deepotsava Lakh
-
15న మరో రికార్డుకు సిద్ధమవుతున్న అయోధ్య
అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లో శ్రీరాముడు కొలువైన అయోధ్య పలు రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పుడు నవంబర్ 15న కార్తీక పౌర్ణమి సందర్భంగా మరో రికార్డుకు అయోధ్య సిద్ధమవుతోంది.రాష్ట్రంలో యోగి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అయోధ్యలో ప్రతీయేటా ‘దీపోత్సవం’ ప్రారంభమైంది. నూతన రామాలయంలో బాలక్ రామ్‌ను ప్రతిష్టించిన తర్వాత అయోధ్యలో చారిత్రాత్మక స్థాయిలో దీపోత్సవాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిశ్చయించారు. ఈ నేపధ్యంలో ఇక్కడి సరయూ తీరంలో మూడు రికార్డులు నమోదయ్యాయి.72 గంటల్లో 28 లక్షల దీపాలుఅయోధ్యలోని రామ్ కీ పైడీలో గత అక్టోబరులో 35 వేల మంది వాలంటీర్లు 55 ఘాట్లలో 28 లక్షల దీపాలు వెలిగించారు. కేవలం 72 గంటల్లోనే దీపాలను అలంకరించి, అయోధ్యలో సరికొత్త రికార్డు సృష్టించారు.ఏకకాలంలో 1,100 హారతులుగత అక్టోబర్ 30న సాయంత్రం సమయాన సరయూ నది ఒడ్డున సరికొత్త రికార్డు నెలకొల్పారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 1,100 మంది భక్తులు సరయూమాతకు హారతులిచ్చారు. ఈ సమయంలో వీరంతా ఒకే రంగు దుస్తులు ధరించారు.35 లక్షల మంది భక్తుల ప్రదక్షిణలు మొన్నటి నవంబరు 9వ తేదీన సాయంత్రం అయోధ్యలో 35 లక్షల మంది భక్తులు ఆలయ ప్రదక్షిణలతో మరో రికార్డు నెలకొల్పారు. 24 గంటల పాటు ఈ ప్రదక్షిణలు సాగాయి. ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం భక్తుల కోసం పలు ఏర్పాట్లు చేసింది.కార్తీక పౌర్ణమికి మరో రికార్డునవంబర్ 15న కార్తీక పౌర్ణమి సందర్భంగా అత్యధిక సంఖ్యలో భక్తులు అయోధ్యకు తరలివచ్చి, సరయూ నదిలో పుణ్యస్నానాలు చేయనున్నారని స్థానిక అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగం భారీగా ఏర్పాట్లు చేసింది. 12 చోట్ల తాత్కాలిక ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా సారించనున్నారు.ఇది కూడా చదవండి: Children's Day 2024: బాలల నేస్తం.. చాచా నెహ్రూ.. -
నేడు రికార్డుకు సిద్ధమవుతున్న దీపోత్సవం
అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరం నేడు (అక్టోబర్ 30) మరో రికార్డుకు వేదికకానుంది. ఈ రోజు అయోధ్యలో ఎనిమిదో దీపోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది.అయోధ్యలో ఈరోజు సాయంత్రం జరిగే దీపోత్సవానికి సంబంధించిన సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఈ వెలుగుల పండుగలో అయోధ్యలోని సరయూ తీరం వెంబడి రామ్ కీ పైడీతో సహా 55 ఘాట్ల వద్ద 25 లక్షల దీపాలు వెలిగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో అయోధ్య దీపోత్సవం మరో రికార్డును సాధించనుంది.దీపోత్సవం కోసం స్థానికులు అయోధ్యను అందంగా ముస్తాబు చేస్తున్నారు. అక్టోబర్ 30న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రామ్ కీ పైడీలో తొలి దీపం వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో లేజర్ షో, బాణసంచా కాల్చడం, రాంలీల ప్రదర్శనలు ఉండనున్నాయి.ఈ ఏడాది జనవరి 22న నూతన రామాలయంలో బాలరాముని ప్రతిష్ఠాపన మహోత్సవం జరిగింది. దీనితరువాత జరుగుతున్న తొలి దీపోత్సవం ఇదే కావడంతో స్థానికుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. ఈరోజు జరిగే దీపోత్సవంలో సరయూ ఒడ్డు, రామ్కీ పైడీ, ఇతర 55 ఘాట్లలో 28 లక్షల దీపాలను ఏర్పాటు చేశారు. వీటిని వెలిగించి పాత రికార్డును బద్దలు కొట్టడం ద్వారా గిన్నిస్ బుక్‌లో కొత్త రికార్డు నమోదు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం అన్ని సన్నాహాలు చేసింది.గత ఏడాది దీపోత్సవంలో 22 లక్షల 23 వేల దీపాలు వెలిగించి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఈసారి జరుగుతున్న దీపోత్సవంలో అవధ్ విశ్వవిద్యాలయంతోపాటు ఇతర కళాశాలలకు చెందిన 30 వేల మంది విద్యార్థులు తమ సేవలు అందిస్తున్నారు. 2017లో ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా దీపోత్సవ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది కూడా చదవండి: ఉక్కు ఉద్యోగుల ఆకలి కేకలు -
ఇంట్లో కూర్చుని.. అయోధ్యలో దీపం వెలిగించండిలా..
అయోధ్య: యూపీలోని అయోధ్యలో ఈ నెల 30 భారీ ఎత్తున దీపోత్సవం నిర్వహిస్తున్నారు. దీపావళి సందర్భంగా అయోధ్యలో లక్షల దీపాలు వెలిగించనున్నారు. అయితే అందరికీ ఈ వేడుకలను వెళ్లే అవకాశం ఉండదు. అటువంటివారికి అయోధ్య డెవలప్మెంట్ అధారిటీ శుభవార్త చెప్పింది.ఏ ప్రాంతంలోని వారైనా వారి ఇంటిలోనూ కూర్చొని అయోధ్యలో ఘనంగా జరిగే దీపోత్సవంలో పాల్గొనవచ్చు. ఇందుకోసం అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. శ్రీరాముని పేరిట ఒక దీపం’ పేరుతో శ్రీరాముని భక్తులు తమ ఇంట్లో కూర్చొని దీపోత్సవంలో భాగస్వాములు కావచ్చు.ఇందుకోసం అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ దివ్య అయోధ్య యాప్ ద్వారా భక్తులకు ఆన్లైన్ బుకింగ్ ఎంపికను ఇచ్చింది. ఈ యాప్ ద్వారా భక్తులు దీపాలు వెలిగించవచ్చు. అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ సెక్రటరీ సత్యేంద్ర సింగ్ మాట్లాడుతూ.. దీపోత్సవ్‌కు హాజరుకాలేని భక్తులు ఇంట్లో కూర్చొనే దీపాలు వెలిగించే అవకాశాన్ని కల్పిస్తున్నామన్నారు. ‘దివ్య అయోధ్య యాప్’ సాయంతో ఆన్లైన్ బుకింగ్ ద్వారా దీపం వెలిగించినవారికి డిజిటల్ ఫోటోతో పాటు అయోధ్య ప్రసాదం పంపిస్తామన్నారు.ఇది కూడా చదవండి: ఆర్మీ శునకం ‘ఫాంటమ్’ ఇకలేదు -
దీపోత్సవానికి అయోధ్య ముస్తాబు
అయోధ్య: దీపావళి సందర్భంగా జరిగే దీపోత్సవ్ వేడుకలకు యూపీలోని అయోధ్య ముస్తాబవుతోంది. అక్టోబర్ 30న జరిగే దీపోత్సవ్ కోసం రామనగరిని అందంగా తీర్చిదిద్దుతున్నారు. భక్తివిశ్వాసాల కలబోతతో అయోధ్య వెలుగులమయం కానుంది.అయోధ్యలో జరిగే 8వ దీపోత్సవంలో అవధ్ యూనివర్సిటీకి చెందిన 30 వేల మంది వాలంటీర్లు దీపోత్సవ్ స్థలంలో 28 లక్షల దీపాలను అమర్చేందుకు కృషి చేస్తున్నారు. రామ్ కీ పైడిలోని 55 ఘాట్ల వద్ద జై శ్రీరామ్ నినాదాలతో వెలుగుల పండుగలో వాలంటీర్లు పాల్గొననున్నారు.శ్రీరాముడు కొలువైన అయోధ్య ఈ సంవత్సరం దీపోత్సవం సందర్భంగా డిజిటల్ సిటీగా కనిపించబోతోంది. వెలుగుల సంగమం ఆవిష్కృతం కానుంది. ధరంపథ్ నుండి లతా మంగేష్కర్ చౌక్ వరకు, రంగురంగుల లైట్లు ఆకర్షణీయంగా కనువిందు చేయనున్నాయి. ముఖ్యంగా లతా మంగేష్కర్ చౌక్ వెలుగు జిలుగులతో అత్యంత సుందరంగా కనిపించనుంది.దీపోత్సవ వేడుకలకు నగరమంతా త్రేతాయుగంలా ముస్తాబైంది. త్రేతాయుగంలో రాముడు లంకను జయించి అయోధ్యకు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున సంబరాలు జరిగాయి. ఇప్పుడు వాటిని గుర్తు చేసేలా అయోధ్యను రంగురంగుల దీపాలతో అలంకరించారు.లతా మంగేష్కర్ చౌక్ నుండి వివిధ కూడళ్లలో రామభక్తుల కోసం డిజిటల్ డిస్ప్లే వ్యవస్థను ఏర్పాటు చేశారు. రామభక్తులు దీపోత్సవ్ ప్రదేశానికి వెళ్లలేకపోయినా, డిజిటల్ తెరలపై దీపోత్సవాన్ని చూసి ఆస్వాదించవచ్చు.రంగురంగుల దీపాలు అయోధ్య అందాన్ని మరింత పెంచుతున్నాయి. రామభక్తులు రాత్రిపూట అయోధ్య వీధుల్లోకి వెళ్లినప్పుడు తమను తాము మైమరచిపోయేలా దీపోత్సవానికి ఏర్పాట్లు సాగుతున్నాయి.ఇది కూడా చదవండి: అత్యంత వృద్ధ మహిళ అస్తమయం -
1,100 మంది వేదాచార్యులతో సరయూ హారతి
లక్నో: ఉత్తరప్రదేశ్ యోగి సర్కారు అక్టోబర్ 28 నుంచి 30 వరకు రామనగరి అయోధ్యలో దీపోత్సవం నిర్వహించనుంది. ఈ సందర్భంగా మొత్తం 25 లక్షల దీపాలు వెలిగించనున్నారు. ఈ సందర్భంగా పలు కళాకారుల బృందాలు రామాయణంలోని వివిధ ఘట్టాల ఆధారంగా ప్రదర్శనలను నిర్వహించనున్నాయి.ఈ దీపోత్సవ్‌కు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో పాటు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కూడా హాజరుకానున్నారు. లక్ష్మణ్ ఖిలా ఘాట్ నుంచి నయా ఘాట్ వరకు 1100 మంది వేదాచార్యులతో సరయూ హారతి నిర్వహించి గిన్నిస్ రికార్డు నెలకొల్పుతామని యోగి ప్రభుత్వ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జైవీర్ సింగ్ తెలిపారు. రామ్ కీ పైడీలో లక్షల దీపాల మధ్య భారీ వేదికపై కళాకారులచేత సాంస్కృతిక కార్యక్రమాలు, లేజర్ షో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ దీపోత్సవంలో ఆరు దేశాలకు చెందిన కళాకారులు రాంలీలను ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా థాయ్‌లాండ్, కంబోడియా, ఇండోనేషియా, మయన్మార్, మలేషియా, నేపాల్‌కు చెందిన కళాకారులు తమ ప్రతిభను చాటనున్నారు. అలాగే కశ్మీర్, ఉత్తరాఖండ్, హర్యానా, మధ్యప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, అస్సాం, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్, బీహార్, చండీగఢ్, సిక్కిం, ఛత్తీస్‌గఢ్‌లకు చెందిన కళాకారులు అయోధ్యలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇది కూడా చదవండి: ఈ ఐదు నగరాల్లో.. మిన్నంటే దీపావళి సంబరాలు -
అయోధ్యలో కన్నుల పండుగగా దీపోత్సవం (ఫొటోలు)
-
నేడు అయోధ్యలో 51 ఘాట్లలో 24 లక్షల దీప కాంతులు!
అయోధ్యలో దీపావళిని మరింత దేదీప్యమానం చేసేందుకు ఈసారి కూడా రామనగరిని అందంగా ముస్తాబు చేస్తున్నారు. అయోధ్యలోని 51 ఘాట్లలో నవంబరు 11న(నేడు) 24 లక్షల దీపాలు వెలిగించి, సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత 6 సంవత్సరాలుగా అయోధ్యలో జరుగుతున్న దీపోత్సవం ప్రపంచ రికార్డులను సృష్టిస్తోంది. ఈ సంప్రదాయం ఈసారి కూడా కొనసాగనుంది. దీపావళి సందర్భంగా అయోధ్యలోని సరయూ నది ఒడ్డున లేజర్ షో ద్వారా శ్రీరాముని జీవిత సంగ్రహావలోకనాన్ని ప్రదర్శించనున్నారు. మనదేశానికి చెందిన కళాకారులతో పాటు రష్యా, శ్రీలంక, సింగపూర్, నేపాల్‌కు చెందిన కళాకారులు కూడా ఈ దీపోత్సవ్‌లో రామలీలను ప్రదర్శించనున్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా దీపావళి నాడు అయోధ్యలో త్రేతాయుగం కళ్లకు కట్టినట్లు చూపేందుకు కళాకారులు సన్నద్ధమవుతున్నారు. రామ మందిర నిర్మాణం పూర్తవుతున్న తరుణంలో ఈసారి అయోధ్యలో దీపావళి వేడుకలు అంబరాన్ని అంటనున్నాయి. ఈసారి యూపీతో పాటు పలు రాష్ట్రాల సంస్కృతులను ప్రదర్శనల్లో చూపనున్నారు. ఇప్పటికే అయోధ్యానగరి దీప కాంతులతో మెరిసిపోతోంది. రోడ్లు, ఇళ్లు, వీధులు జనాలతో రద్దీగా మారిపోయాయి. కాగా అయోధ్యలో జనవరి 22న రామాలయంలో రాముని విగ్రహ ప్రతిష్ఠ జరగనుంది. ఇందుకోసం ఇప్పటినుంచే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది కూడా చదవండి: ‘సరి- బేసి’తో ఎంత ప్రయోజనం? గతంలో ఏం తేలింది? #WATCH | Ayodhya is all set to hold a grand Deeptosav on the eve of Diwali with over 24 lakh diyas at 51 ghats set to illuminate the city pic.twitter.com/p4cEjJQiCd — ANI (@ANI) November 11, 2023 -
అయోధ్యలో గిన్నిస్ రికార్డు సృష్టించిన దీపోత్సవం (ఫొటోలు)
-
అట్టహాసంగా అయోధ్యలో దీపావళి వేడుకలు... హాజరుకానున్న మోదీ
న్యూఢిల్లీ: దీపావళి వేడుకలో యావత్ భారత్ ఆందహేళిలో మునిగితేలే ఒక రోజు ముందు కూడా దీపోత్సవ వేడుకలు పలు చోట్ల జరుగుతుంటాయి. ఈసారి అయోధ్యలో దీపావళి వేడుకలు అట్టహాసంగా జరగనున్నాయి. ఈ వేడుకలకు ఒక రోజుముందు అనగా... అదివారం ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యను సందర్శించే అవకాశం ఉందని అధికారిక వర్గాల సమాచారం. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా అయోధ్యలోని దీపోత్సవ వేడుకల సన్నహాలను పరిశీలించేందుకు బుధవారం పవిత్ర నగరాన్ని సందర్శించనున్నారని సమాచారం. ఆయన రామాలయంలో ప్రార్థనలు చేసిన తర్వాత ప్రధాని మోదీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రాని పరిశీలిస్తారని అధికారులు భావిస్తున్నారు. ఆ తర్వాత అక్కడ నుంచి కొత్తగా నిర్మిస్తున్న భారీ రామాలయాన్ని సందర్శించనున్నట్లు అధికారిక వర్గాల సమాచారం. షెడ్యూల్‌ప్రకారం ఆయన రామలీలా పాత్రలను వేసేవారిని స్వాగతించేందుకు రామ్ కథా పార్కును కూడా సందర్శించే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు రామమందిర నిర్మాణ కమిటీ రెండు రోజుల సమీక్షా సమావేశం ముగియడంతో ట్రస్ట్ సభ్యలు మీడియాతో మాట్లాడుతూ...రామమందిర నిర్మాణ పనులు దాదాపు 50శాతం జరిగాయని పేర్కొన్నారు. అలాగే ఆదివారం ప్రారంభమయ్యే మూడు రోజుల దీపోత్సవ వేడుకల్లో రష్యా, మలేషియా, శ్రీలంక, ఫిజీ దేశాలకు చెందిన కళాకారుల రాంలీలా ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణగా నిలవడమే గాక ఆవుపేడతో తయారు చేసిన దాదాపు 17 లక్షల మట్టి దీపాలను వెలగించి రికార్డు సృష్టించనున్నట్లు వెల్లడించారు. అంతేకాదు సరయునది వద్ద గ్రీన్ డిజిటల్ బాణసంచా కాల్చేందుకు ఏర్పాట్లు కూడా చేసినట్ల తెలిపారు. (చదవండి: విమానంలో ప్రయాణికుడి వీరంగం...సిబ్బంది వేలు కొరికి....) -
వెలుగు దివ్వెల్లో అయోధ్య.. గిన్నిస్ రికార్డుకై దీపోత్సవం
-
శ్రీరామ దివ్యక్షేత్రంలో లక్ష దీపాల వెలుగు
భద్రాచలం: శ్రీరామ దివ్యక్షేత్రం లక్ష దీపాలతో దే దీప్యమానంగా వెలిగింది. రామాలయం, స్వామి వారి కల్యాణ మండప ప్రాంగణమంతా గురువారం భక్తులతో కిటకిట లాడింది. బెంగళూరుకు చెందిన పరుచూరి గ్లోబల్ ఫౌండేషన్ సహకారంతో భద్రాచలంలో తొలసారిగా జరిగిన ఈ అరుదైన వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్తీక పుష్యమి లక్ష దీపోత్సవంలో తాము కూడా ఒక దీపాన్ని వెలిగించాలని భక్తులు ఎంతో ఆసక్తి కనబరిచారు. లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని భద్రాచలం ఆర్డీవో ఆర్. అంజయ్య, దేవస్థానం ఈవో కూరాకుల జ్యోతి, ఫౌండేషన్ చైర్మన్ పరుచూరి సురేంద్రకుమార్ ప్రారంభించారు. ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద వారు దీపాలను వెలిగించి లక్ష దీపోత్సవాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత కల్యాణ మండపంలో దీపాలను వెలిగించారు. దీపాలంకరణలో పాల్గొనేందుకు మొత్తం 76 గ్రూపులు పేర్లను నమోదు చే యించుకోగా వీరిలో 24 గ్రూపులను లాటరీ ద్వారా ఎంపిక చేశారు. ఆర్డీవో, ఈవో, ఫౌండేషన్ ైచె ర్మన్ చేతుల మీదగా లాటరీ ప్రక్రియను పూర్తయ్యింది. ఎంపికైన గ్రూపులలోని భక్తులంతా వారికి కేటాయించిన సెక్టార్లలోకి వెళ్లి దీపాలంకరణ చేశారు. కార్తీక మాసం కావటంతో మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గర్భగుడి ప్రాంగణం, రాజగోపురం ఎదుటగా భక్తులు వెలిగించిన దీపాలతో రామాలయం దేదీప్యమానంగా కనిపిం చింది. ఆకట్టుకున్న దీపాలంకరణలు కార్తీక పుష్యమి లక్ష దీపోత్సవంలో భాగంగా కల్యాణ మండప ప్రాంగణంలో మహిళలు చేసిన దీపాలంకరణ లు ఆకట్టుకున్నాయి. పిల్లలు, వృద్ధులు సైతం ఉత్సాహంగా దీపాలంకరణలో పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. దీపాలంకరణ నడుమ దేవుళ్ల రూపాన్ని అమర్చటంతో, అందంగా పూలతో వాటికి అలంకరణ చేశారు. వర్షంతో ఏర్పాట్లకు కొంత ఆటంకం కలిగినప్పటికీ భక్తి భావంతో ఉన్న మిహ ళలు ఇవేమీ లెక్కచేయకుండా దీపాలంకరణ చేశారు. ఈ కార్యక్రమంలో నారాయణ స్వామి, కెప్టెన్ చౌదరి, ఫౌండేషన్ మేనేజర్ కపిల్, ఏఈవో శ్రావణ్ కమార్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు శివానంద ఆశ్రమం వారు ముద్రించిన హనుమాన్ చాలీసా పుస్తకాన్ని ఆవిష్కరించారు. భద్రాద్రి ఆలయాభివృద్ధికి సహకారం భద్రాచలం రామాలయం అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని పరుచూరి గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ పరుచూరి సురేంద్రకుమార్ అన్నారు. భద్రాచలం పౌరసమితి ఆధ్వర్యంలో పట్టణంలోని జీయర్ మఠంలో సురేంద్రకుమార్‌కు పౌర సన్మానం చేశారు. పట్టణ ప్రముఖులు ఆయన్ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రాద్రి రామయ్యపై తనకు ఉన్న భక్తిభావంతోనే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డాక్టర్ ఎస్.ఎల్.కాంతారావు, లిటిల్‌ఫ్లవర్స్ విద్యాసంస్థల చైర్మన్ మాగంటి సూర్యం, యోగి సూర్యనారాయణ, సర్పంచ్ భూక్యా శ్వేత, అడుసుమిల్లి జగదీష్ పాల్గొన్నారు.