శ్రీరాముని జన్మభూమి అయోధ్యతో సీతామాత పుట్టిన ప్రాంతమైన సీతామర్హి(బీహార్) అనుసంధానం కానుంది. ఈ రెండు ప్రాంతాలను కలిపేలా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రాకపోకలు సాగించనుంది. ఈ ప్రత్యేక రైలు మొదటి పరుగును అతి త్వరలో అందుకోనుంది.
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో శ్రీరామ్ విమానాశ్రయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని మోదీ డిసెంబర్ 30న రానున్నారు. ఈ సందర్భంగా మోదీ.. అయోధ్య జంక్షన్‌లో కొత్తగా నిర్మించిన భవనాన్ని ప్రారంభించడమే కాకుండా, అయోధ్య నుంచి ఢిల్లీకి నడిచే రెండు రైళ్లను ప్రారంభించనున్నారు. అంతే కాదు వందే భారత్ ఎక్స్‌ప్రెస్, అమృత్ భారత్ రైలును కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢిల్లీ- దర్భంగాల మధ్య నడవనుంది.
మొదటి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు సంబంధించిన రెగ్యులర్ సర్వీస్ ఢిల్లీ- దర్భంగా మధ్య ఉంటుంది. ఈ రైలు దూర ప్రయాణికులకు ఎంతో ఉపయుక్తం. మరో అమృత్ భారత్ రైలు బీహార్‌లోని సితామర్హి (జానకీ మాత జన్మస్థలం)-రక్సాల్ మీదుగా అయోధ్య గుండా ఢిల్లీకి చేరనుందని సమాచారం
అమృత్ భారత్ రైలు నాన్-ఏసీ రైలుగా ఉండబోతున్నదని తెలుస్తోంది. అంటే దీనిలో స్లీపర్, జనరల్ కోచ్‌లు మాత్రమే ఉంటాయి. ఇందులో మొత్తం 22 బోగీలు ఉండనున్నాయి. దేశంలోని వివిధ నగరాలను కలుపుతూ రాత్రిపూట రైలు సర్వీసులుగా నడపాలని భారతీయ రైల్వే యోచిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో పని చేయడానికి వచ్చే వలస బీహారీలను దృష్టిలో ఉంచుకుని ఈ రైలు ప్రవేశపెట్టనున్నారని రైల్వే అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: మళ్లీ మాస్క్ తప్పనిసరి.. ఆదేశాలు జారీ!
Comments
Please login to add a commentAdd a comment