సర్కార్ వారి కార్యక్రమంలో అశ్లీల నృత్యాలు! | Vulgar dance in Sitamarhi in the name of govt cultural programme on Bihar Diwas | Sakshi
Sakshi News home page

సర్కార్ వారి కార్యక్రమంలో అశ్లీల నృత్యాలు!

Published Mon, Mar 28 2016 6:17 PM | Last Updated on Thu, Jul 18 2019 2:11 PM

సర్కార్ వారి కార్యక్రమంలో అశ్లీల నృత్యాలు! - Sakshi

సర్కార్ వారి కార్యక్రమంలో అశ్లీల నృత్యాలు!

సాక్షాత్తూ సర్కార్ వారి సాంస్కృతిక కార్యక్రమంలోనే అశ్లీల నృత్యాలు చేయడం బిహార్‌లో దుమారం రేపుతోంది. 'బిహార్ దివస్' సందర్భంగా సీతామర్హి జిల్లాలో సాంస్కృతిక కార్యక్రమాల పేరిట ఇటీవల రికార్డింగ్ డ్యాన్స్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అమ్మాయిలు అశ్లీలంగా నృత్యాలు చేస్తున్న వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది.

పొట్టి దుస్తుల్లో అమ్మాయిలు అశ్లీల నృత్యాలు చేస్తుండగా చుట్టూ మూగిన వ్యక్తులు వారికి డబ్బులు ఈ వీడియోలో కనిపిస్తుంది. సాక్షాత్తూ సీతామర్హి నగర పరిషత్‌ అధికారికంగా నిర్వహించిన ఈ సాంస్కృతిక వేడుకల్లో అశ్లీల నృత్యాలు చేయడం వివాదం రేపుతోంది. ఈ అశ్లీల నృత్యాలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సొమ్ముతో ఇలాంటి అసభ్యకరమైన కార్యక్రమాలు ఏర్పాటుచేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement