ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో శ్రీరాముని జీవిత చరిత్రకు సంబంధించిన అనే కథలు ముడిపడివున్నాయి. బస్తీ జిల్లాను వశిష్ఠ మహర్షి తపోప్రదేశంగా గుర్తిస్తారు. శ్రీరాముని తండ్రి దశరథుడు బస్తీ జిల్లాలోని మస్ఖధామ్‌లో పుత్రకామేష్ఠి యాగాన్ని నిర్వహించాడని చెబుతారు. వేదాలు, పురాణాలలో ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రస్తావనలు కనిపిస్తాయి.
శ్రీరాముని నగరమైన అయోధ్యకు కొద్ది దూరంలోనే బస్తీ జిల్లా ఉంది. ఈ జిల్లాకు రాముని నగరమైన అయోధ్యతో సన్నిహిత సంబంధం ఉంది. శ్రీరాముడు.. రావణుని సంహరించి, తన భార్య సీతామాతతో కలిసి లంక నుండి తిరిగి వచ్చినప్పుడు, ఇక్కడి మనోరమ- కువానో సంగమం ఒడ్డున లిట్టిచోఖాను తిన్నారని స్థానికులు చెబుతుంటారు. నాటి నుండి ఈ ప్రాంతంలో జాతర నిర్వహిస్తున్నారు. పవిత్రమైన మనోరమ నదిలో స్నానం చేయడం ద్వారా పాపాలు పోతాయని భక్తులు నమ్ముతారు.
ప్రతీయేటా చైత్ర పూర్ణిమ రోజున రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి వేలాది మంది జనం ఇక్కడికి వచ్చి మనోరమ కువానో సంగమం ఒడ్డున స్నానాలు చేస్తారు. ఆ తరువాత వారు లిట్టి చోఖాను తయారు చేసి పరస్పరం పంచుకుంటారు. ఈ జాతర ఐదు రోజుల పాటు జరుగుతుంది.
ఇది కూడా చదవండి: 2,100 కిలోల గంట.. 108 అడుగుల అగరుబత్తి
Comments
Please login to add a commentAdd a comment