అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామమందిరం ప్రాణప్రతిష్ట ఈ నెల (జనవరి) 22నజరగనుంది.ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈ వేడుక ప్రముఖంగా మారనుంది. శ్రీరామ్ లల్లా దర్శనం చేసుకోసం భక్తులు వేయికళ్లతో వేచి చూస్తున్నారు. ఈక్రమంలో ప్రముఖ విమానయాన సంస్థలు దేశంలోని వివిధ నగరాల నుంచి అయోధ్యకు విమాన సర్వీసులను కూడా నడపనున్నాయి. అయితే ఇండిగో విమాన సంస్థ వార్తల్లో నిలిచింది.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన అధికారిక నివాసంలో జరిగిన వర్చువల్ ఈవెంట్ ద్వారా విమాన సర్వీసును జనవరి 11, గురువారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. గుజరాత్ లోని అహ్మదాబాద్ నుంచి అయోధ్యకు తొలి విమాన సర్వీసును ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రారంభించింది. తన ప్రారంభ విమానంలో దాని క్యాబిన్ సిబ్బంది శ్రీ రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు, సీత వేషధారణలో ఆకట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెటిజనులను ఆకట్టుకుంటోంది.
విమాన సిబ్బంది ఒకరు రాముడిలా కిరీటంతో పాటు బంగారు రంగులో సాంప్రదాయ దుస్తులు, ఆభరణాలతో అలకరించుకుని మరీ బోర్డింగ్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. ఇక క్యాబిన్ సిబ్బంది రాముడు, లక్ష్మణుడు, సీత , హనుమంతుని వేషధారణలో ఆహ్వానం పలకడంతో ప్రయాణీకులంతా పులకించిపోయారు. ‘జై శ్రీరాం’ అని నినాదాలు చేశారు.
Indigo staff dressed as Shri Ram, Sita, Laxman for the inaugural flight from Ahmedabad to Ayodhya!pic.twitter.com/5tqkfThZBU
— Anu Sehgal 🇮🇳 (@anusehgal) January 11, 2024
ఈ డైరెక్ట్ ఫ్లైట్‌తో అయోధ్య నేరుగా అహ్మదాబాద్‌కి కనెక్ట్ అయిందని, ఢిల్లీ తర్వాత అయోధ్యకు విమాన సర్వీసుల అనుసంధానమైన రెండో స్థానంలో అహ్మదాబాద్ ఉందని, జనవరి 15 నుంచి ఇతన విమాన సర్వీసులు కూడా ఉంటాయని సీఎం యోగి తెలిపారు. జనవరి 16న అయోధ్య-ముంబై, ఢిల్లీ-అయోధ్య మధ్య మరో విమాన సర్వీసు ప్రారంభం కానుందని, మెరుగైన విమాన సేవలు పర్యాటకం, వ్యాపార కార్యకలాపాలకు గణనీయంగా దోహదపడతాయని యోగి పేర్కొన్నారు.
మరోవైపు స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్, జనవరి 12, శుక్రవారం, జనవరి 21 న ఢిల్లీ నుండి అయోధ్యకు ప్రత్యేక విమాన సర్వీసులను ప్రకటించింది. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానం మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 3 గంటలకు అయోధ్య చేరుకుంటుంది. మరుసటి రోజు తిరుగు ప్రయాణంలో సాయంత్రం 5 గంటలకు బయలుదేరి, సాయంత్రం 6.30 గంటలకు ఢిల్లీలో ల్యాండ్ అవుతుంది. మరుసటి రోజు రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యే ప్రయాణీకులకు భోజనం అందించనుంది.
Comments
Please login to add a commentAdd a comment