ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య మాదిరిగానే థాయ్‌లాండ్‌లో కూడా అయోధ్య ఉంది. ఈ ప్రదేశానికి అయోధ్య అని పేరు పెట్టడమే కాకుండా ఇక్కడి రాజులను రాముని అవతారంగా భావిస్తారు. థాయ్‌లాండ్‌లోని ‘అయుతయ’ నగరానికి ప్రాచీన భారతీయ నగరమైన అయోధ్య పేరు పెట్టారు. ఇక్కడి రాజవంశంలోని ప్రతి రాజును రాముని అవతారంగా భావిస్తారు.
థాయ్‌లాండ్ ‘అయోధ్య’కు సంబంధించిన వివరాలను 22 ఏళ్లుగా బోధనావృత్తి సాగిస్తున్న డాక్టర్ సురేష్ పాల్ గిరి వివరించారు. తాను థాయ్‌లాండ్‌లోని మతపరమైన విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు. థాయ్‌లాండ్ ఒకప్పుడు భారతదేశంలో భాగమని అన్నారు. మొదట్లో హిందూ ప్రాబల్యం ఉన్న ఈ దేశంలో కాలక్రమేణా బౌద్ధం ప్రవేశించి, దానిలోని అంశాలు హిందూమతంతో కలిసిపోయాయన్నారు.
భారతదేశంలోని అయోధ్య , థాయ్‌లాండ్‌లోని అయోధ్య మధ్య గల పోలికల గురించి సురేష్ తెలియజేస్తూ.. భారత పూర్వీకుల సంప్రదాయాలు మరచిపోలేనివి అని అన్నారు. ఇప్పటికీ థాయ్‌లాండ్ ప్రజలు శ్రీరాముని పూజిస్తారన్నారు. ఇక్కడి రాజు ఈ నగరంలో కొన్ని హిందూ దేవాలయాలను కూడా నిర్మించారని తెలిపారు. ‘అయుతయ’కు 35 కిలోమీటర్ల దూరంలో విష్ణువు, బ్రహ్మ, శంకరుని ఆలయం ఉంది. ‘అయుతయ’ రాజు 'రామతిబోధి' (రాముడు) అనే బిరుదును కలిగి ఉండేవాడు. అయోధ్య రామాయణంలో శ్రీరాముని రాజధాని వర్ణనలో ‘అయుతయ’ పేరు కూడా కనిపిస్తుంది. అయుతయను 1767లో బర్మీస్ దళాలు దోచుకుని ఆ ప్రాంతాన్ని నాశనం చేశాయి.
ఇది కూడా చదవండి: ‘ఆ భారతీయుడే న్యూయార్క్‌లో హత్యకు కుట్రపన్నాడు’
थाईलैंड के 'अयुत्या' शहर का नाम प्राचीन भारतीय शहर अयोध्या के नाम पर रखा गया है। यहां एक ऐसा राजवंश है जिसके हर राजा को राम का अवतार माना जाता है।(29.11)
— ANI_HindiNews (@AHindinews) November 29, 2023
(वीडियो 'अयुत्या' शहर से है।) pic.twitter.com/h8zY64JzJ7
Comments
Please login to add a commentAdd a comment