sri rama
-
కడపలో వైభవంగా శ్రీరాముడి శోభాయాత్ర.. ఆకట్టుకున్న విద్యార్థుల విన్యాసాలు (ఫొటోలు)
-
శ్రీరాముని దివ్య రూపం.. ఏఐ ఫోటోలు
-
బాలరాముణ్ణి దర్శించుకున్న గాయని కవితా కృష్ణమూర్తి!
అయోధ్యలోని నూతన రామాలయంలో బాలరాముడు ప్రతిష్ఠితుడయ్యాక రామభక్తులంతా రామ్‌లల్లాను దర్శించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. మనదేశం నుంచే కాకుండా విదేశాల నుండి కూడా ప్రతిరోజూ లక్షలాది మంది రామభక్తులు అయోధ్యకు తరలివస్తున్నారు. తాజాగా ప్రముఖ గాయకురాలు, పద్మశ్రీ కవితా కృష్ణమూర్తి అయోధ్యకు వచ్చి బాలరాముణ్ణి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అయోధ్యకు వచ్చి, ఇక్కడ పాటలు పాడే అదృష్టం తనకు దక్కిందని, ఇందుకు దేవునికి ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. అయోధ్య అభివృద్ధిపై సంతోషం వ్యక్తం చేసిన ఆమె రానున్న ఐదేళ్లలో అయోధ్య ను కొత్త కోణంలో చూడనున్నామన్నారు. ఇక్కడికి కళాకారులు తరలి రావడం సంతోషంగా ఉందన్నారు. -
శ్రీరామ నవమికి ముస్తాబవుతున్న అయోధ్య!
అయోధ్యలో రామ్‌లల్లా ప్రతిష్ఠితుడైనప్పటి నుంచి రామనగరికి భక్తులు పోటెత్తున్నారు. ప్రతిరోజూ ఒకటిన్నర నుంచి రెండు లక్షల మంది భక్తులు బాలరాముణ్ణి దర్శించుకుంటున్నారు. గడచిన 18 రోజుల్లో దాదాపు 40 లక్షల మంది భక్తులు రామ్‌లల్లాను దర్శించుకుని పూజలు చేశారు. భక్తుల రద్దీ నిరంతరం కొనసాగుతోంది. ఈనెలలో రాబోయే శ్రీరామ నవమి సందర్భంగా కోటి మంది భక్తులు అయోధ్యకు రావచ్చనే అంచనాలున్నాయి. ఈ నేపధ్యంలో ఆలయ అధికారులు ఇప్పటికే ఈ ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభించారు. తొమ్మిది రోజుల పాటు శ్రీరామ నవమి ఉత్సవాలు జరగనున్నాయి. చైత్ర మాసంలోని శుక్ల పక్షం తొమ్మిదవ రోజున శ్రీరాముని జన్మదినోత్సవం జరగనుంది. ఈసారి ఏప్రిల్ 17న శ్రీరామ నవమి జరగనుంది. చైత్ర నవరాత్రుల ప్రారంభంతో ఉత్సవాలు మొదలు కానున్నాయి. తొమ్మిది రోజుల పాటు ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రామజన్మభూమి గేట్ నంబర్ మూడు నుంచి కూడా భక్తులను అనుమతించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మార్గంలోని 40 అడుగుల వెడల్పు రోడ్డు నిర్మాణం పూర్తయింది. గతంలో ఈ మార్గాన్ని వీఐపీల రాకపోకలకు ఉపయోగించేవారు. దీనితోపాటు ఆలయ సముదాయానికి ఉత్తర దిశలో కొత్త రహదారిని కూడా నిర్మిస్తున్నారు. రామజన్మభూమి మార్గాన్ని రైల్వే స్టేషన్‌కు అనుసంధానించడానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
ఎయిర్‌పోర్టులో రామస్మరణ
-
అయోధ్యలో బాలరాముడి తొలి దర్శనం
-
భద్రాచలంలో అయోధ్య బాలరామ ప్రాణప్రతిష్ట వేడుకలు
-
రామ అనే శబ్దం ఏనాటిది..ఎలా పుట్టింది..?
-
రాజస్థాన్ జైపూర్ లో చిరుత హల్ చల్
-
యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కి చిక్కిన ఉగ్రవాదులు
-
శ్రీరాముని గుర్తుగా అక్బర్ ఏం చేశాడు?
ఆదర్శ పురుషునిగా పేరొందిన శ్రీరామునిపై మొఘల్ చక్రవర్తి అక్బర్ తన భక్తిని చాటుకున్నాడని చరిత్ర చెబుతోంది. శ్రీరాముని నాణాన్ని రూపొందించడమే కాకుండా పర్షియన్ భాషలోకి రామాయణాన్ని అనువదింపజేశాడు. మొఘలుల కాలంలో అక్బర్ చక్రవర్తిపై రాముని ప్రభావం అధికంగా ఉంది. నాటికాలంలో అక్బర్ ఆగ్రాలోని ఫతేపూర్ సిక్రీ ప్యాలెస్‌లో ఎర్ర ఇసుకరాయిపై శ్రీరాముని ఆస్థానం చెక్కించాడు. అక్బర్ తల్లి హమీదా బాను బేగం ఉండే మరియమ్ మహల్లో ఒక స్తంభంపై శ్రీరాముని ఆస్థానంతోపాటు, హనుమంతుని చిత్రం కనిపిస్తుంది. అక్బర్ తల్లి హమీదా బాను బేగం రామాయణ, మహాభారత ఇతిహాసాలను అమితంగా ఇష్టపడేవారని అందుకే ఆమె నివాసభవనంలో శ్రీరాముడు, శ్రీకృష్ణుని చిత్రాలు కనిపిస్తాయని మాజీ ఏఎస్ఐ డైరెక్టర్, పురావస్తు శాస్త్రవేత్త పద్మశ్రీ కేకే ముహమ్మద్ తెలిపారు. తన తల్లి ఆసక్తిని గమనించిన అక్బర్ రామాయణం, మహాభారతాలను పర్షియన్ భాషలోకి అనువదింపజేశారని చరిత్ర చెబుతోంది. అక్బర్ తల్లి నివాస భవనంలో శ్రీకృష్ణుడు వేణువు వాయిస్తున్న పెయింటింగ్ కూడా కనిపిస్తుంది. -
గాలిపటాలు ఎందుకు ఎగురవేస్తారు? శ్రీరామునితో సంబంధం ఏమిటి?
సూర్య భగవానుని గొప్పదనాన్ని గుర్తుచేసుకునే పండుగే మకరసంక్రాంతి. ఈ రోజున స్నానం చేసి, సూర్యభగవానుని పూజించి, దానాలు చేస్తారు. మకర సంక్రాంతి పండుగను మన దేశంలో చాలా పేర్లతో పిలుస్తారు. తమిళనాడులో పొంగల్, గుజరాత్లో ఉత్తరాయణం, పంజాబ్‌లో లోహ్రీ, అస్సాంలో భోగాలి, బెంగాల్లో గంగాసాగర్, ఉత్తరప్రదేశ్‌లో ఖిచ్డీ, తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అని పిలుస్తారు. సంక్రాంతి నాడు ఆకాశంలో గాలిపటాలు ఎగురుతూ కనిపిస్తాయి. పతంగుల పోటీలు జరుగుతుంటాయి. ఒకరి గాలిపటాన్ని మరొకరు కట్ చేసేందుకు ప్రయత్నిస్తూ వినోదిస్తారు. పిల్లలే కాదు పెద్దలు కూడా ఉత్సాహంగా గాలిపటాలు ఎగురవేస్తారు. అయితే సంక్రాంతిరోజున గాలిపటాలు ఎగురవేయడం వెనుక ఉద్దేశం ఏమిటని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక పలు ప్రయోజనాలు ఉన్నాయనే సంగతి మీకు తెలుసా? మకర సంక్రాంతి నాడు గాలిపటాలు ఎగురవేయడం వెనుక పలు శాస్త్రీయ కారణాలున్నాయి. బహిరంగ ప్రదేశంలో ఆకాశంలో గాలిపటాలు ఎగురవేయడం ద్వారా మనకు సూర్యుని నుండి విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ డి మన శరీరానికి ఎంతో అవసరం. అంతేకాకుండా ఎండలో నిలుచుని గాలిపటాలు ఎగురవేయడం ద్వారా మనకు చలినుంచి రక్షణ దొరుకుతుంది. శరీరాన్ని వ్యాధుల బారి నుండి రక్షించుకోవచ్చు. మకర సంక్రాంతి వేళ గాలిపటాలు ఎగురవేయడం వెనుక మతపరమైన కారణాలు కూడా ఉన్నాయి. ఇతిహాసాలలోని వివరాల ప్రకారం మకర సంక్రాంతి నాడు గాలిపటాలు ఎగురవేసే సంప్రదాయాన్ని శ్రీరాముడు ప్రారంభించాడు. శ్రీరాముడు తొలిసారి గాలిపటం ఎగురవేసినప్పుడు, ఆ గాలిపటం ఇంద్రలోకానికి వెళ్లింది. నాటి నుంచి శ్రీరాముడు ప్రారంభించిన సంప్రదాయాన్ని హిందువులు భక్తిశ్రద్ధలతో కొనసాగిస్తున్నారు. మకర సంక్రాంతి రోజున పతంగులు ఎగురవేయడం, ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడం ద్వారా సౌభ్రాతృత్వం, సంతోషం వెల్లివిరుస్తాయి. గాలిపటం అనేది ఆనందం, స్వేచ్ఛ, ఐశ్వర్యానికి చిహ్నమని చెబుతుంటారు. ఇది కూడా చదవండి: పతంగుల పరిశ్రమ వృద్ధిలో ప్రధాని మోదీ పాత్ర ఏమిటి? -
సీతారామలక్ష్మణ వేషధారణలో ఇండిగో సిబ్బంది: పులకించిన ప్రయాణీకులు
అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామమందిరం ప్రాణప్రతిష్ట ఈ నెల (జనవరి) 22నజరగనుంది.ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈ వేడుక ప్రముఖంగా మారనుంది. శ్రీరామ్ లల్లా దర్శనం చేసుకోసం భక్తులు వేయికళ్లతో వేచి చూస్తున్నారు. ఈక్రమంలో ప్రముఖ విమానయాన సంస్థలు దేశంలోని వివిధ నగరాల నుంచి అయోధ్యకు విమాన సర్వీసులను కూడా నడపనున్నాయి. అయితే ఇండిగో విమాన సంస్థ వార్తల్లో నిలిచింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన అధికారిక నివాసంలో జరిగిన వర్చువల్ ఈవెంట్ ద్వారా విమాన సర్వీసును జనవరి 11, గురువారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. గుజరాత్ లోని అహ్మదాబాద్ నుంచి అయోధ్యకు తొలి విమాన సర్వీసును ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రారంభించింది. తన ప్రారంభ విమానంలో దాని క్యాబిన్ సిబ్బంది శ్రీ రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు, సీత వేషధారణలో ఆకట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెటిజనులను ఆకట్టుకుంటోంది. విమాన సిబ్బంది ఒకరు రాముడిలా కిరీటంతో పాటు బంగారు రంగులో సాంప్రదాయ దుస్తులు, ఆభరణాలతో అలకరించుకుని మరీ బోర్డింగ్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. ఇక క్యాబిన్ సిబ్బంది రాముడు, లక్ష్మణుడు, సీత , హనుమంతుని వేషధారణలో ఆహ్వానం పలకడంతో ప్రయాణీకులంతా పులకించిపోయారు. ‘జై శ్రీరాం’ అని నినాదాలు చేశారు. Indigo staff dressed as Shri Ram, Sita, Laxman for the inaugural flight from Ahmedabad to Ayodhya!pic.twitter.com/5tqkfThZBU — Anu Sehgal 🇮🇳 (@anusehgal) January 11, 2024 ఈ డైరెక్ట్ ఫ్లైట్‌తో అయోధ్య నేరుగా అహ్మదాబాద్‌కి కనెక్ట్ అయిందని, ఢిల్లీ తర్వాత అయోధ్యకు విమాన సర్వీసుల అనుసంధానమైన రెండో స్థానంలో అహ్మదాబాద్ ఉందని, జనవరి 15 నుంచి ఇతన విమాన సర్వీసులు కూడా ఉంటాయని సీఎం యోగి తెలిపారు. జనవరి 16న అయోధ్య-ముంబై, ఢిల్లీ-అయోధ్య మధ్య మరో విమాన సర్వీసు ప్రారంభం కానుందని, మెరుగైన విమాన సేవలు పర్యాటకం, వ్యాపార కార్యకలాపాలకు గణనీయంగా దోహదపడతాయని యోగి పేర్కొన్నారు. మరోవైపు స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్, జనవరి 12, శుక్రవారం, జనవరి 21 న ఢిల్లీ నుండి అయోధ్యకు ప్రత్యేక విమాన సర్వీసులను ప్రకటించింది. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానం మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 3 గంటలకు అయోధ్య చేరుకుంటుంది. మరుసటి రోజు తిరుగు ప్రయాణంలో సాయంత్రం 5 గంటలకు బయలుదేరి, సాయంత్రం 6.30 గంటలకు ఢిల్లీలో ల్యాండ్ అవుతుంది. మరుసటి రోజు రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యే ప్రయాణీకులకు భోజనం అందించనుంది. -
ఆ జిల్లాతో శ్రీరామునికి విడదీయరాని అనుబంధం!
ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో శ్రీరాముని జీవిత చరిత్రకు సంబంధించిన అనే కథలు ముడిపడివున్నాయి. బస్తీ జిల్లాను వశిష్ఠ మహర్షి తపోప్రదేశంగా గుర్తిస్తారు. శ్రీరాముని తండ్రి దశరథుడు బస్తీ జిల్లాలోని మస్ఖధామ్‌లో పుత్రకామేష్ఠి యాగాన్ని నిర్వహించాడని చెబుతారు. వేదాలు, పురాణాలలో ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రస్తావనలు కనిపిస్తాయి. శ్రీరాముని నగరమైన అయోధ్యకు కొద్ది దూరంలోనే బస్తీ జిల్లా ఉంది. ఈ జిల్లాకు రాముని నగరమైన అయోధ్యతో సన్నిహిత సంబంధం ఉంది. శ్రీరాముడు.. రావణుని సంహరించి, తన భార్య సీతామాతతో కలిసి లంక నుండి తిరిగి వచ్చినప్పుడు, ఇక్కడి మనోరమ- కువానో సంగమం ఒడ్డున లిట్టిచోఖాను తిన్నారని స్థానికులు చెబుతుంటారు. నాటి నుండి ఈ ప్రాంతంలో జాతర నిర్వహిస్తున్నారు. పవిత్రమైన మనోరమ నదిలో స్నానం చేయడం ద్వారా పాపాలు పోతాయని భక్తులు నమ్ముతారు. ప్రతీయేటా చైత్ర పూర్ణిమ రోజున రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి వేలాది మంది జనం ఇక్కడికి వచ్చి మనోరమ కువానో సంగమం ఒడ్డున స్నానాలు చేస్తారు. ఆ తరువాత వారు లిట్టి చోఖాను తయారు చేసి పరస్పరం పంచుకుంటారు. ఈ జాతర ఐదు రోజుల పాటు జరుగుతుంది. ఇది కూడా చదవండి: 2,100 కిలోల గంట.. 108 అడుగుల అగరుబత్తి -
రాముడి పాదం తాకిన రామడుగు ప్రాంతం
-
అయోధ్య రామయ్య పాదుకలు తయారైంది హైదరాబాద్ లోనే..
-
ఛత్తీస్‌గఢ్ నుంచి అయోధ్యకు.. సుగంధభరిత బియ్యం, భారీగా కూరగాయలు
ఛత్తీస్‌గఢ్ మిల్లర్స్ అసోసియేషన్ అయోధ్యలోని నూతన రామాలయంలో జనవరి 22న జరిగే శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి సుగంధభరిత బియ్యాన్ని పంపనుంది. అలాగే ఈ ప్రాంతపు రైతులు తాము పండించిన కూరగాయలను అయోధ్యకు పంపాలని నిర్ణయించారు. రాజధాని రాయ్‌పూర్‌లోని రామాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవసాయి పాల్గొని, ఆలయ ప్రాంగణం నుంచి 300 మెట్రిక్ టన్నుల సుగంధభరిత బియ్యంతో అయోధ్యకు బయలుదేరిన 11 ట్రక్కులకు పచ్చజెండా చూపారు. ఇదిలావుండగా సీఎం విష్ణు దేవ్‌సాయి తన సోషల్ మీడియా ఖాతాలో ‘రాముని దర్శనం కోసం ఆతృతగా వేచిచూస్తున్నాం. జనవరి 22న అయోధ్యలో మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రుని విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నారు. రాష్ట్రంలోని రైతులు వారి పొలాల్లో పండించిన 100 టన్నుల కూరగాయలను అయోధ్యకు పంపాలని నిర్ణయించుకున్నారు. శ్రీరాముడు ప్రతి వ్యక్తి హృదయంలో ఉన్నాడు. ఈ మహత్కార్యంలో భాగస్వాములవుతున్న రాష్ట్రంలోని రైతులు అభినందనీయులు’ అని పేర్కొన్నారు. కాగా ఛత్తీస్‌గఢ్ రైస్‌మిల్లర్లు అయోధ్యకు సుగంధభరిత బియ్యం పంపినందుకు సీఎం వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇది కూడా చదవండి: అయోధ్యలో కొలువుదీరే శ్రీరాముని విగ్రహం ఇదే! राम काज करिबे को आतुर... आगामी 22 जनवरी को अयोध्या में मर्यादा पुरुषोत्तम भगवान श्री रामचंद्र जी की मूर्ति की प्राण प्रतिष्ठा होने वाली है, जिस पर हर सनातनी को गर्व है। मेरे प्रदेश के अन्नदाताओं ने भी राम काज के लिए अपने खेतों से उगाई गई 100 टन सब्जियां राम मंदिर निर्माण कार्य… pic.twitter.com/fD3OvLiod0 — Vishnu Deo Sai (@vishnudsai) January 2, 2024 -
‘సిద్ద రామయ్యే మా రాముడు.. అయోధ్య ఎందుకెళ్లాలి?’
కర్ణాటక మంత్రి, కాంగ్రెస్ నేత హెచ్ ఆంజనేయ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను శ్రీరామునితో పోల్చడం వివాదాస్పదంగా మారింది. రామాలయం విషయంలో బీజేపీ రాజకీయాలు చేస్తోందని, మత ప్రాతిపదికన దేశ ప్రజలను బీజేపీ విభజిస్తోందని కాంగ్రెస్ నేత ఆంజనేయ ఆరోపించారు. కాగా కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేత బదులిచ్చారు. హిందూ దేవుళ్లు, దేవతల గురించి ఆలోచించి మాట్లాడాలని బీజేపీ నేతలు హెచ్చరించారు. మీడియాతో మాట్లాడిన హెచ్ ఆంజనేయ నూతన రామాలయంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సీఎం సిద్ధరామయ్య అయోధ్యకు వెళ్లే విషయమై ప్రస్తావించారు. ఆయన (సిద్దరామయ్య) మా రాముడు.. అటువంటప్పుడు అయోధ్యలో జరిగే శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎందుకు వెళతారని అన్నారు. అతను తన స్వగ్రామంలోని రామ మందిరాన్ని సందర్శించడానికి వెళ్లగలరని అన్నారు. అక్కడ బీజేపీకి చెందిన రాముని విగ్రహం ప్రతిష్ఠిస్తున్నారు. బీజేపీ వాళ్లను మాత్రమే ఆహ్వానిస్తున్నారు. మా రాముడు మా హృదయాల్లోనే ఉన్నాడు. బీజేపీ ఎప్పుడూ ఇలాంటి పనులనే చేస్తుంది. మతం పేరుతో ప్రజలను విభజించి, ఒక నిర్దిష్ట వర్గాన్ని రెచ్చగొట్టి, వారి ఓట్లను దక్కించుకుంటుందని ఆరోపించారు. కాగా కాంగ్రెస్ నేత ఆంజనేయ వ్యాఖ్యలపై బీజేపీ ఎదురుదాడికి దిగింది. బీజేపీ నేత బసనగౌడ పాటిల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతను ఉద్దేశించి హిందూ దేవుళ్ల గురించి ఆలోచించి మాట్లాడాలని అన్నారు. ఇలాంటి హిందూ వ్యతిరేకులు మనకు మంత్రులు కావడం మన దురదృష్టం అంటూ ఘాటుగా విమర్శించారు. -
ఆనంద డోలికల్లో అరుణ్ యోగిరాజ్ తల్లి
కర్ణాటకకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దిన శ్రీరాముని విగ్రహాన్ని అయోధ్యలోని నూతన రామాలయంలో ప్రతిష్ఠించనున్నారు. ఈ సందర్భంగా అరుణ్ యోగిరాజ్ తల్లి సరస్వతి మీడియాతో మాట్లాడారు. తన కుమారుడు తీర్చిదిద్దిన విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్ఠాపనకు ఎంపిక చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు. అయితే తన కుమారుడు శ్రీరాముని విగ్రహాన్ని తయారు చేస్తుండగా, తాను చూడలేకపోయానని ఆమె తెలిపారు. తన కుమారుడు శ్రీరాముని శిల్పాన్ని తయారు చేస్తున్నప్పుడు.. విగ్రహం తయారీ చివరి రోజున చూపిస్తానని చెప్పాడన్నారు. తన కుమారుడు సాధించిన ఈ విజయానికి చాలా సంతోషంగా ఉందని, అయితే ఈ విజాయానందాన్ని పంచుకునేందుకు తన భర్త ఇప్పుడు జీవించి లేరని ఆమె తెలిపారు. ఇది కూడా చదవండి: అయోధ్యలో కొలువుదీరే శ్రీరాముని విగ్రహం ఇదే! -
అయోధ్యలో కొలువుదీరే శ్రీరాముని విగ్రహం ఇదే!
అయోధ్యలోని నూతన రామాలయంలో జనవరి 22న కొలువుదీరనున్న రాముని విగ్రహం ఖరారయ్యింది. కర్ణాటకకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దిన విగ్రహాన్ని ఎంపిక చేశారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియా ప్లాట్ఫారం ఎక్స్‌లో ఇలా రాశారు.. ‘రాముడు ఎక్కడ ఉంటాడో, అక్కడ హనుమంతుడు ఉంటాడు. అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్ఠాపన కోసం విగ్రహాన్ని ఎంపిక చేశారు. మన దేశపు ప్రఖ్యాత శిల్పి అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన రాముని విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్ఠించనున్నారు. రాముడు, హనుమంతునికి మధ్యనున్న అవినాభావ సంబంధానికి ఇది మరొక ఉదాహరణ. హనుమంతుని జన్మభూమి అయిన కర్ణాటక నుంచే శ్రీరామునికి సేవా కార్యం జరిగినదనడంలో సందేహం లేదు’ అని పేర్కొన్నారు. అయోధ్య రామాలయ ట్రస్ట్ నేపాల్‌లోని గండకీ నదితో పాటు కర్ణాటక, రాజస్థాన్, ఒరిస్సా నుండి శ్రీరాముని విగ్రహ రూపకల్పనకు మొత్తం 12 నాణ్యమైన రాళ్లను సేకరించింది. ఈ రాళ్లన్నింటినీ పరీక్షించగా కేవలం రాజస్థాన్, కర్ణాటక రాళ్లే విగ్రహాల తయారీకి అనువుగా ఉన్నట్లు గుర్తించారు. కర్ణాటకలో లభించిన శ్యామ శిల, రాజస్థాన్‌లోని మక్రానాకు చెందిన మార్బుల్ రాక్లను ఎంపిక చేశారు. మక్రానా రాయి ఎంతో విశిష్టమైనది. అలాగే కర్నాటకలోని శ్యామ శిల.. శిల్పాలు చెక్కేందుకు అనువుగా ఉంటుంది. ఈ రాళ్ళు నీటి నిరోధకతను కలిగి ఉంటాయి. సుదీర్ఘ జీవితకాలాన్ని కూడా కలిగి ఉంటాయి. ప్రఖ్యాత శిల్పి యోగిరాజ్ శిల్పి కుమారుడు అరుణ్ యోగిరాజ్(37) ఎంబీఏ పూర్తిచేశారు. ఇతను యోగిరాజ్ కుటుంబంలో ఐదో తరం శిల్పి. అరుణ్ యోగిరాజ్ 2008లో ఉద్యోగం మానేసి, పూర్తిస్థాయి శిల్పకారునిగా మారారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి అరుణ్ యోగిరాజ్.. మహారాజా జయచామరాజేంద్ర వడయార్‌తో సహా అనేక ప్రముఖుల విగ్రహాలను తయారు చేశారు. కేదార్‌నాథ్‌లో స్థాపించిన ఆదిశంకరాచార్య విగ్రహాన్ని రూపొందించారు. అలాగే మైసూరులో మహారాజా శ్రీకృష్ణరాజ వడయార్-IV, స్వామి రామకృష్ణ పరమహంస పాలరాతి విగ్రహం మొదలైనవి తీర్చిదిద్దారు. ఇండియా గేట్ దగ్గర కనిపించే నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం కూడా అరుణ్ యోగిరాజ్ రూపొందించినదే! "ಎಲ್ಲಿ ರಾಮನೋ ಅಲ್ಲಿ ಹನುಮನು" ಅಯೋಧ್ಯೆಯಲ್ಲಿ ಶ್ರೀರಾಮನ ಪ್ರಾಣ ಪ್ರತಿಷ್ಠಾಪನಾ ಕಾರ್ಯಕ್ಕೆ ವಿಗ್ರಹ ಆಯ್ಕೆ ಅಂತಿಮಗೊಂಡಿದೆ. ನಮ್ಮ ನಾಡಿನ ಹೆಸರಾಂತ ಶಿಲ್ಪಿ ನಮ್ಮ ಹೆಮ್ಮೆಯ ಶ್ರೀ @yogiraj_arun ಅವರು ಕೆತ್ತಿರುವ ಶ್ರೀರಾಮನ ವಿಗ್ರಹ ಪುಣ್ಯಭೂಮಿ ಅಯೋಧ್ಯೆಯಲ್ಲಿ ಪ್ರತಿಷ್ಠಾಪನೆಗೊಳ್ಳಲಿದೆ. ರಾಮ ಹನುಮರ ಅವಿನಾಭಾವ ಸಂಬಂಧಕ್ಕೆ ಇದು… pic.twitter.com/VQdxAbQw3Q — Pralhad Joshi (@JoshiPralhad) January 1, 2024 -
అయోధ్య విమానాశ్రయం విశేషాలివే
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నూతనంగా నిర్మించిన మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ ఎయిర్‌పోర్టు అనేక విశేషాలను కలిగివుంది. అయోధ్య నగర చరిత్ర, విశిష్టత, ఆధ్యాత్మిక వాతావరణం ప్రతిబింబించేలా ఈ విమానాశ్రయ రూపుదిద్దుకుంది. విమానాశ్రయం టెర్మినల్ భవనాన్ని శ్రీరామ మందిరాన్ని తలపించేలా తీర్చిదిద్దారు. ప్రధాన ద్వారంపై ఆలయ తోరణాల డిజైన్ రూపొందించారు. శ్రీరాముని జీవితాన్ని కళ్లకు కట్టే కళాఖండాలు, చిత్రాలు, కుడ్యచిత్రాలతో విమానాశ్రయం శోభాయమానంగా కనిపిస్తోంది. విమానాశ్రయం సమీపంలో బస్సు పార్కింగ్‌తోపాటు దివ్యాంగులకు అనుకూలమైన వసతి సౌకర్యాలు కల్పించారు. ఎల్ఈడీ లైటింగ్, వాననీటి నిర్వహణ, సౌర విద్యుత్ ప్లాంట్, మురుగు శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేశారు. ప్రాంగణం చుట్టూ పరుచుకున్న పచ్చదనం నిర్వహణకు వాడిన నీటిని రీ సైకిల్ చేసి ఉపయోగించనున్నారు. మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్మాణం కేవలం 20 నెలల్లో పూర్తయిందని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ సంజీవ్ కుమార్ చెప్పారు. ఈ ఎయిర్‌పోర్టు గతంలో కేవలం 178 ఎకరాల్లో ఉండేది. దీనిని ఇప్పుడు రూ.350 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దారు. యూపీ ప్రభుత్వం 821 ఎకరాల భూమిని విమానాశ్రయం కోసం కేటాయించింది. ప్రతి ఏటా 10 వేల మంది ప్రయాణికుల రాకపోకలు సాగించేందుకు వీలుగా విమానాశ్రయాన్ని అత్యంత విశాలంగా నిర్మించారు. టెర్మినల్ భవనాన్ని 6,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. 2.2 కిలోమీటర్ల పొడవైన రన్‌వేను ఏర్పాటు చేశారు. దీంతో ఎయిర్‌బస్–321 రకం విమానాల ల్యాండింగ్, టేకాఫ్ సులభతరం కానుంది. ఇక్కడ రెండు లింక్ ‘టాక్సీ వే’లు ఉండటంతో ఒకేసారి ఎనిమిది విమానాలను పార్క్ చేసుకునేందుకు అవకాశం ఉంది. త్వరలో విమానాశ్రయ రెండో దశ విస్తరణ పనులు మొదలుకానున్నాయి. టెర్మినల్‌ను 50 వేల చదరపు మీటర్లకు విస్తరించనున్నారు. ఏటా ఏకంగా 60 లక్షల మంది రాకపోకలకు వీలుగా విస్తరణ ప్రతిపాదనలు ఇప్పటికే సిద్ధంచేశారు. రన్‌వేను 3.7 కిలోమీటర్లకు విస్తరించి, అదనంగా 18 విమానాల పార్కింగ్‌కు చోటు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇది కూడా చదవండి: భారత్‌లో ఐదు కొత్త సంవత్సరాలు... ఏడాది పొడవునా సంబరాలే! -
సీతారాముల స్వస్థలాలు ‘అమృత్ భారత్’తో అనుసంధానం!
శ్రీరాముని జన్మభూమి అయోధ్యతో సీతామాత పుట్టిన ప్రాంతమైన సీతామర్హి(బీహార్) అనుసంధానం కానుంది. ఈ రెండు ప్రాంతాలను కలిపేలా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రాకపోకలు సాగించనుంది. ఈ ప్రత్యేక రైలు మొదటి పరుగును అతి త్వరలో అందుకోనుంది. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో శ్రీరామ్ విమానాశ్రయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని మోదీ డిసెంబర్ 30న రానున్నారు. ఈ సందర్భంగా మోదీ.. అయోధ్య జంక్షన్లో కొత్తగా నిర్మించిన భవనాన్ని ప్రారంభించడమే కాకుండా, అయోధ్య నుంచి ఢిల్లీకి నడిచే రెండు రైళ్లను ప్రారంభించనున్నారు. అంతే కాదు వందే భారత్ ఎక్స్‌ప్రెస్, అమృత్ భారత్ రైలును కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢిల్లీ- దర్భంగాల మధ్య నడవనుంది. మొదటి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు సంబంధించిన రెగ్యులర్ సర్వీస్ ఢిల్లీ- దర్భంగా మధ్య ఉంటుంది. ఈ రైలు దూర ప్రయాణికులకు ఎంతో ఉపయుక్తం. మరో అమృత్ భారత్ రైలు బీహార్‌లోని సితామర్హి (జానకీ మాత జన్మస్థలం)-రక్సాల్ మీదుగా అయోధ్య గుండా ఢిల్లీకి చేరనుందని సమాచారం అమృత్ భారత్ రైలు నాన్-ఏసీ రైలుగా ఉండబోతున్నదని తెలుస్తోంది. అంటే దీనిలో స్లీపర్, జనరల్ కోచ్‌లు మాత్రమే ఉంటాయి. ఇందులో మొత్తం 22 బోగీలు ఉండనున్నాయి. దేశంలోని వివిధ నగరాలను కలుపుతూ రాత్రిపూట రైలు సర్వీసులుగా నడపాలని భారతీయ రైల్వే యోచిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో పని చేయడానికి వచ్చే వలస బీహారీలను దృష్టిలో ఉంచుకుని ఈ రైలు ప్రవేశపెట్టనున్నారని రైల్వే అధికారులు తెలిపారు. ఇది కూడా చదవండి: మళ్లీ మాస్క్ తప్పనిసరి.. ఆదేశాలు జారీ! -
బాలరాముని ప్రాణ ప్రతిష్ఠకు 84 సెకెన్ల సూక్ష్మ ముహూర్తం!
రాబోయే జనవరి 22న అయోధ్యలోని నూతన రామాలయంలో శ్రీరాముడు కొలువుదీరనున్నాడు. 84 సెకన్ల సూక్ష్మ ముహూర్తంలో బాలరాముని విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. నూతన రామాలయంలో బాల రాముని విగ్రహ ప్రతిష్ఠాపనకు ఐదు ముహూర్తాలు ప్రతిపాదించారు. అయితే రామ మందిర తీర్థ క్షేత్ర ట్రస్ట్ అంతిమ నిర్ణయాన్ని గీర్వాణవాగ్వర్ధిని సభకు, కాశీ పండితులకు వదిలివేసింది. జనవరి 22న అత్యంత శుభ ముహూర్తంగా వారు నిర్ణయించారు. జనవరి 17, 21, 24, 25 తేదీలలో ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించిన శుభ ముహూర్తాన్ని దేశంలోని నలుమూలలకు చెందిన పండితులు అందించారు. వారిలో కాశీకి చెందిన పండితుతు పండిట్ గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ అందించిన ముహూర్తాన్ని ఎంపిక చేశారు. అభిజిత్ ముహూర్తంలో బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్టించడానికి చాలా సూక్ష్మమైన శుభ సమయం ఉందని గణేశ్వర్ శాస్త్రి తెలిపారు. జనవరి 22న మేష రాశిలో వృశ్చిక నవాంశ వేళ.. మధ్యాహ్నం 12:29:08 నుంచి 12:30:32 వరకు 84 సెకన్ల సమయం కలిగిన ఈ ముహూర్తాన బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. బాల రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని కాశీలోని వైదిక బ్రాహ్మణులు పర్యవేక్షించనున్నారు. కాశీ నుండే పూజలకు కావాలసిన సామగ్రిని తరలించనున్నారు. కాశీ నుండి పండితుల మొదటి బ్యాచ్ డిసెంబర్ 26న అయోధ్యకు బయలుదేరనుంది. వీరు యాగశాల, పూజా మండపం పనులు చేపట్టనున్నారు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో 51 మంది వేద పండితులు పాల్గొననున్నారు. ఇది కూడా చదవండి: ఆ పదుగురు... 2023లో రాజకీయాలన్నీ వీరివైపే.. -
రామాలయం థీమ్‌తో వజ్రాలహారం.
అయోధ్యలో రూపుదిద్దుకుంటున్న రామాలయం ప్రారంభోత్సవ తేదీ దగ్గర పడుతుండడంతో భక్తులలో ఉత్సాహం నెలకొంటోంది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక ఎమ్మెల్యే తన ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా తన వెంట రామ మందిర ప్రతిరూపాన్ని తీసుకెళ్లారు. తాజాగా సూరత్‌లో ఒక వ్యాపారి రామ మందిరం నేపథ్యంతో వజ్రాల హారాన్ని తయారు చేయించారు. ఈ వజ్రాల హారంలో ఐదు వేల అమెరికన్ వజ్రాలు ఉపయోగించామని సదరు వ్యాపారి తెలిపారు. హారం తయారీలో రెండు కిలోల వెండిని వినియోగించామన్నారు. అలాగే 40 మంది కళాకారులు ఈ డిజైన్‌ను 35 రోజుల్లో పూర్తి చేశారన్నారు. దీనిని ఎలాంటి వాణిజ్య ప్రయోజనం కోసం తయారు చేయలేదని, అయోధ్యలోని రామాలయానికి కానుకగా అందజేస్తామని తెలిపారు. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో నూతనంగా నిర్మితమైన ఆలయంలో జనవరి 22న బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ జరగనుంది. ప్రపంచంలోని కోట్లాది మంది రామభక్తులు ఈ వేడుకల కోసం ఎదురుచూస్తున్నారు. శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు జనవరి 16 నుంచి ప్రారంభం కానున్నాయని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. వివిధ సంప్రదాయాలకు చెందిన సాధువులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ వేడుకల భద్రతా ఏర్పాట్ల గురించి అయోధ్య రేంజ్ ఐజి ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ అయోధ్యలో భద్రతా ఏర్పాట్లు ఎప్పుడూ కట్టుదిట్టంగా ఉంటాయన్నారు. సీఆర్పీఎఫ్, యూపీఎస్ఎస్ఎఫ్, పీఎస్‌ఇ, సివిల్ పోలీసులు నిత్యం పహారా కాస్తారన్నారు. కొత్త భద్రతా ప్రణాళికల ప్రకారం ఇక్కడికి వచ్చే ప్రతీ ఒక్కరినీ తనిఖీ చేస్తామని అన్నారు. అనుమతి లేకుండా డ్రోన్లు ఎగరేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే నదీతీరం గుండా కూడా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వేడుకల సందర్భంగా 37 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఇది కూడా చదవండి: ఏఐతో మరో కొత్త ఆందోళన! -
నేడు అయోధ్యకు శ్రీరామ పాదుకలు
సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్యలో భవ్య రామాలయం గర్భగుడిలో ప్రాణ ప్రతిష్ఠకు ముహూర్తం దగ్గర పడింది. ఈలోపు శ్రీరామ పాదుకా యాత్రలో భాగంగా దేశ వ్యాప్తంగా రాముడు నడిచిన మార్గాలమీదుగా పూజలందుకుంటూ శ్రీరామ పాదుకలు మంగళవారం అయోధ్యకు చేరుకోనున్నాయి. 9 కిలోల బరువున్న ఈ పాదుకల కోసం 8 కిలోల వెండి వాడారు. కిలో బంగారంతో పాదుకలకు తాపడం చేశారు. హైదరాబాద్‌కు చెందిన అయోధ్య భాగ్యనగర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు చల్లా శ్రీనివాస శాస్త్రి ఈ పాదుకలను తయారు చేయించారు. జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత ఈ పాదుకలను ఆలయంలో ప్రతిష్టించనున్నారు. -
Ram Mandir Trust: అయోధ్యకు రాకండి!
సాక్షి, న్యూఢిల్లీ: శ్రీరామ విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగే జనవరి 22న అయోధ్యకు పోటెత్తొద్దని ఆలయ నిర్వాహకులు భక్తులకు విజ్ఞప్తి చేశారు. ‘‘ఆ రోజు అయోధ్యలో ఊహించనంతటి రద్దీ ఉంటుంది. కనుక ఎలాగైనా కార్యక్రమాన్ని కళ్లారా చూడాలని అయోధ్య దాకా రాకండి. మీరున్న చోటే ఆలయాల్లో పూజలు చేయండి’’ అని భవ్య రామమందిరం ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ విజ్ఞప్తి చేశారు. జనవరి 16వ తేదీ నుంచే వైదిక కార్యక్రమాలు మొదలవుతాయని చెప్పారు. 80 వేల మంది భక్తులకు బస, భోజన వసతి కలి్పంచేలా అయోధ్యలో ’టెంట్ సిటీ’ని నిర్మిస్తున్నారు. ఆలయ పూజారుల్లో తిరుపతి పూర్వ విద్యార్థి అయోధ్య రామాలయ పూజారిగా ఎంపికైన మోహిత్ పాండే తిరుపతిలో గతంలో వేద విద్య అభ్యసించారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర వేద విశ్వ విద్యాలయంలో ఎంఏ (ఆచార్య) పట్టా సాధించారు. లక్నోలోని సీతాపూర్‌కు చెందిన మోహిత్ గాజియాబాద్‌లోని దుధేశ్వర్ వేద్ విద్యాపీఠ్‌లో ఏడేళ్ల సామవేదం అభ్యసించారు. తర్వాత వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో వేద విద్యాభ్యాసం కొనసాగించారు. -
శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠకు 60 గంటలపాటు పూజలు
అయోధ్యలో శ్రీరాముడు కొలువుదీరడానికి ఇక 40 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ 2024 జనవరి 22న శ్రీరామునికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. కాశీకి చెందిన పండితులు లక్ష్మీకాంత దీక్షిత్ నేతృత్వంలో 121 మందికి పైగా వేద పండితుల బృందం జనవరి 16 నుండి 22 వరకు రామాలయంలో పూజలు నిర్వహించనుంది. శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు ముందు యాగంతో పాటు నాలుగు వేదాల పఠనం.. ఇలా మొత్తం 60 గంటల పాటు వివిధ పూజాది కార్యక్రమాలు జరగనున్నాయి. శ్రీరామునికి 56 రకాల ప్రసాదాలు సమర్పించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ.. శ్రీరామునికి ఘనమైన హారతినివ్వనున్నారు. జనవరి 17న ఉదయం ఎనిమిది గంటలకు ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం ప్రారంభమై, మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగనుంది. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు వివిధ పూజలు తిరిగి ప్రారంభమై రాత్రి 9.30 గంటల వరకు కొనసాగనున్నాయి. అంటే జనవరి 16 నుండి 22 వరకు ప్రతిరోజూ దాదాపు 10 నుండి 12 గంటల పాటు రామాలయంలో పూజలు జరగనున్నాయి. జనవరి 22న బాల శ్రీరాముడు గర్భగుడిలో కొలువుదీరనున్నాడు. ఈ పూజాదికాల కోసం ఆలయ ప్రాంగణంలో పలు మండపాలు, హోమ గుండాలు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)కు చెందిన సాయుధ బృందం అయోధ్యలో త్వరలో ప్రారంభంకానున్న అంతర్జాతీయ విమానాశ్రయానికి భద్రతను అందించనుంది. డిసెంబర్ నెలాఖరులోగా విమానాశ్రయం మొదటి దశ పూర్తవుతుంది. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. ఇది కూడా చదవండి: రాజస్థాన్ సీఎం ఎంపికకు ఛత్తీస్‌గఢ్ ఫార్ములా? -
‘శ్రీరామునికి రెండు నూలు పోగులు’ ఉద్యమానికి అనూహ్య స్పందన!
మహారాష్ట్రలోని పూణెలో ‘దో ధాగే శ్రీరామ్ కే లియే’ (శ్రీరామునికి రెండు నూలుపోగులు) ఉద్యమం ప్రారంభమైంది. అయోధ్యలో కొలువుదీరనున్న శ్రీరామునికి వస్త్రాలు సిద్ధం చేసేందుకు వేలాది మంది చేనేత కార్మికులు మగ్గాలపై నేత పనులకు ఉపక్రమించారు. ఈ ఉద్యమ ప్రచారం 13 రోజుల పాటు కొనసాగనుంది. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం, పూణేకు చెందిన హెరిటేజ్ హ్యాండ్‌వీవింగ్ రివైవల్ ఛారిటబుల్ ట్రస్ట్ డిసెంబర్ 10న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఈ ప్రచారానికి ప్రజల నుంచి ఉత్సాహంతో కూడిన మద్దతు లభిస్తున్నదని ప్రచార నిర్వాహకురాలు అనఘా ఘైసాస్ తెలిపారు. రానున్న 13 రోజుల్లో ఈ పనుల్లో భాగస్వాములయ్యేందుకు దాదాపు 10 లక్షల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారని ఆమె తెలిపారు. చేనేత కళను ప్రోత్సహిస్తూనే, ఈ పనిలో ప్రజలను భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో ఈ ప్రచారం సాగుతున్నదన్నారు. చేనేత పని అంత సులభం కాదని, ఇది గణితంతో ముడిపడివుందని, అలాగే ఎంతో సహనం అవసరమన్నారు. శ్రీరామునికి అందించబోయే దుస్తులు పట్టుతో తయారవుతున్నాయని, వెండి బ్రోకేడ్‌తో ఈ వస్త్రాలను అలంకరిస్తామని ఆమె తెలిపారు. కాగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, రామమందిరం ట్రస్ట్‌కు చెందిన గోవింద్ దేవ్ గిరి మహారాజ్‌లు ఈ ప్రచార ఉద్యమంలో పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: ఆ ఎంపీ అదృశ్యం అంటూ పోస్టర్లు.. ఆ చూకీ చెబితే రూ. 50 వేలు! -
నూతన రామాలయ ప్రారంభోత్సవంలో పాక్ కళాకారుల ప్రదర్శనలు
యూపీలోని అయోధ్యలో నిర్మితమవుతున్న నూతన రామాలయం వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా రామలీల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీనిలో సినిమా ఆర్టిస్టులు ప్రత్యేక ఆకర్షణగా కనిపించనున్నారు. అలాగే పాకిస్తాన్‌తో సహా 14 దేశాలకు చెందిన కళాకారులు కూడా దీనిలో భాగస్వాములు కానున్నారు. రాముని కథను సజీవంగా ప్రదర్శించేందుకు వీరంతా ఇప్పటి నుంచే సాధన చేస్తున్నారు. రామమందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఈసారి జనవరిలో అత్యంత వైభవంగా రామలీలను ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సాధారణంగా రామలీల కార్యక్రమం ప్రతి సంవత్సరం దసరా రోజున జరుగుతుంది. అయితే ఇప్పుడు 2024 జనవరి 17 నుంచి 22 వరకు సరయూ తీరంలో ఉన్న రామకథా పార్క్‌లో రామలీలను ప్రదర్శించనున్నారు. రాబోయే జనవరిలో జరిగే రామలీలలో తొలిసారిగా సినీ కళాకారులతో పాటు విదేశీ కళాకారులు కూడా కనిపించనున్నారని రామలీల కమిటీ చైర్మన్ సుభాష్ మాలిక్ తెలిపారు. రష్యా, మలేషియా, అమెరికా, లండన్, దుబాయ్, ఇజ్రాయెల్, ఆఫ్ఘనిస్తాన్, జపాన్, చైనా, జర్మనీ, అమెరికా, థాయ్‌లాండ్, ఇండోనేషియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్లకు చెందిన కళాకారులు అయోధ్యలో జరిగే రామలీలలో కనిపించనున్నారని పేర్కొన్నారు. అనేక దేశాల కళాకారులు, సినీ కళాకారులతో సంయుక్తంగా రామలీలను ప్రదర్శించడం ఇదే తొలిసారి. అది కూడా శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలో నిర్వహించడం ఇదే మొదటిసారి అవుతుంది. రామ్‌లీల కార్యక్రమాన్ని పర్యాటక శాఖ మంత్రి జైవీర్ సింగ్ ప్రారంభిస్తారని కమిటీ ప్రధాన కార్యదర్శి శుభమ్ మాలిక్ తెలిపారు. కాగా ఈ ఏడాది దసరా సందర్భంగా జరిగిన రామలీల కార్యక్రమాన్ని ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో 32 కోట్ల మంది వీక్షించారు. ఇది కూడా చదవండి: అమెరికా మాజీ మంత్రి హెన్రీ కిస్సింజర్ కన్నుమూత! -
థాయ్‌లాండ్‌లోనూ అయోధ్య.. ఇక్కడి రాజే రాముని అవతారం!
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య మాదిరిగానే థాయ్‌లాండ్‌లో కూడా అయోధ్య ఉంది. ఈ ప్రదేశానికి అయోధ్య అని పేరు పెట్టడమే కాకుండా ఇక్కడి రాజులను రాముని అవతారంగా భావిస్తారు. థాయ్‌లాండ్‌లోని ‘అయుతయ’ నగరానికి ప్రాచీన భారతీయ నగరమైన అయోధ్య పేరు పెట్టారు. ఇక్కడి రాజవంశంలోని ప్రతి రాజును రాముని అవతారంగా భావిస్తారు. థాయ్‌లాండ్ ‘అయోధ్య’కు సంబంధించిన వివరాలను 22 ఏళ్లుగా బోధనావృత్తి సాగిస్తున్న డాక్టర్ సురేష్ పాల్ గిరి వివరించారు. తాను థాయ్‌లాండ్‌లోని మతపరమైన విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు. థాయ్‌లాండ్ ఒకప్పుడు భారతదేశంలో భాగమని అన్నారు. మొదట్లో హిందూ ప్రాబల్యం ఉన్న ఈ దేశంలో కాలక్రమేణా బౌద్ధం ప్రవేశించి, దానిలోని అంశాలు హిందూమతంతో కలిసిపోయాయన్నారు. భారతదేశంలోని అయోధ్య , థాయ్‌లాండ్‌లోని అయోధ్య మధ్య గల పోలికల గురించి సురేష్ తెలియజేస్తూ.. భారత పూర్వీకుల సంప్రదాయాలు మరచిపోలేనివి అని అన్నారు. ఇప్పటికీ థాయ్‌లాండ్ ప్రజలు శ్రీరాముని పూజిస్తారన్నారు. ఇక్కడి రాజు ఈ నగరంలో కొన్ని హిందూ దేవాలయాలను కూడా నిర్మించారని తెలిపారు. ‘అయుతయ’కు 35 కిలోమీటర్ల దూరంలో విష్ణువు, బ్రహ్మ, శంకరుని ఆలయం ఉంది. ‘అయుతయ’ రాజు 'రామతిబోధి' (రాముడు) అనే బిరుదును కలిగి ఉండేవాడు. అయోధ్య రామాయణంలో శ్రీరాముని రాజధాని వర్ణనలో ‘అయుతయ’ పేరు కూడా కనిపిస్తుంది. అయుతయను 1767లో బర్మీస్ దళాలు దోచుకుని ఆ ప్రాంతాన్ని నాశనం చేశాయి. ఇది కూడా చదవండి: ‘ఆ భారతీయుడే న్యూయార్క్‌లో హత్యకు కుట్రపన్నాడు’ थाईलैंड के 'अयुत्या' शहर का नाम प्राचीन भारतीय शहर अयोध्या के नाम पर रखा गया है। यहां एक ऐसा राजवंश है जिसके हर राजा को राम का अवतार माना जाता है।(29.11) (वीडियो 'अयुत्या' शहर से है।) pic.twitter.com/h8zY64JzJ7 — ANI_HindiNews (@AHindinews) November 29, 2023 -
శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు మూహూర్తం ఖరారు
అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపనకు ముహూర్తం ఖరారయ్యింది. 2024, జనవరి 22న అభిజీత్ లగ్నం, మృగశిర నక్షత్రంలో మధ్యాహ్నం 12:20 గంటలకు శ్రీరాముని విగ్రహానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ స్థాయి కల్పించేందుకు ఆదివారం సాకేత్ నిలయంలో సంఘ్ పరివార్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వేడుకల ప్రచారాన్ని నాలుగు దశలుగా విభజించి నిర్వహించాలని నిర్ణయించారు. దీనిలో మొదటి దశ ఇప్పటికే ప్రారంభమయ్యింది. ఇది డిసెంబర్ 20 వరకు కొనసాగనుంది. దీనిలో ఆరోజు నిర్వహించాల్సిన కార్యాచరణ ప్రణాళిక రూపురేఖలను సిద్ధం చేయనున్నారు. అలాగే స్టీరింగ్ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. జిల్లా, బ్లాక్ స్థాయిలో పది మందితో కూడిన బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రెండో దశలో డోర్ టు డోర్ కాంటాక్ట్ స్కీమ్ కింద 10 కోట్ల కుటుంబాలకు అక్షతలు, రాంలాల చిత్రం, కరపత్రం అందజేయనున్నారు. జనవరి 22న మొదలయ్యే మూడో దశలో దేశవ్యాప్తంగా వేడుకలు నిర్వహించనున్నారు. నాలుగో దశలో దేశవ్యాప్తంగా ఉన్న భక్తులకు శ్రీరాముని దర్శనభాగ్యం కలగనుంది. ఈ నాలుగో దశ గణతంత్ర దినోత్సవం నుండి ప్రారంభమై ఫిబ్రవరి 22 వరకు కొనసాగనుంది. నవంబర్ 20న భక్తులు ఆలయంలో ప్రదక్షిణలు చేపట్టనున్నారు. ఈ మార్గంలోని రోడ్లు, కూడళ్లకు మరమ్మతులు చేస్తున్నారు. తాత్కాలిక బస్టాండ్ నిర్మించారు. మఠాలు, ఆలయాలను అలంకరించారు. లక్నో నుండి వచ్చే భక్తులు సహదత్‌గంజ్ పరిక్రమ మార్గంలో ఫైజాబాద్ బస్సు స్టేషన్‌కు చేరుకుంటారు. రైలులో వచ్చే వారు అయోధ్య కాంట్‌కు చేరుకుంటారు. ఇక్కడి నుండి వారు అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ చేరుకోవచ్చు. ఈ ప్రదక్షిణల కార్యక్రమం నవంబర్ 21వ తేదీ రాత్రి 11:38 గంటలకు ముగియనుంది. ఇది కూడా చదవండి: విశ్వసుందరి పలాసియోస్ -
‘అయోధ్య’ తొలి అంతస్తు దాదాపు పూర్తి
న్యూఢిల్లీ: అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రామాలయ పనులు వేగం పుంజుకున్నాయి. ఆలయాన్ని మొత్తం మూడు అంతస్తుల్లో నిర్మిస్తుండగా తొలి అంతస్తు నిర్మాణం దాదాపు పూర్తికావచ్చింది. ఈ వివరాలను ఆలయ అధికారులు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ‘ ఈ ఏడాది అక్టోబర్‌కల్లా గ్రౌండ్‌ఫ్లోర్ నిర్మాణం పూర్తి అవుతుంది. నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా స్వయంగా ఈ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. నిర్మాణ పనులపై తాజా సమీక్షా సమావేశంలో నిర్మాణసంస్థలు లార్సెన్ అండ్ టూబ్రో, టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్ వారి నిపుణులు, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు. రోజువారీగా పనుల పర్యవేక్షణ కొనసాగుతోంది. గర్భగుడితో ఉన్న ప్రధాన ఆలయంతోపాటు నృత్య మండపం, ప్రధాన మండపం, కీర్తన మండపం ఇలా ఐదు మండపాలనూ నిర్మిస్తున్నారు. ఐదు మండపాలపై 34 అడుగుల పొడవు, 32 అడుగుల వెడల్పు, 32 అడుగుల ఎత్తు ఉండే గుమ్మటాలను ఏర్పాటుచేస్తారు. ఇవి భక్తులకు ఆలయం ప్రాంగణం నుంచి 69 అడుగుల నుంచి 111 అడుగుల ఎత్తుల్లో గోచరిస్తాయి. ప్రధాన ఆలయం పొడవు 380 అడుగులుకాగా, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులు. మొత్తం గర్భగుడి నిర్మాణంలో మక్రానా మార్బుల్‌తో చెక్కిన స్తంభాలు, పైకప్పు, కుడ్యాలను వినియోగించనున్నారు. ఆలయ బరువు, అన్ని రకాల వాతావరణ మార్పులను తట్టుకునేలా మొత్తంగా 392 భారీ స్తంభాలను ప్రధాన ఆలయం కోసం వాడుతున్నారు. గర్భగుడి ద్వారాలకు బంగారు పూత పూయనున్నారు. ఆలయ ప్రాకారంతో కలిపి రామాలయ విస్తీర్ణం 8.64 ఎకరాలు. ఆలయ ప్రాకారం పొడవు 762 మీటర్లుకాగా లోపలి ప్రాంగణంలో మొత్తం ఆరు ఆలయాలు నిర్మిస్తారు. భక్తుల కోసం విడిగా సదుపాయం కల్పిస్తారు’ అని ఆ ప్రకటన పేర్కొంది. -
శ్రీరామ పట్టాభిషేకానికి గవర్నర్ తమిళిసై
-
Srirama Navami 2023: పరిపూర్ణ పురుషోత్తముడు..
దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం అంతటా వ్యాపించి ఉన్న భగవానుడు మనకోసం ఒక రూపంలో ఒదిగిపోయి దివి నుంచి భువికి దిగి వస్తే, దాన్ని అవతారం అంటారు. అలా శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాలలో మానవ జీవితానికి అతి దగ్గరగా ఉండే అవతారం రామావతారం. చైత్ర శుద్ధ నవమి రోజు, లోకాలన్నిటి చేత నమస్కరింపబడే రాముడు ఈ భూమి మీద జన్మించాడు. పుట్టింది మొదలు ధర్మాన్నే అనుసరించాడు. పితృధర్మం, మాతృధర్మం, భ్రాతృధర్మం, స్నేహ ధర్మం, పత్నీ ధర్మం, ఋషుల ధర్మం... ఇలా అన్ని ధర్మాలు తెలిసినవాడు, ఆచరించినవాడు. అందుకే ‘రామో విగ్రహవాన్ ధర్మః’ అంటూ శత్రువులు కూడా ఆయనను స్తుతించారు. నేడు శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా... ఆ పరిపూర్ణ పురుషోత్తముడి గురించి తెలుసుకుందాం. అప్పటికి కౌసల్యాసుతునికి పదిహేను పదహారేళ్ల వయసుండొచ్చు. ఒకానొక రోజు దశరథమహారాజు రాముణ్ణి పిలిచి విశ్వామిత్ర మహర్షివైపు చూపిస్తూ ‘‘ఈ మహర్షితోపాటు నువ్వు అడవులకు వెళ్లాలి నాయనా...’’ అని అంటాడు. మరో పిల్లాడయితే ఏమనేవాడో ఏమో కానీ, రాముడు మాత్రం తండ్రి చెప్పాడు కాబట్టి కిమ్మనకుండా బయలుదేరాడు. అనుగు సోదరుడు లక్ష్మణుడు తోడు రాగా అడవుల్లోకి దారితీశాడు. తాటక సంహారం చేశాడు. అహల్యకు విమోచన ప్రసాదించాడు. రాముడు ఎంతటి క్రమశిక్షణ కలవాడంటే అంతఃపురంలో ఉన్నంత కాలమూ కన్నవారి మాట జవదాటలేదు. అరణ్యాల్లో ప్రవేశించాక విశ్వామిత్రుని ఆజ్ఞ మీరలేదు. సీతాస్వయంవరానికి తీసుకువెళతానని ఆ గురువర్యుడంటే∙మారు మాట్లాడకుండా అనుసరించాడు. పెద్దల మాటకే ప్రాధాన్యం జనకమహారాజు నెలకొల్పిన స్వయంవరమంటపంలో శ్రీరాముడు అడుగుమోపినా శివధనుస్సు ఉండే చోటికి హడావుడిగా వెళ్లిపోలేదు. దాన్ని భళ్లున ఎత్తేసి, ఫెళ్లున విరిచేసి, చేతులు దులిపేసుకోలేదు. ఎలాంటి తొందరపాటూ పడకుండా సభాభవనంలో నిమ్మళంగా కూర్చున్నాడు. శివధనువును ఎత్తాలంటూ విశ్వామిత్రుడు అనుజ్ఞ ఇచ్చాకనే రాముడు ఆ పనికి పూనుకున్నాడు. ధనస్సును సున్నితంగా ఎత్తిపట్టుకుని, నారి సారించి, విరిచాడు. ఇదంతా ఎలాంటి భావోద్వేగాలకు లోనుకాకుండా చేశాడు. అంత పెద్దపనీ పూర్తిచేశాక ధీర గంభీరంగా అడుగులు వేస్తూ తన ఉచితాసనానికి చేరుకున్నాడు. చిన్నపాటి విజయాన్ని సాధిస్తేనే మురిసి మెరిసిపోయే మనం, ఆ సందర్భాన రాముడి వర్తన నుంచి ఎన్ని పాఠాలు నేర్చుకోవచ్చో. చిన్న కష్టానికే కన్నీరొలికించడం. అల్పమైన సుఖాలకే అతిగా స్పందించడం.. లాంటి లక్షణాలను మరెంత సునాయాసంగా తొలగించుకోవచ్చో! వినయ విధేయతలు తొందరపాటు...తొట్రుపాటు అనేవి రాముడి నిఘంటువులోనే లేదు. శివధనువును విరవగానే సీతను రాముడికిచ్చి పెళ్లి చేస్తానని జనకుడు చెప్పిన మాట విని ఎగిరి గంతేయలేదు. వెంటనే సీత మెడలో మూడు ముళ్లూ వేసేయలేదు. జనకుని ప్రతిపాదనను తన కన్నవారికి తెలియజేయాలని, అందుకు వారి అనుమతి అవసరమనీ వినమ్రంగా చెప్పాడు. ఎవరి పట్ల ఏవేళ ఎలా ఆదరం చూపాలో రామునికి బాగా తెలుసుననడానికి ఇంతకు మించిన ఉదాహరణ మరొకటి లేదు. అలా ఆ పెద్దలందరి సమక్షంలోనూ మైథిలి చేయి అందుకున్నాడు. సీతారాముల కళ్యాణం జరిగి ఎంతోసేపు అవనే అవదు. పరశురాముడు వేంచేశాడు. పెళ్లివేదిక వద్దకు వస్తూనే ఆ మహాశయుడు వీరావేశాన్ని ప్రదర్శించాడు. ప్రపంచంలో రాముడంటే పరశురాముడేనని, మరో రాముడికి లోకాన చోటు లేనేలేదని వీరవిహారం చేశాడు. అటు జనకుడు, ఇటు దశరథుడు పరశురాముని క్రౌర్యాన్ని చూసి బెంబేలెత్తిపోయారు. అయితే రాముడు ఏమాత్రం తొందరపడలేదు. పరశురాముడు ఎంతగా పేట్రేగిపోతుంటే రాముడు అంత ప్రశాంతంగా ఉన్నాడు. పరశురాముడు అందించిన విష్ణుధనువును సునాయాసంగా పైకెత్తాడు. తను శ్రీహరి ప్రతిరూపమని చెప్పకనే చెప్పాడు. దీంతో పరశురాముడికి కమ్మిన పొరలు తొలగిపోయాయి. తారుమారైనా... మర్నాడు పొద్దున్నే పట్టాభిషేకం జరగాల్సి ఉంది. రాత్రికి రాత్రే కథ మారిపోయింది. కైకమ్మ స్వయంగా పిలిచి, తన మాటల్ని దశరథుని ఆదేశాలుగా వినిపించింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా పద్నాలుగేళ్లపాటు అరణ్యవాసం చేయాలని ఆజ్ఞాపించింది. మారు తల్లి మాటలను మన్నించాడు. అడవుల్లోకి పోయేందుకు సిద్ధమేనంటూ అందుకు రథాన్ని సిద్ధం చెయ్యమన్నాడు. మంగళస్నానాలు చేసి రాజదండాన్ని చేపట్టాల్సిన వేళ పత్నినీ, సోదరునీ వెంటబెట్టుకుని గుహుని పడవమీద నది దాటుకుంటూ పోయాడు. అడవుల్లోనూ ఆ రామునికి ప్రశాంతత లేనే లేదు. కష్టాలూ కన్నీళ్లే! సీతమ్మను రావణుడు అపహరించుకుపోయాక మానసికంగా నలిగిపోయాడు. చివరికి లంకలో అమ్మవారు ఉన్నారన్న సంగతి తెలిసి కొంత స్థిమితపడ్డాడు. తన ప్రియపత్నిని తన వద్దకు తెచ్చుకునేందుకు తగిన ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. వానరసైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. విభీషణునితో చెలిమిచేశాడు. ఓరిమితో వ్యవహరించాడు. తగిన సమయం కోసం ఓపికగా ఎదురు చూశాడు. సముద్రం మీద సేతువును నిర్మించాడు. అందుబాటులో ఉన్న వానర సేన సహకారంతోనే అమిత బలవంతుడైన శత్రువుతో యుద్ధం చేశాడు. విజేత తానే అయ్యాడు. స్థితప్రజ్ఞావంతుడు దక్కుతుందనుకున్న రాజ్యం క్షణాల్లో చేజారిపోయింది. వనవాస క్లేశాలు ముదిరిపోయాయి. సరసరాజాన్నభోజనాల స్థానంలో ఆకులు అలములు తినాల్సి వచ్చింది. ఒకవైపు భార్యావియోగం. మరోవైపు రాక్షసబాధ. వయసేమంత పెద్దది కాదు. అయినా చలించలేదు. స్థిరంగా ఉన్నాడు. దృఢంగా ఉన్నాడు. స్థితప్రజ్ఞతతో వ్యవహరించాడు. మరి ఇప్పటికాలాన మనం ఎలా ఉన్నాం..? బస్సు దొరక్కపోతే ఆందోళన. సినిమా టికెట్టు అందకపోతే అశాంతి. పరీక్షలో మార్కులు తక్కువయితే ఆవేదన. అన్నింటికీ తొందరే. ప్రేమ తొందర. పెళ్లి తొందర. ఇలా అయితే ఎలా. రాముని వంటి వారినే కష్టాలు కాల్చుకు తిన్నాయి. అన్నింటినీ ఆయన ఓపిగ్గా ఎదుర్కొన్నాడు. ఆయనతో పోల్చుకుంటే మనం ఎంతటి వారం? ఆయన పడ్డ కష్టాలతో పోల్చి చూసుకుంటే మన కష్టాలు ఏపాటివి?ఎప్పటి త్రేతాయుగం? రాముడు పుట్టి రెండు యుగాలయింది. మనమిప్పుడు కలికాలంలో ఉన్నాం. అయినా ఆ ఆదర్శనీయుణ్ణి నేటికీ మరువలేకపోతున్నాం. అదే ఆయన వ్యక్తిత్వం. అందుకే మానవుడిగా పుట్టినా, రాముడు మనకు దేవుడయ్యాడు. ఆయన నడిచిన బాట అయిన రామాయణం పఠనీయ కావ్యం అయింది. అందుకే రామాయణాన్ని పారాయణం చేయాలి. అందులోని మంచిని ఒంటబట్టించుకోవాలి. కృతజ్ఞత ఆయన రక్తంలోనే ఉంది చేసిన సహాయాన్ని ఎన్నటికీ మరువని సద్గుణ సంపన్నత రామునిది. అందుకే సీతమ్మ జాడతెలుసుకున్న ఆంజనేయస్వామిని బిడ్డలా చూసుకున్నాడు. ఎవరికీ ఇవ్వనంతటి చనువును ఇచ్చాడు. తన ప్రేమను పంచాడు. సుగ్రీవుడికి పట్టం కట్టాడు. విభీషణునికి లంకేశునిగా మకుటం తొడిగాడు. ..జననీ జన్మభూమిశ్చ.. రావణ సంహారం జరిగాక ఆ రాక్షస రాజు మనసుపడి కట్టించుకున్న కోటను స్వాధీనం చేసుకోవాలని లక్ష్మణుడు భావించాడు. విషయాన్ని అన్నతో చెప్పాడు. యావత్ లంకానగరమే మణిమయ నిర్మితమైనది. అందులోని రాజ సౌధం సామాన్యమైంది కాదు. ఎటు చూసినా బంగారమే. కాని, రాముని తీరు వేరు. ఆయనకు దురాశ ఉండదు. ఆయన ధర్మం తప్పడు. లక్ష్మణుని సలహాను సున్నితంగా తిరస్కరిస్తాడు. ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ’ అంటూ అయోధ్యవైపు చూడాలని సూచన చేస్తాడు. లంక విభీషణునికే చెందుతుందని స్పష్టం చేస్తాడు. అంటే పరాయి ప్రదేశం ఎంతటి గొప్పదైనా, సుందరమైనదైనా దానిని చూసి మనసు పారేసుకోలేదు. మాతృభూమిని మరువలేదు. పుట్టిన గడ్డపై ప్రేమను పోగొట్టుకోలేదు. రామ నైవేద్యం పానకం కావలసినవి: బెల్లం పొడి– పావు కేజీ; నీళ్లు– లీటరు; యాలకుల పొడి– టీ స్పూన్; మిరియాల పొడి– టీ స్పూన్; శొంఠిపొడి– చిటికెడు తయారీ: బెల్లం పొడిలో నీటిని కలిపి కరిగిన తర్వాత వడపోయాలి. ఈ బెల్లం నీటిలో యాలకుల పొడి, మిరియాల పొడి, శొంఠిపొడి కలిపితే పానకం రెడీ. వడపప్పు కావలసినవి: పెసరపప్పు – పావు కేజీ; పచ్చిమిర్చి ముక్కలు – టీ స్పూన్; పచ్చి కొబ్బరి తురుము– టేబుల్ స్పూన్; మామిడి కాయ తురుము– టేబుల్ స్పూన్ తయారీ: పెసరపప్పు శుభ్రంగా కడిగి అరగంట సేపు నానబెట్టాలి. గింజ మెత్తబడిన తర్వాత నీటిని వంపేసి అందులో పైన తీసుకున్న దినుసులన్నీ కలిపితే వడపప్పు రెడీ. వడపప్పు, పానకం ఆరోగ్యకరమైనవి. ఈ రెండింటినీ కలిపి తింటే జీర్ణవ్యవస్థ పని తీరు మెరుగవుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు తొలగిపోతాయి. వేసవి మొదలైన ఈ సమయంలో ఆరోగ్యం ఒడిదొడుకులను పానకం నివారిస్తుంది. యాలకుల పొడి అతిదాహాన్ని తగ్గిస్తుంది. – డి.వి.ఆర్. భాస్కర్ -
కౌత్సుడి గురుదక్షిణ..
నాయనా! నాకు తెలిసిన విద్యలన్నీ నీకు నేర్పించాను. క్షుణ్ణంగా నేర్చుకున్నావు. ఇక ఇంటికివెళ్లి, తగిన కన్యను పెళ్లాడి గృహస్థాశ్రమాన్ని స్వీకరించు. శ్రీరామచంద్రుడి తాత అయిన రఘు మహారాజు పరిపాలిస్తున్న రోజులవి. రఘు మహారాజు పాలనలో విద్యలకు గొప్ప ఆదరణ ఉండేది. విరివిగా గురుకులాలు ఉండేవి. ప్రతి గురుకులంలోనూ వందలాదిగా శిష్యులుండేవారు. గురువుల శుశ్రూషలో గడుపుతూ, విద్యలు నేర్చుకునేవారు. పరతంతు మహాముని నడిపే గురుకులంలో కౌత్సుడనే పేదబాలకుడు కూడా విద్యాభ్యాసం చేసేవాడు. గురువును అత్యంత భక్తిశ్రద్ధలతో సేవించుకుంటూ, వేదవేదాంగాలను, సకల శాస్త్రాలనూ క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. కౌత్సుడి విద్యాభ్యాసం పూర్తయిన సందర్భంగా గురువు పరతంతుడు అతణ్ణి చేరబిలిచి, ‘నాయనా! నాకు తెలిసిన విద్యలన్నీ నీకు నేర్పించాను. క్షుణ్ణంగా నేర్చుకున్నావు. ఇక ఇంటికివెళ్లి, తగిన కన్యను పెళ్లాడి గృహస్థాశ్రమాన్ని స్వీకరించు. ఎప్పటికీ స్వాధ్యాయాన్ని శ్రద్ధగా కొనసాగించు. గృహస్థాశ్రమంలో కోపతాపాలకు తావివ్వకు. త్యాగంతో కూడిన భోగమే గొప్పదని గ్రహించు. ధర్మాన్ని ఆచరించు’ అని చెప్పాడు. ‘గురువర్యా! విద్యాభ్యాస సమయంలో చేసిన దోషాలను మీరు క్షమించాలి. మీకు గురుదక్షిణ చెల్లించడం శిష్యునిగా నా కర్తవ్యం. గురుదక్షిణగా ఏం కావాలో ఆదేశించండి’ అన్నాడు కౌత్సుడు. ‘నిరుపేదవు నువ్వేమిచ్చుకుంటావు నాయనా! ఆశ్రమంలో సేవలు చేసుకుంటూ, నా శుశ్రూషలో గడిపావు కదా! అది చాలు. నీ సేవలను చాలాసార్లు మెచ్చుకున్నాను కూడా. నువ్వు నాకేమీ ఇవ్వనక్కర్లేదు. సంతోషంగా వెళ్లిరా’ అన్నాడు గురువు పరతంతుడు. ‘గురువర్యా! దయచేసి మీరు అలా అనవద్దు. గురుదక్షిణ కోరుకోండి. తప్పక చెల్లించి మీ రుణం తీర్చుకుంటాను’ అన్నాడు కౌత్సుడు. తనకు ఏమీ ఇవ్వనవసరం లేదని పరతంతు మహాముని పదేపదే చెప్పినా, కౌత్సుడు వినిపించుకోలేదు. గురుదక్షిణ కోరుకోవాల్సిందేనంటూ పట్టుబట్టాడు. శిష్యుడి మొండితనానికి విసిగిన గురువు ఇలా అన్నాడు: ‘నాయనా! నీకు పద్నాలుగేళ్లు పద్నాలుగు విద్యలను నేర్పించాను. ఒక మనిషి ఏనుగుపై నిలబడి, ఒక గులకరాయిని విసిరితే, ఆ రాయి ఎంత ఎత్తుకు ఎగురుతుందో అంత ఎత్తు గల పద్నాలుగు ధనరాశులు ఇవ్వు’ అన్నాడు. ‘సరే’నని గురువుకు నమస్కరించి, బయలుదేరాడు కౌత్సుడు. గురువుకు గురుదక్షిణ చెల్లించాలనే సంకల్పమే తప్ప, ఎలా చెల్లించాలో అతడికి అంతుచిక్కలేదు. రాజు తండ్రివంటి వాడంటారు. రాజును కోరుకుంటే తప్పక తనకు కావలసిన ధనరాశులు దొరుకుతాయని ఆలోచించి, రాజ దర్శనానికి బయలుదేరాడు. రఘు మహారాజు వద్దకు వచ్చాడు కౌత్సుడు. అంతకుముందు రోజే రఘు మహారాజు ఒక మహాయజ్ఞం చేసి, తన వద్దనున్న ధనరాశులన్నింటినీ దానం చేశాడు. కౌత్సుడు వచ్చేసరికి రఘు మహారాజు మట్టి కుండలు ఎదుట పెట్టుకుని, సంధ్యావందనం చేస్తున్నాడు. కౌత్సుడిని గమనించిన రఘు మహారాజు ‘నాయనా! నువ్వెవరివి? ఏ పనిమీద వచ్చావు?’ అని అడిగాడు. మహారాజు పరిస్థితిని గమనించిన కౌత్సుడు ‘అది కష్టంలే మహారాజా!’ అని నిష్క్రమించడానికి వెనుదిరిగాడు. రఘు మహారాజు అతణ్ణి వెనక్కు పిలిచాడు. ‘నా వద్దకు వచ్చి, వట్టి చేతులతో వెనుదిరగడమా? ఏం కావాలో సంశయించకుండా అడుగు. తప్పక ఇస్తాను’ అన్నాడు. కౌత్సుడు తన గురువుకు చెల్లించాల్సిన గురుదక్షిణ కోసం వచ్చానంటూ, జరిగిన వృత్తాంతమంతా చెప్పాడు. ‘రేపు ఉదయమే కనిపించు. నీవు కోరిన ధనరాశులు ఇచ్చుకుంటాను’ అని కౌత్సుణ్ణి సాగనంపాడు రఘు మహారాజు. యజ్ఞంలో చేసిన దానాల వల్ల ఖజానా ఖాళీ అయిన స్థితిలో ఏం చేయాలో పాలుపోలేదు మహారాజుకు. మంత్రులతో సంప్రదించాడు. వారి సలహాపై రాజగురువైన వశిష్ఠుని వద్దకు వెళ్లాడు. ‘తక్షణమే అంత ధనం కావాలంటే, దేవేంద్రుడిపై దండెత్తడమే మార్గం’ అని సూచించాడు. రఘు మహారాజు దేవేంద్రుడిపై దండ్రయాత్రకు బయలుదేరాడు. ఆయన సైన్యం చేసే భేరీనాదాలకు దేవేంద్రుడి చెవులు మార్మోగాయి. దేవదూతల ద్వారా రఘు మహారాజు దండయాత్రకు వస్తున్నట్లు తెలుసుకున్నాడు. ‘ధర్మాత్ముడైన రఘు మహారాజు ఏమి కోరి దండయాత్రకు వస్తున్నాడో కనుక్కోండి. ఆయనను కోరినది ఇచ్చి, సంధికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పండి’ అని దేవదూతలను పంపాడు. ధనరాశులు కోరి దండయాత్రకు వచ్చినట్లు తెలుసుకున్న దేవేంద్రుడు, తక్షణమే రఘు మహారాజు కోశాగారాలన్నింటినీ ధనరాశులతో నింపివేయాలని దేవదూతలను ఆదేశించాడు. కోశాగారాలు అపార ధనరాశులతో నిండిపోయి ఉండటం గమనించిన రాజభటులు హుటాహుటిన రఘు మహారాజు వద్దకు చేరుకుని, సంగతి చెప్పారు. యుద్ధం చేయకుండానే పని నెరవేరడంతో రఘు మహారాజు సైన్యంతో వెనుదిరిగాడు. మర్నాడు ఉదయమే వచ్చిన కౌత్సుడికి తన కోశాగారాల్లోని ధనరాశులను చూపించి, ‘నీకు కావలసిన ధనరాశులు తీసుకువెళ్లు’ అన్నాడు. కౌత్సుడు వాటిని చూసి, ‘నా గురువు పద్నాలుగు ధనరాశులే కోరుకున్నాడు. ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయి. మిగిలినవి నాకొద్దు’ అంటూ తన గురువు కోరినన్ని మాత్రమే ధనరాశులను తీసుకుని బయలుదేరాడు. మిగిలిన ధనరాశులను రఘు మహారాజు తిరిగి దేవేంద్రుడికి పంపేశాడు. ∙సాంఖ్యాయన -
అయోద్యలో శ్రీరాముడి విగ్రహం ఆవిష్కరణ
-
భద్రాద్రిలో వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం
-
‘సీతాదేవి అందుకు పూర్తి అర్హురాలు’
లక్నో : అఖండ భారతావనిని ఏకం చేసిన సర్ధార్ వల్లభ్‌భాయ్ పటేల్ గౌరవార్థం ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ ఐక్యతా విగ్రహం ఆవిష్కరణ అనంతరం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తమ రాష్ట్రంలో శ్రీరాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. దాదాపు 221 మీటర్ల ఎత్తు ఉండే రాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు యోగి తెలిపారు. రాముడి విగ్రహంతో పాటు సీతా దేవి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలంటూ యోగికి లేఖ రాశారు యూపీ కాంగ్రెస్ నాయకుడు కరణ్ సింగ్. ‘మీరు రాముడి విగ్రహాన్ని నిర్మించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. అయితే నా అభ్యర్థన ఏంటంటే రాముడి విగ్రహం ఎత్తును తగ్గించడమే కాక శ్రీరామునితో పాటు సీతాదేవి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయండి. రామున్ని పెళ్లి చేసుకున్న తర్వాత సీతా దేవి అయోధ్య వచ్చారు.. కానీ కొద్ది రోజుల్లోనే శ్రీరామునితో కలిసి వనవాసం చేయడానికి అడవులకు వెళ్లారు. 14 ఏళ్లు అరణ్యవాసంలో ఉన్నారు. చివరకు రావణాసురుడు అమ్మను ఎత్తుకెళ్లాడు. ఆ రాక్షసుడి చెర నుంచి రాముడు సీతాదేవిని విడిపించాడు. కానీ అగ్ని పరీక్షలో నెగ్గినప్పటికి.. చివరకూ ఆ తల్లి మళ్లీ అడవుల పాలయ్యారు. అది గర్భవతిగా ఉన్న సమయంలో.. మొత్తంగా చాలా తక్కువ రోజులు మాత్రమే సీతాదేవి అయోధ్యలో ఉన్నారు. కానీ అయోధ్యలో ఉండటానికి ఆ తల్లికి పూర్తి అర్హత ఉంది. కనుక కేవలం రాముని విగ్రహాన్ని మాత్రమే కాక.. సీతారాముల విగ్రహాన్ని ఏర్పాటు చేయండంటూ’ కరణ్ సింగ్ తన లేఖలో రాశారు. -
కత్తి మహేశ్‌ను అరెస్ట్ చేసిన పోలిసులు
-
ప్రియదర్శనం
కళ్లకు ప్రియమైన దృశ్యాన్ని చూడటం ద్వారా, మనసుకు నచ్చే ప్రదేశాన్ని దర్శించడంవల్ల కూడా మనం ఆనందాన్ని పొందుతూ ఉంటాము. అంతే కాకుండా కంటిని ఆకర్షించే రూపం గల వ్యక్తిని లేదా మనసుకు దగ్గరైన వ్యక్తిని దర్శించడంవల్ల కూడా సంతోషం కలుగుతూ ఉంటుంది. అయితే మనకు ప్రస్తుతం ప్రియంగా భాసిస్తున్న వ్యక్తులో, దృశ్యాలో కొంత కాలం తరువాత అప్రి యంగా మారవచ్చు. కాని తన రూపం చేత, గుణాల చేత అందరినీ ఆకర్షించే శ్రీరామచంద్రుని దివ్య మంగళ విగ్రహ దర్శనం ప్రాంత-వయో-లింగ కాల భేదం లేకుండా అందరికీ ప్రియమైనట్టిదే. శ్రీరామచంద్రుని సుందరమైన వదనాన్ని దర్శిం చిన వారికి ఎవరికీ విసుగు రాకపోయేదట. ఆయన దర్శనం పొందిన వారికి ఇక చాలులే అనే సంతృప్తి కలుగదట. ఇంకా ఇంకా దర్శించాలనే ఆశ రేకెత్తు తూనే ఉండేదట. చంద్రుని కన్నా సుందరమైన ముఖ సౌందర్యం, సర్వాతి శయమైన అవయవ శోభ కలిగిన శ్రీరామచంద్రుని దర్శించే వారం దరికీ ఆయన నిత్య నూతనంగా భాసిస్తూ నేత్రానందాన్ని, పరమ ప్రీతిని కలిగించెడివాడట. శ్రీరామచంద్రుని రూపం, గుణాలు వ్యక్తుల దృష్టినే కాకుండా వారి మనసును కూడా బాగా ఆకర్షిస్తాయని వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణంలోని అయోధ్యాకాండలో ‘చంద్రకాంతాననం రామం అతీవ ప్రియదర్శనమ్/ రూపౌదార్యగుణైః పుంసాం దృష్టిచిత్తాపహారిణమ్॥అనే శ్లోకం ద్వారా పేర్కొన్నాడు. సాధారణంగా లోకంలో స్త్రీ సౌందర్యం పురు షులను, పురుషుల సౌందర్యం స్త్రీలను మాత్రమే ఆక ర్షిస్తూ ఉంటుంది అనే విషయం మనకు తెలిసిందే. అయితే శ్రీరామచంద్రుని సౌందర్యం స్త్రీలనే కాక పురు షులను కూడా విశేషంగా ఆకర్షించేదని ‘పుంసాం మోహన రూపాయ’ వంటి ప్రమాణ వాక్యాలు విశద పరుస్తున్నాయి. దశరథ మహారాజు సుమంత్రుడు అను పేరుగల ముఖ్యమైన మంత్రిని శ్రీరామచంద్రుని వద్దకు పంపి తన సభకు రప్పించుకొన్నాడు. రథంపై ఊరేగుతూ వచ్చిన శ్రీరాముని అద్భుత సౌందర్యాన్ని దశరథుడు తదేక దృష్టితో చూస్తూ ఉండిపోయాడు. శ్రీరాముని రూపమే కాక, ఆయన నడక సౌందర్యం కూడా అందరికీ ప్రియాన్ని కలిగించేదే. అందుకే శ్రీరాముని నడక సౌందర్యాన్ని పరమప్రియంగా దర్శించే దశరథ మహారాజు ముసలితనపు బాధలు దూరమయ్యేవట. ఆయన మనసు యవ్వన దశను పొందేదట. పరమప్రియ దర్శనాన్ని మనకు అనుగ్రహించే శ్రీరామచంద్రుని స్మరిద్దాం. ఆయన గుణాలను ఆదర్శంగా గ్రహిద్దాం. - సముద్రాల శఠగోపాచార్యులు -
పరిపూర్ణ మానవుడు... శ్రీరాముడు!
స్పెషల్ స్టోరీ ఏప్రిల్ 15 శ్రీరామనవమి మానవ సంబంధాలు గతి తప్పి, వికృత, విశృంఖల ప్రవర్తన వెర్రితలలు వేస్తున్న ఈ రోజుల్లో మనిషి మనిషిలా ఎలా జీవించాలన్న విషయాన్ని తెలుసుకోవడానికి శ్రీరాముని జీవితాన్ని అధ్యయనం చేయవలసిన అవసరం మునుపటి కంటే చాలా ఎక్కువగా ఉంది. ఈ రోజుల్లోనే, రామ కథాశ్రవణం, రాముని గుణగణాల అధ్యయనం, రాముని అనుసరించే ప్రయత్నం చేయడం ఎక్కువ అవసరం. బ్రహ్మ ఇచ్చిన వరాలబలం వల్ల రావణ వధ అనేది దేవ, దానవ, యక్ష, సిద్ధ, సాధ్య, కిన్నెర, కింపురుషాదులు ఎవరికీ సాధ్యం కాని పని. నర వానరుల పట్ల రావణునికి ఉన్న తేలిక భావం కారణంగా వారి చేతిలో మరణం లేకుండా ఉండాలని వరంలో భాగంగా బ్రహ్మను కోరనూ లేదు, బ్రహ్మ ఇవ్వనూ లేదు. అందువల్ల నరుడుగా జన్మించి, నరుడుగా వ్యవహ రించినపుడు మాత్రమే శ్రీమహావిష్ణువుకైనా రావణుని చంపడం సాధ్యమౌతుంది. ఇందుకొరకు వానర రూపంలో జన్మించిన దేవతాగణాల సహాయం తీసుకొని రావణుని వధించవలసి వచ్చింది. ఒక పరిపూర్ణ మానవుడు, ఒక ఆదర్శ మానవుడు ఎలా ప్రవర్తించాలి? నరుల పట్ల ఉన్న తేలిక భావం తొలగించాలన్నా, ఆదర్శ మానవ సంబంధాలు, ఆదర్శ కుటుంబ సంబంధాలు ఎలా ఉండాన్న విషయాన్ని నా జీవితమే నా సందేశం అన్నట్లుగా జీవించి చూపాలన్నా ఇది అవసరం అవుతుంది. అలా జీవించి చూపిన అవతారమే శ్రీరామావతారం. మానవ సంబంధాలు గతి తప్పి, వికృత, విశృంఖల ప్రవర్తన వెర్రితలలు వేస్తున్న ఈ రోజుల్లో మనిషి మనిషిలా ఎలా జీవించాలన్న విషయాన్ని తెలుసుకోవడానికి శ్రీరాముని జీవితాన్ని అధ్యయనం చేయవలసిన అవసరం మునుపటి కంటే చాలా ఎక్కువగా ఉంది. ఈ రోజుల్లోనే, రామ కథాశ్రవణం, రాముని గుణగణాల అధ్యయనం, రాముని అనుసరించే ప్రయత్నం చేయడం ఎక్కువ అవసరం. రాముడిని దేవుడిగా కొలవడం ముమ్మాటికీ తప్పు కాదు. కానీ రాముడిని దేవుడిగా ఆరాధిస్తూనే, రాముడి జీవితం నుంచి మనం ఎలా జీవించాలి అన్న అంశాన్ని నేర్చుకోవడం అంతకంటే ముఖ్యం. రామాయణ రచనా ప్రారంభంలోనే వాల్మీకి మహర్షి... తన ఆశ్రమానికి వచ్చిన బ్రహ్మ మానస పుత్రుడైన నారద మహర్షిని ఏమడిగాడంటే... ఈ లోకంలో ఇప్పుడే, ఇక్కడే ఉన్న గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞత భావం కలిగినవాడు, సత్యం పలికేవాడు, దృఢమైన సంకల్పం కలిగినవాడు, చారిత్రము కలిగినవాడు, అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్ధుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంత సౌందర్యం కలిగినవాడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించినవాడు, తేజస్సు కలిగినవాడు, ఎదుటివారిలో మంచిని చూసేవాడు, ఎవరి కోపం దేవతలను కూడ భయపెడుతుందో అట్టి వ్యక్తి ఉంటే నాకు చెప్పండి అని అడిగాడు. వాల్మీకి మహర్షిలో జాగృతమైన బ్రహ్మజిజ్ఞాసే ఈ ప్రశ్న అన్నది ఇందులో ఉన్న నిగూఢార్థం. వాల్మీకి మహర్షి నారదులవారిని షోడశ గుణాత్మకమైన భగవత్ తత్వాన్ని గురించి ప్రశ్నించగా నారదుడు ఈ లక్షణాలన్నీ నర రూపంలో భూమిపై నడయాడుతున్న నారాయణుడైన శ్రీరామునివేనని వివరిస్తాడు. అలా ఈ లక్షణాలు పరిపూర్ణ మానవుని లక్షణాలుగా కూడా స్వీకరించదగినవి. చాలా చిన్న కారణాలకే కుంగి పోయి నిస్పృహకు గురయ్యే నేటి తరం శ్రీరాముని వద్ద నేర్చుకో వలసిన అతి గొప్ప లక్షణం స్థిత ప్రఙ్ఞత్వం. ఈ రోజు ఉదయం తండ్రి పిలిచి ‘‘రామా రేపే నీ పట్టాభిషేకం. నీవు, నీ భార్య అవసరమైన దీక్షను చేపట్టండి’’ అన్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉండిపోయాడో ఆ రోజే రాత్రి కైకేయి పిలిపించి, ‘రామా! మీ నాన్న చెప్పలేక పోతున్నారు. నీకు పట్టాభిషేకం చేయడం లేదు, రేపటి నుంచీ నీవు జటాధారివై, ముని వృత్తి స్వీకరించి 14 సంవత్సరాల పాటు వనవాసం చేయాలి’ అని చెప్పినప్పుడూ అంతే సహజంగా స్వీకరించాడు. ఆవేశపడిపోయి, తల్లిదండ్రులను శాపనార్థాలు పెట్టకుండా ఉండడమే కాక, ఆవేశపడుతున్న లక్ష్మణుడిని మందలించి అరణ్యవాసానికి చాలా హాయిగా సిద్ధపడిపోయాడు. దేశభక్తి మాతృభక్తి కూడా రాముని చూసి నేర్చుకోవాలి. రావణ సంహారం తరువాత లంకా నగరంలో సంచరిస్తూ ఆ నగర సౌందర్యానికి ముగ్ధుడైన లక్ష్మణునితో ‘బంగారంతో నిండినదైనా నాకు లంకా నగరం రుచించదు లక్ష్మణా, జననీ జన్మ భూములు స్వర్గం కంటే గొప్పవి’ అన్నాడు. ఇంతకుమించిన దేశభక్తి, జాతీయతా భావన మరెక్కడ కనిపిస్తాయి? కృతజ్ఞతా గుణం మానవునికి ఉండవలసిన ఉత్తమ గుణాలలో ప్రధానమైనది. ఈ గుణం రామునిలో పుష్కలంగా దర్శనమిస్తుంది. పరిస్థితుల ప్రభావం వల్ల తండ్రికి దహన సంస్కారం కూడా చేయలేకపోతాడు రాముడు. సీతను రక్షించడం కోసం రావణునితో పోరాడి కొన ప్రాణాలతో మిగిలి ఉన్న జటాయువు పట్ల కృతజ్ఞతాభావంతో రాముడు, జటాయువుకు అంత్యక్రియలు నిర్వహిస్తాడు. ఇదీ కృతజ్ఞతా గుణం అంటే. మనకు చిన్న ఉపకారం చేసినవారిని కూడా మరచిపోకుండా వారికి అవసరమైనప్పుడు ప్రతి సహాయం చేయగలిగే సంస్కారం రాముని దగ్గరే నేర్చుకోవాలి. మనలను ఆశ్రయించి శరణు కోరిన వారిని పరిత్యజించకుండా శరణు ప్రసాదించడాన్ని వ్రతంగా కొనసాగించినవాడు రాముడు. చంపదగినట్టి శత్రువు రావణుని సోదరుడైన విభీషణుడు తనను శరణు కోరి అర్ధించినపుడు, (హనుమంతుడు తప్ప మిగిలిన) వానర ప్రముఖులు అవమానించినా, ఎట్లాంటి సంశయం లేకుండా అతనికి శరణు ప్రసాదించి, రావణుడే కోరినా శరణమిస్తానని అంటాడు. ఒక పాలకుడుగా ప్రజారంజకమైన పాలన అందివ్వడమే కాదు. ప్రజలకు తాను ఆదర్శంగా నిలవగలగాలి. ఉత్తముడైన పాలకుని లక్షణం అది. నా వ్యక్తిగత జీవితం, నా ఇష్టం అనడానికి పాలకునికి హక్కు లేదు. అందుకే తను రావణ వధానంతరం సీతను చేపట్టడాన్ని గురించి విమర్శ రాగానే, ఆమెను పరిత్యజించడానికి సిద్ధపడ్డాడు. రాముడు కేవలం సీతారాముడే కాదు రాజా రాముడు కూడా. తన మీద విమర్శలు వెల్లువెత్తుతున్నా, ప్రజలు చీదరించుకొంటున్నా, నీ చేష్ఠలు భరించ లేకుండా ఉన్నాం, దిగిపోవయ్యా మహానుభావా అని ప్రజలు నెత్తీ నోరూ మొత్తుకొంటున్నా కుర్చీని పట్టుకొని వేలాడుతున్న నేటి రాజకీయ నాయకులు రాముని చూచి నేర్చుకోవలసినది ఎంతైనా ఉంది. ఇతర ఆభరణాలన్నీ నశించిపోయేవే శాశ్వతమైన భూషణం వాగ్భూషణమే. శ్రీరాముడిని వచస్విగా, ‘వాగ్మి’ (చక్కని వక్త)గా వాల్మీకి వర్ణించాడు. రామచంద్రుడు మృదుభాషి, మితభాషి, మధురభాషి, పూర్వభాషి, స్మితపూర్వభాషి అని ప్రశంసించాడు. తానే ముందుగా పలకరించడం, నెమ్మదిగా, ప్రశాంతంగా ఆవేశానికి లోను కాకుండా మాట్లాడగలగడం రాముని ప్రధాన లక్షణాలు. రాముడు చిరునవ్వుతో పలకరించి, తరువాత మధురమైన మాటలతో మనసు చల్లబరచేవాడు. అంతేకాదు. కొద్ది నిముషాలు ఎదుటి వ్యక్తితో మాట్లాడగానే అతని వ్యక్తిత్వాన్నీ, సామర్థ్యాన్నీ అంచనా వేయగలిగే సామర్థ్యం రాముని సొత్తు. కిష్కింధకాండలో హనుమంతుడు రాముని తొలిసారిగా యతి వేషంలో కలిసి రామునితో పరిచయ వాక్యాలుగా నాలుగు మాటలు మాట్లాడుతాడు. హనుమంతుని సామర్థ్యాన్ని గురించి రాముడు కచ్చితమైన అంచనా వేస్తాడు. ఈ వ్యక్తి వేదవేత్త అని, వ్యాకరణ నిపుణుడనీ, మాట్లాడే సమయంలో ఇతని శరీర భంగిమలూ (బాడీ లాంగ్వేజ్) మాట్లాడే విధానమూ ఇతనిని ఒక అసాధారణ ప్రతిభాసంపన్నుడిగా తెలియ జేస్తున్నాయని, ఇట్టి మంత్రివర్యుని కలిగిన రాజుకు అసాధ్యమైనది ఉండదనీ లక్ష్మణునితో చెబుతాడు రాముడు. దీన్నిబట్టే రాముని సూక్ష్మబుద్ధి ఎలాంటిదో తెలుసుకోవచ్చు. రాముని సోదర ప్రేమ, సోదరుల పట్ల అతనికి ఉన్న తాపత్రయం వారి పట్ల అతనికి ఉన్న విశ్వాసం అసాధారణమైనవి. రాముని మరలా తీసుకువెళ్లి రాజ్యాభిషేకం చేయడానికి భరతుడు సైన్యంతో సహా బయలుదేరాడు. దూరం నుంచీ సైన్య సమేతంగా వస్తున్న భరతుని చూచి మనలను చంపి రాజ్యాధి కారాన్ని శాశ్వతం చేసుకోవడానికి భరతుడు వస్తున్నాడు. అతడిని నేను తుదముట్టిస్తానని ఆవేశపడతాడు లక్ష్మణుడు. అప్పుడు రాముడు భరతుని సోదర ప్రేమనూ, తనపట్ల అతనికి ఉన్న భక్తి భావాన్ని లక్ష్మణునికి వివరిస్తాడు. వ్యక్తుల పట్ల లోతైన అవగాహనతో కూడిన రాముని వ్యక్తిత్వం అచ్చెరువు కొలుపుతుంది. తండ్రి నేరుగా అడవులకు వెళ్లమని చెప్ప లేదు, పెపైచ్చు వెళ్లవద్దని బతిమాలు తున్నాడు. అయినా తండ్రి ఏనాడో ఇచ్చిన మాట వ్యర్థం కారాదనీ తద్వారా తండ్రికి అసత్యదోషం అంటరాదన్న రాముని తపన ఎంత విశేషమైంది! తండ్రి మరణించాక అతని అప్పులతో మాకు సంబంధం లేదు ఏం చేసు కొంటారో చేసుకోండి అని అప్పులవాళ్లను బుకాయిస్తున్న నేటి సంతానం రాముని నుంచి ఎంతో నేర్చుకోవాలి. తల్లిదండ్రులను అనాథాశ్ర మాలలో చేర్చి వదిలించుకొనే ప్రయత్నాలు చేయడం, ఆస్తిపాస్తుల కోసం అవసరమైతే తల్లిదండ్రులనూ, సోదరులనూ తుదముట్టించడానికి వెనుకాడని నేటి యువత రాముని పితృప్రేమ నుంచీ, సోదర ప్రేమ నుంచీ ఎన్ని గుణపాఠాలను నేర్చుకోవాలి! వికృత, అసహజ సంబంధాలు అనే భూతమ్ జడలు విప్పి నృత్యం చేస్తున్న ఈ రోజుల్లో రాముని ధర్మబద్ధమైన వైవాహిక జీవిత నిష్ఠ, ఏక పత్నీవ్రత నియమం, సుందరాంగి తనంత తాను వలచి వచ్చి వారించినా కన్నెత్తై చూడని నిగ్రహ సంపత్తీ నేటి యువతరానికి మార్గదర్శకాలు. రామకథ ఈనాటి సమాజానికి కూడా గురుస్థానంలో నిలుపుకోవలసిన మహాకావ్యమే, రాముడు నేటికీ మనకు మార్గదర్శకుడే. నాటికీ నేటికీ ఏనాటికీ రాముని శీలసంపద, గుణసంపత్తి, అగాధమైన అమృతసాగరం. సర్వకాలాలకూ, సర్వదేశాలకూ ఒక దీపస్తంభం రాముని వ్యక్తిత్వం. జన్మతః రాక్షసుడైనా రామబాణ స్పర్శతో విశేషమైన పరివర్తనకు లోనైన మారీచుడు రాముని వ్యక్తిత్వాన్నీ, దివ్యత్వాన్నీ సంపూర్ణంగా అవగాహన చేసుకొన్న ధన్య జీవి. అతని మాటల్లోనే రాముని గురించిన ఏకవాక్య సమగ్ర వివరణ ‘రామో విగ్రహవాన్ ధర్మః’. మూర్తీభవించిన ధర్మమే రాముడు. ఈ ఒక్క వాక్యం శ్రీరాముని పరిపూర్ణమైన మానవ త్వానికీ, దివ్యత్వానికీ దర్పణం పడుతుంది. - ఆర్.ఎ.ఎస్.శాస్త్రి రిటైర్డ ప్రిన్సిపాల్, ఆర్ట్స అండ్ సైన్స కాలేజ్, ఆదోని తండ్రి నేరుగా అడవులకు వెళ్లమని చెప్ప లేదు, పెపైచ్చు వెళ్లవద్దని బతిమాలు తున్నాడు. అయినా తండ్రి ఏనాడో ఇచ్చిన మాట వ్యర్థం కారాదనీ తద్వారా తండ్రికి అసత్యదోషం అంటరాదన్న రాముని తపన ఎంత విశేషమైంది! -
ఆటోడ్రైవర్ల మూకుమ్మడి ఆత్మహత్యాయత్నం
ఆటో స్టాండుకు స్థలం కేటాయించలేదని మనస్తాపం గ్రామ సమీపంలో ఒడిశాకు తిని అపస్మారక స్థితిలోకి పలమనేరు: పలమనేరు పట్టణం గుడియాత్తం రోడ్డులో ఆటోస్టాండు కోసం పోలీసులు స్థలం కేటాయించలేదని మనస్తాపానికి గురైన టి.వడ్డూరుకు చెందిన నలుగురు ఆటోడ్రైవర్లు ఒడిశాకు తిని బుధవారం మూకుమ్మడిగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానిక గుడియాత్తం రోడ్డు సర్కిల్లో ఆటోస్టాండు ఉంది. అక్కడ పట్టణం, టి.వడ్డూరుకు చెందిన పలువురు ఆటోడ్రైవర్లు ఆటోలు ఉంచుతారు. వారం రోజుల క్రితం టి.వడ్డూరు ఆటోడ్రైవర్లు మాత్రం ఆటోస్టాండు కోసం రోడ్డు పక్కన కొంత స్థలాన్ని చదును చేసుకునేందుకు ప్రయత్నించారు. దీనికి పట్టణానికి చెందిన డ్రైవర్లు అభ్యంతరం తెలిపారు. ఈ వ్యవహా రం పోలీస్ స్టేషన్ చేరింది. ఇరువురి వాదనలు విన్న ఎస్ఐ శ్రీరాముడు పట్టణం నుంచి ఆటో డ్రైవర్లు టి.వడ్డూరుకు ప్యాసింజర్లను తీసుకెళ్లి వచ్చేటపుడు ఖాళీగా రావాలని, అదేవిధంగా టి.వడ్డూరు నుంచి ఆ గ్రా మానికి చెందిన డ్రైవర్లు పట్టణంలోకి ప్యాసింజర్లను తీసుకురావాలని సూచించారు. సంతృప్తి చెందని టి. వడ్డూరు డ్రైవర్లు మళ్లీ పోలీసులను ఆశ్రయించారు. వీరికి హామీ రాకపోవడంతో మనస్తాపం చెంది టి.వడ్డూ రు సమీపంలోని చిన్నకుంట చెరువు వద్ద శివకృష్ణ, పద్మనాభన్, గోవర్ధన, కుమార్‌స్వామి ఒడిశాకు తిని అపస్మారక స్థితికెళ్లారు. గమనించిన గ్రామస్తులు 108 ద్వారా పలమనేరు ఆస్పత్రికి తరలించారు. ఎస్ఐ విచారణ జరుపుతున్నారు. -
ఇంటి పేరు శ్రీరాం.. చేసేది ఫ్యాక్షనిజం..
నేరచరితులకు ‘తాతయ్య’ వెన్నుపోటులో చంద్రబాబుకు తమ్ముడే.. అక్రమాల్లో సోదరుల అండ సాక్షి, విజయవాడ : ఆయన ఇంటి పేరు శ్రీరాముడు.. రామచంద్రుడంతటి గొప్ప పాలనాదక్షుడనుకుంటే ‘తప్పు’లో కాలేసినట్లే. ఆనాడు మాటకోసం శ్రీరాముడు పదవిని తృణప్రాయంగా త్యజిస్తే.. ఈనాడు శ్రీరాం రాజగోపాలుడు పదవి కోసం ఎంతటి పని చేయడానికైనా వెనుకాడడని ప్రతీతి. మున్సిపల్ చైర్మన్‌గా, ఎమ్మెల్యేగా తన స్వార్థమే తప్ప ప్రజల కష్టసుఖాలు పట్టించుకోని నాయకుడని తెలుగు తమ్ముళ్లే చెప్పుకొంటుంటారు. తనను రాజకీయంగా పైకి తీసుకొచ్చిన సామినేని ఉదయభానునే వెన్నుపోటు పొడిచి చంద్రబాబుకు రాజకీయ తమ్ముడిని అనిపించుకున్న ‘ఘనుడు’. ఒక్కసారి ఎమ్మెల్యే పదవి రుచిచూశాక తన తమ్ముడి సాయంతో నియోజకవర్గంలో భయభ్రాంతులు సృష్టిస్తూ రెండోసారి ఎమ్మెల్యే కావాలని కలలు కంటున్నాడు. ఆయన అరాచక రాజకీయాలు గమనిస్తున్న నియోజకవర్గ వాసులు ఈసారి తగిన బుద్ధిచెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రజాకంటక పాలనలో కొన్ని నిజాలు... తన నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఉనికే ఉండకూడదని శ్రీరాం తాతాయ్య భావించారు. ఈ సమయంలో నవాబుపేట సర్పంచ్ గింజుపల్లి వీరయ్య స్థానిక శివాలయంలో అత్యంత పాశవికంగా హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసులో శ్రీరాం తాతాయ్య సోదరులు శ్రీరాం ధనుంజయ (చిన్నబాబు), శ్రీరాం బదరీనారాయణ నిందితులు. వీరిద్దరిని ముద్దాయిలుగా తప్పించేందుకు ఎమ్మెల్యేగా తనకున్న పరపతిని ఉపయోగించారని నవాబుపేట గ్రామస్తులు నమ్ముతున్నారు. వీరయ్య హత్యకేసులో మొదటి నిందితుడుగా ఉన్న చిన్నబాబు సినిమా ఫక్కీలో ఏడాది పాటు నియోజకవర్గం నుంచి కనుమరుగయ్యాడు. పరిస్థితులు చక్కబడిన తరువాత తిరిగి నియోజకవర్గంలో కాలుపెట్టాడు. పాతికేళ్ల కిందట జయరాజ్ అనే దళితుడిపై స్వయంగా దాడి చేసిన తాతయ్య అతని తల పగలగొట్టి హత్యాయత్నం చేయడం అప్పట్లో పట్టణంలో సంచలనం సృష్టించింది. ఈ తరహా దాడులతోనే చివరికి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారని నియోజకవర్గ ప్రజలు ఇప్పటికీ చర్చించుకుంటారు. దళిత నాయకులు ఆలేటి రాజారావు, కనపర్తి బాబు, సేతు, గోపిలను హత్యచేసిన వారికి రాజకీయ ఆశ్రయం కల్పించారనే ఆరోపణలు ఉన్నాయి.సినీనటుడు పవన్‌కల్యాణ్ అభిమాని బసవల వెంకటేశ్వరరావు అలియాస్ కొండ.. తొర్రగుంటపాలెంలో దారుణ హత్యకు గురైన ఘటన వెనుక రాజకీయ నేపథ్యం ఉందనేది బహిరంగ రహస్యమే. తన మాటలు వినని ఇతర పార్టీ నేతలను, పోలీసు అధికారులను వేధించడం ఆయనకు వెన్నతోపెట్టిన విద్య. జిల్లాలో పేకాట క్లబ్‌లను పోలీసులు అనేక సంవత్సరాల క్రితమే నిషేధించినా ఆయన తన కనుసన్నల్లో అక్రమంగా యథేచ్ఛగా కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ నిర్వాహకుల నుంచి లక్షల రూపాయల్లో మామూళ్ల వసూలు అందరికీ తెలిసిన విషయమే. తన పదవిని అడ్డుపెట్టుకుని ప్రత్యర్థులపై తప్పుడు కేసులు పెట్టించేందుకూ వెనుకాడని నైజం ఆయనది. ఈ నేపథ్యంలోనే ఆయన మాటలు విన్న స్థానిక ఎస్ఐ, సీఐలు సస్పెన్షన్‌కు గురవడం గమనార్హం. అక్రమార్జనలో సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యాలనూ వదిలిపెట్టరని ప్రతీతి. ప్రతి ఫ్యాక్టరీకీ ఒక రేటు ఫిక్స్ చేస్తారని, ఏటా వాటినుంచి మామూళ్లు వసూలు చేస్తారని, చందాలు ఇవ్వని యాజమాన్యాలపై కార్మికులను ఉసిగొల్పుతారని విమర్శలు ఉన్నాయి. కార్మికులకు, యజమానులకు మధ్య సయోధ్య కుదుర్చుతున్నట్లుగా నటించి కోట్లు వెనుకేసుకోవడం ఆయన సోదరులకు వెన్నతో పెట్టిన విద్య. తన అనుచరులకు బినామీ కాంట్రాక్టులు ఇప్పించి అందులోనూ వాటాలు దండుకోవడంలో సిద్ధహస్తుడు. వత్సవాయి మండలం భీమవరం వద్ద కొంగర మల్లయ్య గట్టును తవ్వి నూతనంగా నిర్మించిన హైవే రోడ్డు విషయంలోనూ ఆయనకు కోట్ల రూపాయలు ముట్టినట్లు ప్రచారం జరుగుతోంది. -
టెండర్లు లేకుండానే హుండీలు, టేబుళ్లు కొనుగోలు
భద్రాచలం, న్యూస్‌లైన్ : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయాధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది. భక్తుల సౌకర్యాలు, ఆలయ అవసరాల పేరిట చేపట్టే పనుల్లో నిబంధనలను కాలరాస్తున్నారనే ఆరోపణలున్నాయి. దేవస్థానం అన్నదాన సత్రంలో 20 టేబుళ్లు, పర్ణశాల ఆలయం కోసం 8 హుండీలను కొనుగోలు చేశారు. గుంటూరులో తయారు చేయించినట్లుగా చెపుతున్న వీటిని ఆదివారం భద్రాచలం తీసుకొచ్చారు. టేబుళ్ల కోసం సుమారు రూ.2 లక్షలు, హుండీలకు రూ.1.50 లక్షలు వెచ్చించినట్లు తెలిసింది. ఈ టేబుళ్లను కొత్తగా నిర్మించిన అన్నదాన సత్రంలో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం భద్రాద్రి రామాయంలో ఉన్న హుండీలను పర్ణశాలకు పంపించి, కొత్తగా తెచ్చిన వాటిని ఇక్కడ ఏర్పాటు చేయాలని ఆలయాధికారులు భావిస్తున్నారు. అయితే ఇప్పటికే సరిపడా హుండీలు ఉన్నప్పటికీ.. మళ్లీ కొత్తగా కొనుగోలు చేయటం విమర్శలకు తావిస్తోంది. కాగా, ప్రస్తుతం అన్ని దేవాలయాల్లోనూ స్టీల్ హుండీలను మాత్రమే ఏర్పాటు చేస్తున్నారు. డబ్బులు, ఇతర కానుకలు తుప్పు పట్టకుండా ఉండేందుకు వీటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే భద్రాద్రి దేవస్థానం అధికారులు కొత్తగా కొనుగోలు చేసినవి ఇనుపవి కావటం గమనార్హం. అందులోనూ గేజ్ తక్కువగా ఉన్న ఇనుముతో చేసినవి కావడంతో ఇవి కొంతకాలం మాత్రమే ఉపయోగపడతాయని పలువురు అంటున్నారు. నిబంధనలు పట్టవా..? దేవాదాయశాఖ నిబంధనల ప్రకారం రూ.50 వేలకు పైగా విలువైన వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా టెండర్లను పిలవాలి. కానీ ఇక్కడి అధికారులు కొటేషన్ ద్వారా ఈ పనులు అప్పగించినట్లు తెలిసింది. కమీషన్ల కోసమే వారు ఇలా వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి. గతంలో అన్నదాన సత్రంలో భోజనాలు వడ్డించే ట్రేలను తయారుచేసిన దుకాణదారుల నుంచే వీటిని కూడా కొనుగోలు చేసినట్లు తెలిసింది. భోజనం వడ్డించేందుకు చంధ్రశేఖర్ ఆజాద్ ఈవోగా ఉన్న సమయంలో రెండు ట్రేలను కొనుగోలు చేయగా, అవి నాసిరకంగా ఉండటంతో బిల్లు చెల్లించేందుకు ఆయన నిరాకరించారు. అవి కొంతకాలానికే నిరుపయోగంగా మారాయి. వాటిని అన్నదాన సత్రంలోని ఓ మూలన పడేయగా, ప్రస్తుతం తప్పుపట్టాయి. అయితే వీటికి కూడా బిల్లు చేసి ఆ మొత్తాన్ని కాజేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దేవస్థానానికి పాలకమండలి కూడా లేకపోవటంతో అడిగే వారు లేక అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆలయంలో జరుగుతున్న ఈ పరిణామాలపై దేవాదాయశాఖ ఉన్నతాధికారులు ఇప్పటికైనా దృష్టి సారించాలని భ క్తులు కోరుతున్నారు. కొటేషన్లతోనే కొనుగోళ్లు : రవీందర్, దేవస్థానం ఏఈ కొటేషన్ల ద్వారానే హుండీలు, భోజనం చేసేందుకు టేబుళ్లు కొనుగోలు చేశామని ఆలయ ఏఈ రవీందర్ తెలిపారు. నిబంధనల మేరకే అన్నీ జరిగాయన్నారు.