మృతి చెందిన నళిని
తిరుత్తణి: వెంటపడుతున్న కోతి నుంచి దేవుడి ప్రసాదాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఓ భక్తురాలు కొండపై నుంచి పడి ప్రాణాలు వదిలిన దయనీయమైన సంఘటన తమిళనాడులో గురువారం చోటుచేసుకుంది. బెంగళూరు అంబేడ్కర్ నగర్ శ్రీనివాసపురానికి చెందిన 50 మంది మహిళా భక్తులు ఆదిపరాశక్తి మాలధారణ చేశారు. మాలధారణతో పుణ్యక్షేత్రాలు సందర్శించే నిమిత్తం బెంగళూరు నుంచి మంగళవారం చెన్నై శివారు మేల్‌మరువత్తూరులోని ఆదిపరాశక్తి ఆలయాన్ని దర్శించుకున్నారు.
అక్కడి నుంచి గురువారం సాయంత్రం తిరుత్తణి కొండపైనున్న సుబ్రమణ్యస్వామి ఆలయానికి చేరుకున్నారు. భక్తులం తా స్వామిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరిస్తుండగా గణేష్ భార్య నళిని(45) వద్దనున్న ప్రసాదం బ్యాగును ఒక కోతి లాగేసుకో బోయింది. దీంతో ఆందోళన చెందిన నళిని కోతి నుంచి తప్పించుకునేందుకు కొండపై పరుగులు తీస్తూ కాలుజారి మాడ వీధిలో పడిపోయింది. ఆమెను తోటి భక్తులు సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది.
Comments
Please login to add a commentAdd a comment