devote
-
15న మరో రికార్డుకు సిద్ధమవుతున్న అయోధ్య
అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లో శ్రీరాముడు కొలువైన అయోధ్య పలు రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పుడు నవంబర్ 15న కార్తీక పౌర్ణమి సందర్భంగా మరో రికార్డుకు అయోధ్య సిద్ధమవుతోంది.రాష్ట్రంలో యోగి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అయోధ్యలో ప్రతీయేటా ‘దీపోత్సవం’ ప్రారంభమైంది. నూతన రామాలయంలో బాలక్ రామ్‌ను ప్రతిష్టించిన తర్వాత అయోధ్యలో చారిత్రాత్మక స్థాయిలో దీపోత్సవాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిశ్చయించారు. ఈ నేపధ్యంలో ఇక్కడి సరయూ తీరంలో మూడు రికార్డులు నమోదయ్యాయి.72 గంటల్లో 28 లక్షల దీపాలుఅయోధ్యలోని రామ్ కీ పైడీలో గత అక్టోబరులో 35 వేల మంది వాలంటీర్లు 55 ఘాట్లలో 28 లక్షల దీపాలు వెలిగించారు. కేవలం 72 గంటల్లోనే దీపాలను అలంకరించి, అయోధ్యలో సరికొత్త రికార్డు సృష్టించారు.ఏకకాలంలో 1,100 హారతులుగత అక్టోబర్ 30న సాయంత్రం సమయాన సరయూ నది ఒడ్డున సరికొత్త రికార్డు నెలకొల్పారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 1,100 మంది భక్తులు సరయూమాతకు హారతులిచ్చారు. ఈ సమయంలో వీరంతా ఒకే రంగు దుస్తులు ధరించారు.35 లక్షల మంది భక్తుల ప్రదక్షిణలు మొన్నటి నవంబరు 9వ తేదీన సాయంత్రం అయోధ్యలో 35 లక్షల మంది భక్తులు ఆలయ ప్రదక్షిణలతో మరో రికార్డు నెలకొల్పారు. 24 గంటల పాటు ఈ ప్రదక్షిణలు సాగాయి. ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం భక్తుల కోసం పలు ఏర్పాట్లు చేసింది.కార్తీక పౌర్ణమికి మరో రికార్డునవంబర్ 15న కార్తీక పౌర్ణమి సందర్భంగా అత్యధిక సంఖ్యలో భక్తులు అయోధ్యకు తరలివచ్చి, సరయూ నదిలో పుణ్యస్నానాలు చేయనున్నారని స్థానిక అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగం భారీగా ఏర్పాట్లు చేసింది. 12 చోట్ల తాత్కాలిక ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా సారించనున్నారు.ఇది కూడా చదవండి: Children's Day 2024: బాలల నేస్తం.. చాచా నెహ్రూ.. -
మాణిక్యధార కొండకు పోటెత్తిన భక్తులు
-
రేపు లైవ్‌లో మహాదేవుని కల్యాణం
రేపు (శుక్రవారం) మహా శివరాత్రి సందర్భంగా యూపీలోని కాశీలో మహాదేవుని కళ్యాణానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలను భక్తులు తమ మొబైల్ ఫోన్లలో ప్రత్యక్షంగా చూడవచ్చు. కాశీ విశ్వనాథ దేవాలయం ట్రస్ట్.. మార్చి 8న మంగళ హారతి నుండి మార్చి 9 న భోగ్ హారతి వరకు మొత్తం 36 గంటల పాటు అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలలో నాన్‌స్టాప్ లైవ్ టెలికాస్ట్ చేయనున్నట్లు ప్రకటించింది. మహాశివరాత్రి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఆలయ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ఏడాది కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకునేందుకు 10 లక్షల మందికి పైగా భక్తులు హాజరవుతారని ట్రస్ట్ అంచనా వేస్తోంది. వికలాంగులు, వృద్ధులు సులభంగా దర్శనం చేసుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఏడాది మహాశివరాత్రి సందర్భంగా సుమారు 8 లక్షల మంది భక్తులు కాశీ విశ్వనాథుణ్ణి దర్శించుకున్నారని, ఈసారి ఆ సంఖ్య 10 లక్షలు దాటే అవకాశం ఉందని ట్రస్ట్ సభ్యులు చెబుతున్నారు. వారణాసిలోని అస్సీ ఘాట్, దశాశ్వమేధ్ ఘాట్, వారణాసి కాంట్ రైల్వే స్టేషన్ ఇతర ప్రధాన ప్రదేశాలలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్లపై శ్రీ కాశీ విశ్వనాథ ఆలయ గర్భగుడి నుంచి ప్రత్యక్ష దర్శనాన్ని ప్రసారం చేయనున్నమని తెలిపారు. -
రామాలయ ప్రాంగణంలో ప్రత్యేక ఆలయాలివే..
శ్రీరామ జన్మభూమి అయోధ్యలోని నూతన రామాలయంలో బాలరాముడు జనవరి 22న కొలువుదీరనున్నాడు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వానపత్రికలను ప్రముఖులకు అందజేస్తున్నారు. అయితే సామాన్యులు జనవరి 22 తరువాత ఆలయాన్ని సందర్శించుకోవాలని రామజన్మభూమి ఆలయట్రస్ట్ కోరింది. జనం రద్దీని నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. నూతన రామాలయం ప్రాంగణంలో పలు ఇతర ఆలయాలు కూడా ఉండనున్నాయని రామాలయ ట్రస్టు తెలిపింది. వీటిలో మహర్షులు వాల్మీకి, వశిష్ఠుడు, విశ్వామిత్ర,అగస్త్యుడు, శబరి, అహల్య ఆలయాలు ముఖ్యమైనవి. దీంతో పాటు నైరుతి భాగంలో నవరత్న కుబేరుడు కొలువుదీరనున్నాడు. గుట్టపై ఉన్న శివాలయాన్ని పునరుద్ధరించి అక్కడ రామభక్తుడు జటాయురాజు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి అయోధ్యలో ఉన్న రామ మందిర సముదాయాన్ని ఉత్తరప్రదేశ్ పోలీసు ఎస్టీఎఫ్ పర్యవేక్షించనుంది . 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయాన్ని జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఇది కూడా చదవండి: 22న అయోధ్యలో వెలగనున్న భారీ దీపం -
అయోధ్యలో కొలువుదీరే శ్రీరాముని విగ్రహం ఇదే!
అయోధ్యలోని నూతన రామాలయంలో జనవరి 22న కొలువుదీరనున్న రాముని విగ్రహం ఖరారయ్యింది. కర్ణాటకకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దిన విగ్రహాన్ని ఎంపిక చేశారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియా ప్లాట్ఫారం ఎక్స్‌లో ఇలా రాశారు.. ‘రాముడు ఎక్కడ ఉంటాడో, అక్కడ హనుమంతుడు ఉంటాడు. అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్ఠాపన కోసం విగ్రహాన్ని ఎంపిక చేశారు. మన దేశపు ప్రఖ్యాత శిల్పి అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన రాముని విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్ఠించనున్నారు. రాముడు, హనుమంతునికి మధ్యనున్న అవినాభావ సంబంధానికి ఇది మరొక ఉదాహరణ. హనుమంతుని జన్మభూమి అయిన కర్ణాటక నుంచే శ్రీరామునికి సేవా కార్యం జరిగినదనడంలో సందేహం లేదు’ అని పేర్కొన్నారు. అయోధ్య రామాలయ ట్రస్ట్ నేపాల్‌లోని గండకీ నదితో పాటు కర్ణాటక, రాజస్థాన్, ఒరిస్సా నుండి శ్రీరాముని విగ్రహ రూపకల్పనకు మొత్తం 12 నాణ్యమైన రాళ్లను సేకరించింది. ఈ రాళ్లన్నింటినీ పరీక్షించగా కేవలం రాజస్థాన్, కర్ణాటక రాళ్లే విగ్రహాల తయారీకి అనువుగా ఉన్నట్లు గుర్తించారు. కర్ణాటకలో లభించిన శ్యామ శిల, రాజస్థాన్‌లోని మక్రానాకు చెందిన మార్బుల్ రాక్లను ఎంపిక చేశారు. మక్రానా రాయి ఎంతో విశిష్టమైనది. అలాగే కర్నాటకలోని శ్యామ శిల.. శిల్పాలు చెక్కేందుకు అనువుగా ఉంటుంది. ఈ రాళ్ళు నీటి నిరోధకతను కలిగి ఉంటాయి. సుదీర్ఘ జీవితకాలాన్ని కూడా కలిగి ఉంటాయి. ప్రఖ్యాత శిల్పి యోగిరాజ్ శిల్పి కుమారుడు అరుణ్ యోగిరాజ్(37) ఎంబీఏ పూర్తిచేశారు. ఇతను యోగిరాజ్ కుటుంబంలో ఐదో తరం శిల్పి. అరుణ్ యోగిరాజ్ 2008లో ఉద్యోగం మానేసి, పూర్తిస్థాయి శిల్పకారునిగా మారారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి అరుణ్ యోగిరాజ్.. మహారాజా జయచామరాజేంద్ర వడయార్‌తో సహా అనేక ప్రముఖుల విగ్రహాలను తయారు చేశారు. కేదార్‌నాథ్‌లో స్థాపించిన ఆదిశంకరాచార్య విగ్రహాన్ని రూపొందించారు. అలాగే మైసూరులో మహారాజా శ్రీకృష్ణరాజ వడయార్-IV, స్వామి రామకృష్ణ పరమహంస పాలరాతి విగ్రహం మొదలైనవి తీర్చిదిద్దారు. ఇండియా గేట్ దగ్గర కనిపించే నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం కూడా అరుణ్ యోగిరాజ్ రూపొందించినదే! "ಎಲ್ಲಿ ರಾಮನೋ ಅಲ್ಲಿ ಹನುಮನು" ಅಯೋಧ್ಯೆಯಲ್ಲಿ ಶ್ರೀರಾಮನ ಪ್ರಾಣ ಪ್ರತಿಷ್ಠಾಪನಾ ಕಾರ್ಯಕ್ಕೆ ವಿಗ್ರಹ ಆಯ್ಕೆ ಅಂತಿಮಗೊಂಡಿದೆ. ನಮ್ಮ ನಾಡಿನ ಹೆಸರಾಂತ ಶಿಲ್ಪಿ ನಮ್ಮ ಹೆಮ್ಮೆಯ ಶ್ರೀ @yogiraj_arun ಅವರು ಕೆತ್ತಿರುವ ಶ್ರೀರಾಮನ ವಿಗ್ರಹ ಪುಣ್ಯಭೂಮಿ ಅಯೋಧ್ಯೆಯಲ್ಲಿ ಪ್ರತಿಷ್ಠಾಪನೆಗೊಳ್ಳಲಿದೆ. ರಾಮ ಹನುಮರ ಅವಿನಾಭಾವ ಸಂಬಂಧಕ್ಕೆ ಇದು… pic.twitter.com/VQdxAbQw3Q — Pralhad Joshi (@JoshiPralhad) January 1, 2024 -
పెల్లుబికిన భక్తి ప్రవాహం.. చార్ధామ్ యాత్రలో భక్తుల రద్దీ!
హిందువులు చార్ధామ్ యాత్రను ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తారు. తమ జీవితంలో ఒక్కసారైనా చార్ధామ్ యాత్ర చేయాలనుకుంటారు. ప్రతి సంవత్సరం చార్ధామ్ యాత్రకు భక్తులు తరలివస్తుంటారు. చార్ధామ్ యాత్ర అంటే కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రిలను చుట్టిరావడం. ఈ చార్ధామ్ యాత్రతో పాటు ఇతర ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు కూడా 2023లో భక్తుల తాకిడి ఎదురయ్యింది. 2023లో ఏ ధామాన్ని సందర్శించడానికి ఎంత మంది భక్తులు వచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం. మీడియా దగ్గరున్న సమాచారం ప్రకారం ఈ సంవత్సరం 50 లక్షల మందికి పైగా భక్తులు చార్ధామ్ యాత్రచేశారు. 2021లో సుమారు 5 లక్షల 18 వేల మంది భక్తులు చార్ ధామ్ యాత్ర చేశారు. 2022లో ఈ సంఖ్య 46 లక్షల 27 వేలు దాటింది. 2023లో అక్టోబర్ 16 నాటికి ఈ సంఖ్య 50 లక్షలు దాటడం విశేషం. కేదార్నాథ్ ధామ్ ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ ధామ్ 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా పరిగణిస్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడికి చేరుకోవడానికి హెలికాప్టర్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. 2023 లో 19 లక్షల 61 వేల మందికి పైగా భక్తులు కేదార్నాథ్ ధామ్‌కు తీర్థయాత్ర చేశారు. 2023లో కేదార్నాథ్ తలుపులు ఏప్రిల్ 25న తెరుచుకున్నాయి. ఈ యాత్ర నవంబర్ 15న ముగిసింది. బద్రీనాథ్ ధామ్ విష్ణు భక్తులు బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించడాన్ని ఒక వరంగా భావిస్తారు. ఈ సంవత్సరం బద్రీనాథ్ యాత్ర ఏప్రిల్ 27న ప్రారంభమై, నవంబర్ 15న ముగిసింది. ఈ ఏడాది బద్రీనాథ్‌కు వచ్చిన 18 లక్షల 34 వేల మందికి పైగా భక్తులు బద్రీ విశాల్ స్వామిని దర్శించుకున్నారు. గంగోత్రి ఈ ఏడాది 9 లక్షల 5 వేల మందికి పైగా భక్తులు గంగోత్రి యాత్రను పూర్తి చేసుకున్నారు. 2023లో గంగోత్రి యాత్ర ఏప్రిల్ 22 నుండి ప్రారంభమై, నవంబర్ 14న ముగిసింది. ప్రతి సంవత్సరం గంగోత్రి యాత్ర ప్రారంభం కాగానే గంగమ్మ దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు ఇక్కడికు తరలి వస్తుంటారు. యమునోత్రి ఈ ఏడాది యమునోత్రిని 7 లక్షల 35 వేల మందికి పైగా భక్తులు సందర్శించారు. యమునోత్రి యాత్ర 2023, ఏప్రిల్ 22న న ప్రారంభమై నవంబర్ 15న ముగిసింది. యమునోత్రిని యమునా దేవి నివాసంగా చెబుతారు. ఇక్కడ యమునా దేవి ఆలయం కూడా ఉంది. అమర్నాథ్ చార్ధామ్తో పాటు ఇతర యాత్రా స్థలాల విషయానికి వస్తే 2023లో దాదాపు 4 లక్షల 40 వేల మంది భక్తులు అమర్నాథ్ను దర్శించుకున్నారు. ఈ సంవత్సరం అమర్నాథ్ యాత్ర జూలై ఒకటి నుండి ప్రారంభమై ఆగస్టు 31న ముగిసింది. అమర్నాథ్ ప్రయాణం ఎంతో కష్టతరమైనప్పటికీ భక్తులు ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో ఇక్కడికి తరలివస్తుంటారు హేమకుండ్ సాహిబ్ యాత్ర హేమకుండ్ సాహిబ్ సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ సంవత్సరం హేమకుండ్ సాహిబ్ యాత్ర మే 20 నుంచి నుండి అక్టోబర్ 11 వరకు కొనసాగింది. ప్రతి సంవత్సరం హేమకుండ్ సాహిబ్ యాత్రకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. 2023లో దాదాపు 2 లక్షల మంది హేమకుండ్ సాహిబ్‌ను సందర్శించుకున్నారు. ఇది కూడా చదవండి: అలరిస్తున్న ఉల్లి, ఇసుకల శాంతాక్లాజ్ శిల్పం! -
శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠకు 60 గంటలపాటు పూజలు
అయోధ్యలో శ్రీరాముడు కొలువుదీరడానికి ఇక 40 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ 2024 జనవరి 22న శ్రీరామునికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. కాశీకి చెందిన పండితులు లక్ష్మీకాంత దీక్షిత్ నేతృత్వంలో 121 మందికి పైగా వేద పండితుల బృందం జనవరి 16 నుండి 22 వరకు రామాలయంలో పూజలు నిర్వహించనుంది. శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు ముందు యాగంతో పాటు నాలుగు వేదాల పఠనం.. ఇలా మొత్తం 60 గంటల పాటు వివిధ పూజాది కార్యక్రమాలు జరగనున్నాయి. శ్రీరామునికి 56 రకాల ప్రసాదాలు సమర్పించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ.. శ్రీరామునికి ఘనమైన హారతినివ్వనున్నారు. జనవరి 17న ఉదయం ఎనిమిది గంటలకు ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం ప్రారంభమై, మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగనుంది. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు వివిధ పూజలు తిరిగి ప్రారంభమై రాత్రి 9.30 గంటల వరకు కొనసాగనున్నాయి. అంటే జనవరి 16 నుండి 22 వరకు ప్రతిరోజూ దాదాపు 10 నుండి 12 గంటల పాటు రామాలయంలో పూజలు జరగనున్నాయి. జనవరి 22న బాల శ్రీరాముడు గర్భగుడిలో కొలువుదీరనున్నాడు. ఈ పూజాదికాల కోసం ఆలయ ప్రాంగణంలో పలు మండపాలు, హోమ గుండాలు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)కు చెందిన సాయుధ బృందం అయోధ్యలో త్వరలో ప్రారంభంకానున్న అంతర్జాతీయ విమానాశ్రయానికి భద్రతను అందించనుంది. డిసెంబర్ నెలాఖరులోగా విమానాశ్రయం మొదటి దశ పూర్తవుతుంది. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. ఇది కూడా చదవండి: రాజస్థాన్ సీఎం ఎంపికకు ఛత్తీస్‌గఢ్ ఫార్ములా? -
ఐపీఎస్ కొలువుకు రాజీనామా.. శ్రీకృష్ణుడి సేవకు అంకితం
చండీగఢ్: పోలీసు ఉద్యోగానికి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ ఐపీఎస్ కొలువు అంటే మాటలు కాదు. ఇక ఐపీఎస్ ఉద్యోగం సాధించడం కూడా అంత సులువు కాదు. మొదటి ప్రయత్నంలోనే ఐపీఎస్ సాధించేవారు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఎక్కువ మంది ఏళ్ల తరబడి అహోరాత్రాలు శ్రమించి.. కష్టపడి చదువుతారు. అయినా కొందరికి ఉద్యోగం రాదు. అంతలా కష్టపడి సాధించిన ఉద్యోగాన్ని మధ్యలోనే వదులుకుంటారా.. అది కూడా దేవుని సేవ కోసం. చాలా కష్టం కదా. కానీ హరియాణాకు చెందిన ఓ మహిళా ఐపీఎస్ అధికారి తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. మిగతా జీవితాన్ని భగవంతుడి సేవకు అంకితం చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఆమె నిర్ణయం విన్నవారంతా షాకవుతున్నారు. ఆ వివరాలు.. ప్రస్తుతం హరియాణా అంబాలా రేంజ్లో ఇన్స్పెక్టర్ జనరల్‌గా విధులు నిర్వహిస్తున్నారు సీనియర్ ఐపీఎస్ అధికారిణి భారతి అరోరా. ఈ క్రమంలో ఆమె తాను స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోవాలనుకుంటున్నట్లు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఈ మేరకు భాతరి అరోరా రాష్ట్ర ప్రధాన సలహాదారుకు లేఖ రాశారు. దానిలో "50 సంవత్సరాల వయస్సు వచ్చిన తరువాత, ఆల్ ఇండియా సర్వీసెస్ (డీసీఆర్బీ) నిబంధనలు, 1958 లోని రూల్ 16 (2) ప్రకారం, ఆగస్టు 1, 2021 నుంచి సర్వీసు నుంచి పదవీ విరమణ కోరుతూ.. నేను ఈ దరఖాస్తును స్వచ్ఛందంగా సమర్పించాను" అని తెలిపారు. “ఇప్పుడు నేను జీవితం అంతిమ లక్ష్యాన్ని సాధించాలనుకుంటున్నాను. పవిత్ర సాధువులైన గురు నానక్ దేవ్, చైతన్య మహాప్రభు, కబీర్దాస్, తులసీదాస్, సుర్దాస్, మీరాబాయి, సూఫీ సాధువులు చూపిన మార్గంలో జీవించాలనుకుంటున్నాను. శ్రీకృష్ణుడి సేవకు నా జీవితాంతం అంకితం చేయాలని నేను ఆరాటపడుతున్నాను’’ అని తెలిపారు భారతి అరోరా. ఇక దీనిపై ఫోన్ ద్వారా భారతి అరోరా పీటీఐతో మాట్లాడుతూ, ‘‘నా ఉద్యోగం అంటే నాకు ఎంతో గౌరవం, ఆసక్తి. ఇప్పటికే 23 ఏళ్లుగా విధులు నిర్వహించాను. ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో పయణించాలనుకుంటున్నాను. అందుకే ఉద్యోగం నుంచి స్వచ్ఛందంగా వైదొలగాలని భావిస్తున్నాను’’ అని తెలిపారు. ఐపీఎస్ అధికారిగా పని చేసిన భారతి అరోరా 2007 సంజౌతా ఎక్స్‌ప్రెస్ రైలు పేలుడు కేసును దర్యాప్తు చేశారు. అప్పుడు ఆమె పోలీసు సూపరింటెండెంట్‌గా (రైల్వే) విధులు నిర్వహించారు. పోలీసు పరిపాలనలో పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆమెను ఏప్రిల్ 2021 లో కర్నాల్ నుంచి అంబాలా రేంజ్‌కు బదిలీ చేశారు. భారతి తన లేఖలో “నా సేవ పట్ల నేను ఎంతో గర్విస్తున్నాను. నాకు సేవ చేయడానికి, నేర్చుకోవడానికి, ఎదగడానికి అవకాశం కల్పించినందుకు ఈ సేవకు నేను చాలా కృతజ్ఞతలు. నాకు సరైన మార్గాన్ని చూపించినందుకు హరియాణా రాష్ట్రానికి నా కృతజ్ఞతలు. నా అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొని ఆగస్టు 1 నుంచి స్వచ్ఛందంగా సేవ నుంచి విరమించుకునేందుకు నన్ను అనుమతించమని నేను కోరుతున్నాను” అన్నారు. -
ప్రసాదంకోసం ప్రాణాలే పోగొట్టుకుంది
తిరుత్తణి: వెంటపడుతున్న కోతి నుంచి దేవుడి ప్రసాదాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఓ భక్తురాలు కొండపై నుంచి పడి ప్రాణాలు వదిలిన దయనీయమైన సంఘటన తమిళనాడులో గురువారం చోటుచేసుకుంది. బెంగళూరు అంబేడ్కర్ నగర్ శ్రీనివాసపురానికి చెందిన 50 మంది మహిళా భక్తులు ఆదిపరాశక్తి మాలధారణ చేశారు. మాలధారణతో పుణ్యక్షేత్రాలు సందర్శించే నిమిత్తం బెంగళూరు నుంచి మంగళవారం చెన్నై శివారు మేల్‌మరువత్తూరులోని ఆదిపరాశక్తి ఆలయాన్ని దర్శించుకున్నారు. అక్కడి నుంచి గురువారం సాయంత్రం తిరుత్తణి కొండపైనున్న సుబ్రమణ్యస్వామి ఆలయానికి చేరుకున్నారు. భక్తులం తా స్వామిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరిస్తుండగా గణేష్ భార్య నళిని(45) వద్దనున్న ప్రసాదం బ్యాగును ఒక కోతి లాగేసుకో బోయింది. దీంతో ఆందోళన చెందిన నళిని కోతి నుంచి తప్పించుకునేందుకు కొండపై పరుగులు తీస్తూ కాలుజారి మాడ వీధిలో పడిపోయింది. ఆమెను తోటి భక్తులు సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. -
తిరుమలలో నూతన సంవత్సరం సందడి
-
వరసిద్ధునికి రూ.2లక్షల విరాళం
ఐరాల : కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి వారికి మంగళవారం ఓ భక్తుడు రూ.2,00,116 విరాళంగా అందజేశారు. నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష, స్వామి వారి సేవలకు 1,00,116 రూపాయలను గుంటూరుకు చెందిన మణికంఠ డీడీ రూపంలో ఏఈఓ కేశవరావుకు ఈ విరాళం అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాలతో స్వామి వారి ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం మూషిక మండపంలో వేదపండితుల ఆశీర్వచనం పలికి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు పలువురు పాల్గొన్నారు. వినాయకుని సన్నిధిలో కన్నా లక్ష్మీనారాయణ కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామిని మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. స్వామి వారి ప్రత్యేక దర్శనం, వేదపండితులు ఆశీర్వచనం అనంతరం ఆలయ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాలను అందజేశారు. -
లోకారాధన
రఘువంశరాజుల సద్గుణాలను కీర్తించకుండా ఉండ లేక రఘువంశ మహాకావ్యాన్ని తాను రచిస్తున్నానని కాళిదాస మహాకవి పేర్కొన్నాడు. సద్గుణ నిధులైన రఘువంశ రాజులు తమకు లభించిన రాజ్యాధికారం ప్రజలపై పెత్తనం చెలాయించడానికి అని ఎన్నడూ భావించలేదు. తమ వంశంలో పుట్టిన వారికి అన్ని యోగ్యతలుంటేనే వారిని రాజ్యపాలనకు అర్హులని భావించారు. తమ సంతానంలో ఎవరైనా ప్రజలకు ఇబ్బందు లను కలిగిస్తూ, తమ వంశ మర్యాదకు కళంకాన్ని తీసుకొని వస్తూ ఉంటే వారిని రాజ్యం నుండి బహిష్కరించడా నికి కూడా రఘువంశ రాజులు ఏ మాత్రం వెనుకంజ వేసేవారు కారు. సామాన్య ప్రజలలో సద్గు ణములను, తగిన సామర్థ్య మును కూడా ఎవరైనా కలిగి ఉంటే వారితో తమకు రక్తసంబంధం లేకపోయినా వారిని చేరదీసేందుకు రఘువంశ రాజులు ఏమాత్రం సంకోచించే వారు కారు. రఘువంశరాజులు రాజ్యపరిపాలనను భగవదా రాధనగా భావించేవారు. శ్రీరామచంద్రుడు 11 వేల సంవత్సరాల కాలం భగవంతుని ఉపాసనారూపంగా రాజ్యాన్ని పరిపాలించాడు అని సంక్షేప రామాయణం లోని ‘‘దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ / రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి॥అనే శ్లోకం ద్వారా తెలుస్తోంది. శ్రీరామచంద్రుడు ధర్మబద్ధమైన పరిపాలనను అందించినందువల్లనే ప్రజలు కూడా ధర్మమార్గాన్ని అనుసరిస్తూ జీవనాన్ని కొనసాగించారు. శ్రీరామచం ద్రుడు తన ప్రాణానికి ప్రాణమైన లక్ష్మణునికన్న, ప్రియ మైన ధర్మపత్నియైన సీతాదేవికన్న తనకు మహోన్న తమైన కీర్తిప్రతిష్టలను కలిగిస్తూ ఉండే, తనలోని స్నేహము దయ మొదలగు గుణాలకన్న తనకు లభించే రాజ్యసుఖాలకన్న లోకారాధన రూపమైన రాజ్యపరి పాలనే ముఖ్యమని భావించినాడు. అందుకే లోకారాధన రూపంగా కొనసాగే రాజ్య పరిపాలన నిమిత్తం దేనినైనా ఎంత ముఖ్యమైన వారి నైనా వదులుకోవడానికి సిద్ధమని, తాను రాజ్యపరిపా లన విషయంలో అవసరమైతే ప్రాణాలను అయినా విడుస్తాను కాని ప్రజలకిచ్చిన వాగ్దానములను వదల లేనని శ్రీరామచంద్రుడు ప్రతిజ్ఞా పూర్వకంగా పేర్కొ న్నాడు. రఘువంశ రాజులు ప్రజలను ప్రభువులుగా, తమను ప్రజాసేవకులుగా భావించుకున్నారు. అంతే తప్ప ప్రభువులం అనే అహంకార ధోరణిని వారు ప్రదర్శించనేలేదు. రాజు ధర్మాత్ముడైతే ప్రజలు ధర్మాత్ములౌతారు. రాజు పాపాత్ముడైతే ప్రజలు పాపకార్యాల్లో ఆసక్తి కలిగియుంటారు. రాజునే ప్రజలు అనుసరిస్తారు అనే విషయాన్ని ‘‘యథా రాజా తథా ప్రజా’’ అనే సూక్తి ధృవ పరుస్తున్నది. ప్రజలను పరిపాలించాలనే భావనతో కాకుండా వారిని ఆరాధించాలనే సంకల్పంతోనే రాజ్యాధికారాన్ని చేపట్టిన ఆదర్శ ప్రభువు శ్రీరామచం ద్రుడు. అందుకే నాటి నుండి నేటి వరకు రామరాజ్య మనే ప్రసిద్ధి చెక్కుచెదరకుండా ఉన్నది. శ్రీరామచం ద్రుని ప్రజాపరిపాలనా విధానం పరిపాలకులందరికీ ఆదర్శప్రాయం కావాలని ఆశిద్దాం. సముద్రాల శఠగోపాచార్యులు -
ఫీరోజ్ఖాన్కు నివాళులు అర్పించనున్న జగన్