గుంటూరు(తాడేపల్లిగూడెం): ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఈ సంఘటన మంగళవారం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం కొండపై వెలుగుచూసింది. వివరాలు.. కృష్ణా జిల్లా అత్తలూరుకు చెందిన పోకాల కొండలరావు(19) అనే యువకుడు ఇరవైరోజుల కిందట సీతానగరంలోని కొండపై చెట్టుకు ఉరేసుకొని మృతిచెందాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇది హత్యా..? ఆత్మహత్యా..? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.