
రేగిడి: మండల పరిధిలోని సంకిలి గ్రామం వద్ద గురువారం ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై ఎస్సై షేక్ మహ్మద్ ఆలీ అందజేసిన వివరాలిలా ఉన్నాయి. బూర్జ మండలం పాలవలసకు చెందిన వి.రాజేశ్వరి మండలంలోని బూరాడ గ్రామంలో తాతగారి ఇంటివద్ద ఉంటోంది.
బయోమెట్రిక్ వేసేందుకు సొంత గ్రామం పాలవలస వెళ్లేందుకు బూరాడ గ్రామానికి చెందిన సీర యేసుబాబుతో ద్విచక్ర వాహనంపై వెళ్లి పని ముగించుకుని తిరుగు ప్రయాణంలో రాజాం వైపు వస్తుండగా రాజాం నుంచి పాలకొండ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టగా ద్విచక్ర వాహనం బస్సు కిందకు వెళ్లిపోవడంతో వారు రోడ్డుపైన పడ్డారు. దీంతో రాజేశ్వరికి గాయాలు కాగా, యేసుబాబుకు తలకు బలమైన గాయమైంది. క్షతగాత్రులను 108లో పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం యేసుబాబును శ్రీకాకుళం తరలించినట్లు ఎస్సై తెలిపారు.
(చదవండి: కారుకూతలు కూస్తే ఖబడ్దార్)
Comments
Please login to add a commentAdd a comment