Sitamarhi
-
సీతారాముల స్వస్థలాలు ‘అమృత్ భారత్’తో అనుసంధానం!
శ్రీరాముని జన్మభూమి అయోధ్యతో సీతామాత పుట్టిన ప్రాంతమైన సీతామర్హి(బీహార్) అనుసంధానం కానుంది. ఈ రెండు ప్రాంతాలను కలిపేలా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రాకపోకలు సాగించనుంది. ఈ ప్రత్యేక రైలు మొదటి పరుగును అతి త్వరలో అందుకోనుంది. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో శ్రీరామ్ విమానాశ్రయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని మోదీ డిసెంబర్ 30న రానున్నారు. ఈ సందర్భంగా మోదీ.. అయోధ్య జంక్షన్లో కొత్తగా నిర్మించిన భవనాన్ని ప్రారంభించడమే కాకుండా, అయోధ్య నుంచి ఢిల్లీకి నడిచే రెండు రైళ్లను ప్రారంభించనున్నారు. అంతే కాదు వందే భారత్ ఎక్స్‌ప్రెస్, అమృత్ భారత్ రైలును కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢిల్లీ- దర్భంగాల మధ్య నడవనుంది. మొదటి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు సంబంధించిన రెగ్యులర్ సర్వీస్ ఢిల్లీ- దర్భంగా మధ్య ఉంటుంది. ఈ రైలు దూర ప్రయాణికులకు ఎంతో ఉపయుక్తం. మరో అమృత్ భారత్ రైలు బీహార్‌లోని సితామర్హి (జానకీ మాత జన్మస్థలం)-రక్సాల్ మీదుగా అయోధ్య గుండా ఢిల్లీకి చేరనుందని సమాచారం అమృత్ భారత్ రైలు నాన్-ఏసీ రైలుగా ఉండబోతున్నదని తెలుస్తోంది. అంటే దీనిలో స్లీపర్, జనరల్ కోచ్‌లు మాత్రమే ఉంటాయి. ఇందులో మొత్తం 22 బోగీలు ఉండనున్నాయి. దేశంలోని వివిధ నగరాలను కలుపుతూ రాత్రిపూట రైలు సర్వీసులుగా నడపాలని భారతీయ రైల్వే యోచిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో పని చేయడానికి వచ్చే వలస బీహారీలను దృష్టిలో ఉంచుకుని ఈ రైలు ప్రవేశపెట్టనున్నారని రైల్వే అధికారులు తెలిపారు. ఇది కూడా చదవండి: మళ్లీ మాస్క్ తప్పనిసరి.. ఆదేశాలు జారీ! -
వింత నమ్మకం.. పెరిగిన పార్లేజీ బిస్కెట్ల అమ్మకాలు
పట్న: మన దగ్గర అప్పుడప్పుడు వింత వింత పుకార్లు వ్యాప్తి అవుతుంటాయి. ఆడపడుచులకు గాజులు పెట్టించాలి.. ఒక్కడే మగ పిల్లాడు ఉన్న తల్లి వేప చెట్టుకు నీళ్లు పోయాలని.. ఇలా వింత వింత పుకార్లు వెలుగులోకి వస్తుంటాయి. తాజాగా ఇలా వెలుగులోకి వచ్చిన ఓ పుకారు వల్ల పార్లేజీ బిస్కెట్ల అమ్మకాలు పెరిగాయి. పుకారు వల్ల బిస్కెట్ల అమ్మకాలు ఎలా పెరిగాయా అని ఆలోచిస్తున్నారు. అదే తెలియాలంటే ఈ వార్త చదవాలి. తాజాగా బిహార్‌లో ఓ వింత పుకారు వెలుగులోకి వచ్చింది. దాని సారంశం ఏంటంటే.. జితియా పండగ నాడు మగపిల్లలు పార్లేజీ బిస్కెట్లు తప్పక తినాలి. లేదంటే వారికి భవిష్యత్తులో తీవ్ర సమస్యలు తలెత్తుతాయి అని పుకారు మొదలయ్యింది. దాంతో జనాలు ఎగబడి మరీ పార్లే బిస్కెట్లు కొన్నారు. దీని వల్ల ఎవరికి ఎలాంటి నష్టం వాటిల్ల లేదు. కంపెనీకి మాత్రం అమ్మకాలు పెరిగి లాభాలు వచ్చాయి. (చదవండి: గ్రామంలోని మహిళల బట్టలు ఉతకాలి.. నిందితుడికి కోర్టు ఆదేశం) తొలుత ఈ పుకారు సీతామర్హి జిల్లాలో వినిపించింది. దాంతో జనాలు పార్లే జీ బిస్కెట్ల కోసం షాపుల వద్దకు పరుగులు తీశారు. ఈ పుకారును జనాలు ఎంత బలంగా నమ్మారు అంటే.. సీతామర్హి ప్రాంతంలోని పలు దుకాణాల ముందు పెద్ద పెద్ద క్యూ లైన్లు దర్శనమిచ్చాయి. లైన్లలో ఉన్నవారంతా బిస్కెట్ల కోసం వచ్చినవారే కావడం గమనార్హం. జనాలు బిస్కెట్ల కోసం ఇలా ఎగబడటంతో చాలా షాపుల్లో అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. నెమ్మదిగా ఈ పుకారు కాస్త బైర్గానియా, ధేంగ్, నాన్పూర్, దుమ్రా, బజ్‌పట్టి ప్రాంతాలకు వ్యాపించింది. ఇంకేముంది దీన్ని గుడ్డిగా నమ్మిన జనాలు.. పార్లేజీ బిస్కెట్ల కోసం షాపుల వద్దకు పరిగెత్తారు. ఆ తర్వాత ఈ పుకారు మరో నాలుగు జిల్లాలకు వ్యాపించింది. అక్కడ కూడా ఇవే దృశ్యాలు కనిపించాయి. ఎందుకు ఇలా బిస్కెట్ల కొంటున్నారని జనాలను అడిగితే.. ‘‘జితియా పండగనాడు మగ పిల్లలు పార్లే బిస్కెట్లు తినకపోతే.. వారికి చాలా ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు. అందుకే కొంటున్నాం’’ అని తెలిపారు. దీన్ని అవకాశంగా తీసుకుని కొందరు షాపు యజమానులు ఐదు రూపాయల బిస్కెట్ ప్యాకెట్‌ని 50 రూపాయలకు అమ్మడం ప్రారంభించారు. అసలు ఈ పుకారు ఎలా.. ఎవరు వ్యాప్తి చేశారు అనే దాని గురించి మాత్రం తెలయలేదు. (చదవండి: నేను ఇవ్వను.. ప్రధాని నాకోసం ఆ పైసలు పంపారు !) జితియా పండుగ.. బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో జితియా పండుగ జరుపుకుంటారు. తల్లులు.. తమ కుమారులు జీవితాంతం సంతోషంగా.. ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తూ 24 గంటల పాటు ఉపవాసం చేస్తారు. చదవండి: అమ్మాయిలూ ‘జట్టు విరబోసుకుని రావొద్దు’ ‘సెల్ఫీలు దిగొద్దు’ -
తుపాకీతో భార్యను ఏడుసార్లు కాల్చి.. ఆపై
పట్నా : ఒక జవాన్ తన భార్యను తుపాకితో ఏడు సార్లు కాల్చి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం బీహార్‌లోని సీతామర్హి నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చంద్రభూషణ్ పాండే క్విక్ రెస్పాన్స్ టీమ్(క్యూఆర్టీ) జవాన్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం కావడంతో ఇంట్లోనే ఉన్న చంద్రభూషణ్ మొదట తన భార్య మధును తుపాకీతో ఏడు సార్లు కాల్చి ఆపై తానూ షూట్ చేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని ఇంటి తలుపులు పగలగొట్టి లోనికి వెళ్లారు. ఇద్దరు మృతదేహాలను పోస్టుమార్టమ్‌కు తరలించి కేసు నమోదు చేశారు. వీరి వివాహం జరిగి ఆరు నెలలు కావొస్తుందని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున 3-4 గంటల ప్రాంతంలో చోటుచేసుకున్నట్లు తెలిపారు. కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడ్డారా లేక ఇంకా ఏదైనా కారణం ఉందా అన్న కోణంలో దర్యాప్తు నిర్వహించనున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
ఏటీఎం నుంచి నకిలీ కొత్త కరెన్సీ నోటు!
