Karteeka maasam
-
Kartik Purnima: వారణాసి, అయోధ్యలతో పాటు దేశవ్యాప్తంగా భక్తుల పుణ్యస్నానాలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఈరోజు(నవంబర్ 15) కార్తీక పౌర్ణమి వేడుకలు ఎంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ పరిత్ర పుణ్యదినాన ఉత్తరాదినగల గంగా ఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు. వారణాసి, అయోధ్యలతో పాటు ప్రముఖ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పవిత్ర నదుల వద్ద భక్తుల రద్దీ నెలకొంది.యూపీలోని అయోధ్యలోని సరయూ స్నాన ఘట్టాల వద్ద భక్తులు పూజలు, పుణ్యస్నానాల కోసం బారులు తీరారు. కార్తీక పౌర్ణమి పుణ్య స్నానాలకు 10 లక్షల మందికి పైగా భక్తులు అయోధ్యకు వచ్చే అవకాశం ఉందని స్థానిక అధికారులు భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.#WATCH | Uttar Pradesh: A huge crowd of devotees arrive in Varanasi to take holy dip in the Ganga River, on the occasion of Kartik Purnima. pic.twitter.com/dosN2SHqNN— ANI (@ANI) November 15, 2024ఇదేవిధంగా యూపీలోని వారణాసిలోనూ పుణ్యస్నానాల కోసం గంగా ఘాట్ల వద్ద భక్తులు బారులు తీరారు. ఈ రోజున వారణాసిలో దేవ్ దీపావళి వేడుకలు జరుగుతున్నాయి. వీటిని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు వారణాసికి తరలివస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా రెండు రోజుల పాటు విశ్వనాథుని స్పర్శ దర్శనాన్ని అధికారులు నిలిపివేశారు. కాగా సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ప్రజలకు కార్తీక పూర్ణిమ, గురునానక్ దేవ్ల జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు దక్కాలని ఆకాంక్షించారు. గురునానక్ తత్వవేత్త, సంఘ సంస్కర్త, కవి, యోగి, దేశభక్తుడని ఆయన కొనియాడారు. సమాజంలోని మూఢనమ్మకాలు, కులతత్వాన్ని తొలగించేందుకు గురునానక్ కృషి చేశారని ఆయన అన్నారు.ఇది కూడా చదవండి: Guru Nanak Jayanti: కార్తీక పౌర్ణమి నాడే గురునానక్ జయంతి ఎందుకు చేస్తారంటే.. -
15న మరో రికార్డుకు సిద్ధమవుతున్న అయోధ్య
అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లో శ్రీరాముడు కొలువైన అయోధ్య పలు రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పుడు నవంబర్ 15న కార్తీక పౌర్ణమి సందర్భంగా మరో రికార్డుకు అయోధ్య సిద్ధమవుతోంది.రాష్ట్రంలో యోగి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అయోధ్యలో ప్రతీయేటా ‘దీపోత్సవం’ ప్రారంభమైంది. నూతన రామాలయంలో బాలక్ రామ్‌ను ప్రతిష్టించిన తర్వాత అయోధ్యలో చారిత్రాత్మక స్థాయిలో దీపోత్సవాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిశ్చయించారు. ఈ నేపధ్యంలో ఇక్కడి సరయూ తీరంలో మూడు రికార్డులు నమోదయ్యాయి.72 గంటల్లో 28 లక్షల దీపాలుఅయోధ్యలోని రామ్ కీ పైడీలో గత అక్టోబరులో 35 వేల మంది వాలంటీర్లు 55 ఘాట్లలో 28 లక్షల దీపాలు వెలిగించారు. కేవలం 72 గంటల్లోనే దీపాలను అలంకరించి, అయోధ్యలో సరికొత్త రికార్డు సృష్టించారు.ఏకకాలంలో 1,100 హారతులుగత అక్టోబర్ 30న సాయంత్రం సమయాన సరయూ నది ఒడ్డున సరికొత్త రికార్డు నెలకొల్పారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 1,100 మంది భక్తులు సరయూమాతకు హారతులిచ్చారు. ఈ సమయంలో వీరంతా ఒకే రంగు దుస్తులు ధరించారు.35 లక్షల మంది భక్తుల ప్రదక్షిణలు మొన్నటి నవంబరు 9వ తేదీన సాయంత్రం అయోధ్యలో 35 లక్షల మంది భక్తులు ఆలయ ప్రదక్షిణలతో మరో రికార్డు నెలకొల్పారు. 24 గంటల పాటు ఈ ప్రదక్షిణలు సాగాయి. ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం భక్తుల కోసం పలు ఏర్పాట్లు చేసింది.కార్తీక పౌర్ణమికి మరో రికార్డునవంబర్ 15న కార్తీక పౌర్ణమి సందర్భంగా అత్యధిక సంఖ్యలో భక్తులు అయోధ్యకు తరలివచ్చి, సరయూ నదిలో పుణ్యస్నానాలు చేయనున్నారని స్థానిక అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగం భారీగా ఏర్పాట్లు చేసింది. 12 చోట్ల తాత్కాలిక ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా సారించనున్నారు.ఇది కూడా చదవండి: Children's Day 2024: బాలల నేస్తం.. చాచా నెహ్రూ.. -
శివాలయాల్లో కార్తీక శోభ
బద్వేలు అర్బన్∙: కార్తీక మాసం రెండవ సోమవారాన్ని పురస్కరించుకుని భక్తులు శివాలయాలను అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు ఏర్పాటు చేసిన కార్తీక దీపాలతో శివాలయాలు వెలుగులతో నిండాయి. ఈ సందర్భంగా రూపరాంపేట శివానందాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి లక్షబిల్వార్చన, సహస్రదీపాలంకరణలు చేపట్టగా భక్తులు విరివిగా పాల్గొన్నారు. అలాగే మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే దత్తసాయిబాబాల ఆలయ ప్రాంగణంలోని శ్రీ పార్వతిసమేత ఓంకారేశ్వరస్వామి ఆలయంలో 365 శివలింగాలకు భస్మార్చన పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ గౌరవా«ధ్యక్షులు భూమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కార్యదర్శి నాగిరెడ్డి శంకర్‌రెడ్డిలతో పాటు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. అలాగే లక్ష్మీపాలెం, చెన్నంపల్లె, కట్టమీద శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఆలయాలలో దీపాలు వెలిగించి తమ మొక్కులు తీర్చుకున్నారు.