hill
-
అదీ గ్లాస్ బ్రిడ్జ్..! ఎక్కారంటే ప్రాణం గుప్పిట్లోనే!!
ఎత్తయిన కొండ అంచున వాక్ వే .. అదీ గ్లాస్ బ్రిడ్జ్! రెయిలింగ్ నుంచి పక్కకు చూసినా.. నడుస్తూ కిందకు చూసినా.. గుండె జారిపోయే దృశ్యమే! ఇదేదో థ్రిల్లర్ మూవీలో సీన్ అనుకునేరు! చైనాలోని పర్యాటక ప్రాంతం. పేరు.. ఝాంగ్జాజే నేషనల్ ఫారెస్ట్ పార్క్!చైనాలో యునెస్కో గుర్తించిన ఫస్ట్ వరల్డ్ హెరిటేజ్ సైట్! భలే ఉంది కదా! చూడాలని మనసు ఉవ్విళ్లురుతోంది సరే... హార్ట్ బీట్‌ని కంట్రోల్లో పెట్టుకుని మరీ ఆ బ్రిడ్జి ఎక్కండి!ఇవి చదవండి: తొలి సజీవ కంప్యూటర్ని.. మీరెప్పుడైనా చూశారా!? -
కళ్లు చెదిరే అందంతో రంగులీనుతుంది ఆ ఎడారి..అడుగుపెట్టారో అంతే..!
ఇదో ప్రకృతి కళాఖండం. ఉత్తర ఆఫ్రికాలో ఇథియోపియా ఈశాన్య ప్రాంతంలోని దీన్ని దానకిల్ డిప్రెషన్ అంటారు. 1,36,956 చదరపు కిలోమీటర్ల మేర కళ్లు చెదిరేంత అందంతో రంగులీనుతుంది ఈ ప్రదేశం. ఇక్కడ అడుగు పెడితే వేరే గ్రహం మీద అడుగుపెట్టినట్లుంటుంది. ప్రపంచంలోని అత్యంత వేడి ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ భూమి నుంచి నిత్యం నిప్పులు ఎగసిపడతాయి. ఇక్కడ నీళ్లు కుతకుతా మరుగుతాయి. అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఆమ్లవర్షం కురుస్తుంటుంది. మనిషి మనుగడకు అనుకూలం కాని ఈ ఎడారిలో చూడతగ్గ అందాలెన్నో ఉన్నాయి. అలాగే ఇక్కడ ప్రమాదాలు కూడా నీడలా పొంచే ఉంటాయి. భూమి లోపల అల్లకల్లోలం ఏర్పడినప్పుడల్లా నిప్పులుచిమ్మే లావా ఎగసిపడుతుంది. అది ధారలా పొంగి, కనుచూపు మేర రంగురంగుల కథలెన్నో చెబుతుంది. లక్షల సంవత్సరాలుగా ఈ భూభాగం ఎన్నో మార్పులకు గురైంది. దీనిలోని వైవిధ్యభరితమైన మార్పులను గుర్తించి, దీనికి ‘దానకిల్ డిప్రెషన్’ అని పేరు పెట్టారు. దానకిల్ చుట్టుపక్కల పెద్దపెద్ద లోయలు, ఎతై న పర్వతాలు, ఉప్పు గోపురాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. అయితే ఇక్కడికి వెళ్లే పర్యాటకులంతా స్థానిక గైడ్ అడుగుజాడల్లోనే నడుచుకోవాలని సూచిస్తుంటారు. సురక్షితమైన పాదరక్షలు ధరించి మాత్రమే నడవాలంటారు. చేతులతో ఏదిపడితే అది తాకి చూడటం ప్రమాదమని హెచ్చరిస్తారు. గ్రహాంతర ప్రదేశంలా ఉండే ఈ దానకిల్లో వేడి నీటి బుగ్గలు, ఆమ్ల కొలనులు, సరస్సులు మైమరిపిస్తుంటాయి. అయితే ఈ ఎడారి ఎందుకు ఇంత వేడిగా ఉంటుంది? భూమి లోపల ఏం జరుగుతూ ఉంటుంది? లాంటి వివరాలను శాస్త్రవేత్తలు సైతం కనిపెట్టలేకపోయారు. దాంతో భూమి మీద ఈ ప్రదేశం మిస్టీరియస్‌గానే మిగిలిపోయింది. ఇథియోపియాలో కొన్ని శతాబ్దాల క్రితం ఉప్పును కూడా కరెన్సీగా ఉపయోగించేవారట. అందుకోసం ఉప్పును సేకరించేందుకు ఈ ప్రదేశానికి వెళ్లేవారట. ఒకప్పుడు ఈ ప్రాంతం ఎర్ర సముద్రంలో భాగంగా ఉండేది. కాలక్రమేణా అగ్నిపర్వతాల విస్ఫోటాల కారణంగా.. కొంతభాగం సల్ఫ్యూరిక్ సరస్సులా మారింది. మరికొంత భాగం లావాతో బీటలువారి ఎడారిని తలపిస్తుంది. శిలాద్రవంలోని ఖనిజాలు, సముద్రపు ఉప్పు నీరు, ఆమ్ల వర్షపు నీరు కలసి పసుపు, నారింజ, ఆకుపచ్చ, ఎరుపు, నీలం రంగులతో ఈ ప్రాంతమంతా మెరుస్తుంది. ఇక్కడ కొంత సురక్షితమైన భూభూగానికి పర్యాటకులు తరచుగా వెళుతుంటారు. చూడటానికి ఈ పరిసర ప్రాంతాలన్నీ చాలా వింతగా ఉంటాయి. ఒక చోట వేడి నీరు.. పొగలు కక్కుతుంటే, పక్కనే మరో చోట చల్లటి నీటి కొలను సేదతీరుస్తుంది. మనుషులను మునిగిపోనివ్వకుండా తేలియాడిస్తూ ఆటలాడిస్తుంది. --సంహిత నిమ్మన (చదవండి: కాదేది రికార్డుకనర్హం! అగ్గిపుల్లలతో సరికొత్త రికార్డు..!) -
విరుగుతున్న కొండచరియలు.. కుప్పకూలుతున్న ఇళ్లు
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కొండరియలు విరిగిపడుతున్నాయి. తాజాగా సిమ్లాలోని కృష్ణ నగర్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడగా.. వాటిపై ఉన్న ఏడు ఇళ్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. ఈ భయానక దృశ్యాలు భీతికొల్పేవిగా ఉన్నాయి. ఈ ఘటనలో మరణాల సంఖ్య ఇంకా ఓ అంచనాకు రాలేమని సీపీ సంజీవ్ కుమార్ తెలిపారు. #WATCH | Several houses collapsed in Krishna Nagar area in Himachal Pradesh's Shimla after a landslide took place. Rescue operation underway. (Video Source: Local; confirmed by Police and administration) pic.twitter.com/qdYvR4C4fx — ANI (@ANI) August 15, 2023 కాగా.. గత మూడు రోజులుగా హిమాచల్ ప్రదేశ్ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో వర్షాల కారణంగా 54 మంది మరణించారు. వర్షపు నీటితో నదులు ఉద్దృతంగా ప్రవహిస్తున్నాయి. సోమవారం వివిధ చోట్ల జరిగిన కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 12 మంది మృతి చెందారు. రహదారులు మూతపడ్డాయి. దీంతో రాష్ట్రంలో నేడు స్వాతంత్య్ర వేడుకలు కూడా జరపలేదు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది నిర్విరామంగా పనిచేస్తున్నారు. #WATCH | Hill collapsed in Krishna Nagar area in HP's Shimla. Around five to seven houses collapsed. Further details awaited. pic.twitter.com/esWoGcjxlB — ANI (@ANI) August 15, 2023 కాగా.. మరో రెండు రోజులు హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్, ఈశాన్య భారతంలో మరో ఐదు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. ఇదీ చదవండి: స్వాతంత్య్ర వేడుకలకు దూరంగా ఆ రాష్ట్రం.. ఎందుకంటే. -
ఇక కొండలపై మొక్కల పెంపకం
సాక్షి, అమరావతి : గ్రామీణ ప్రాంతాల్లోని కొండలపై ఈ వర్షాకాలంలో ఒకే రోజు కోటి పండ్ల మొక్కలు నాటేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ సిద్ధమైంది. ఉపాధి హామీ పథకంలో.. కొండలపై మొక్క బతికేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఒక్కో మొక్కపై కేవలం అర్థరూపాయి ఖర్చుతో అధికారులు ఈ ప్రక్రియను చేపట్టనున్నారు. సాధారణంగా మొక్కల పెంపకంలో ఒక్కో మొక్క నాటాలంటే.. గుంత తీసేందుకు కనీసం రూ.25, మొక్క కొనుగోలుకు రూ.25 నుంచి రూ.50.. ఇలా ఒక్కో మొక్కకే రూ.50 నుంచి 100 దాకా ఖర్చవుతుంది. అయితే సీడ్ బాల్స్ విధానంలో ఒక్కో మొక్కపై కేవలం అర్థరూపాయి మాత్రమే ఖర్చుపెట్టేలా కొండలపై ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. సేంద్రియ ఎరువులతో కూడిన షోషకాలు ఎక్కువగా ఉండే మట్టిని సిద్ధం చేసుకుని.. ఆ మట్టిని ఉండలు ఉండలుగా చేస్తారు. ఒక్కో ఉండలో నాటాల్సిన మొక్కకు సంబంధించిన విత్తనాన్ని ఉంచుతారు. ఎలాంటి నేలలోనైనా నామమాత్రపు తేమకే ఆ విత్తనం మొలకెత్తేలా ఆ మట్టి ఉండలు(సీడ్స్ బాల్స్) అత్యంత నాణ్యంగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. విత్తనం, మట్టి ఉండల తయారీకి అయ్యే ఖర్చు కూడా ఒక్కో దానికి అర్ధరూపాయి లోపే ఉంటుందంటున్నారు. కనీసం వెయ్యి కొండల్లో పదివేల చొప్పున.. ఈ వర్షాకాలంలో కొండలపై కోటి మొక్కలు పెంచడాన్ని లక్ష్యంగా పెట్టుకున్న గ్రామీణాభివృద్ధి శాఖ.. రాష్ట్రమంతటా ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు మండలానికి రెండేసీ కొండలను ఎంపిక చేసుకోనుంది. మండలానికి కనీసం ఒక్క కొండపైనైనా ఈ సీడ్ బాల్స్ విధానంలో మొక్కల పెంపకాన్ని చేపట్టాలని నిర్ణయించారు. ఇలా రాష్ట్రంలో 660 మండలాల్లో కనీసం వెయ్యి కొండల్లో ఒక్కో కొండపై పది వేల చొప్పున మొక్కల పెంపకాన్ని చేపడతారు. ఉపాధి హామీ పథకం, వాటర్‌హెడ్ కార్యక్రమాల్లో భాగంగా గతంలో కూలీల ద్వారా వర్షం నీరు నిల్వలకు స్ట్రెంచ్‌ల తవ్వకం జరిపిన కొండలను ఎక్కువగా ఈ కార్యక్రమానికి ఎంపిక చేస్తారు. కాగా, సీతాఫలం, ఉసిరి, రేగు వంటివాటితో పాటు కుంకుడు, వెలగ వంటి వాటినే ఈ మొక్కల పెంపకం కార్యక్రమంలో ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు అధికారులు వెల్లడించారు. నీడకు పనికొచ్చే వేప, కానుగ మొక్కలను కూడా పెంచుతారు. కొండల గుర్తింపు ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసి.. వర్షాకాలం మధ్య కల్లా కార్యక్రమాన్ని చేపడతామని అధికారులు వెల్లడించారు. -
రిషికొండలో అనుమతులకు లోబడే నిర్మాణాలు
-
వైరల్ వీడియో: తిరుమల కొండ ఎక్కుతున్న చిన్న కుక్క పిల్ల
-
వైరల్ వీడియో : భార్యను ఎత్తుకొని తిరుమల కొండెక్కిన భర్త
-
పగలకపోతే బా'గుండు'!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రం నుంచి కూతవేటు దూరంలో ఉన్న ‘నంబర్‌గుండు’ గుట్ట గుల్లవుతోంది. ఓ అక్రమార్కుడి ధనదాహానికి రోజురోజుకు రూపం కోల్పోతోంది. ఆరు నెలల నుంచి రోజుకు కొంత మేర తొలిచివేతకు గురవుతున్న ఆ గుట్ట రాబోయే రోజుల్లో కనుమరుగయ్యే పరిస్థితి కనబడుతోంది. మరోవైపు రాత్రిపూట కొనసాగుతున్న బ్లాస్టింగ్లతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు? ఏ బండ తమ ఇంటికప్పు మీద పడుతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. బ్లాస్టింగ్లతో గుట్ట రాళ్లు సమీప పంటపొలాల్లో వచ్చి పడుతుండడంతో ఇటు రైతులూ ఇబ్బందులు పడుతున్నారు. ఇదేంటనీ ప్రశ్నించిన తమకు సదరు అక్రమార్కుడి నుంచి బెదిరింపులు తప్పడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ తతంగంపై రెవెన్యూ అధికారులకు ఎన్నిమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని బాధిత ప్రజలు ఆరోపిస్తున్నారు. ఓ రాజకీయ పార్టీకి చెందిన సదరు అక్రమార్కుడు.. అధికారుల అండదండలతో గుట్టను తోడేసే పనిని ముమ్మరం చేశాడు. ♦ మహబూబ్‌నగర్ రూరల్ మండలం వెంకటాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని గుట్టమీది తండాలోని సర్వేనంబర్ 23లో 154 ఎకరాల విస్తీర్ణంలో సీలింగ్ భూమి ఉంది. ఇందులో ఆరు ఎకరాలను అధికారులు ఇతరులకు అసైన్డ్ చేశారు. కాగా మిగతా భూమిలో నంబర్‌గుండు గుట్ట ప్రాంతం ఉంది. అయితే ఈ గుట్టపై కన్నేసిన ఓ అక్రమార్కుడు ఆరు నెలల నుంచి గుట్టను తొలుస్తున్నాడు. కొన్నాళ్ల నుంచి డిటోనెటర్లు పెట్టి రాత్రి పూట పేలుళ్లకు పాల్పడుతున్నాడు. బ్లాస్టింగ్ ధాటికి రాళ్లు వచ్చి తమ ఇళ్లపై పడుతున్నాయని గుట్టమీది తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతటితో ఆగని సదరు అక్రమార్కుడు గుట్టను పగలగొట్టేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని కడప నుంచి ప్రత్యేకంగా 20 మంది కూలీలనూ రప్పించడం గమనార్హం. గుట్టను పగలగొట్టడంలో సిద్ధహస్తులైన ఈ కూలీలు స్థానిక కూలీలతో కలిసి పెద్ద మొత్తంలో ప్రకృతి వనరు అయిన గుట్టను గుల్ల చేస్తున్నారు. ఇలా తీసిన రాళ్లను రూ. 24కు ఒకటి చొప్పున మహబూబ్‌నగర్ పట్టణం, పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తూ లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నాడు. సదరు అక్రమార్కుడు ఓ రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు కావడంతో అధికారులూ అటువైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో అక్రమార్కుడి అక్రమాలపై నోరు మెదిపేందుకూ ఆయా తండావాసుల్లో చాలా మంది సాహసించడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నంబర్గుట్టను కాపాడడంతో పాటు సదరు అక్రమార్కుడిపై చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. భయపెట్టిండు.. ఎప్పటి నుంచో నంబర్ గుండు ఉంది. ఆ గుండును పగలగొట్టకూడదని చెబితే, నా చేను పక్కనే ఉంది. నేను కొట్టుకుంటా. అడగటానికి నీవెవరు. నీ యబ్బ జగీరా.. అని భయపెట్టిస్తున్నాడు. అర్ధరాత్రి సమయంలో గుండ్లను పూసలు పెట్టి పేలుస్తున్నారు. ఆ రాళ్లు తండాలోకి వచ్చి పడుతున్నాయి. దీంతో మేం భయాందోళనకు గురవుతున్నాం. ఈ అక్రమంపై వీఆర్ఓకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదు. – లక్ష్మణ్‌నాయక్, గుట్టమీదితండా బాధ్యులపై చర్య తీసుకుంటాం గుట్టమీది తండా సమీపంలో రాళ్లగుట్టను బ్లాస్టింగ్ చేస్తున్నారనే ఫిర్యాదు ఇది వరకే వచ్చింది.వెంటనే వీఆర్ఓను పంపి.. రాళ్లను పగులగొట్టడాన్ని నిలిపివేయించా. ఒకవేళ అలాగే గుట్టలో బ్లాస్టింగ్‌కు పాల్పడితే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.– ఎస్.కిషన్, తహసీల్దార్, మహబూబ్‌నగర్ రూరల్ -
నిజాం వారసుడి అద్భుత సృష్టి
సాక్షి, బంజారాహిల్స్: ఆయన అందరిలా ఉండాలనుకోలేదు.. ఏదో ఒక ప్రత్యేకతతో పది మందిలో నిలవాలనుకున్నాడు.. అందుకోసం కోట్లాది రూపాయల విలువ చేసే భూమిని కూడా లెక్క చేయలేదు.. ఏళ్ల తరబడి కష్టపడి ఓ కొండనే నిర్మించుకున్నాడు. హైదరాబాద్ మొత్తాన్ని వీక్షిస్తూ టీ తాగాలన్న ఒకే ఒక్క కోరికతో ఆ కొండను మలిచాడు. ఆయనే 6వ నిజాం మహబూబ్ అలీఖాన్ (గ్రేట్ గ్రాండ్ ఫాదర్) ముని ముని మనవడు రౌనక్ యార్ఖాన్. ఆయన ప్రత్యేకతలు చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్–25లోని ఎంసీఆర్హెచ్ఆర్డీని ఆనుకొని రౌనక్ యార్‌ఖాన్‌కు 75 ఎకరాల స్థలం ఉంది. దీన్ని బూత్ బంగ్లా స్థలమని కూడా పిలుస్తుంటారు. తరచూ ఈ స్థలంలో సినిమా షూటింగ్‌లు జరుగుతుంటాయి. పదేళ్ల క్రితం రౌనక్‌కు ఓ ఆలోచన వచ్చింది. అత్యంత ఎత్తైన కొండ మీద కూర్చొని చాయ్ తాగుతూ హైదరాబాద్‌ను చూడాలని ఆ కోరిక. దాన్ని అమల్లో పెట్టేందుకు సుమారుగా రూ.5 కోట్లు ఖర్చు చేశాడు. ఆ స్థలంలోనే ఏడు ఎకరాల్లో 8 ఏళ్ల పాటు శ్రమించి లారీలతో ప్రొక్లెయిన్లతో మట్టి, రాళ్లను పేర్చుకుంటూ 180 అడుగుల ఎత్తులో కొండను మలిచాడు. ఆ కొండపైన ఎకరం విస్తీర్ణంలో లాన్, షెడ్డు, చిన్నచిన్న పార్టీలు చేసుకునేందుకు వీలుగా సౌకర్యాలు కల్పించాడు. ఆ కొండపై కూర్చొని చూస్తే హైదరాబాద్ మొత్తం కనిపిస్తుంది. చార్మినార్, గోల్కొండ నుంచి హుస్సేన్‌సాగర్, మౌలాలి గుట్ట కూడా కనిపించాల్సిందే. 6వ నిజాం మహబూబ్ అలీఖాన్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్‌గా తాను ఈ కొండను మలుచుకోవడం తనకెంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా రౌనక్ యార్ఖాన్ తెలిపాడు. జూబ్లీహిల్స్ అంటేనే కొండలు. ఆ కొండల్లోనే ఆయన ఇంకో కొండను మలిచాడు. వర్షం పడ్డప్పుడు ఈ కొండపైన కూర్చుంటే కశ్మీర్‌ను తలపిస్తుందని ఈ సందర్భంగా రౌనక్ వెల్లడించాడు. రాత్రి పూట చూస్తే విద్యుత్ దీపాల కాంతుల్లో నగర ధగధగలు కనువిందు చేస్తాయన్నారు. దీనిపైన ఆర్ట్ ఎగ్జిబిషన్ కోసం హాలును కూడా నిర్మించానని, ఔత్సాహికులు ఈ కొండపైన తమ చిత్రకళా ప్రదర్శనను ప్రత్యేకతతో ఏర్పాటు చేసుకుంటారన్నారు. ఇక గత 35 సంవత్సరాలుగా బూత్ బంగ్లా ప్రాంతంలో కులమతాలకు అతీతంగా హోలీ వేడుకలు నిర్వహిస్తున్నానని, గత 6 ఏళ్లుగా ఈ హోలీ వేడుకల్ని తాను నిర్మించిన గుట్టపైనే చేస్తున్నానని తెలిపాడు. 105 ఏళ్లుగా ఈ స్థలం తమ ఆధీనంలోనే ఉందని ఇక్కడ ప్లాట్లు చేసి విక్రయిస్తే కోట్లాది రూపాయలు వస్తాయని, అది తనకు ఇష్టం లేదన్నారు. ఈ కొండనే తనకు పూర్తి సంతృప్తిని ఇస్తున్నదన్నారు. ప్రతిరోజూ సాయంత్రం పూట ఇక్కడకు వస్తుంటానని ఒంటరిగా కుర్చీలో కూర్చొని నగరాన్ని చూస్తుంటే ఎన్ని కోట్లు వెచ్చించినా ఆ ఆనందం రాదన్నారు. ఇదిలా ఉండగా నిజాం హయాంలో రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా ఈ స్థలంలోనే ఒక బంకర్ నిర్మించారని ఎయిర్ రైడ్ షెల్టర్ కూడా నిర్మించారని అవి ఇప్పటికీ ఈ స్థలంలో ఉన్నాయన్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్–25లో తనకున్న 75 ఎకరాల స్థలాన్ని ఎప్పటికీ అమ్మేది లేదని, ఇలా ఉండటమే తనకు ఇష్టమన్నారు. ఈ స్థలం విలువ సుమారు రూ.వెయ్యి కోట్ల వరకు ఉంటుందని తెలిపాడు. కొండ, దాని చుట్టూ అడవి ఉంటే ఆ ఆనందమే వేరన్నారు. దీన్ని ఇలాగే కాపాడుకుంటానన్నారు. కొండపైన ఇంకా కొన్ని సౌకర్యాలు కల్పించే యోచన ఉందన్నారు. తనకున్న ఈ ఖాళీ స్థలంలో రంగస్థలంతో పాటు ఎన్నో సినిమా షూటింగ్‌లు జరిగాయన్నారు. -
గండి, రాయచోటి రోడ్డులో విరిగిపడిన కొండ చరియలు
-
సియర్ బాబా జలపాతంల వద్ద విషాదం
-
జలపాతంలో స్నానం చేస్తుండగా విషాదం
జమ్మూ : జలపాతంలో స్నానం చేస్తున్న వారిపై కొండచరియలు విరిగి పడిన ఘటనలో ఐదుగురు మృతిచెందగా దాదాపు 25 మంది గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం జమ్మూకాశ్మీర్ రియాసి జిల్లాలోని సియర్ బాబా జలపాతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రియాసి జిల్లాలోని సియర్ బాబా ఓ ఆధ్యాత్మిక ప్రదేశం కావటం వల్ల బాబా భక్తులు ఎక్కువగా అక్కడికి వస్తుంటారు. అక్కడ ఉన్న జలపాతంలో చిన్నాపెద్ద స్నానం చేస్తూ ఆనందంగా గడుపుతారు. అయితే కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగి జలపాతంలో స్నానం చేస్తున్న వారిపై పడ్డాయి. దాదాపు వంద అడుగుల ఎత్తునుంచి కొండచరియలు విరిగిపడటంతో ఎక్కువ నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా 25 మంది గాయాలపాలయ్యారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు, పోలీసులు గాయపడిన వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. మిగిలిన వారి కోసం సహాయక చర్యలు ముమ్మరం చేశారు. -
తనగల గుట్టలపై ట్రెక్కింగ్
శాంతినగర్ (అలంపూర్): వడ్డేపల్లి మండలంలోని తనగల గుట్టలపై పోలీసు అధికారులు, సిబ్బంది ఆదివారం ట్రెక్కింగ్ నిర్వహించారు. ఉదయం ఆరు గంటలకే ఎస్పీ రెమా రాజేశ్వరి, ఏఎస్పీ ఆర్.భాస్కర్, డీఎస్పీ సురేందర్‌రావుతోపాటు జిల్లాలోని సీఐలు, ఎస్ఐలు అక్కడికి చేరుకున్నారు. కాలినడకన సుమారు 5కి.మీ. గట్టుపైకి ఎక్కి ఫ్రెండ్లీగా కబడ్డీ ఆడి పర్దీపురం శివారులో కిందకు దిగారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ‘మన కుటుంబం–మన ఆరోగ్యం’లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. శిక్షణ సమయంలో తప్పా శారీరక శ్రమ లేకపోవడంతో పోలీసు అధికారులు, సిబ్బంది తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారన్నారు. వారు ఆరోగ్యంగా, శారీరక దృఢత్వం పొందాలనే ఉద్దేశంతో ట్రెక్కింగ్ చేపట్టామన్నారు. అంతేగాక ఎవరెవరు ఏ మేరకు ఫిట్నెస్ కలిగి ఉన్నారనేది పరీక్షించామన్నారు. -
ఆలయాలు కొండమీదే ఎందుకు ఉంటాయి?
దేవుళ్లలో తేడా ఏమీ ఉండదు. ఎక్కడున్నా దేవుడు దేవుడే! నేలమీద ఉన్నా కొండపైన ఉన్నా భగవంతుడు అందరినీ సమదృష్టితో చూస్తాడు. కరుణా కటాక్షాలను అందిస్తాడు. అందుకోసమే భగవంతుని సేవించుకోవడానికి భక్తులు ఎంతో దూరాభారానికి, వ్యయప్రయాసలకూ ఓర్చి కొండలపైకెక్కి మరీ ఆయనను సందర్శింటారు. అలా ఎందుకు, దేవాలయం మన మధ్యలోనే ఉంటే ఎంతో బాగుంటుందనుకుంటారు చాలా మంది. నిజానికి మనకు తనపై ఎంతటి భక్తి విశ్వాసాలు ఉన్నాయో తెలుసుకునేందుకే దేవుళ్లు కొండలపై, గుట్టలపై వెలిసినట్లు పెద్దలు చెబుతారు. అంతేకాదు, కొండలను, కోనలను ఉద్ధరించాలని స్వామికి ప్రేమ. అందుకే వాటిపై నివాసముంటాడు. తన పాదస్పర్శతో, భక్తుల పాదస్పర్శతో కొండలు తరిస్తాయి. సెలయేళ్లతో, ఫలవృక్షాలతో భక్తులకు సేదతీరుస్తాయి. దీని కోసమే రుషులు కొండలుగా పుట్టాలని కోరుకుంటారు. భద్రగిరి, యాదగిరి, వేదగిరి వీరంతా రుషులే! తపస్సు చేసి మరీ తమపై కొలువుండాలని కోరుకొని స్వామిని వరం కోరుకున్నారు. ఈ లోకంలో పరోపకార పరాయణులు పర్వతాలు, నదులు, వృక్షాలేనని అంటాడు మహాకవి వాల్మీకి. ఈ ముగ్గురు ఉన్నంతవరకు రామాయణం భూమి మీద ఉంటుందని వాల్మీకికి బ్రహ్మ వరమిస్తాడు. అందుకే కొండలు, కోనలు భగవంతునికి ప్రీతిపాత్రమైనవి. అక్కడే ఆయన కొలువై ఉంటాడు. లౌకికంగా చూస్తే, కొండలపైన మనుష్య సంచారం తక్కువగా ఉంటుంది, వాహనాల రణగొణ« ధ్వనులుండవు. కాలుష్యానికి ఆస్కారం ఉండదు. ప్రశాంతంగా ఉంటుంది. అందుకే దేవుడు కొండలపై వెలిశాడేమో మరి! -
ప్రసాదంకోసం ప్రాణాలే పోగొట్టుకుంది
తిరుత్తణి: వెంటపడుతున్న కోతి నుంచి దేవుడి ప్రసాదాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఓ భక్తురాలు కొండపై నుంచి పడి ప్రాణాలు వదిలిన దయనీయమైన సంఘటన తమిళనాడులో గురువారం చోటుచేసుకుంది. బెంగళూరు అంబేడ్కర్ నగర్ శ్రీనివాసపురానికి చెందిన 50 మంది మహిళా భక్తులు ఆదిపరాశక్తి మాలధారణ చేశారు. మాలధారణతో పుణ్యక్షేత్రాలు సందర్శించే నిమిత్తం బెంగళూరు నుంచి మంగళవారం చెన్నై శివారు మేల్‌మరువత్తూరులోని ఆదిపరాశక్తి ఆలయాన్ని దర్శించుకున్నారు. అక్కడి నుంచి గురువారం సాయంత్రం తిరుత్తణి కొండపైనున్న సుబ్రమణ్యస్వామి ఆలయానికి చేరుకున్నారు. భక్తులం తా స్వామిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరిస్తుండగా గణేష్ భార్య నళిని(45) వద్దనున్న ప్రసాదం బ్యాగును ఒక కోతి లాగేసుకో బోయింది. దీంతో ఆందోళన చెందిన నళిని కోతి నుంచి తప్పించుకునేందుకు కొండపై పరుగులు తీస్తూ కాలుజారి మాడ వీధిలో పడిపోయింది. ఆమెను తోటి భక్తులు సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. -
సత్తా చూపుతా.. సాయం చేయరూ!
విలువిద్యలో ప్రావీణ్యం ఉంది ప్రోత్సహించండి ఎవరెస్ట్ అధిరోహకుడు కుంజా దుర్గారావు వీఆర్‌పురం : తనకు తగిన ప్రోత్సాహం అందిస్తే విలువిద్య(ఆర్చరీ)లో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చూపిస్తానని ఎవరెస్ట్ అధిరోహకుడు కుంజా దుర్గారావు అన్నాడు. రేఖపల్లి తహసీల్దార్ కార్యాలయంలో గురువారం దుర్గారావు మాట్లాడుతూ విలువిద్యలో తనకు ప్రావీణ్యం ఉందని, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో, ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు తగిన సాధన చేయాల్సి ఉందన్నాడు. సాధనకు అవసరమైన పరికరాలకు సుమారు రూ.మూడు లక్షలకు పైగా ఖర్చవుతుందని తెలిపాడు. ప్రభుత్వంగానీ, దాతలు గానీ తన ఆశయ సాధనకు ఆర్థిక సహకారం అందించాలని కోరాడు. అనంతరం తహసీల్దార్ జీవీఎస్ ప్రసాద్‌కు వినతి పత్రం ఇచ్చాడు. దుర్గారావును తహసీల్దార్ అభినందించారు. దుర్గారావు విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతానని ఆయన చెప్పారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి పూనెం సత్యనారాయణ, సోయం చినబాబు తదితరులు ఉన్నారు. -
కొండ కోనల్లో కలెక్టర్ పర్యటన
24 కిలో మీటర్ల మేర కొండ, రాళ్ల మార్గంలో కాలి నడకన పయనం ఆపసోపాలు పడ్డ అధికార యంత్రాంగం మారేడుమిల్లి : చుట్టూ దట్టమైన అడవి, అడుగడుగునా రాళ్లు, మధ్యలో కొండ కాలువలు, రెండు కొండలు ఎక్కి దిగుతూ కాలినడకన మాత్రమే ఆ గ్రామానికి చేరుకోవాలి. అక్కడకు వెళ్లి రావాలంటే నరయాతన తప్పదు. అదే మారేడుమిల్లి మండలం జీఎం వలస పంచాయతీ పరిధిలోని ఇజ్జలూరు గ్రామం. అక్కడ 12 కుటుంబాలు, 10 గృహాలు, 30 మంది జనాభా ఉంటారు. మారేడుమిల్లి నుంచి భద్రాచలం వెళ్లే దారిలో ఘాట్ రోడ్డు దగ్గర నుంచి అటవీ మార్గం గుండా 12 కిలో మీటర్లు వెళితే ఈ గ్రామం వస్తుంది. ఇలాంటి గ్రామాన్ని కలెక్టర్ కార్తికేయ మిశ్రా శనివారం సందర్శించారు. అక్కడి గిరిజనులు పడుతున్న బాధలు తెలుసుకోవడానికి ఆయన కాలినడకన చేరుకున్నారు. గత కలెక్టర్లకు భిన్నంగా మిశ్రా తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల గ్రామాల అభివృద్ధిపై ఆయన దృష్టి సారించారు. దట్టమైన అటవీ మార్గంలో 24 కిలోమీటర్లు కాలినడకన అతి కష్టం మీద మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ నడిచి వెళ్లారు. ఇంతవరకు ఏ కలెక్టర్ చేయని సాహసం ఆయన చేశారు. అయితే కలెక్టర్ వెంట బయలుదేరిన అధికార బృందం నానా అవస్థలు పడింది. గిరిజనులతో ముఖాముఖి మారుమూల లోతట్లు గ్రామాల్లో విద్య, వైద్య మౌలిక సదుపాయాలు కల్పిస్తామని కలెక్టర్ కార్తికేయ మిశ్రా అన్నారు. ఇజ్జలూరు గ్రామంలో పర్యటించిన కలెక్టర్ అక్కడి గిరిజనులతో ముఖాముఖి నిర్వహించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ నివసిస్తున్న పది కుటుంబాలు రోడ్డు పాయింట్‌కు వస్తే అన్ని వసతులతో గృహాలు నిర్వహించి ఉపాధి కల్పిస్తామని అన్నారు. అయితే తమ గ్రామాన్ని విడిచి రావడానికి వారు నిరాకరించారు. గ్రామంలో పిల్లల చదువుకోసం స్కూల్, మినీ అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గ్రామానికి చెందిన నాగేశ్వర రెడ్డి, స్కూల్ టీచర్‌గా, రమణమ్మను ఆయాగా నియమించారు. అధికారులతో సర్వేచేసి సోలార్ సిస్టమ్ ద్వారా ఆయకట్టు విస్తీర్ణాన్ని పెంచేందుకు యోచన చేస్తామని అన్నారు. అటవీ అభ్యంతరాలు పరిష్కరిస్తూ రహదారి నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. గ్రామంలో డ్వాక్రా గ్రూపును టీపీఎంఎం ద్వారా పునరుద్ధరించి ఒక్కొక్క సభ్యురాలికి రూ.15 వేల రుణం అందిస్తామన్నారు. ఈ నిధులను ఆదాయ వనరుల పెట్టుబడి పెట్టుకుని జీవనోపాధి పెంపొందించుకోవాలని సూచించారు. ఒక ఆశ వర్కర్‌ను స్థానికంగా నియమిస్తామన్నారు.గ్రామంలో ఏఏ పంటలు సాగుచేస్తారని ఆయన ఆరా తీశారు. అనంతరం వాటర్ ఫిల్టర్‌ను గిరిజనులకు కలెక్టర్ అందజేశారు. కార్యక్రమంలో పీవో దినేష్‌కుమార్, ఏఎస్పీ నయీంఅస్మీ, డీఎఫ్‌వో నందిని, సబ్ డీఎఫ్‌వో శ్యాముల్, ఎంపీడీవో సూర్యానారాయణ, ఎంపీపీ కుండ్ల సీతామహాలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యుడు సత్తి సత్యనారాయణ రెడ్డి, ఈఈ నాగేశ్వరరావు, డీఈ శ్రీనివాసరావు, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
తవ్వుకో.. సొమ్ము చేసుకో!
– యథేచ్ఛగా కొండల తవ్వకాలు – ఏజెన్సీలో కాంట్రాక్టర్ల అక్రమాలు – తవ్విన రాళ్లను రోడ్ల నిర్మాణానికి వాడుకుంటున్న వైనం – ఇష్టారాజ్యంగా చెట్ల నరికివేత – అన్నీ తెలిసినా పట్టనట్టు వ్యవహరిస్తున్న అధికారులు బుట్టాయగూడెం : పశ్చిమ ఏజెన్సీ ప్రాంతం పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేవి దట్టమైన అడవి, పొడవైన చెట్లు, ఎతైన కొండలు. ఇవి ప్రకృతి ప్రేమికులను ఎంతో ఆనందింప చేస్తాయి. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఆ ఆనందం దూరమౌతున్నట్టు కనిపిస్తోంది. కొందరు కొండల మీద చెట్లను నరికి వేస్తుంటే కాంట్రాక్టర్లు కొండలను తొలి చేస్తూ కాసులను పోగేసుకుంటూ జేబులు నింపుకుంటున్నారు. రోడ్ల కాంట్రాక్టు పేరుతో ఎతైన కొండలు కళ్లెదుటే కరిగిపోతున్నాయి. సహజ సంపదను అక్రమంగా తవ్వేస్తున్నా అటు అటవీశాఖ అధికారులు కానీ ఇటు రెవెన్యూ అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదు. దీనిపై గిరిజన సంఘాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. సహజసిద్ధంగా ఏర్పడిన కొండలను ఇష్టారాజ్యంగా తవ్వేస్తుండడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడవుల్లోని చెట్లను అక్రమార్కులు నరికేస్తున్నా అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ చర్యలతో పర్యావరణ సమతుల్యం దెబ్బతిని ఎన్నో అనర్థాలు జరిగే అవకాశాలున్నాయని గిరిజనులు వాపోతున్నారు. రోడ్ల నిర్మాణం పేరుతో.. పోలవరం నియోజకవర్గంలోని పలు గిరిజన గ్రామాల్లో ఇటీవల రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. బుట్టాయగూడెం మండలం దొరమామిడి, దుళ్లపూడి, కుమ్మరకుంట, ముందులూరు, రేగులగూడెం తదితర గ్రామాల్లోని కొండలను తవ్వేసి ఆ రాళ్లతోనే కాంట్రాక్టర్లు రహదారులు నిర్మిస్తున్నారు. వాస్తవానికి కొండలను తవ్వకుండా గ్రావెల్, రాళ్లు సొంత ఖర్చుతో తెచ్చి రోడ్లను నిర్మించాల్సి ఉంది. కానీ అధికార పార్టీ నేతల దన్నుతో సమీపంలోని కొండలను తవ్వేసి ఆ రాళ్లతో రహదారులను నిర్మిస్తున్నారు. ఏజెన్సీలోని పోలవరం, జీలుగుమిల్లి, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. నిబంధనలకు విరుద్ధంగా కొండలను తవ్వేస్తున్నా పట్టించుకునే నాథుడు లేడు. కొన్ని కొండలు గ్రావెల్ కోసం, మరికొన్ని కొండలు కట్టుబడి రాయికోసం తొలిచేస్తున్నారు. ఈ అక్రమాలకు అధికారులు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు. తవ్వేస్తున్నా పట్టించుకోవడం లేదు ఏజెన్సీ ప్రాంతంలో ఎతై ్తన కొండలు పచ్చదనంతో కనువిందు చేస్తుంటాయి. అటువంటి కొండలను కాంట్రాక్టర్లు రోడ్డు నిర్మాణాల కోసం కరగతీసి అక్రమంగా తవ్వుకెళ్తుంటే అధికారులు చూస్తూ ఊరుకోవడం దారుణం. వారి స్వప్రయోజనాల కోసం పర్యావరణాన్ని పాడుచేస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలి. – ముచ్చిక రంజిత్ కుమార్ దొర, ఆప్తమిత్ర స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ -
బాల బాహుబలులు!
సాక్షి వెబ్ చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో ఓట్యులీర్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఓ పెద్ద కొండ ఉంది. అక్కడి పిల్లలు స్కూలుకు వెళ్లాలంటే రోజూ 2,624 అడుగుల ఎత్తున ఉన్న ఆ కొండను ఎక్కాలి. మళ్లీ ఇళ్లకు రావాలంటే దిగాలి. కొండ ఎక్కేందుకు వారికి రెండు గంటల సమయం పడుతుంది. ఆరేళ్ల నుంచి 15 ఏళ్ల వరకు వయసున్న పిల్లలు అలా కొండ ఎక్కి, దిగి.. స్కూలుకు, అక్కడి నుంచి ఇంటికి వెళ్తుంటారు. వాళ్ల భుజాల మీద బరువైన బ్యాగులు కూడా ఉంటాయి. వాళ్లు పడిపోకుండా చూసేందుకు ముగ్గురు పెద్దవాళ్లు కూడా వాళ్లతో పాటు ఉంటారు. ఈ పిల్లలంతా ఉండే కుగ్రామంలో కేవలం 72 కుటుంబాలు మాత్రమే ఉంటాయి. అయితే ఇలా ప్రతిరోజూ కొండ ఎక్కి వెళ్లడం కష్టం కాబట్టి, ఒకసారి స్కూలుకు వెళ్లారంటే రెండు వారాల పాటు అక్కడే ఉండిపోతారు. ప్రతిసారీ వాళ్లు కొండ ఎక్కేటప్పుడు తల్లిదండ్రులు వంతుల వారీగా పిల్లలతోపాటు వెళ్తారు. పెద్దవాళ్లయితే గంటలోనే కొండ ఎక్కేస్తారు. కానీ పిల్లలకు కష్టం కాబట్టి కొండ మీద ఇనుప రాడ్లతో నిచ్చెన ఒకదానిని ఏర్పాటు చేశారు. ఇలా కొండ ఎక్కుతూ జారి పడిపోయి ఇప్పటికి 8 మంది మరణించారు. గ్రామం నుంచి స్కూలుకు రోడ్డు వేయాలంటే దాదాపు రూ. 61 కోట్ల ఖర్చవుతుంది. అందుకే ప్రభుత్వం కూడా ఈ బాల బాహుబలుల విషయాన్ని పట్టించుకోవడం లేదు. -
గుహాలయాలు
పుణ్యతీర్థం ఆదిమానవుడు గుహతో పాటు గుడిని కూడా కనుగొన్నాడు. గుహను గుడిగా మలుచుకున్నాడు. అజంతా, ఎల్లోరాలు అలాంటి గుహాలయాలే. మన తెలుగువారి తావుల్లో కూడా అలాంటి గుహాలయాలు ఉన్నాయి. విజయవాడలో ఉన్న అక్కన్న మాదన్న గుహలు, మొగల్రాజపురం గుహలు ఎందరికి తెలుసు? వాటిని చూడాలని మనం ఒకరికొకరం చెప్పుకున్నామా? విజయవాడకు వెళ్లినవాళ్లు కనకదుర్గ ఆలయానికి తప్పక వెళతారుకాని దుర్గమ్మ పాదాల చెంత కొలువై ఉన్న అక్కన్న మాదన్న గుహలను ప్రత్యేకంగా పరికించి చూడరు. ప్రకృతి రమణీయతకే కాకుండా, చారిత్రక ప్రాధాన్యతను కూడా కలిగి ఉన్న ఈ గుహలు 6వ,7వ శతాబ్దాల నాటివని తెలుస్తోంది. ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపాలు శిథిలావస్థలో దర్శనమిస్తాయి. ఇవి గుహలే అయినప్పటికీ వీటిలో భగవంతుని మూర్తులను ఉంచడం వలన ఇవి గుహాలయాలు అయ్యాయి. అక్కన్న మాదన్నలు ఇంద్రకీలాద్రి కొండకు తూర్పు దిశగా కొండ కింది భాగంలో ఈ ఆలయాలు ఉంటాయి. 17వ శతాబ్దంలో గోల్కొండను పాలించిన తానీషా చక్రవర్తి దగ్గర అక్కన్నమాదన్నలు మంత్రులుగా పనిచేసేవారు. రాజుగారికి నమ్మిన బంట్లు. ఈ గుహలు ఆరు ఏడు శతాబ్దాలకు చెందినవే అయినా ఈ గుహలతో అక్కన్న మాదన్నలకు విడదీయరాని అనుబంధం ఉండటంతో వీటిని వారి పేరుతో పిలుస్తారు. గుహల నిర్మాణం ఈ గుహలు తూర్పుముఖంగా దీర్ఘ చతురస్రాకారంలో నిర్మితమయ్యాయి. కింద భాగంలో మూడు గుహలు ఉన్నాయి. వాటికి ఎదురుగా ఒక స్తంభం ఉంది. శిల్పనిర్మాణం చూస్తే బౌద్ధులకు చెందినదిగా అనిపిస్తుంది. కాని ఈ గుహలు చాళుక్య, విష్ణుకుండిన, పల్లవ సామ్రాజ్యాలకు చెందినవిగా భావిస్తున్నారు. లోపలకు ప్రవేశించగానే అందమైన, సువాసన భరితమైన పూల చెట్లు స్వాగతం పలుకుతాయి. నాలుగడుగులు వేయగానే గుహలు మనలను కొన్ని వంద సంవత్సరాలు వెనక్కు తీసుకువెళ్తాయి. తూర్పు ముఖంగా ఉన్న ఈ గుహలకు దక్షిణ భాగంలో వినాయకుని విగ్రహాన్ని శిల్పులు చెక్కారు. అయితే ఇది కొంచెం శిథిలావస్థలో ఉంది. ఆ గుహలను చూసి బయటకు వచ్చి ఉత్తరాన ఉన్న మెట్లు ఎక్కితే పైన కూడా గుహాలయం ఉంది. ఓం నమశ్శివాయ.. అంటూ అక్కడ లింగాకారంలో ఉన్న శివుడు సాక్షాత్కరిస్తాడు. ఎవరికి వారు పూజ చేసుకునే అవకాశం ఉన్న శివాలయం ఇది. ప్రతి సోమవారం నాడు భక్తులు ఇక్కడకు వచ్చి స్వయంగా అభిషేకాలు చేస్తుంటారు. అక్కడ నుంచి పైకి చూస్తే దుర్గమ్మ గుడికి వెళ్లే ఘాట్ రోడ్ మనకు కనిపిస్తుంది. ఈ శివుడే గంగ బదులు కనకదుర్గమ్మను తన తల మీద మోస్తున్నాడేమోననే భావన కలుగుతుంది. అక్కడక్కడ పడిన శిల్పాలను ఒక దగ్గర చేర్చి అందంగా ప్రేక్షకులకు కనువిందు కలిగేలా అమర్చారు. మండపం మీద సంగీత వాద్యపరికరాలు వాయిస్తూన్న శిల్పం నాటి రాజుల సంగీతాభిమానాన్ని ప్రతిబింబిస్తుంది. ధనుస్సు సంధించిన అర్జునుడు, స్థూపం మీద నాలుగు వైపులా దేవతామూర్తులు, మండపం నాలుగు స్తంభాల మీద శాసనం చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలబడతాయి. ప్రస్తుతం ఈ గుహాలయాలు, పరిసరాలు పురావస్తు శాఖవారి ఆధ్వర్యంలో ఉన్నాయి. మొగల్రాజపురం గుహలు మొగల్రాజపురం విజయవాడలో ప్రధానమైన ప్రాంతం. ఈ ప్రాంతాన్ని మొగలులు సందర్శించిన కారణంగా మొగల్రాజపురం అని పిలుస్తారని స్థానికులు చెబుతారు. ఇక్కడ 5వ శతాబ్దానికి చెందిన ఐదు ప్రధాన గుహలు ఉన్నాయి. ఈ గుహలు కృష్ణానది నుంచి సుమారు 2 కి.మీ. దూరంలో ఉన్నాయి. దక్షిణ భారతదేశ పర్యటన చేస్తున్న సమయంలో బుద్ధుడు ఇక్కడకు వచ్చి విశ్రాంతి తీసుకున్నాడని చరిత్ర చెబుతోంది. కృష్ణాజిల్లాప్రాంతాన్ని 5వ శతాబ్దంలో పరిపాలించిన విష్ణుకుండినులు ఈ గుహలను, అందులో దేవతా మూర్తులను చెక్కించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ గుహలలో మొత్తం ఐదు దేవతామూర్తులు ద ర్శనమిస్తాయి. శిల మీద చెక్కిన ఈ శిల్పాలు పవిత్రతను సంతరిస్తాయి. గుహలను తొలుచుకుంటూ ఈ మూర్తులను చెక్కారు. ఐదు గుహలు మొత్తం ఐదు గుహలలో మొదటిది గిరిపురంలో ఉంది. ఇక్కడ గుహలను నేల పాద ప్రాంతంలోనే చెక్కారు. కాని ఇక్కడ శిల్ప సంపద లేదు. గిరిపురం నుంచి కొద్ది దూరంలో మధు కల్యాణమండపం ప్రాంతంలో రెండవ గుహ ఉంది. ఇక్కడ ఆర్చి మీద నటరాజ విగ్రహం శిథిలావస్థలో ఉంది. ఆర్చి మీద వరుసగా ఏనుగు, సింహం, నంది శిల్పాలను అందంగా తీర్చారు. ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు నంది, భృంగి శిల్పాలు కూడా శిథిలావస్థలోనే ఉన్నాయి. లోపల ముక్కలుగా ఉన్న శివలింగం మాత్రం కనిపిస్తుంది. బౌద్ధులు ఇక్కడకు వచ్చినప్పుడు, విగ్రహాలకు వ్యతిరేకంగా వీటిని ధ్వంసం చేసినట్లు స్థానికులు చెబుతారు. ఇక మొగల్రాజపురం మెయిన్ రోడ్లో ఉన్న మూడవ గుహలో త్రిమూర్తుల శిల్పాలు శిథిలావస్థలో కనిపిస్తాయి. ఇక్కడ కూడా ఈ గుహలను కిందిభాగంలోనే చెక్కారు. ఈ గుహకు పక్కనే నాలుగవ గుహ దర్శనమిస్తుంది. ఈ గుహను కొండ మీద చెక్కారు. ఇక్కడ త్రిగుణాత్మకతను చూపేలా మూడు గుహలు కనిపిస్తాయి. ఇక అక్కడ నుంచి పక్క సందులోకి కొద్దిగా లోపలకు వెళితే ఐదవ గుహ కనిపిస్తుంది. ఇక్కడి నల్లరాతి మండపం నాటి కళను కళ్లకు కడుతుంది. మధ్యలో ఉన్న శాసన స్తంభం మహేశ్వరుని వివిధ రూపాలను చూపుతుంది. ఈ ఐదు గుహల నిర్మాణం ఉండవల్లి గుహల నిర్మాణం మాదిరిగానే ఉండటం చూస్తే, వీటిని నిర్మించినవారు ఒకరే అనిపిస్తుంది. గుహల గురించిన పూర్తి సమాచారం అందుబాటులో లేకపోవడంతో ప్రస్తుతం యాత్రికులను ఆకర్షించే ప్రయత్నాలు ఏమీ జరగడం లేదు. జాతీయ వారసత్వ సంపదగా గుర్తింపు పొందినప్పటికీ ఈ గుహాలయాలకు సందర్శకులు ఒక గైడ్‌తో పాటు, వీటికి తగిన ప్రాధాన్యత, గుర్తింపు, ప్రచారం కలిగిస్తే, అజంతా ఎల్లోరా గుహలకు ఏ మాత్రం తీసిపోకుండా నగర ప్రతిష్ఠను ప్రపంచవ్యాప్తం చేస్తాయనడంలో సందేహం లేదు. - డా.పురాణపండ వైజయంతి ఇలా చేరుకోవాలి... విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి ఈ గుహాలయాలు 3 కిలోమీటర్లు. ఇంద్రకీలాద్రి కొండకు చేరుకొని, అక్కడ నుంచి కాలి నడకన ఈ గుహాలయాలను సందర్శించవచ్చు. విజయవాడ బస్ స్టేషన్ నుంచి 2 కిలోమీటర్లు.క్యాబ్, హోటల్ వసతి సదుపాయాలున్నాయి. సమీప విమానాశ్రయం గన్నవరం. దాదాపు 17 కిలోమీటర్లు అన్ని ప్రధాన నగరాల నుంచి రవాణా సదుపాయాలున్నాయి. -
ఏడుకొండలకు ఆ పేర్లు ఎలా వచ్చాయంటే..?
సప్తగిరి ఏడుకొండల సమాహారమే తిరుమల దివ్యక్షేత్రం. వాటి గురించిన విశేషాల్లోకి వెళ్తే... వృషభాద్రి: పూర్వం వృషభాసురుడు అనే శివభక్తుడు బలగర్వితుడై శ్రీహరితోనే యుద్ధానికి తలపడ్డాడు. యుద్ధంలో చావు తప్పదనుకుని వృషభాసురుడు ‘నీ చేతిలో మరణించడం నా మహద్భాగ్యం! నీవున్న ఈ పర్వతానికి ‘వృషభాచలం’ అన్న పేరు ప్రసాదించాలని వేడుకున్నాడు. స్వామి ఆ వరమిచ్చి, త ర్వాత అతణ్ని సంహరించాడు. నీలాద్రి: ఏడుకొండల స్వామికి భక్తులు తలనీలాలను మొక్కుగా చెల్లించడం వెనక ఒక పురాణ కథనం ఉంది. స్వామివారికి తొలిసారిగా తన తలనీలాలు సమర్పించిన భక్తురాలి పేరు నీలాంబరి. ఆమె భక్తికి పరవశించిన స్వామివారు సప్తగిరిలో ఓ కొండకు ఆమె పేరు పెట్టారని ప్రతీతి. గరుడాద్రి: శ్రీ మహావిష్ణువు హిరణ్యాక్షుని సంహరించిన తర్వాత గరుత్మంతుని పిలిచి, తన క్రీడాద్రిని తీసుకురమ్మని ఆదేశిస్తాడు. ఆయన ఆజ్ఞ మేరకు గరుత్మంతుడు దాన్ని తెచ్చినందువల్లే ఇది ‘గరుడాచలం’, ‘గరుడాద్రి’గా ప్రసిద్ధి పొందింది. అంజనాద్రి: సంతానం కోసం అంజనాదేవి వేంకటాచల క్షేత్రంలో తపస్సు ఆచరించింది. దాంతో ఆమె గర్భాన్ని దాల్చి అనంత బలశాలి అయిన ఆంజనేయుడికి జన్మనిచ్చింది. అందుకే ఈ పర్వతం అంజనాద్రిగా ప్రసిద్ధి పొందింది. నారాయణాద్రి: నారాయణుడనే భక్తుడు స్వామి పుష్కరిణి తీరాన తపస్సు చేయడంతో అతడి పేరుమీదుగా ఈ పర్వతం నారాయణాద్రిగా ఖ్యాతి పొందింది. వేంకటాద్రి: ‘వేం’ అనగా సమస్త పాపాలను, ‘కటః’ అనగా దహించునది. అంటే, పాపరాశులను భస్మం చేసేది కనుక ఈ క్షేత్రానికి ‘వేంకటాచలం’ అని పేరొచ్చింది.. శేషాద్రి: ఓసారి ఆదిశేషుడికి, వాయుదేవునికి మధ్య ఎవరు గొప్పనే వివాదం రేగింది. ‘నీకు శక్తి ఉంటే నన్ను కదుల్చు’ అంటూ ఆదిశేషుడు వేంకటాచలాన్ని చుట్టుకున్నాడు. వాయుదేవుడు అతణ్ని విసిరివేయగా పర్వతంతోపాటు ఇక్కడ వచ్చి పడతాడు. ఓడిపోయిన చింతతో ఉన్న ఆదిశేషుడిని శ్రీనివాసుడు ఓదార్చుతూ, నిన్ను ఆభరణంగా ధరిస్తాను, నీ పేరుతో ఈ క్షేత్రం ప్రసిద్ధి పొందుతుందని వరమిచ్చాడు. దాంతో ఇది శేషాద్రిగా ప్రసిద్ధి పొందింది. - డీవీఆర్ -
కొండ పైనుంచి దూకాడు, కానీ..
మదనపల్లి (చిత్తూరు) : ఉన్నతాధికారుల వేధింపులు తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గుట్టపై నుంచి మూడు కిలోమీటర్ల లోతులో ఉన్న లోయలోకి దూకి ఆత్మహత్యాయాత్నం చేసిన వ్యక్తి అదృష్టవశాత్తు చెట్లలో చిక్కుకొని బతికిపోయాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం హార్స్ లీ హిల్స్‌లోని కాలిబండ వద్ద సోమవారం చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన ఎం.టి.భగీరధ రెడ్డి(48) సిరికల్చర్ డిపార్ట్మెంట్లో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఉన్నతాధికారులతో విబేధించిన కారణంగా వారు ఇతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగక పలుమార్లు భౌతిక దాడులకు దిగారు. దీంతో మనస్తాపానికి గురైన భగీరధ రెడ్డి ఆత్మాహత్య చేసుకోవడానికి హార్స్ లీ హిల్స్‌లోని కాలిబండ పక్కన ఉన్న కొండపైకి చేరుకున్నాడు. అనంతరం తన తమ్ముడికి ఫోన్ చేసి విషయం చెప్పి అక్కడి నుంచి దూకేశాడు. ఒంటిపై వేసుకుని ఉన్న జర్కిన్ చెట్లలో చిక్కుకోవడంతో.. సుమారు 3000 అడుగుల ఎత్తులో కొండపై ఇరుక్కున్నాడు. అప్పటికే అతని తమ్ముడి ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అతడిని రక్షించారు. చెట్టు కొమ్మలు గీరుకోవడంతో.. శరీరమంతా గాయాలుకావడంతో ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కొండపై యువకుడి మృతదేహం
గుంటూరు(తాడేపల్లిగూడెం): ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఈ సంఘటన మంగళవారం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం కొండపై వెలుగుచూసింది. వివరాలు.. కృష్ణా జిల్లా అత్తలూరుకు చెందిన పోకాల కొండలరావు(19) అనే యువకుడు ఇరవైరోజుల కిందట సీతానగరంలోని కొండపై చెట్టుకు ఉరేసుకొని మృతిచెందాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇది హత్యా..? ఆత్మహత్యా..? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. -
కొండ మీద నుంచి జారిపడి వ్యక్తి మతి
తాడేపల్లి: మద్యం మత్తులో తూగుతూ నడుస్తున్న వ్యక్తి ప్రమాదవశాత్తూ కొండమీద నుంచి జారిపడి వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. మంగళగిరి మండాలానికి చెందిన గోపి(20) కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిసున్నాడు. గోపి బుధవారం మామయ్య నివాసముంటున్న తాడేపల్లిలోని డలాస్‌నగర్‌కు వచ్చాడు. అల్లుడు వచ్చాడనే సంతోషంలో ఇద్దరు కలిసి మద్యం సేవించారు. ఆ మత్తులో తూగుతూ నడుస్తున్న గోపి ప్రమాద వశాత్తు కొండ మీదనుంచి జారిపడి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.