ఆటోడ్రైవర్ల మూకుమ్మడి ఆత్మహత్యాయత్నం
- ఆటో స్టాండుకు స్థలం కేటాయించలేదని
- మనస్తాపం గ్రామ సమీపంలో ఒడిశాకు తిని అపస్మారక స్థితిలోకి
పలమనేరు: పలమనేరు పట్టణం గుడియాత్తం రోడ్డులో ఆటోస్టాండు కోసం పోలీసులు స్థలం కేటాయించలేదని మనస్తాపానికి గురైన టి.వడ్డూరుకు చెందిన నలుగురు ఆటోడ్రైవర్లు ఒడిశాకు తిని బుధవారం మూకుమ్మడిగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానిక గుడియాత్తం రోడ్డు సర్కిల్‌లో ఆటోస్టాండు ఉంది. అక్కడ పట్టణం, టి.వడ్డూరుకు చెందిన పలువురు ఆటోడ్రైవర్లు ఆటోలు ఉంచుతారు.
వారం రోజుల క్రితం టి.వడ్డూరు ఆటోడ్రైవర్లు మాత్రం ఆటోస్టాండు కోసం రోడ్డు పక్కన కొంత స్థలాన్ని చదును చేసుకునేందుకు ప్రయత్నించారు. దీనికి పట్టణానికి చెందిన డ్రైవర్లు అభ్యంతరం తెలిపారు. ఈ వ్యవహా రం పోలీస్ స్టేషన్ చేరింది. ఇరువురి వాదనలు విన్న ఎస్‌ఐ శ్రీరాముడు పట్టణం నుంచి ఆటో డ్రైవర్లు టి.వడ్డూరుకు ప్యాసింజర్లను తీసుకెళ్లి వచ్చేటపుడు ఖాళీగా రావాలని, అదేవిధంగా టి.వడ్డూరు నుంచి ఆ గ్రా మానికి చెందిన డ్రైవర్లు పట్టణంలోకి ప్యాసింజర్లను తీసుకురావాలని సూచించారు.
సంతృప్తి చెందని టి. వడ్డూరు డ్రైవర్లు మళ్లీ పోలీసులను ఆశ్రయించారు. వీరికి హామీ రాకపోవడంతో మనస్తాపం చెంది టి.వడ్డూ రు సమీపంలోని చిన్నకుంట చెరువు వద్ద శివకృష్ణ, పద్మనాభన్, గోవర్ధన, కుమార్‌స్వామి ఒడిశాకు తిని అపస్మారక స్థితికెళ్లారు. గమనించిన గ్రామస్తులు 108 ద్వారా పలమనేరు ఆస్పత్రికి తరలించారు. ఎస్‌ఐ విచారణ జరుపుతున్నారు.