అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లో శ్రీరాముడు కొలువైన అయోధ్య పలు రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పుడు నవంబర్ 15న కార్తీక పౌర్ణమి సందర్భంగా మరో రికార్డుకు అయోధ్య సిద్ధమవుతోంది.
రాష్ట్రంలో యోగి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అయోధ్యలో ప్రతీయేటా ‘దీపోత్సవం’ ప్రారంభమైంది. నూతన రామాలయంలో బాలక్ రామ్‌ను ప్రతిష్టించిన తర్వాత అయోధ్యలో చారిత్రాత్మక స్థాయిలో దీపోత్సవాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిశ్చయించారు. ఈ నేపధ్యంలో ఇక్కడి సరయూ తీరంలో మూడు రికార్డులు నమోదయ్యాయి.
72 గంటల్లో 28 లక్షల దీపాలు
అయోధ్యలోని రామ్ కీ పైడీలో గత అక్టోబరులో 35 వేల మంది వాలంటీర్లు 55 ఘాట్లలో 28 లక్షల దీపాలు వెలిగించారు. కేవలం 72 గంటల్లోనే దీపాలను అలంకరించి, అయోధ్యలో సరికొత్త రికార్డు సృష్టించారు.
ఏకకాలంలో 1,100 హారతులు
గత అక్టోబర్ 30న సాయంత్రం సమయాన సరయూ నది ఒడ్డున సరికొత్త రికార్డు నెలకొల్పారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 1,100 మంది భక్తులు సరయూమాతకు హారతులిచ్చారు. ఈ సమయంలో వీరంతా ఒకే రంగు దుస్తులు ధరించారు.
35 లక్షల మంది భక్తుల ప్రదక్షిణలు
మొన్నటి నవంబరు 9వ తేదీన సాయంత్రం అయోధ్యలో 35 లక్షల మంది భక్తులు ఆలయ ప్రదక్షిణలతో మరో రికార్డు నెలకొల్పారు. 24 గంటల పాటు ఈ ప్రదక్షిణలు సాగాయి. ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం భక్తుల కోసం పలు ఏర్పాట్లు చేసింది.
కార్తీక పౌర్ణమికి మరో రికార్డు
నవంబర్ 15న కార్తీక పౌర్ణమి సందర్భంగా అత్యధిక సంఖ్యలో భక్తులు అయోధ్యకు తరలివచ్చి, సరయూ నదిలో పుణ్యస్నానాలు చేయనున్నారని స్థానిక అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగం భారీగా ఏర్పాట్లు చేసింది. 12 చోట్ల తాత్కాలిక ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా సారించనున్నారు.
ఇది కూడా చదవండి: Children's Day 2024: బాలల నేస్తం.. చాచా నెహ్రూ..
Comments
Please login to add a commentAdd a comment