సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్యలో భవ్య రామాలయం గర్భగుడిలో ప్రాణ ప్రతిష్ఠకు ముహూర్తం దగ్గర పడింది. ఈలోపు శ్రీరామ పాదుకా యాత్రలో భాగంగా దేశ వ్యాప్తంగా రాముడు నడిచిన మార్గాలమీదుగా పూజలందుకుంటూ శ్రీరామ పాదుకలు మంగళవారం అయోధ్యకు చేరుకోనున్నాయి.
9 కిలోల బరువున్న ఈ పాదుకల కోసం 8 కిలోల వెండి వాడారు. కిలో బంగారంతో పాదుకలకు తాపడం చేశారు. హైదరాబాద్‌కు చెందిన అయోధ్య భాగ్యనగర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు చల్లా శ్రీనివాస శాస్త్రి ఈ పాదుకలను తయారు చేయించారు. జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత ఈ పాదుకలను ఆలయంలో ప్రతిష్టించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment