అయోధ్య: యూపీలోని అయోధ్యలో ఈ నెల 30 భారీ ఎత్తున దీపోత్సవం నిర్వహిస్తున్నారు. దీపావళి సందర్భంగా అయోధ్యలో లక్షల దీపాలు వెలిగించనున్నారు. అయితే అందరికీ ఈ వేడుకలను వెళ్లే అవకాశం ఉండదు. అటువంటివారికి అయోధ్య డెవలప్‌మెంట్ అధారిటీ శుభవార్త చెప్పింది.
ఏ ప్రాంతంలోని వారైనా వారి ఇంటిలోనూ కూర్చొని అయోధ్యలో ఘనంగా జరిగే దీపోత్సవంలో పాల్గొనవచ్చు. ఇందుకోసం అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. శ్రీరాముని పేరిట ఒక దీపం’ పేరుతో శ్రీరాముని భక్తులు తమ ఇంట్లో కూర్చొని దీపోత్సవంలో భాగస్వాములు కావచ్చు.
ఇందుకోసం అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ దివ్య అయోధ్య యాప్ ద్వారా భక్తులకు ఆన్‌లైన్ బుకింగ్ ఎంపికను ఇచ్చింది. ఈ యాప్ ద్వారా భక్తులు దీపాలు వెలిగించవచ్చు. అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ సెక్రటరీ సత్యేంద్ర సింగ్ మాట్లాడుతూ.. దీపోత్సవ్‌కు హాజరుకాలేని భక్తులు ఇంట్లో కూర్చొనే దీపాలు వెలిగించే అవకాశాన్ని కల్పిస్తున్నామన్నారు. ‘దివ్య అయోధ్య యాప్’ సాయంతో ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా దీపం వెలిగించినవారికి డిజిటల్ ఫోటోతో పాటు అయోధ్య ప్రసాదం పంపిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment