూడదు. * ఆయుధాన్ని ఎవరికైనా (అధికారిక వ్యక్తులు) ఇచ్చేటప్పుడు, బెల్ ఆఫ్ ఆర్మ్‌లో డిపాజిట్ చేసేప్పుడు కచ్చితంగా తూటాలు ఉండే మ్యాగజైన్‌ను బయటకు తీయాలి. * చాంబర్లోకి తూటా లోడ్ అయిందో లేదో పరిశీలించడానికి ఒకటి, రెండుసార్లు పైన ఉండే స్లైడర్‌ను కాగ్ చేయాలి. * ఇలా చేస్తే చాంబర్లోడ్లో తూటా ఉంటే ఇంజెక్షన్ పోర్ట్ నుంచి బయటకు పడిపోతుంది. * కాగ్ చేసిన తర్వాత కూడా నేల వైపు గురిపెట్టి రెండు మూడుసార్లు ట్రిగ్గర్ను నొక్కినతర్వాతే ఎదుటి వారికి అప్పగించాలి. * ఆయుధాన్ని ఎదుటి వ్యక్తులకు (అధికారిక) ఇస్తున్నప్పుడు కచ్చితంగా తూటా బయటకు వచ్చే బ్యారెల్ భాగం తన వైపే ఉండేలా చూడాలి. ఏం జరిగిందంటే..? 1. పీఎస్ఓ రవీందర్ వద్ద ఉన్న పిస్టల్‌ను వెంకట్ పరిశీలిస్తున్న క్రమంలో సేఫ్టీ లివర్ రిలీజ్ కావడంతో పాటు మ్యాగజైన్లో ఉండే తూటాల్లో ఒకటి చాంబర్లోకి వెళ్లిపోయింది. పిస్టల్ మ్యాగజైన్ కెపాసిటీ 12 రౌండ్లు (తూటాలు) కాగా... స్ప్రింగ్ మూవ్మెంట్ కోసం 10 లేదా 11 మాత్రమే పెడుతుంటారు. 2. ఈ ఆయుధాన్ని తీసుకున్న అక్బర్ పిస్టల్ పైభాగంలో ఉండే స్లైడర్‌ను లాగడానికి యత్నించాడు. 3. దీంతో కంగారుపడిన రవీందర్ ఆయుధాన్ని తన చేతుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. పిస్టల్ రవీందర్ చేతుల్లోకి వస్తుండగానే.. అతడి వేలు పొరపాటున ట్రిగ్గర్‌పై పడింది. 4. ఈ పరిణామంతో తుపాకీ వెనుక ఉండే హ్యామర్ ఫైరింగ్ పిన్ను ప్రేరేపించడంతో తూటా పేలి బ్యారెల్ నుంచి దూసుకుపోయింది. 5. అక్బర్ ఛాతీలోకి దూసుకుపోయిన తూటా వీపు భాగం నుంచి బయటకు వచ్చి... గోడను తాకి కింద పడింది. * ఆయుధం.. శరీరంలో భాగం * శిక్షణలో పదే పదే చెప్పే అంశమిది * అయినా నిత్యం గన్‌మెన్ నిర్లక్ష్యం * పట్టించుకోని అధికారులు సంఘటన స్థలంలో దృశ్యమిదీ.. 1. గోడను బుల్లెట్ తాకిన ప్రాంతం 2. పేలిన పిస్టల్ 3. అక్బర్‌కు గాయమైన ప్రాంతం 4. పిస్టల్ పేలిన సందర్భంలో రవీందర్ కూర్చున్న ప్రాంతం -
ఏసీబీ వలలో చిప్పగిరి ఎమ్మార్వో
కర్నూలు : ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ ఎమ్మార్వో అక్బర్ ఏసీబీ అధికారులకు రెడ్ హాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ ఘటన కర్నూలులో మంగళవారం చోటు చేసుకుంది. జిల్లాలోని చిప్పగిరి ఎమ్మార్వోగా అక్బర్ విధులు నిర్వహిస్తున్నారు. అయితే తనకు రావాల్సిన బకాయిలు ఇప్పించ వలసిందిగా వ్యక్తి ... ఎమ్మార్వోను ఆశ్రయించారు. అందుకు సదరు వ్యక్తిని అక్బర్ రూ. 7 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దాంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు వల పన్ని ఎమ్మార్వోను అరెస్ట్ చేశారు. -
కుక్కని చంపాడని వ్యక్తిపై కేసు నమోదు
-
అక్బర్ చరిత్ర కారుడే.. కానీ
ప్రతాప్ నగర్: మొఘల్ సామ్రాజ్యాన్ని పాలించిన అక్బర్ కంటే మహరాణా ప్రతాప్ గొప్పవ్యక్తి అని హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. అయితే చరిత్ర కారులు మాత్రం అక్బర్ ను మహోన్నత వ్యక్తిగా చిత్రీకరించడాన్ని మాత్రం తాను ఏమీ తప్పుబట్టడం లేదన్నారు. కాగా, అక్బర్ కంటే రాణా ప్రతాప్ గొప్ప వ్యక్తి అని తన వ్యక్తిగత అభిప్రాయంగా పేర్కొన్నారు. ఆదివారం రాజస్థాన్ లోని ప్రతాప్ ఘర్ లో రాణా ప్రతాప్ విగ్రహావిష్కరణలో్ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్ నాథ్ పై విధంగా స్పందించారు. హల్దీ ఘాట్ యుద్ధంలో అక్బర్ చేతిలో మేవర్ చక్రవర్తి రాణా ప్రతాప్ ఓటమి పాలైన సంగతి ఈ సందర్భంగా గుర్తు చేశారు. అక్బర్-రాణాల చరిత్ర సరి చేయాలని రాజ్ నాథ్ పేర్కొన్నారు. రాణా ప్రతాప్ ప్రజల్లో అపారమైన ఘోరవాన్ని సంపాదించుకోవడమే కాకుండా.. ఉన్నతమైన వ్యక్తిగా నిలిచిపోయాడన్నారు. తదుపరి తరాలకు మహరాణా ప్రతాప్ జీవితం ఆదర్శం కావాలని రాజ్ నాథ్ తెలిపారు. -
సాధికారత వల్లే బంగారు భవిత
సమాజాన్ని చీల్చే శక్తులు పదే పదే ఓడిపోతున్నాయి. అయినా ఆ శక్తుల కుట్రలు ఆగలేదు. చిన్న పగులునైనా పెను అగాధంగా మార్చడానికి అలాంటి వారు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. స్వీయ సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే దళారులకు, కపట రాజకీయవేత్తలకు కాలం చెల్లింది. అవకాశాలను అందిపుచ్చుకోవడానికి, నిండైన విశ్వాసంతో ముందడుగేయడానికి యువత కదులుతున్నది. వారికి తిరుగులేని సాధికారత కల్పిస్తే ఈ దేశానికి బంగారు భవితవ్యం సాధ్యమవుతుంది. అనుభవమే మన గురువైనప్పుడు జ్ఞానం బహు రూపాల్లో లభిస్తుంది. చాన్నాళ్లక్రితం ఓ పాలకుడిని కలుసుకున్న ప్రతినిధి బృందంలో నేనూ ఒక సభ్యుణ్ణి. మైనారిటీల్లో విద్య విస్తృతి, నాణ్యత, గాఢత ఏమేరకు ఉన్నాయో తెలుసుకోవడమే మా ఏక సూత్ర ఎజెండా. ముఖ్యంగా ముస్లిం బాలికల కోసం ఇంకేమి చేయవచ్చునో తెలుసుకోవడం మా ఉద్దేశం. ఓ సత్కార్యం కోసం ఉత్తములందరూ కలిశారు. ప్రతినిధి బృం దంలో సంపాదకులు, విద్యావేత్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అప్పుడప్పుడు సామాజిక సేవలందించేవారూ ఉన్నారు. పాలకుడి కార్యాలయానికి చేర్చి ఉన్న ఓ గదిలో అందరం కూర్చున్నాం. అందరి మొహాలూ పరమానందంగా వెలిగిపోతున్నాయి. తప్పనిసరి నిరీక్షణ తర్వాత గంభీర వదనాలతో ఒకరి వెనక ఒకరం ఆయన గదిలోకి ప్రవేశించాం. ఆ గౌరవనీయ నేత సమక్షంలో అందరూ అర్ధంలేని నవ్వులు చిందించడం పూర్తయ్యాక ఒకాయన గొంతు సవరించుకుని ఏదో చెప్పారు. ఒక వినతి పత్రం ఇచ్చారు. ఆయన దాన్ని సావధానంగా చదివారు. మా సమష్టి జ్ఞానం ఆయన సైద్ధాంతిక పరిధిని విస్తృతపరిచిన జాడ కనబడింది. అంగీకార సూచకంగా ఆయన తలపంకించారు. అంతే...ఒక్కసారిగా గందరగోళం. ప్రతినిధి బృందంలోని వారంతా ఎవరికి తోచినట్టు వారు మాట్లాడటం మొదలెట్టారు. నిర్ఘాంతపోవడం నావంతైంది. అందరూ సిగ్గువిడిచి ఎవరికి కావలసినవి వారు అడగటం ప్రారంభించారు. ఓ చిన్న పత్రికకు సంపాదకుడిగా ఉన్నాయనకు మరిన్ని వాణిజ్య ప్రకటనలు కావాలి. ఖాళీ అయిన ఒక సంస్థకు అధిపతి కావడం మరొకాయన కోరిక. అంత వ్యామోహంతో, అంత శ్రద్ధతో తమ తమ దురాశలను వారు వ్యక్తంచేసిన తీరు వ్యాపార శాస్త్రంలో ఒక అధ్యాయం అవుతుందనడంలో ఆశ్చర్యం లేదు. ఇందులో కొందరి కోరికలు నెరవేరాయని అనంతరకాలంలో నాకు తెలిసింది. ఇక మైనారిటీల విద్య సంగతంటరా...అందులో పెద్ద మార్పేం రాలేదు. అది మెరుగుపడకపోయినా...మరింత క్షీణించనందుకు మనం సంతృప్తిపడి ఊరుకోవాలి. ఈ నేపథ్యంలో కొందరు ముస్లిం మత పెద్దల బృందం ప్రధాని నరేంద్ర మోదీని ఓ వారం క్రితం కలిసి సంప్రదాయానికి భిన్నమైన సమస్యల గురించి ప్రస్తావించారని తెలుసుకోవడం ఆసక్తి కలిగిస్తుంది. డబ్బు దన్నుతో కొన్నేళ్లనుంచి పుంజుకుంటూ, ఇటీవలి సంవత్సరాల్లో చురుగ్గా కదులుతున్న వహాబీ ఉద్యమం మన ముస్లింలపై చూపుతున్న ప్రభావం గురించి, వారికి చెందిన సంస్థల నియంత్రణ గురించి మాట్లాడటానికి ఆ బృందం సభ్యులు వెళ్లారు. అయితే, మన దేశంలో మత సామరస్యానికి అసాధారణమైన శక్తి ఉంది. ఆ శక్తి మత బోధనల్లో ఉంది. మన స్వాతంత్య్రోద్యమ మూలాల్లో ఈ సమ్మిళిత సందేశం ఉంది. స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ, మౌలానా ఆజాద్ వంటి మత, సామాజిక దార్శనికుల ప్రసంగాల్లో ఉంది. పటిష్టమైన, సమైక్య భారత నిర్మాణమే ఇతరేతర పాక్షిక ప్రయోజనాలకన్నా వారికి అత్యంత ముఖ్యమైనది. బ్రిటిష్ వారు మూర్ఖులేమీ కాదు గనుక సమైక్య భారత శక్తి ముందు తమ పాలన నిలబడటం కష్టమని గ్రహించారు. అందువల్లే అన్ని మతాల్లోనూ సామరస్యాన్నికాక చీలికలను ప్రోత్సహించే సంస్థలకు దన్నుగా నిలిచారు. పాకిస్థాన్ భావన ఉనికిలోనికి రావడానికి చాలా ముందే చీలిక రాజకీయాలను పెంచి పోషించారు. ఇందుకు 1905 నాటి బెంగాల్ విభజన ఒక్కటే కాదు...చాలా ఉదాహరణలున్నాయి. అయితే ఈ దేశ పౌరులు ఇతర మతాలవారితో సహజీవనానికే మొగ్గుచూపారు. చీలికవాదులు మాత్రం తమ ఓటమిని అంగీకరించలేదు. జనబాహు ళ్యంలో, రాజకీయ చట్రంలో మాటువేశారు. చిన్న పగులు కనబడినా దాన్ని అగాధంగా మార్చడానికి వేచిచూస్తున్నారు. దేశంలోని హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవమతాలవారందరికీ ఇది మౌలికమైన సవాలు. విధానపరమైన అంశాల్లో వినియోగించే ‘సామాజిక-ఆర్థిక’ అనే పదబంధం ఉపఖండంలో అదనపు అర్థాన్ని సంతరించుకుంది. వివిధ వర్గాల ప్రజలు విద్యకు దూరంకావడానికి... అసమానత, అగౌరవం, భయానక పేదరికం కోరల్లో వారు చిక్కుకోవడానికి సంస్కృతి, విశ్వాసం కూడా దోహదపడటమే ఇందుకు కారణం. మూలాల్లో సమస్య ఉన్నప్పుడు పరిష్కారాలూ అక్కడే లబిస్తాయి. మైనారిటీల సమస్యలను దళారులకు విడిచిపెట్టడం స్వాతంత్య్రా నంతరం ఈ ఆరున్నర దశాబ్దాలుగా సాగుతూ వస్తోంది. ఫలితంగా ఆ వర్గాలవారుగాక దళారులే ఎక్కువగా బాగుపడ్డారు. రాజకీయ రంగం నిండా అలాంటివారే కనిపిస్తారు. ఈ కపట రాజకీయ నేతల ఆసక్తి అంతా స్వీయ సంక్షేమమే గనుక...వీరంతా వేర్పాటువాదాన్ని ప్రవచించే వారితోనే చేతులు కలుపుతారు. ఈ పాత రాజకీయాలకు కొత్తగా ఒక బద్ధ శత్రువు బయల్దేరింది. ఈ ఇరవైయ్యొకటో శతాబ్దంలోని యువత తమ పెద్దలకు లభించని లేదా వారికి నిగూఢంగా మిగిలిపోయిన ఒక అంశాన్ని పోల్చుకోగలిగారు. పరస్పరం పంచుకునే, సమానావకాశాలు లభించే చలనశీలమైన భారత్‌లో ఆర్థిక అభివృద్ధికి ఆస్కారమున్నదని గుర్తించారు. మన యువతకు అవకాశాన్ని, భరోసాను, విద్యను కల్పిస్తే... తిరుగులేని సాధికారతను కల్పిస్తే...ఉపాధి అవకాశాలు దండిగా లభించే, విస్తరించే ఆర్థిక వ్యవస్థ సాధ్యమవుతుంది. దశాబ్దాల క్రితం వాగ్దానం చేసినా మనకు అందకుండా పోతున్న భవితవ్యం మనదవుతుంది. ఎం.జె. అక్బర్ సీనియర్ సంపాదకులు -
సరూర్‌నగర్‌లో చైన్‌స్నాచింగ్
సరూర్‌నగర్ : గుర్తుతెలియని దుండగులు బైక్‌పై వెళ్తున్న మహిళ మెడలోంచి గొలుసు లాక్కొని ఉడాయించారు. ఈ సంఘటన ఆదివారం హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జీబీ కాలనీలో జరిగింది. వివరాలు.. కాలనీకి చెందిన అక్బర్ అనే వ్యక్తి భార్య ఫాతిమా(30) శనివారం సాయంత్రం తన ఇద్దరు పిల్లలను బచ్పన్ స్కూల్ నుంచి బైక్‌పై తీసుకొని వస్తుంది. సరిగా ఇదే సమయంలో ఆమెను అనుసరిస్తున్న ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి ఆమె మెడలో ఉన్న గొలుసు లాక్కొని వెళ్లారు. నిందితులు నేరుగా జాతీయరహాదారి - 65 పై పరారయ్యారని బాధితురాలు తెలిపారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కాగా, నిందితులు వేసుకున్న టీషర్ట్ మాత్రమే తను గుర్తించినట్లుగా బాధితురాలు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
పర్షియన్ మహాభారతం
జాతస్య హి ద్రువో మృత్యుః పూర్తి కాకుండానే అది మహాభారతంలోని భగవద్గీత శ్లోకమని ఠక్కున చెప్పేస్తాం. మన ఇతిహాసాలు సగటు భారతీయుడిపై అంతగా ముద్ర వేశాయంటే అతిశయోక్తి కాదు. అయితే ‘పర్షియన్ మహాభారతం’ గురించి ఎప్పుడైనా విన్నారా? పర్షియాలో మహాభారతమేంటని అనుమానపోకండి. సంస్కృతంలో వేదవ్యాసుడు రాసిన ఈ మహాగ్రంథాన్ని 400 ఏళ్ల కిందట అక్బర్ సంస్థానంలోని ‘నవరత్నా’ల్లో ఒకరైన అబుల్ ఫజిల్ పర్షియన్లోకి కూడా అనువాదం చేశారు. ఆ గ్రంథం ఇప్పటికీ చెక్కు చెదరకుండా జామియా నిజామియా గ్రంథాలయంలో భద్రంగా ఉంది. ..:: ఎస్.శ్రావణ్‌జయ భాగ్యనగర దర్పానికి చిహ్నంగా నిలిచే చార్మినార్కి మూడు కిలోమీటర్ల దూరంలోని శిబ్లి గంజ్‌లో పురాతన జామియా నిజామియా లైబ్రరీ ఉంది. 144 ఏళ్ల కిందట జామియా మహమ్మద్ అల్ ఫరూకీ 1874లో దీన్ని ఏర్పాటు చేశారు. తొలుత 25 వేల పుస్తకాలతో ప్రారంభం కాగా, ప్రస్తుతం లక్ష పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. పర్షియన్‌తో పాటు ఇక్కడ ఉర్దు, అరబిక్, హిందీ, ఇంగ్లిష్ భాషల్లోని పుస్తకాలను భద్రపరిచారు. అలాగే కొన్ని తెలుగు పుస్తకాలు కూడా ఉంచారు. నిజాం నవాబు వంశంలో 6, 7తరాలకు చెందినవారు కూడా ఇక్కడే చదువుకున్నారు. బంగారు రేకులతో... జామియా లైబ్రరీలో మహాభారతంతో పాటు దాదాపు 3000 రాత ప్రతులున్నాయి. ‘మను చరిత్రకు సంబంధించి మా వద్ద ఉన్న గ్రంథాలు 200 ఏళ్లకు పూర్వం రచించినవే. అత్యంత పురాతన మను చరిత్ర గ్రంథాన్ని 700 ఏళ్లకు పూర్వమే కితాబ్ ఉల్ తబ్సేరా ఫిల్ ఆషరా రచించారు. మా లైబ్రరీలో మొత్తం 40 సబ్జెక్టులకు సంబంధించిన పుస్తకాలు 5 భాషల్లో దొరుకుతాయి’ అని లైబ్రేరియన్ షా మహమ్మద్ ఫసీదుద్దీన్ నిజామియా చెప్పారు. ఇక్కడ అత్యంత పురాతనమైన ఖురాన్ గ్రంథం కూడా ఉంది. ఇందులోని మొదటి రెండు పేజీలు బంగారు రేకులతో రూపొందించారు. విద్యాదాయిని... జామియా నిజామియా ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇన్స్టిట్యూట్లో ప్రస్తుతం 1200 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి తిండి, బట్ట, వైద్యం అన్నీ ట్రస్ట్ భరిస్తుంది. దీనికి ప్రభుత్వ సాయం లేదు. కేవలం విరాళాలతోనే ఈ ట్రస్ట్ నడుస్తోంది. బర్మా, శ్రీలంక, యెమెన్, సౌదీ అరేబియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్ నుంచి కూడా విద్యార్థులు పీహెచ్డీ చేసేందుకు ఇక్కడికి వస్తుంటారు. వారిలో కొందరికి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు కూడా లభించాయి. మార్చి 21, 22తేదీల్లోలైబ్రరీ వ్యవస్థాపకుడు జామియా మహమ్మద్ అల్ ఫరూకీ 100వ వ ర్ధంతి ఘనంగా నిర్వహించనున్నారు. పరమత దూషణ, పరమత హింస అక్కడక్కడా జరుగుతున్న ఈ కాలంలో పరభాష నుంచి అనువదించిన గ్రంథాలను వందల ఏళ్ల నుంచి జాగ్రత్తగా కాపాడటం అరుదైన విషయం! -
బాగ్‌నగర్- సిటీ ఆఫ్ గార్డెన్స్
ఇబ్రహీం కాలంలో (1556) విజయనగరం పతనమైంది. హంపిలో కొల్లగొట్టిన అపారమైన సంపద గోల్కొండ చేరింది. ఇబ్రహీం చివరిరోజుల నుంచి అతని వారసుడు మహమ్మద్ కులీ పరిపాలనా కాలం వరకూ గోల్కొండ చరిత్రలో స్వర్ణయుగం అని చరిత్రకారులు భావిస్తారు. అహ్మద్‌నగర్ పతనం, అక్బర్ చక్రవర్తితో సంధి, బీజాపూర్ సుల్తాన్‌తో స్నేహ సంబంధాలు ఆనాటి తెలంగాణలో శాంతి సౌఖ్యాలు నెలకొల్పాయి. నిర్మాణాలు ఊపందుకున్నాయి. విస్తరించిన గోల్కొండ చుట్టూ మరో కోటగోడ నిర్మాణమైంది (ఖుతుబ్షాహీ సమాధుల వద్ద నయాఖిల్లా అదే). మూసీనదికి దక్షిణాన మరో మహానగరానికి పునాదులు పడ్డాయి. నేటి పురానాపూల్ నుంచి లాడ్ బజార్‌కి సమానాంతరంగా కారవాన్ రాస్తాకి రెండువైపులా విస్తారమైన తోటలు, మహళ్ళతో కొత్త లేఔట్ వేయబడింది. దాన్నే ‘సిటీ ఆఫ్ గార్డెన్స్- బాగ్‌నగర్’ అన్నారు. నాలుగు మినార్లతో ఖుతుబ్షాహి ప్రతిష్టని ఇనుమడించేలా చార్మినార్ నిర్మించబడింది. 20 వేల మంది వడ్డె, ఉప్పర కార్మికులతో మక్కామిసీద్ నిర్మాణం ప్రారంభమైంది. ఈ కాలంలోనే మధ్య ఆసియాకి చెందిన ముస్లింలు అనేకమంది ఇండియాకి వలసవచ్చారు. వారిని ‘అఫాకీలు’ అనేవారు. సుల్తాన్లు సైన్యంలో, అధికార యంత్రాంగంలో అటువంటివారి మీదే ఎక్కువగా ఆధారపడ్డట్లు కనిపిస్తుంది. అయితే ప్రజ్ఞ ఉన్న హిందువులకి పదవులు ఇవ్వలేదనటానికి వీలులేదు. అక్కన, మాదనల వంటి అనేకులు పెద్దపెద్ద పదవులు చేపట్టారు. రాజకీయాలని నిర్దేశించారు. అలా వచ్చిన ముస్లిం బృందాలు ఎలా జనస్రవంతిలో కలిసిపోయాయో చెప్పేందుకు వేమన రాశాడని చెబుతున్న ఒక పద్యం ఉంది. షేకు సైదు మొగలలు చెలగి పఠానులు తురుకులు దొరతనము తొలుత చేసి రాగరాగ విడిచి రౌతులై కొలిచిరి విశ్వదాభిరామ వినుర వేమా! కుతుబ్ షాహీ సుల్తానులు తెలుగు భాషని కూడా ఆదరించారు. ఇబ్రహీం కులీ ఆస్థానాన్ని వేదపురాణశాస్త్ర విద్వాంసులు అలంకరించినట్లు అద్దంకి గంగాధరుడు తన ‘తపతీ సంవరణోపాఖ్యానం’ అనే గ్రంథంలో చెప్పాడు. ఇబ్రహీం కులీని ‘మల్కిభరాముడ’ని ప్రస్తుతించే అనేక చాటువులు దొరికాయి. గోల్కొండలో మజ్లీస్ దివాన్‌దారీ అనే పరిషత్తులో తెలుగు పండితులకి కూడా చోటు ఉండేది. నాటి తెలంగాణ రాజ్యం ఇప్పటి కోస్తాంధ్రలో పూర్తిగా విస్తరించింది. తూర్పు ఆసియా దీవులు కేంద్రంగా డచ్చి, ఇంగ్లిష్ వర్తకులు పోర్చుగీసులో వాణిజ్యానికి పోటీ వచ్చారు. మచిలీపట్నం, పెద్దపల్లి (నిజాంపట్నం), నరసాపురం, భీమ్లీ తెలంగాణకి ముఖ్య రేవు పట్టణాలుగా అభివృద్ధ్ది చెందాయి. మహమ్మద్ షా ఇచ్చిన ఫర్మానాతో డచ్చివారు కోస్తాలో అనేక కలంకారీ, లేస్, తుపాకీ మందు కర్మాగారాలు స్థాపించారు. ఇండెంచర్ నమూనాతో కార్మికులని గ్రామాలలో కొనుగోలు చేసి పగలూ రాత్రీ బలవంతంగా పనిచేయించి, ఎగుమతులలో విపరీతమైన లాభాలు గడించారు. గోల్కొండ నుంచి మచిలీపట్నం, విశాఖపట్నం, అహ్మద్‌నగర్, బీదర్, బీజాపూర్, పెనుగొండలకి వెళ్ళే మార్గాలు విస్తరించబడ్డాయి. ఈ దండుబాటలలో రక్షణ వ్యవస్థ పటిష్టం చేయబడింది. ఒక ముసలవ్వ బంగారం నిండిన పెట్టెతో ఒంటరిగా గోల్కొండ నుండి మచిలీపట్నం సురక్షితంగా ప్రయాణించ గలిగేదని ఫరిష్తా చెప్పాడు. చేతిలో ఈటె, కాళ్ళకు గజ్జెలతో ఒక్కొక్కరూ 400 మీటర్లు మాత్రమే వేగంగా పరుగెత్తే టపాబంట్ల రిలే వ్యవస్థ ద్వారా గోల్కొండ నుండి రాజమండ్రికి ఉత్తరాలు ఒక్కరోజులో చేరేవి. అందుకనే ప్రజలు వాడుక భాషలో ‘గోల్కొండ టపా’ అనే పదాన్ని అర్జంటు అనే అర్థం వచ్చేట్లు ఉపయోగించారు. -
ఆ ప్రధాని ప్రజల మహారాజు
ఆదేశాల్లో పదనిసలు.. వరుసలో ఇమడని ఒక పత్రం ఉంది! తన ప్రధానమంత్రి కిషన్ ప్రసాద్ చేసిన వ్యక్తిగత ‘రుణాన్ని మాఫీ’ చేస్తూ నిజాం సంతకం చేశాడు. ఈ వైనం వచ్చేవారం ముచ్చటించుకుందాం. అంతకు ముందుగా, కిషన్ ప్రసాద్ బహదూర్‌ను స్మరించుకుందాం! ప్రజల మహారాజుగా ఆయన కీర్తి పొందారు. నిజాం నవాబులూ అందుకు అసూయ చెందలేదు. కిషన్ ప్రసాద్ (1864 జనవరి 1-1940 మే 13) మరికొంతకాలం జీవించి ఉంటే ఉపఖండం చరిత్ర మరోలా ఉండేది! కిషన్ ప్రసాద్ బహదూర్ పూర్వీకులు అక్బర్ చక్రవర్తికి ఆర్థిక మంత్రిగా పనిచేసిన తోడర్ మల్ వారసులు! కిషన్ ప్రసాద్ హైద్రాబాద్ స్టేట్‌లోనే జన్మించారు. ఆయన తాతగారు చందూలాల్ హైదరాబాద్ స్టేట్ ప్రధానమంత్రిగా పనిచేశారు. మొదటి సాలార్జంగ్తో, ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్‌తో కిషన్ కలసి మెలసి పెరిగాడు. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ నూనూగు మీసాల వయసులోనే రసికుడు! విచ్చలవిడి స్త్రీ సాంగత్యం మంచిది కాదని బ్రిటిష్ రెసిడెంట్ ఒత్తిడి చేయడంతో మహబూబ్ అలీ ఖాన్‌ను పురానీ హవేలీకి మార్చారు. వారానికి ఒక పర్యాయం మాత్రమే యువతులను కలిసే షరతుతో! క్రమం తప్పని నెలసరి.. కిషన్ ప్రసాద్ స్వయంగా కవి. షాద్ (సంతుష్టుడు) అనే కలం పేరుతో కవితలు రాశారు. సంస్కృతం, పర్షియన్,అరబిక్,ఉర్దూ, గురుముఖి, ఇంగ్లిష్ భాషలలో పండితుడు. ప్రథమ భారత స్వాతంత్య్రోద్యమం (సిపాయిల తిరుగుబాటు) నేపథ్యంలో ఉత్తరాది అల్లకల్లోలం అయ్యింది. ప్రఖ్యాత ఉర్దూ కవి ఫానీ బదయూని ఇబ్బందుల్లో ఉన్నాడని తెలుసుకుని అవధ్ ప్రాంతం నుంచి ‘షాద్’ పిలిపించారు. ఇక్కడ అధ్యాపకునిగా ఉద్యోగం ఇప్పించారు. కిషన్ ప్రసాద్ నివాసం నిత్యం ముషాయిరాల (కవితా గోష్టుల)తో కళకళలాడేది. నిజాంలు తాము రాసిన కవితలను కిషన్ ప్రసాద్ ముషాయిరాల్లో మాత్రమే చదివేందుకు పంపేవారు. అలా వచ్చిన కవితలను సగౌరవంగా నుదుటికి తాకించుకుని కవితాహరులతో చదివించేవారు. అబిద్ అలీ అనే కవి ‘బేగమ్’ అనే కలం పేరుతో గజల్స్ రాసేవాడు. స్త్రీ వేషధారణతో వచ్చి చదివేవాడు. ముషాయిరాల్లో హాస్యం ఉండొద్దా? అతడికి అఫ్కోర్స్ బేగమ్‌కు కిషన్ ప్రసాద్ నెలసరి ప్రోత్సాహకాన్ని మంజూరు చేశారు. ఆ నేపథ్యంలో ‘మహారాజా ధన్యవాదాలు! నాకు ‘నెలసరి’ క్రమం తప్పకుండా వస్తోంది’ అని బేగమ్ చమత్కరించాడు! రెండోసారి.. ఆరో నిజాం హయాంలో ప్రధానమంత్రి పదవిని చేపట్టిన కిషన్ ప్రసాద్ ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్చే ఉద్వాసనకు గురైనారు. తన నియామకానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వైస్రాయ్కి ఫిర్యాదు చేసిన వారిలో కిషన్ ప్రసాద్ ఒకరనే అపోహతో! అలా తనకు లభించిన విరామంతో కిషన్ ప్రసాద్ దేశాటన చేశారు. పెయింటింగ్ నేర్చుకున్నారు. పియానో నేర్చుకున్నారు. వంటలు కూడా. లాహోర్ పర్యటనలో ప్రముఖ కవి ఇక్బాల్‌తో స్నేహం చేశారు. కిషన్ ప్రసాద్ విధేయతను శంకించడం తప్పని ఆయన సంతకాన్ని ఇతరులు ఫోర్జరీ చేశారని నిజాం నవాబుకు తర్వాత తెలిసింది. 1927లో రెండోసారి ప్రధానమంత్రిగా ఆహ్వానించారు. 9 ఏళ్లు ఆ బాధ్యతలు నిర్వర్తించాడు. యమీన్-ఉల్- సుల్తానత్ (ప్రభువు కుడి భుజం) అనే బిరుదును సార్థకం చేసుకున్నాడు. ‘అద్వితీయ’ వారసత్వం! కిషన్ ప్రసాద్ ఏడుగురిని వివాహమాడాడు. ముగ్గురు హిందూ భార్యలు. నలుగురు ముస్లిం భార్యలు. 30 మంది సంతానం. తల్లుల మతానికి చెందిన పేర్లు పిల్లలకు పెట్టారు. వారి వారి మతరీతులతో పద్ధతులతో పెంచారు. ఆయా మతాల వారికే ఇచ్చి వివాహం చేశారు. తన విల్లులో తన వారసులు ఏక పత్నీ-పతీ వ్రతం పాటించాల్సిందిగా సూచించారు. ఇతరుల మతాన్ని కించపరచిన ఎవరూ సుఖంగా జీవించలేరని స్పష్టం చేశారు! కిషన్ ప్రసాద్ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ ఆరాధకుడు. శ్రీకృష్ణ భక్తుడు. అన్ని కులాల, మతాల అభిమానాన్ని పొందిన కిషన్ ప్రసాద్‌ను హిందువుగా, ముస్లింగా భావించేవారు. ఇంతకీ మహారాజా సర్ కిషన్ ప్రసాద్ బహదూర్ హిందువా? ముస్లిమా? వచ్చేవారం.. ప్రెజెంటేషన్: పున్నా కృష్ణమూర్తి