పాట్నా: నకిలీ నోట్లను, బ్లాక్‌మనీని నిర్మూలిస్తామంటూ ప్రభుత్వం తీసుకొచ్చిన పాత నోట్ల రద్దు ప్రక్రియ ఏ మేరకు అనుకున్న లక్ష్యాన్ని చేధించగలదనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందేహాలకు ఆజ్యం పోస్తూ భారీ మొత్తంలో కొత్త కరెన్సీ నోట్లు ఐటీ రైడ్స్‌లో దొరకడం, అక్కడక్కడా నకిలీ కొత్త నోట్లు వెలుగులోకి రావడం జరుగుతోంది. తాజాగా స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఏటీఎం నుంచి నకిలీ కొత్త రూ.2000 కరెన్సీ నోటు బయటికి వచ్చినట్టు తెలిసింది. ఎస్బీఐ ఏటీఎంలో నగదు డ్రా చేసుకున్న సీతామహ్రి జిల్లా లంగ్మా ప్రాంతానికి చెందిన పంకజ్ కుమార్ అనే వ్యవసాయదారుడికి అచ్చం ఒరిజినల్ నోటు మాదిరి నకిలీ కొత్త రూ.2000 నోట్లు డ్రా అయినట్టు తెలిసింది. వేరే వ్యక్తికి ఈ నోటును అందించినప్పుడు ఇది నకిలీ నోటని అతను తిరస్కరించడంతో ఆశ్చర్యానికి గురైనట్టు పంకజ్ తెలిపాడు. వెంటనే మంగళవారం బ్యాంకుకి వెళ్లి ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నాడు. అదేవిధంగా డుమ్రా పోలీసు స్టేషన్లోనూ దీనిపై ఫిర్యాదుచేసినట్టు చెప్పాడు. పంకజ్ ఫిర్యాదు మేరకు దీనిపై విచారణ కొనసాగిస్తున్నామని డుమ్రా పీఎస్ విజయ్ బహదూర్ సింగ్ తెలిపారు. ఎక్కడైతే పంకజ్ నకిలీ నోటు విత్‌డ్రా చేసుకున్నాడో ఆ ఏటీఎం ఖజానా ఓ ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తుందని ఎస్బీఐ చీఫ్ మేనేజర్ సుధాంశు కుమార్ రావు తెలిపారు. ఏటిఎం ఖజానా లోపల కరెన్సీని ప్రైవేట్ సంస్థ అధికారులు సమక్షంలో బ్యాంకు అధికారులు తనిఖీ చేస్తారని ఆయన చెప్పారు. ఆ సమయంలోనే వాటికి సీల్ కూడా వేస్తామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏటీఎం నుంచి నకిలీ నోటు విత్‌డ్రా అయ్యేందుకు ఆస్కారం ఉండదని పేర్కొంటూ ఈ విషయాన్ని రావు తోసిపుచ్చారు. -
సర్కార్ వారి కార్యక్రమంలో అశ్లీల నృత్యాలు!
సాక్షాత్తూ సర్కార్ వారి సాంస్కృతిక కార్యక్రమంలోనే అశ్లీల నృత్యాలు చేయడం బిహార్‌లో దుమారం రేపుతోంది. 'బిహార్ దివస్' సందర్భంగా సీతామర్హి జిల్లాలో సాంస్కృతిక కార్యక్రమాల పేరిట ఇటీవల రికార్డింగ్ డ్యాన్స్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అమ్మాయిలు అశ్లీలంగా నృత్యాలు చేస్తున్న వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. పొట్టి దుస్తుల్లో అమ్మాయిలు అశ్లీల నృత్యాలు చేస్తుండగా చుట్టూ మూగిన వ్యక్తులు వారికి డబ్బులు ఈ వీడియోలో కనిపిస్తుంది. సాక్షాత్తూ సీతామర్హి నగర పరిషత్ అధికారికంగా నిర్వహించిన ఈ సాంస్కృతిక వేడుకల్లో అశ్లీల నృత్యాలు చేయడం వివాదం రేపుతోంది. ఈ అశ్లీల నృత్యాలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సొమ్ముతో ఇలాంటి అసభ్యకరమైన కార్యక్రమాలు ఏర్పాటుచేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు.