ఆదర్శ పురుషునిగా పేరొందిన శ్రీరామునిపై మొఘల్ చక్రవర్తి అక్బర్ తన భక్తిని చాటుకున్నాడని చరిత్ర చెబుతోంది. శ్రీరాముని నాణాన్ని రూపొందించడమే కాకుండా పర్షియన్ భాషలోకి రామాయణాన్ని అనువదింపజేశాడు.
మొఘలుల కాలంలో అక్బర్ చక్రవర్తిపై రాముని ప్రభావం అధికంగా ఉంది. నాటికాలంలో అక్బర్ ఆగ్రాలోని ఫతేపూర్ సిక్రీ ప్యాలెస్‌లో ఎర్ర ఇసుకరాయిపై శ్రీరాముని ఆస్థానం చెక్కించాడు. అక్బర్ తల్లి హమీదా బాను బేగం ఉండే మరియమ్ మహల్‌లో ఒక స్తంభంపై శ్రీరాముని ఆస్థానంతోపాటు, హనుమంతుని చిత్రం కనిపిస్తుంది.
అక్బర్ తల్లి హమీదా బాను బేగం రామాయణ, మహాభారత ఇతిహాసాలను అమితంగా ఇష్టపడేవారని అందుకే ఆమె నివాసభవనంలో శ్రీరాముడు, శ్రీకృష్ణుని చిత్రాలు కనిపిస్తాయని మాజీ ఏఎస్‌ఐ డైరెక్టర్, పురావస్తు శాస్త్రవేత్త పద్మశ్రీ కేకే ముహమ్మద్ తెలిపారు. తన తల్లి ఆసక్తిని గమనించిన అక్బర్ రామాయణం, మహాభారతాలను పర్షియన్ భాషలోకి అనువదింపజేశారని చరిత్ర చెబుతోంది. అక్బర్ తల్లి నివాస భవనంలో శ్రీకృష్ణుడు వేణువు వాయిస్తున్న పెయింటింగ్ కూడా కనిపిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment